మెకానికల్ ఇంజనీరింగ్

రెండు చేతులు కౌగిలించుకున్నప్పుడు
వచ్చే కడియాల చప్పుడుతో
తరగతి గదులు నిద్రలేస్తుంటాయి

అక్కడ తలలు లేని సూత్రాలు
ప్రాణం లేని సమీకరణాలు
ఎందుకు పుట్టాయో తెలియని ప్రమేయాలు
జీవితాలను లోతుగా అధ్యయనం
చేస్తుంటాయి

మధ్య మధ్యలో వేరే ప్రపంచపు
విద్యుత్తు, కంప్యూటర్ అవశేషాలు
పైపైన యుద్ధం అని పూర్తిగా
మెదడుని తినేస్తుంటాయి

ప్రయోగాలు జరగని
ప్రయోగశాలలు ఒంటరిగా
చీకటిలో నానిపోతూ
మూలన ఎక్కడో పడి ఉంటాయి

మడ్డి కనపడని చేతులు
కనపడేలా గర్వపడుతుంటాయి
కాలేజీ దాటి వచ్చాక
గేర్ బాక్స్‌ కూడా వెతకలేక
అవే చేతులు నలుగురి ముఖాలను
దీనంగా తడుముతుంటాయి