పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/05/2014 2:23 pm

    ఓ మూడేళ్ళ నుంచి కాబోలు వెల్చేరు, పరుచూరి ద్వయం రాయనున్న బ్రౌన్ వ్యాసం గురించి వింటూ ఉన్నాను. ఎట్టకేలకు వెలుగులోకి వచ్చిన ఈ వ్యాసం ఆనాటి పండితుల స్థితి గతుల గురించి, బ్రౌన్ వ్యక్తిత్వపు వెలుగు నీడల గురించి, తన కృషి తదనంతర తరాలపై చూపిన ప్రభావం గురించి, వలసవాదపు ఛాయలను దాటుకొని కొత్త ప్రశ్నలు వేసుకోవాల్సిన ఆగత్యం గురించి చాలా వివరంగానే చర్చించింది.

    బ్రౌన్ పరిష్కరణ/సంస్కరణ పద్ధతుల గురించి ఇంకాస్త రాయాల్సిందేమో. శ్రీనివాస్ గారు ఓరియెంటల్ లైబ్రరీలో ఏం చూసారో స్పష్టపడలేదు (బ్రౌన్ కాగితపు ప్రతులు అక్కడ ఏ ఆలనాపాలనా లేకుండా అరలలో పడి మగ్గుతున్నాయన్న విషయం కాకుండా).

    బ్రౌన్ కృషిలో మీరు ఎత్తి చూపిన రెండు ప్రధాన దోషాలు – బండి ర, అర సున్నలను “సంస్కరించటం”, మన సాహిత్యానికి సరిపడని పద్ధతులను ప్రవేశపెట్టటం (గ్రంథకర్తృత్వ నిర్ణయాలు, క్రిటికల్ ఎడిషన్ రూపొందించే పనిలో పడి, ఇక్కడి సాహిత్య స్వభావాన్ని గమనించకపోవటం). ఈ రెంటిలోనూ రెండవదే తీవ్రమైన అభియోగంలా అనిపించింది. ఐతే ఇందుకు మనం బ్రౌన్‌ని తప్పుపట్టాలా లేక అది ఆనాటి చదువుల కారణంగా, అప్పటి అవగాహనల వల్లా ఏర్పడిన పరిమితిగా సర్దుకుపోవాలా?

    వేమన పద్యాల పట్ల బ్రౌన్ అభిమానాన్ని మీరు “బ్రాహ్మణ వ్యతిరేకత”కి ఆట్రిబ్యూట్ చేసారు. వేమన పద్యాలకి బ్రౌన్ రాసిన పీఠిక చదువుతుంటే అలా అనిపించలేదు (“For some parts of this comment written in Telugu, I am indebted to two very learned Bramins who taught me the language, its grammar and prosody. They are Tippabhotla Venkata Siva Sastri of Masulipatnam and Advyta Brahmia, the Pandit belonging to the court in which I have the honour of being assistant judge.” అని కూడా రాసారు కదా?).

    మీ వ్యాసం చదివాక బంగోరె “బ్రౌన్ లేఖలు” మళ్ళీ చదవటం మొదలు పెట్టాను. ఆసక్తికరమైన వ్యాసాన్ని రాసినందుకు అభినందనలతో

    శ్రీనివాస్

  2. మైదానానికి చెలియలి కట్ట గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    06/05/2014 1:40 pm

    ఇలాటి వ్యాసాలు కత్తి మీద సాములాటివి. ఉపోద్ఘాతం బాగున్నా, ఉపోద్ఘాతం అయిపోయిన తరువాత కొన్ని వాక్యాలు చదవగానే అనుకోకుండా ఘాతం తగిలింది. ఆహ్లాదంగా షికారుకెళుతున్న సమయంలో కనపించే మలుపు వద్ద కనపడని స్పీడు బంపు వచ్చి కీచు మని బ్రేకేసినట్టు ఆగవలసి వచ్చింది. అలా ఆగటం వల్ల ఈ వ్యాసరచయిత(త్రి)కి ఒక “ప్రెజ్యుడిస్”, అనగా పక్షపాతం, ఉన్నదన్న భావన వచ్చి చేరి, ఆ తర్వాత బలపడి, ఆ వాక్యాలు చదివాక నాకు అప్పటిదాకా లేని “ప్రెజ్యుడిస్” వచ్చి చేరింది. అలాటి ఎఫెక్టు కలగటం చాలా దరిద్రం ఏ పాఠకుడికైనా, ఏ వ్యాసానికైనా. ఇలా చెప్పడం వల్ల ఈ వ్యాసానికి, వ్యాస రచయితకు, పాఠకలోకానికి, ఈమాటకు ఉపయోగం ఉన్నా ఉండకపోయినా, మా గురువు గారు లైలా గారు లంకె ఇచ్చి మరీ ఇక్కడికి పంపించి చదివింపచేసారు కాబట్టి ఒక రెండు ముక్కలు రాయవలసి వచ్చింది.

    ఆ “ప్రెజ్యుడిస్” అన్న సంగతికి చిన్నపాటి వివరణ – ఈ కింది వాక్యాల వల్ల వ్యాసానికి ఉపయోగం లేకపోగా చదవడానికి విముఖత కలిగిస్తై.

    **** “పైన నేను పేర్కొన్న నవలల్లో లత నవలకు విమర్శార్హత కూడా లేదు. ఇక గోపీచంద్ నవలలు అటు రచనాపరంగానూ, ఇటు సిద్ధాంతపరంగానూ కూడా బలహీనంగా రాయబడినవి. “వెంకటచలం పాత్ర ” అంటూ గోపీచంద్ చేసిన మరొక గల్పిక లాంటిది మరీ కురచబారిన రచన.” *****

    ఇది చదివిన తరువాత, నే చదివే తీరు, అభిప్రాయం మారిపోవటం మొదలుపెట్టింది. అనగా అప్పటిదాకా లేని “ప్రెజ్యుడిస్” వచ్చి చేరింది నాలో. చెలియలికట్టను తీసుకుని దాని మీద రాయడానికి స్వయంగా మనకు ఎంత అర్హత ఉందనుకుని రాసామో అంతే అర్హత పైన పేర్కొన్న నవలలకూ ఉన్నది అని ఈ వ్యాసరచయిత(త్రి)కి తెలియకపోవటం ఆశ్చర్యం. దీనివల్ల అభాసుపాలు కావటం తప్పితే ఉపయోగం నిల్లు.

    అయితే వ్యాసంలోని మిగతా సంగతులు బాగానే ఉన్నా, ఇటువంటి వ్యాసాలు కత్తి మీద సాము అని చెప్పాను గాని, ఆ కత్తి పదునా, మొండా అన్నది తేల్చుకోవాలె ముందు. ఇక్కడ కత్తి మొండిగా ఉన్నట్టుగా నాకు కనపడ్డది. కాబట్టి సాము ఎట్లా చేసినా, ఎంత చేసినా పాఠకుడి మీద ప్రభావం లేదనే అనుకోవచ్చునేమో. అలా ప్రభావం లేకపోవటానికి, పదిహేనేళ్ళ క్రితం రాసిన ఈ వ్యాసానికి రెండు కామెంట్లు, ఇప్పుడు నాది మూడు మటుకే ఉండటం ఒక బలమైన సాక్ష్యమని నేను అనుకుంటున్నా.

    అలాకాకపోయినా ఇంకో సాక్ష్యంగా చివరాఖరి రెండు పేరాలు చదివితే ఈ వ్యాసం పట్టు ఎంతో, ఏమిటో చప్పున తెలిసిపోయె. కాబట్టి, చదివి సమయం వ్యర్థం చేసుకున్నానో ఏమిటో అన్నది తెలియక, ఇదే వ్యాసం ఇదే వ్యాస రచయిత ఇప్పుడు తిరగ రాస్తే ఎట్లా ఉంటుంది చూడాలన్న ఆలోచన ఉద్భవిస్తున్న సమయంలో స్వస్తి…

    లైలా గారూ క్షమించాలె… 🙂

    భవదీయుడు
    మాగంటి వంశీ

  3. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    06/04/2014 10:24 am

    మైథిలి ఈ ప్రశ్న అడిగింది కదా తనూజ గారూ, అసలు ఆమెకి బాధేసిందే అందుకు…. అనుమానం వచ్చిందే అందుకు….. అలా కథ మొదలైంది.

  4. విముక్తం గురించి Tanuja అభిప్రాయం:

    06/03/2014 10:18 pm

    ఏమీ తప్పులేకపోతే, అంత కాలం జీవిత భాగస్వామికి ఎందుకు చెప్పలేదో? మనం తెలిసిన వాళ్ళు వీధిలో కనీపిస్తేనే ఇంటికి రాగానే చెప్తాం కదా. మరి అన్ని రోజులు అంత మాట్లాడుకొని కనీసం భార్యకి చెప్పాలని “గుర్తు” కూడా రాకపోతే ఎలా? అంత కమ్యునికేషన్ గాప్ వుంటే ఇక ఆ బంధం విలువేంటి?

  5. విముక్తం గురించి lyla yerneni అభిప్రాయం:

    06/03/2014 8:38 pm

    ‘వాటేసుకోటం.’ What a word!

    అసలు అంత మోటు మాట, ఆ ప్రక్రియ, తెలుగు సంస్కృతి లోనే సాధ్యం. నిన్నో, మొన్నో, ఒబామా తన ప్రెస్ సెక్రెటరీకి వీడ్కోలు చెపుతూ, వాటేసుకోబోతే, ఇద్దరూ మగాళ్లు అయ్యేసరికో, తెలుగు వాళ్లు కానందువల్లో, మరీ పీలగా ఉండేసరికో, ఆ దృశ్యం అంత దర్శనీయంగా లేదు. అని జనాభిప్రాయం.

    పాఠకులు కథ సుఖాంతం అంటారేం? అసలిక్కడ కథ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్టుంది. I am watching the scene. జరుగుతున్నది ఇదీ! ఒక ఆడది, ఇంకో ఆడదాని నడుము కావిలించుకోటం, గుండెల్లో తల దాచుకోవటం. My God! Why does not the guy stop it? He is patting his wife’s hand. In silent consent. While she is rubbing her face, against another woman’s breasts. Horror! మగాడిని పక్కన వెర్రి వెధవ లాగా నిలబెట్టి, – ఒక ఆడదానికి ఇంకో ఆడది, లెమనేడ్ తాగించటం, నెత్తి మీద నూనె మర్దన చెయ్యటం. ఈశ్వరా! చిన్న పిల్ల చూస్తుండగానే -కథానాయిక, ‘The other woman’, వాటేసుకుంటారేంటండీ? ఇదా, ఇదా? అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగుతనం? Lesbianism. Does the heroine want ‘the other woman’ all to herself? Is that what her sudden bout of jealousy, is all about?

    లైలా

    PS: Love this essay, in this magazine. ‘మైదానానికి చెలియలి కట్ట.’ రచన. జయప్రభ. A good one. 🙂

  6. ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి B.S.N.Reddy అభిప్రాయం:

    06/03/2014 3:20 pm

    మంచి వ్యాసాన్ని అందించి నందుకు ధన్యవాదములు. తెలుగు తేనియలు విశ్వవ్యాప్తముగా పంచుచున్న మీరు అభినందనీయులు.

  7. ఇద్దరు మిత్రులు గురించి VSTSayee అభిప్రాయం:

    06/03/2014 2:15 pm

    Dr. CBS Venkataramana అభిప్రాయం:

    ‘దాన్ని అలా అనకూడదు, ఇలా అనాలి’ అని చెప్పబూనటం, ‘తమకు వచ్చు, ఇతరులకు రాదు’ అని గొప్పలు చెప్పడం మాత్రమేనేమో!

    ఉచ్చారణనిఘంటువులు పాండిత్యప్రకర్ష కోసమేనంటారు?

    Regards,
    VSTSayee.

  8. ఇద్దరు మిత్రులు గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:

    06/03/2014 5:46 am

    ఒక భాషకు చెందినవారు, వేరొక భాషలోని పదాలను పలికేటప్పుడు, ఆ వేరొక భాష యొక్క పదాల ఉచ్ఛారణ ఎలా ఉన్నప్పటికీ, తమ భాషలో అటువంటి అక్షరాలతో కూడిన పదాలను ఎలా ఉచ్చరిస్తారో, అలాగే ఉచ్చరిస్తారు. అన్ని భాషలలోనూ, సమానమైన అక్షరాలు ఉన్నాయని అనుకోవటం ఒక లోపభూయిష్టమైన ఆలోచన. మనదేశంలోనే, తమిళంలోని కొన్ని అక్షరాలు ఇతర ఏ భాషలలోనూ లేవు. “మా భాషలోని పదాలను మా భాషలో ఉచ్చరించినట్లే మీరు కూడా ఉచ్చరించాలి” అని అంటే, చాలా కష్టం. ఆ విధంగా కట్టడి చేయాలనుకునేవారు, తమ తమ భాషలను తమ దేశాలలోనే కట్టేసుకుని ఉంచుకోవాలి. వేదకాలం లోనే “వసుధైక కుటుంబకం” అని మన ప్రాచీనులు అంటే, “The world is a Global village” అని ఇప్పుడు అంతా అంటున్నారు.

    అయినా, భాష అనేది, ఒకరు మాట్లాడినప్పుడు, అవతలివారికి అర్థం అయితే చాలు. తెలుగునేల పై ఉండే ఏ సగటు తెలుగువారైనా, ‘గై డి మపాసా” అనే అంటారు. ‘దాన్ని అలా అనకూడదు, ఇలా అనాలి’ అని చెప్పబూనటం, ‘తమకు వచ్చు, ఇతరులకు రాదు’ అని గొప్పలు చెప్పడం మాత్రమేనేమో!

  9. పలుకుబడి: దిక్కులు, పక్కలు గురించి తఃతః అభిప్రాయం:

    06/02/2014 8:56 pm

    ‘సినబ్బ’ మాండలికంలో పడమరకు ‘పరంట’ అని కనపడుతుంది- తఃతః

  10. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి అశ్మాచం అభిప్రాయం:

    06/02/2014 4:41 pm

    “కృతకం” సంస్కృతంలో అయితే “శెయర్కైప్పొరుళ్‌” అని పిలవటం బాగుంటుందో ఏవిటో? అంతలావుగా కొండ నాలికను తుండి నుంచి మెలుసు పెట్టి బావుకునేదేవిటీ? అది మెచ్చుకోవటవేమిటో ? అచ్చగం బావుంటే ముద్రణాలయమూ బాగున్నట్టే! అదీ సరే, ఇదీ సరే! ఓ మా తెలుగు అని అంత బేటమే ఉంటే పైడిపాటి లక్ష్మణ కవి గారు, ఆయన కూర్చిన ఆంధ్రనామసంగ్రహం, అడిదంవారు, ఆయన కూర్చిన ఆంధ్రనామ శేషము, అందులోని పింగులు మన నాలికల మీద ఇంకా పింపిళ్ళాడుతూ ఉండేవి.

    అశ్మాచం
    (asm chamdra)