రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఇంటికి మళ్ళు

రచన: పాలపర్తి ఇంద్రాణి
జూన్ 2017

1.

బట్టల సబ్బు రంగు
ఆకాశం కింద
అంతులేకుండా
గొణుగుతోంది
కోన

అరచేతికి కాసిన
కాయల చుట్టూ
గుయ్యిమని
చికాకు పురుగు.

గుంట కన్ను
చికిలించి
రారామ్మని
లాగే పోకిరి
లోయ

చందమామ
పొట్టలోకి
జారిపోతో
గబ్బిలాయి
నల్ల చుక్క

కసరెక్కింది
గాలి
గాల్లో ధూపంలా
తేలబోయే దేహం.

2.

అంతలోనే
ఘల్లుమన్నవి
ఎండు కాయలు
గెంతుకొచ్చాయి
లేగ కాళ్ళు

అమ్మా! చూడవూ?

చిట్టి గుప్పిట
సీతాకోకచిలక
మెదల్లేదది
ప్రాణం లేదు

ఎగర్లేదే?
అల్లల్లాడుతూ
వెల్లకిల్లా
బబ్బుందేం
నేల పైనా?

ఇదీ ఇదీ
ఎగరదూ అమ్మ?
పెద్దగా ఏడ్చింది
తన గుప్పిటంతే
పాప గుండె.

అమ్మా?
ఎగరదూ?

3.

ఊగి ఊగి
కొండపూలు
అలసిపోతే

భుజం మీదే
నిద్రపోయిన
పాప బుగ్గకి
బావుందే
రెక్క రంగు.

మబ్బులన్నీ
చెదిరిపోతే
సంచి కోసి
జల్లినారో
మినుకుమినుకు
తారలేవో

మసక వెన్నెల
మెరుస్తున్నవి
బురద దారీ
కొండవాలు

దూరాన
ఎదురుచూసే
ఇంటి గడప
బుడ్డి దీపం.

    
   

3అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    థింసా June 9, 2017 1:30 pm

    కొన్ని హైకూల్లాంటివి కలిపి కుట్టినట్లుందీ కవిత. వీటితో వచ్చిన సమస్యల్లా కవితని పూర్తిగా ఆస్వాదించనీవు ముక్కలు ముక్కలుగా తప్ప. పాలపర్తి ఇంద్రాణి మంచి poet అని విన్నాను. వారి కవిత్వ తాత్వికతని నేనే అందుకోలెకపోతున్నానేనేమో.
    మన్నించగలరు.

  2. 2
    indrani palaparthy June 10, 2017 5:48 pm

    థింసా గారు,

    1. అత్తింటి పోరు, నస, చాకిరీ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని వస్తుంది తల్లి.

    2. ఇంతలో పాప మరణించిన శీతాకోక చిలుక తెచ్చి అది ఎగరడం లేదని ఏడుస్తుంది.

    3. తల్లికి తాను చనిపోతే పాప పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి వస్తుంది. పాపని తీసుకుని ఇంటి వైపుకు ఆడుగు వేస్తుంది.

    ఇదీ నేను చెప్పదల్చుకున్నది. బహుశా నేను అనుకున్న విధంగా చెప్పలేకపోయి ఉండవచ్చు.

    నా కవిత మాట ఎలా ఉన్నా మీ మారుపేరు భలే ఉన్నాదండీ. ధింసా అంటే- తుం సా నహి దేఖా! అన్న పాట గుర్తొస్తోంది. 🙂

    ధన్యవాదాలు.
    ఇంద్రాణి.

  3. 3
    థింసా June 13, 2017 5:36 am

    మీ వివరణ కు ధన్యవాదాలండీ ఇంద్రాణి గారు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మూడు కవితలు
  • పల్లెటూర్ to పట్నం: The Seven Seater
  • వానకు తడిసిన పువ్వొకటి
  • వాన – గులాబీ – పాము
  • అల్లరి పిచుకలు

ఇటువంటివే…

  1. మా ఇంటికి దారి
  2. రంగులూ మాటాడతాయి!
  3. పిల్లల కోసం
  4. ఓ నాలుగు చిన్న కవితలు
  5. అమ్మా, నాకేం పేరు పెడతావు?

జూన్ 2017 సంచికలో ...

  • ఇంటికి మళ్ళు
  • ఒకనాటి యువ కథ: మా నాన్న నాకేమిచ్చారు?
  • ఒకప్పుడు
  • కడవ
  • కళకాలమ్: 1. కళగని…
  • కిటికీ పక్క ఆకాశం
  • కోడ్ కూలీ
  • గడి నుడి – 8
  • జూన్ 2017
  • తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు?
  • తెలుగులో యాత్రాసాహిత్యం
  • నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం
  • పునరావృతమ్
  • మహారాజుగారి రయిలుబండి
  • మిథ్య ఎగ్జిబిషన్
  • రంగులూ మాటాడతాయి!
  • విశ్వనాథ నర్తనశాల
  • వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 6
  • సంసారంలో బేతాళ ప్రశ్న
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కోడ్ కూలీ
తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు?

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.