రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

చందవరం, ప్రకాశం జిల్లా

రచన: పాలపర్తి ఇంద్రాణి
మే 2012

ఊగుతాడు సూర్యుడు
గుండ్ల కమ్మ మీద
తేలుతాడు చంద్రుడు
కాళ్ళు జాపుకు ఆవులిస్తూ
మెటికలు విరుస్తుంది కాలం.

పొద్దుటి పూట
పొగలు కక్కే చౌకరకం తేనీరు
ఆరారగా తాగుతుంది ఊరు
వీధిలో ఉరికి ఉరికి పోతుంది
ఆడ కూలీల గుంపు
పురుగును పొడుస్తుంది
బిత్తర చూపుల కోడిపుంజు.

ఎండ పొద్దెక్కాక
వీపున పిచికారీ గొట్టాలతో
వడివడిగా అంగలు వేస్తాడు రైతు
బొడ్రాయి దగ్గరకు చేరుతుంది
పోచికోలు కుర్రకారు
అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.

సాయంకాలం పూట
నాసిరకం పుణుగులు పొంగణాలకి
గలగల్లాడతాయి రూపాయలు
పేడ కళ్ళెత్తుకుంటూ
చెతుర్లాడుతుంది ఓబులమ్మ
శివాలయం మీద ఇంకొంచెం పొడుగు పెరిగి
ఎచ్చులు పోతుంది రావి మొక్క.

రాత్రిపూట
బజనలు చేయుట మా బారం
మా బాదలు తీర్చుట మీ బారం
రాం రాం రామ్మంటుంది గుళ్ళో మైకు
నులక మంచాల మీద
దుప్పట్లు పరుస్తుంది వెన్నెల
గోడ పగుల్లోంచి తొంగి చూస్తుంది తేలు.

ఇక్కడ ఏ పొద్దూ ఇలాగే
ఊగుతాడు సూర్యుడు
గుండ్ల కమ్మ మీద
తేలుతాడు చంద్రుడు
కాళ్ళు జాపుకు ఆవులిస్తూ
మెటికలు విరుస్తుంది కాలం.

    
   

13అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    బొక్కా ప్రేమ్ కుమార్ May 2, 2012 6:44 am

    పురుగును పొడుస్తుంది
    బిత్తర చూపుల కోడిపుంజు.

    కోడిపుంజు బిత్తర చూపులు కూడా క్యాచ్ చేసి కవిత రాయడం కేక.

    అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
    తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.

    రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?

    సాయంకాలం పూట
    నాసిరకం పుణుగులు పొంగణాలకి
    గలగల్లాడతాయి రూపాయలు

    ఏసీ హోటల్లో కూకోని..కయితలు రాసేవారికి నాసిరకం ఏమో కాని, తినేవాళ్ళు నాసిరకం తింటున్నాం అని అనుకోరు.

    ఇంకా ఏమన్నారు మీరు

    పొద్దుటి పూట
    పొగలు కక్కే చౌకరకం తేనీరు
    ఆరారగా తాగుతుంది ఊరు

    మీరు షుగర్-ఫ్రీ బూస్టు తాగుతూ రాసుంటారు ఈ లైను

    మొత్తానికి మీ ఈ కయిత కెవ్వు కేక కేకస్యః

  2. 2
    nadeem ansari May 2, 2012 9:23 am

    చక్కని కవిత్వం చాలా రోజులకు. కోస్తావాండ్లకు తెలుగు వచ్చుననే అనిపించుచున్నది. పలుకుబడిలో కాకున్నా కవుల మనసులలొ తెలుగు ఉన్నది. కవికి ధన్యవాదాలు.

  3. 3
    Srinivas Vuruputuri May 2, 2012 9:36 am

    > రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?

    ఆవు సినిమా పోస్టర్‌ను తిని నెమరేస్తుందని అర్థం కాదా?

  4. 4
    Parvatha Sekhar May 2, 2012 10:52 am

    చాల బాగుంది ఇంద్రాణి గారూ! అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, వాహ్. వాహ్! నాకు బాగా నచ్చింది! మీరూ చందవరం లోనే పెరిగారా?

  5. 5
    Aparna krishnavajhala May 2, 2012 3:57 pm

    పర్వత శేఖర్ గారు, చందవరంలో పెరగనవసరం లేదు కవి అవడానికి, కాని కవి చందవరం వెళ్ళాడంటే, కవి హృదయం దాగదు.

  6. 6
    బొక్కా ప్రేమ్ కుమార్ May 3, 2012 4:57 am

    @Srinivas Vuruputuri
    >ఆవు సినిమా పోస్టర్‌ను తిని నెమరేస్తుందని అర్థం కాదా?

    మీరు చాల షార్ప్ సుమండీ…
    -బొక్కా ప్రేమ్ కుమార్

  7. 7
    ravikiran timmireddy May 4, 2012 4:59 pm

    నెల్లూర్లో, పత్తేగాను పేట పీతిరి గుంట సెంటర్ లో
    మా ఇరవయ్యో శతాబ్దపు వాటర్ హోల్, ఉన్నీ టీ బంకు.
    మొట్ట మొదటి ఖాతా అక్కడే, అప్పు తీసుకున్న వేడి టీని చప్పరిస్తూ
    ఖాతాలో రాసిన సిగరెట్టుని ఊదటంలో మజా నేర్చింది అక్కడే
    బతుకు పోరాటంలో అన్నీ మర్చిపోయి పదేళ్ళ తర్వాత పోతే
    ఏవి సారు ఎక్కడకిపొయ్యారు ఎలా వున్నారు అని
    ఆప్యాయంగా పలకరించిన ఉన్నీ ఇప్పుడక్కడ లేడు
    ఆ టీ బంకూ లేదు, ఎందుకు లేడో తెలుసుకునే ఓపిక నాకు లేదు
    కానీ ఉన్నీ, ఆ చిన్న పాక టీ బంకు, ఆ అద్భుతవైన టీ
    మాత్రం ముప్పై ఏళ్ళ తర్వాత కూడా
    నా మనసులో పదిలంగా ఉంది బహుశా
    ఊన్నీ ఖాతా పుస్తకంలో నా అకవుంటు ఇంకా కరంటేనేవో!

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. 8
    vikas,vinnakota May 8, 2012 9:16 pm

    చాలా బాగున్నది అండి..

    వికాస్ విన్నకోట

  9. 9
    అజ్ఞాత May 9, 2012 12:49 am

    ఈరకం కవిత్వం అంటే నాకు చాలా ఇష్టం. రచయితని ‘మామూలు మాటలని కవితలుగా మలచగల అద్యుభయ కవయిత్రి’ అనచ్చు

  10. 10
    శారదా కిషోర్ May 23, 2012 4:55 am

    1. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముక్కలు జిగురు రాకుండా, అడుగున అంటుకోకుండా ఉండాలంటే వేపుడు చేసే పాత్రలో కొంచెం ఇంగువ వెయ్యాలి.
    2. క్యాబేజి వండేటప్పుడు చెంచా నిమ్మరసం వేస్తే వాసన రాకుండా ఉంటుంది
    3. అనీజీ (uneasy) గా ఉన్న టైంలో మళ్ళి ప్రశాంతంగా అవ్వాలంటే ఇంద్రాణి గారి కవిత చదవాలి

  11. 11
    Seetha Kumari May 24, 2012 10:44 pm

    అలా ఎక్కడికో తీసుకుపోతాండీ …ప్రతీ చిన్న విషయాన్నీ ఎంతో చక్కగా చెబుతారు సుమా…I throughly enjoy reading your poem…

  12. 12
    అనంత్ మల్లవరపు August 3, 2012 1:02 pm

    బహు బాగుంది చందవరపు కవిత. మా చిన్ననాట తాత గారి ఊరిలో నులక మంచాలు గుర్తుకు తెచ్చారు!

    “బజనలు చేయుట మా బారం
    మా బాదలు తీర్చుట మీ బారం”

    “భజనలు చేయుట మా భారం
    మా బాదలు తీర్చుట మీ భారం”

    వత్తులు తీసి కాస్త భారం తగ్గించారు.

  13. 13
    Aparna Yeluripati October 24, 2012 12:37 pm

    అనంత్ గారు, ఇది వత్తులు తియ్యడం కాదండీ చాలమంది అలాగే పాడతారు. అంత వ్యాకరణ యుక్తంగా పాడరు. పాడేవారందరూ పండితులు కాదు కదా.
    ఇక్కడ ఒక పల్లెటూరు దైనందిన జీవన దృశ్యీకరణ. దాన్ని దానిలాగే చిత్రించారు. అందుకే చవకరకం తేనీరు అన్నా, నాసిరకం పుణుగులు పొంగణాలన్నా. ఒకదాన్ని వివరించాలంటే అక్కడే కూర్చుని రాయాలని, దాన్నే తాగుతూ రాయాలనీ లేదు కదా. అలా చెప్పాలంటే కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడీ —- పాటలో నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో అని రాయడానికి కవి కూడా మండుటెండలో మాడక్కరలెదు కదా ప్రేం కుమార్ గారూ??

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మల్లే పూల్ మల్లే పూల్
  • వేసవి
  • తిరణాల
  • కిటికీ
  • Nails

ఇటువంటివే…

  1. ఓ నాలుగు చిన్న కవితలు
  2. నిరంతరం
  3. ఓ మలి సంధ్య దృశ్యం
  4. తేనీటి సమయం
  5. ఉదయం

మే 2012 సంచికలో ...

  • అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం
  • ఆషాఢస్య ప్రథమ దివసే
  • ఈమాట మే 2012 సంచికకు స్వాగతం!
  • ఒక పుస్తకం
  • ఓ నాలుగు చిన్న కవితలు
  • కాల్వీనో కథల నుంచి – 3
  • కినిమా పత్రిక నుంచి – 3
  • చందవరం, ప్రకాశం జిల్లా
  • జాతర
  • తేనీటి సమయం
  • దీక్షా లాక్షా రాగ రేఖ
  • నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన
  • పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2
  • బాల బేలవు ముద్దరాల
  • బ్రహ్మ సృష్టి
  • మూడు లాంతర్లు -11
  • మేఘసందేశం – ఆడియో రూపకం
  • లక్ష్మణదేవర నవ్వు
  • వలపారగించవమ్మ వనిత నీ యలుక చిత్తమున
  • సురవర తెలుగు కీబోర్డ్
  • హాబూ నిప్పు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2
లక్ష్మణదేవర నవ్వు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.