ఏవ ఏవం

[రచ్చబండలో, 2006 జులై 31న వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన టపా (సౌలభ్యం కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము.)]

006 ఏప్రిల్ నెలలో వెల్చేరు నారాయణ రావు గారు రచ్చబండలో ఇలా రాశారు:

“I like these fantastic lifespans and anachronistic legends. Indian literature is full of them. Remember Kalidasa and Bhavabhuti and Dandin meeting together in caatu tradition?” (Refer to the Afterword in A Poem at the Right Moment.)

భద్రాద్రి రామదాసు, కబీరుని కలిశాడని సినిమాలో చూపించిన తరువాత రచ్చబండలో రామ! రామ! అన్న మకుటంతో వచ్చిన thread లో ఈ పై కథనం నారాయణ రావు గారు చెప్పారు. అప్పటి నుంచీ ఉత్తరరామచరితలోని భవభూతి శ్లోకం (ఈ.27) రచ్చబండ పాఠకులకి, విమర్శకులకీ విన్నవిద్దామనుకుంటున్నా. ఇప్పటికి అది సాధ్యం అయ్యింది. ఇది పూర్వ కథ. ఇక అసలు కథ ఏదంటే:

కిమపి కిమపి మందం మందమాసక్తి యోగా
దవిరల కపోలం జల్పతో రక్రమేణ
అశిథిల పరిరంభ వ్యాపృతైకైకదోష్ణో
రవిదిత గతయామా రాత్రి రేవం వ్యరం సీత్

ఈ పై శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ కవిత అని చెప్పుతారు.

భవభూతి (బహుశా ఎనిమిదవ శతాబ్దం) తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసుకి (బహుశా నాలుగవ శతాబ్దం) ఒక దూత ద్వారా వినిపించాడట. ఆ సమయంలో కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. ఆ దూత భవభూతి దగ్గిరకి తిరిగి రాగానే భవభూతి, ‘కాళిదాసు ఏమన్నాడు?’ అని ఆతృతగా అడిగాడట. ‘ఏమీ అనలేదు,’ అని దూత సమాధానం. ‘మొత్తం కావ్యం అంతా విని ఏమీ అనలేదా?’ అని భవభూతి రెట్టించి మరీ అడిగాడట. దానికి దూత సమాధానం: “కాళిదాసు గారు చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆట మధ్యలో ఒక పరిచారిక కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ తాంబూలం వేసికొని, అబ్బ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!”

భవభూతి ఈ పై శ్లోకంలో ఆఖరి పాదంలో ‘ ఏవం వ్యరం సీత్’ అని రాసి ఉండాలి. వెంటనే ఆ ‘మ’ కారప్పొల్లు (nasal)తీసిపారేసి ‘ఏవ వ్యరంసీత్’ అని మార్చాడట. తమాషా ఏమిటంటే, తెలుగులో సున్న, సంస్కృతంలో ‘మ’ కారప్పొల్లు. సంస్కృతంలో సున్న లేదు. ఇక్కడ కాళిదాసు గారిని, భవభూతి గారినీ పదహారణాల తెలుగు వాళ్ళని చేసుకున్నాం. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట ఈ శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్టుగా భవభూతికి అర్థం అయ్యింది.

ఇది A Poem at the Right Moment లో చెప్పిన కథ. Merwin, Massonలు Sanskrit Love Poetry అన్న సంకలనంలో చెప్పిన కథలో భవభూతే కాళిదాసుకి ఉత్తరరామచరిత అంతా చదివి వినిపించాడని, కాళిదాసు అంతా విని, మొత్తం కావ్యంలో ఒకే ఒక్క శ్లోకంలో ఒక్క ‘మ’ కారపు పొల్లు ఎక్కువయ్యింది అన్నాడట.

ఒక్క మాట కవితార్థాన్ని ఎంత పల్చబడేట్టు చెయ్యగలదో, సంస్కృతం క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు. రాత్రి ఏవం వ్యరంసీత్, అంటే the night has passed in this way అన్న అర్థం. దాని బదులు రాత్రి ఏవవ్యరంసీత్, అంటే, only the night disappeared, (but the rest of it continued) అన్న అర్థం.

ఈ శ్లోకాన్ని ఇంగ్లీషులోకి నాకు తెలిసి ముగ్గురు అనువదించారు. D. H. H. Ingalls (Vidyaakara’s Subhaashita Ratna kOSa, Vol. 45, Harvard Oriental
Series, 1965), W. S. Merwin and J. MoussaieffMasson (Sanskrit Love Poetry, Columbia University Press, 1977), and Velcheru Narayana Rao & David Shulman (A Poem at the Right Moment, University of California Press, 1998.) ఆ మూడు “అనువాదాలు” ఇస్తున్నా. అంతేకాదు, Monier William, నిఘంటువు, Vaman Apte గారి నుఘంటువు సంప్రదించి ప్రతిపదార్థాలు కూడా ఇస్తున్నా. అర్థాలు ఎందుకిస్తున్నానో తరువాత చెప్పుతా!

Ingalls అనువాదం:
And as we talked together, softly, secretly,
cheek closely pressed to cheek
while our arms were busied in theit tight embrace,
the night was gone without our knowing
the hours as they passed.

Merwin, Massonల అనువాదం:
Deep in love
cheek leaning on cheek we talked
of whatever came to our minds
just as it came
slowly oh
slowly
with our arms twined
tightly around us
and the hours passed and we
did not know it
still talking when
the night had gone.

Velcheru Narayana Rao, David Shulmanల అనువాదం:

Whispering wonderful whatevers
in any which order,
cheek touching cheek,
arms totally enmeshed
from so much loving
we never knew the hours passing,
when suddenly night itself was over.

ఇక ప్రతిపదార్థాలు, అనేకార్థాలూ.

కిం అపి = some what, still further
మందం = slowly or softly
ఆసక్తి = devoted, attachment, uninterrupted
యోగాద్ = union, act of joining
అవిరలిత = contiguous, close, dense
కపోలం = cheek
జల్పతోర = chatter, gossip, speak
అక్రమేణ = not happening successively
అశిథిల = becoming tight or firm
పరిరంభ = embracing
వ్యాప్రిత = occupied, busy
ఐకాఇక = one by one, every single one
దోష్ణోర = forearms
అవిదిత = unknown, without the knowledge of
గత = past (as time)
యామ = progress, going
రాత్రి = night
ఏవం = thus, in this way
ఏవ = exactly so, truly, in deed
వ్యారంసీత్ = rejoice at, enjoy carnally(?)

ఈ అర్థాలు ఇవ్వడానికి కారణం: Merwinకి సంస్కృతం రాదు. Masson అర్థాలు, కథా సమయం, అంటే శ్లోకం context, ఇచ్చిన తరువాత, ఆయన తన ‘కవితా ప్రతిభ’ ఉపయోగించి ఇంగ్లీషు అనువాదం చేశాడు. నా మటుకు నాకు సంస్కృతం రాదు, కవిత్వం అసలే అర్థం కాదు. కాబట్టి, రచ్చబండ కవులు, మరో మంచి అనువాదం తయారు చేస్తారేమో నన్న ఆశతో ఈ పై అర్థాలు!

పోతే, ఈ శ్లోకం context: రావణుడు సీతని ఎత్తుకోపోకముందు, అడవుల్లో, రాముడు తాను సీతతో గడిపిన శుభ సుఖ సమయాలు గుర్తుకు తెచ్చుకొంటూ ఉన్నప్పటి సమయం, pure nostalgia!

ఇక మీ ఇష్టం.
రిగార్డులతో,
వేలూరి వేంకటేశ్వర రావు.