రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆకురాలిన చప్పుడు

రచన: శ్రీ వశిష్ఠ సోమేపల్లి
ఏప్రిల్ 2020

ఎక్కడో ఆకురాలిన చప్పుడు వినిపిస్తుంది
ఇంకెక్కడో రెక్కలు ముడిచిన పావురం మాటలు వినిపిస్తాయి
మహానగరపు ఖాళీలేనితనం
గోలచేస్తూనే వుంటుంది

గదిలో మాత్రం
నిశ్శబ్దపు పోట్లు.
గొంతు పెగలని ఆక్రందనలు,
పెదాలు దాటని ప్రశ్నలూ సమాధానాలూ
పలుగై పొడుస్తుంటాయి

ఎంత హింస
మౌనం చేసే గాయాలకు లేపనాలుండవు.
నిశ్శబ్ధాన్నీ దూరాల్నీ ప్రేమించినా
మౌనాన్నీ దూరమవుతున్న దగ్గరనీ భరించలేము

డైరీలోని ప్రతి పేజీ ఖాళీగా మిగిలుంటుంది
రాయలేని అక్షరాలు
పాళీలోనూ గుండెలోనూ
తడిగా కాలుతుంటాయి

ఓ చప్పుడు కోసం
నగర ఘోషను వినపడనివ్వని
ఓ మాట చేసే చప్పుడు కోసం
వెతికీ వెతికీ
వెలితి నిండిన గుండెలో
ఏదో ఆకు రాలిన చప్పుడు వినిపిస్తుంది.

    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    తఃతః April 1, 2020 3:39 pm

    క్లుప్తంగా, తీయగా ఆకు రాలిన చప్పుడు వినిపించిన కవికి అభినందనలు- తఃతః

  2. 2
    శ్రీ వశిష్ఠ సోమేపల్లి April 3, 2020 3:28 am

    థాంక్యూ సర్

  3. 3
    సిరిపురపు శ్రీనివాస శర్మ April 5, 2020 3:16 am

    మీ కవితా శిల్పం చాలా బాగుంది. అంతర్మథనాన్ని ప్రశ్నగా వేసిన తీరు బాగుంది. ఆఖరి వరకు సాగిన అక్షర యుద్ధం చివరి పేరాలో మౌనం వహించింది అనిపించింది.

  4. 4
    నాగరాజు April 17, 2020 1:16 am

    ఓ మౌనం నభోంతరాళాలలో విస్ఫుటించి ఆకురాలు చప్పుడులో గుండెచప్పుళ్లను ఆవిష్కరించుకున్నారు కవిగారు..అధ్భుతం

  5. 5
    శ్రీ వశిష్ఠ సోమేపల్లి July 15, 2020 5:47 am

    ధన్యవాదాలు సిరిపురపు శ్రీనివాస శర్మ గారు, నాగరాజు గారు

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • లోపలి ఉదయం
  • స్వ
  • ఆకురాలిన చప్పుడు
  • కల

ఇటువంటివే…

  1. అక్షరాలు
  2. అసంపూర్ణ చిత్రం
  3. రాయని పద్యం
  4. పక్షులు
  5. నీ లోపలి నిజం

ఏప్రిల్ 2020 సంచికలో ...

  • Tara and the Teacher
  • ఆకాశవంతెన 5
  • ఆకురాలిన చప్పుడు
  • ఏదైనా రాలిపోవాల్సిందే
  • ఏప్రిల్ 2020
  • కొన్ని లలితగీతాలు
  • గడినుడి – 42
  • గ్రీకు పురాణ గాథలు 4
  • చూడు చూడు!
  • తథాగతుని అడుగుజాడలలో
  • నీ లోపలి నిజం
  • పుస్తక పరిచయాలు
  • రాజకీయాందోళనము
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 42
  • సెకండ్ ఛాన్స్
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఏదైనా రాలిపోవాల్సిందే
ఆకాశవంతెన 5

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.