నా-2

నా
పద్యాలలో
తలా తోకా రెండూ ఉన్నది
ఒక్కటీ లేదు
కొన్ని పద్యాలైతే
తలల్లేని ఒట్టి తోకలు.
గాలితో ఆడుకుంటూ వచ్చిన
తోకను చూసి నా పద్యాన్ని
నేనే పోల్చుకోలేను.
మిగతావి
తోకని ఏ పేకాటలోనో ఒడ్డి
ఓడిపోయిన ముడ్డితో
నవ్వుతూ అటూ ఇటూ
తిరుగుతున్న మొహాలు!

నా
పద్యాల మీద
గుట్టలు గుట్టలుగా
పుట్టలు పుట్టలుగా
తుట్టెలు తుట్టెలుగా
పేరుకు పోయిన జ్ఞాపకాలు
జ్ఞాపకాలు పద్యాల్ని కొరుకుతూ
అక్షరం అక్షరాన్నీ
కొరికేస్తూ
పద్యాలు
హాయితో నీలుగుతోనో
బాధతో మూలుగుతోనో
లుంగలు లుంగలు తిరుగుతూ
చటుక్కున అవాక్కయి
పోతూ.