గడినుడి-7కు అన్నీ కరక్టు సమాధానాలు పంపిన వారు:
- పం.గో.కృ.రావు
- రవిచంద్ర ఇనగంటి
- సుభద్ర వేదుల
- కె. వి. గిరిధరరావు
- సుధారాణి
ఒక తప్పుతో సమాధానాలు పంపినవారు: పి. సి. రాములు, సూర్యప్రకాశ్.
గమనిక: 6 నిలువుకు రాచరికాలు/ రాజరికాలు; 36 నిలువుకు బజంత్రి/ భజంత్రి/ బజంత్రీ/ భజంత్రీ- లలో ఏదయినా ఒప్పుగానే పరిగణించాము.
అడ్డం
- మదగమన నగుమోము తలాతోకలమీదే ధ్యానం (4)
సమాధానం: మననము. అంటే ధ్యానం కదా? - రాయలేని ఆటంకముతో చావు (3)
సమాధానం: అంతము. అంతరాయములో ‘రాయ’లేకపోతే వచ్చేది. - హారతి పడితే పట్టనీరా ప్రజలు (5)
సమాధానం: నీరాజనాలు. నీరా ప్రజలులో సూచించబడింది. - దీని చిగురుతో బెంగ (2)
సమాధానం: చింత. చింతచిగురు వినే వుంటారు. - మా లయ మారితే టక్కులాడి అవుతుంది (5)
సమాధానం: మాయలమారి. టక్కులాడి కదా! - కత్తిరివావిలి చెట్టు నించి దిగిన మరదలు (3)
సమాధానం: రిత్తిక. వెనకనుండి చూడమని సూచన. - కిటుకుని పాటిస్తే చిటికలో నిద్ర ముంచుకొస్తుంది (5)
సమాధానం: కునికిపాటు. మాటల పొందికలో కనిపిస్తుంది. - కవి కాలు కదపడం ప్రారంభిస్తే చెల్లాచెదురై పటాపంచలు అవుతుంది (5)
సమాధానం: కకావికలు. చెల్లాచెదురుగా కనిపిస్తోంది. - తాకట్టు పెట్టుకోడానికి పనికొచ్చేది? (2)
సమాధానం: తల. వాడుకలో తల తాకట్టుపెట్టడం వినే ఉంటారు. - ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇది పఠిస్తే తప్పించుకోవచ్చు (6)
సమాధానం: పలాయనమంత్రం. ఎదుర్కోలేనప్పుడు పఠించే మంత్రం అదేకదా? - ఆదిమధ్యాంతాలులేని ప్రేమతో కీలు (2)
సమాధానం: మర. ప్రేమ అంటే మమకారము. అందులో ఆది, మధ్య, అంతాలు లేకపోతే మర మిగుల్తుంది. - ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రదేశం (5)
సమాధానం: రాయలసీమ. - యమున వాలు చూసి పారితే స్త్రీలు వ్రతాలు చేస్తూ ఇచ్చేవి (5)
సమాధానం: వాయనములు. అక్కడే ఉంది. - 23 అడ్డం తిరగబడింది (2)
సమాధానం: లక్ష్మి. 23అడ్డం తిరగబడితే రమ కదా? - ఎల్లవేళలా కాదు (6)
సమాధానం: అడపా తడపా. అప్పుడప్పుడు కదా? - శంభో! గంగాధరా! ఇక్కడే దాగుంది సుఖం (2)
సమాధానం: భోగం. ఇక్కడే దాగుంది. - జలపుష్పాలు? (5)
సమాధానం: కలువపూలు. జలపుష్పాలు [అంటే చేపలు అనే అర్థం ఉన్నా] అన్నది కావాలని వాడడం జరిగిందిక్కడ. ఎందుకంటే కలువపూలు కూడా నీటిలోనే కదా వికసించేది. - తప్పుచేసినవాడు లెక్కపెట్టేవి (5)
సమాధానం: కటకటాలు. ఖైదీలు లెక్కపెట్టేవి అవే కదా? - తలాతోకాలేని పాము మధ్య మిగిలిన దేవర (3)
సమాధానం: జంగమ. భుజంగమము అంటే పాము. తలాతోకా లేదు. - స్త్రీ అంటే అపరంజి ప్రతిమా? (5)
సమాధానం: పుత్తడిబొమ్మ. అపరంజి అంటే పుత్తడి. ప్రతిమ అంటే బొమ్మ. - ఈ దొర అంటే సూర్యుడు (2)
సమాధానం: తమ్మి. తమ్మిదొర అంటే సూర్యుడు. - ఈ జంతువు స్నానం మధ్యలో కంటపడిందో జాగ్రత్త! (5)
సమాధానం: జలకంటకం. స్నానం అంటే జలకం. మధ్యలో కంట పడింది. - చర్మానికి రాక్షసి (3)
సమాధానం: తాటకి. తాట+కి. తాట అంటే చర్మం కదా. - విద్యావంతుడిని పోషించదు వరిగడ్డిభోజనం (4)
సమాధానం: చదువరి. అందులోనే దాగుంది.
నిలువు
- వరిపొలం పరిశుద్ధం (2)
సమాధానం: మడి. దీనికి వరిపొలం, పరిశుద్ధం అనే అర్థాలు. - పిల్లలేని నల్లపిల్లిలో నలిపెయ్యాలనిపించే కీటకం (2)
సమాధానం: నల్లి. నల్లపిల్లిలో పిల్ల లేకపోతే వస్తుంది. నల్లిని నలిపినట్టు వాడుకలో వింటాం కదా. - మునిమాత కల కంటే శ్రేష్ఠము కాదా? (6)
సమాధానం: తలమానికము. అంటే శ్రేష్ఠమైనది. అక్కడే ఉంది. - ప్రభుత్వాలు (5)
సమాధానం: రాచరికాలు, రాజరికాలు. రాజరికము అంటే ప్రభుత్వం కదా. - నాత మధ్య పచ్చగడ్డి వేస్తే సంస్కృతి (5)
సమాధానం: నాగరికత. పచ్చగడ్డి అంటే గరిక. నాత మధ్యలో చేరింది. - కేక దెబ్బ కలిస్తే పిలిస్తే వినపడేంత దూరం (4)
సమాధానం: కూతవేటు. కూత అంటే కేక. వేటు అంటే దెబ్బ. రెండూ కలిసేయి. - పోలిక రాశి (2)
సమాధానం: తుల. తుల అంటే పోలిక. రాశి ఉండనే ఉంది. - తునాతునకలు అయినా కనపడే ప్రతిరూపం (3)
సమాధానం: నకలు. అందులోనే ఉంది. - అబద్ధపు లెక్కలు వెయ్యడానికి పనికొచ్చే ప్రాణి (2)
సమాధానం: కాకి. కాకిలెక్కలు వింటుంటాం కదా. - వాడు పట్టుకుని చెల్లాచెదురైతే ఇక బట్టలెవడుకుడతాడు? (6)
సమాధానం: కుట్టుపనివాడు. అక్కడే ఉంది. - రవి సాము సరిగ్గా చేస్తే జలపుష్పం దొరుకుతుంది (4)
సమాధానం: విసారము. చెల్లాచెదురైన చేప. - పాలకులు తమ పరిపాలనలో తాంబూలాలకి విధిగా వాడేవారు (6)
సమాధానం: తమలపాకులు. ఇవిలేకుండా తాంబూలం అవుతుందా? - నయముగా పారే నది (3)
సమాధానం: యమున. అక్కడే పారుతోంది. - సంక్రాంతి ముందురోజు వేసేవి (3)
సమాధానం: మంటలు. సంక్రాంతి ముందు వచ్చేది భోగి. అప్పుడు వేసేవి మంటలే కదా. - ఆగమనం రమ్ము చివర (3)
సమాధానం: రాకడ. రమ్ము అంటే రా. చివర అంటే కడ. - జయతో కూడిన స్త్రీ (3)
సమాధానం: లలిత. జయలలితలో ఉన్న స్త్రీ కదా. శశికళ అనుకున్నారా? - జాగ్రత్తగా ఉండాలంటే కాపలా తిరిగే సేవకుల మెరిక అవసరం (4)
సమాధానం: మెలకువ. తిరిగేలో వెనుకనుండి వెతకమని సూచన. - తోటలు బొమ్మలా పేరిస్తే జానపదకళారూపం (6)
సమాధానం: తోలుబొమ్మలాట. పేరిస్తే అవుతుంది. - పసుపు-నలుపు రంగులు కలిసిన గోవు (5)
సమాధానం: గంగమయిల. నలుపు పసుపు రంగుల మిశ్రమం. గంగమయిలావు వినే ఉంటారు. - మండు పుటక వలన కలిగే అసూయ (5)
సమాధానం: కడుపుమంట. అందులోనే ఉంది. - తమకములో తడబడితే సేద్యము (4)
సమాధానం: కమతము. తడబడి చెల్లాచెదురైంది. - నడుము చూడడం వెనుకటిపని (2)
సమాధానం: కటి. అందులోనే ఉంది. - వాద్య విశేషం (3)
సమాధానం: బజంత్రి. (బజంత్రీ, భజంత్రి, భజంత్రీ లను కూడా ఒప్పుగానే పరిగణించాము.) - తాబేలు పైభాగం (2)
సమాధానం: డిప్ప. - చేబదులు అక్కడక్కడ తీసుకుంటే రుచిగానే ఉంటుంది (2)
సమాధానం: చేదు. చేబదులులో అక్షరాలు తప్పించి చూస్తే కనబడుతుంది. - పత్రికల్లో రాసేవాడు మధ్యలో చీటీ చిరిగి పువ్వుగా మారేడు (2)
సమాధానం: విరి. విలేఖరిలో లేఖ తీసేస్తే విరి మిగుల్తుంది.