పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ఐదు కవితలు: అగ్ని స్పర్శ గురించి వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    12/30/2015 2:58 pm

    చంద్ర భింభంకూడా సూర్యకిరణాలను ప్రసరించక మానదు
    అయినా అంటుకున్న అగ్నిస్పర్స ఆరిపొకమానదు

  2. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    12/29/2015 8:26 am

    నేను: “మోహనగారు చెపుతున్నది లయ గురించి, ……..అనిపిస్తోంది”
    తఃతఃగారు: కాదు. అర్థవంతంగా పాడుకోవటానికి వీలుగా సంస్క్ర్త త శ్లొకాల పాదాలు పదాలు విరగకుండా ముగుస్తాయి అన్న విషయాన్ని మోహన తన వ్యాసాలలో పదే పదే చెపుతున్నారు. ఈ అభిప్రాయానికి తోడుగా తెలుగు కవులు పాదాంత యతిని పాటించక పోవటాన్ని (కొంత తక్కువ చేసి) కూడా వారు ప్రస్తావిస్తున్నారు.

    నేను: ఇక్కడ తఃతఃగారు దేని గురించి “కాదు” అన్నారో నాకు అర్థం కాలేదు. మోహనగారు లయ గురించి కాకుండా స్వరం గురించో, లేక రాగం గురించో చెప్పారని వారి అభిప్రాయమా? తఃతఃగారి మిగతా వ్యాఖ్యబట్టి అలా అనిపించడం లేదు. వారు ప్రస్తావించిన పాదాంత యతి కూడా లయకి సంబంధించినదే తప్ప రాగానికి సంబంధించినది కాదు. ముందుగా, మోహనగారు ప్రస్తావించిన “singability” లేదా “గానయోగ్యత” అనే అంశం లయ/తాళానికి సంబంధించినది అన్న విషయం స్పష్టమై, దానిపైన అంగీకారం కుదిరితే, చర్చను ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇక పదచ్ఛేదయతి గురించి:

    1. ఈ వ్యాసంలో ప్రధానమైన అంశం శ్రీశ్రీ గేయాలు. అవి చాలావరకూ స్పష్టమైన లయతో సాగుతాయనడంలో ఎలాంటి విప్రతిపత్తి లేదు. దీనికి పాదాంతర విరామమూ, పాదాంత విరామమూ చాలా ఉపయోగపడే లక్షణాలన్నది మోహనగారి ప్రతిపాదన. దీనిని నేను అంగీకరిస్తాను. ఎవరైనా అంగీకరించకపోతే, వారి వాదన వివరించవచ్చు.

    2. పదచ్ఛేదయతి గురించి మోహనగారు వ్యాసంలో ప్రస్తావించిన మరొక అంశం – “సంస్కృతములో పాదాంతయతి పాటించబడుతుంది.”. “అదే విధముగా సంస్కృతములో శార్దూలవిక్రీడితము, స్రగ్ధరలవంటి వృత్తములకు పాద మధ్యములో కూడ పదముల విఱుపు ఉంటుంది”.
    ఇవి సాధారణంగా (చాలా ఎక్కువ శాతం) కనిపించే లక్షణాలే తప్ప నూరుపాళ్ళూ నియతంగా పాటింపబడినాయని ఎక్కడా లేదు. బహుశా ఛందస్సులో ఏ నియమాలకైనా అపవాదాలు ఉండనే ఉంటాయి. అందుచేత ఇందులో కాదనడానికి నాకేమీ కనిపించడం లేదు.

    3. మోహనగారు తన వ్యాఖ్యలలో ప్రస్తావించిన అంశం:
    “ఉత్తర భారత భాషలలో, సంస్కృతములో, తమిళ, మలయాళములలో ఎక్కువగా పాదాంతయతిని వాడుతారు. అలా చేసినందువలన వాటికి గానయోగ్యత లభిస్తుంది. తెలుగు కన్నడ భాషలలో (ముఖ్యముగా తెలుగులో) సాహిత్యము రెండు భిన్న రీతులలో రూపొందినాయి. కావ్యములు పఠనీయములు మాత్రమే. అది సంగీతముతో ఎక్కువ సంబంధము లేకుండా రూపొందినది. వాగ్గేయకారులు రచించిన గీతులకు మాత్రమే గేయత్వము లభించినది. కవులు ఎక్కువగా ఈ వాగ్గేయకారులను, యక్షగాన కర్తలను సరకుగొనలేదు. ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.”

    ఇక్కడ కూడా “గానయోగ్యత” అంటే లయాన్వితంగా పాడుకోడమనే అర్థం స్పష్టం. తెలుగులో కావ్యములు పఠనీయములనే మోహనగారు కూడా అన్నారు. అయితే తెలుగు పద్యాలు చదువుకోనేందుకు కాక పాడుకొనేందుకు వీలుగా ఉంటే బాగుంటుందన్నది మోహనగారి అభిప్రాయం. అది వారి అభిరుచికి సంబంధించిన విషయం. దానితో ఏకీభవించడమా లేదా అన్నది మన అభిరుచికి బట్టి ఉంటుంది తప్ప, అందులో చర్చించడానికి ఏమీ లేదు!

    ఇక, తమిళ, మలయాళ భాషల విషయం నాకు ఎక్కువగా తెలియదు కాని, సంస్కృతశ్లోకాలలో పాదాంతయతి వాటి “గానయోగ్యతకి” కారణమయ్యిందా లేదా అన్నది చర్చనీయాంశం. అయితే అది యీ వ్యాసానికి అంతగా అవసరం లేని విషయం. కాబట్టి దాని గురించి యీ వ్యాసంలో/వ్యాఖ్యలలో ప్రస్తావించకుండా ఉండి ఉంటే, చర్చ మోహనగారు కోరుకున్నట్టు వ్యాసంలో అసలు విషయమ్మీద కేంద్రీకృతం అయ్యుండేదేమో!

    అలాగే “ఇప్పుడు ఛందోబద్ధమైన కవిత్వము నిరాదరణకు పాలవడానికి ఇది ఒక ముఖ్య కారణము అని నాకు అనిపిస్తుంది.” అనే అభిప్రాయం కూడా (అది వ్యక్తిగతమే కావచ్చు!) చర్చనీయాంశమే. అది వ్యక్తిగత “అభిరుచి”కి సంబంధించినది కాదు. అయితే, ఇది కూడా ఈ వ్యాస విషయానికి సంబంధం లేని అంశం. పై రెండు చర్చనీయాంశాలకి సంబంధించి మోహనగారి అభిప్రాయాలను నేను పూర్తిగా అంగీకరించను. అయితే అది వేరే చర్చ కాబట్టి, దాన్ని యిక్కడ కొనసాగించడం నాకు యిష్టం లేదు.

    చివరిగా, నేను నా అసమ్మతిని తెలిపినప్పటికీ ఏదో కారణాలవల్ల అశ్మాచంగారు నన్ను “అండు కో”లో కలపడం మానలేదు. సరే అది వారి ఆనందం! అయితే నేరుగా నన్ను మాత్రమే ప్రస్తావించి సూటిగా ఏదైనా అడిగితే తప్ప వారికి నా దగ్గరనుండి స్పందన/సమాధానం రాదని మాత్రం మనవి చేసుకొంటున్నాను.

  3. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    12/28/2015 4:42 pm

    సంస్కృతములో కూడ రెండు యతి (పదచ్ఛేదము) camps ఉన్నాయి. భరతాదులకు యతి పట్టింపు లేదు, పింగళాదులు యతిని పాటిస్తారు. వృత్తాదుల ముద్రణలో కూడ బేసి పాదముల అంతమును ఒక నిలువు గీతతో (|), సరి పాదముల అంతమును రెండు నిలువు గీతలతో (||) సూచిస్తారు. సరి పాదాంతములో యతిని almost విధిగా పాటిస్తారు. బేసి పాదాంతములో కూడ “సామాన్యముగా” (most of the times) పాటిస్తారు.

    తమిళములో “సామాన్యముగా”, తెలుగులోకంటే ఎక్కువగా, గణములకు (శీరులు) తగ్గట్లు పదములను ఎన్నుకొంటారు. అదే విధముగా పాదాంత యతి కూడ.

    తెలుగు దేశి ఛందస్సులో “సామాన్యముగా” పాదాంతయతి ఉంటుంది. ద్విపదలో, రగడలో ఇది తప్పని సరి (a must). కాని సూర్యేంద్ర గణములకు తగ్గట్లు, మాత్రాగణములకు తగ్గట్లు పదముల విఱుపులు తక్కువ. తాళబద్ధమైన రగడలు ఈ విషయములో కొద్దిగా మేలు. కాని అక్కడ కూడ రెండు మాత్రాగణములను కలిపి వ్రాసిన కవులు ఉన్నారు.

    ఏ పద్యమునైనను, వచనమునైనను, తుదకు మాటలను కూడ రాగయుక్తముగా పాడుకొనవచ్చును. కాని అన్నిటిని తాళయుక్తముగా పాడుకోలేము.

    అతి స్వేచ్ఛతో వ్రాసే చంపకోత్పలమాలలలో కూడ కొన్ని నియమములను పాటిస్తే వాటిని పాడుకొనడము మాత్రమే కాదు, తాళబద్ధముగా కూడ పాడుకొనవచ్చును. ఈ మాలికా వృత్తములలో 4,5,5 – 4,5,5 మాత్రలతో, 6,4,4 – 6-8 మాత్రలుగా పదముల విఱుపులున్నప్పుడు వాటిని తాళయుక్తముగా పాడుకొనవచ్చును. ఇలాటివి ఇతర వృత్తములకు కూడ సాధ్యము.

    విధేయుడు – మోహన

  4. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    12/28/2015 3:44 pm

    చతురస్ర లఘువు + ద్రుతము ఈ రెంటిని ఆఱు మాత్రలుగా తీసికొంటే మొదటి ఆనందం పదము మనకు లభిస్తుంది, అర్ణవ, ఐతే ఈ నాలుగు మాత్రలు తఱువాతి చతురస్ర లఘువులు అవుతాయి. అప్పుడు హాయిగా దీనిని ధ్రువ తాళములో పాడుకొనవచ్చును. అశ్మాచం, లైలాగారు ఏదో మౌఖిక పరీక్షలో పరీక్షించినట్లు నన్ను పరీక్షించినందులకు వందనములు. దురదృష్టవశాత్తు వారి దృష్టిలో నేను fail అయ్యాను. పర్లేదు లెండి. నా ఉద్దేశములో వ్యాసములోని ముఖ్య విషయములను ఎవ్వరూ చర్చించలేదు అన్న విషయము నాకు నిరుత్సాహాన్ని కలిగించింది. ఇక ఈ చర్చలో ఏవైనా క్రొత్త విషయాలుంటే చర్చిస్తాను. లేక పోతే వాళ్లిద్దరు వారి gun powder ను తడి లేకుండ తఱువాతి వ్యాసానికి ఉంచుకొనమని ఒక ఉచిత సలహా. స్వస్తి!

    విధేయుడు – మోహన

  5. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    12/28/2015 1:53 pm

    సంస్కృతంలో పాదాంత యతి (విరామం) విషయకమైన శ్రీ మోహనరావు గారి వ్యాఖ్యను చదివి, దానిని గురించి ఈ నాలుగు మాటలు వ్రాయాలనిపించింది:

    ‘పాదాంత యతి’ అంటే ప్రతిపాదం చివర పదం పూర్తయి, మరొక కొత్తపదంతో మరుసటి పాదం ప్రారంభం కావటం అన్నమాట. ఒక పాదానికి, మరొక పాదానికి నడుమ సంధికార్యం జరిగే వీలుండదని దీని అర్థం. నిజానికిది సంస్కృతంలో బహుళంగా కనుపించే దృగ్విషయమే కాని, “లాక్షణికనియత” మైనట్లు లేదు. పాదాంత యతి భగ్నమైనందుకు వేద వాఙ్మయం నుంచి, లౌకిక సాహిత్యం నుంచి కొన్ని ప్రమాణాలు:

    001.02 (a): agníḥ pū́rvebhir ŕ̥ṣibhir (+ +)
    1.001.02 (b): ī́ḍiyo nū́tanair utá
    1.001.02 (c): sá devā́m̐ éhá vakṣati.

    (అగ్నిః పూర్వేభిరృషిభి (+ +)
    రీడ్యో నూతనైరుత
    స దేవానేహ వక్షతి.) – ఋగ్వేదం 1, 1-2.
    *
    1.024.11 (a): tát tvā yāmi bráhmaṇā vándamānas (+ +)
    1.024.11 (b): tád ā́ śāste yájamāno havírbhiḥ
    1.024.11 (c): áheḷamāno varuṇehá Bodhi
    1.024.11 (d): úruśaṃsa mā́ na ā́yuḥ prá moṣīḥ.
    (తత్ త్వా యామి బ్రహ్మణా వన్దమానస్ (+ +)
    తదా శాస్తే యజమానో హవిర్భిః
    అహేళమానో వరుణేహ బోధ్యురుశంస మా న ఆయుః ప్రమోషీః.) – ఋగ్వేదం 1, 24-11.
    *
    ఇది కాళిదాసు రఘువంశం నుంచి –
    అనాకృష్టస్య విషయై
    ర్విద్యానాం పారదృశ్వనః
    తస్య ధర్మరతే రాసీ (+ +)
    ద్వృద్ధత్వం జరసా వినా. (1-23)

    ఇవి గాక ఇటువంటి ప్రయోగాలను శతశః ఉదాహరింపవచ్చును. (+ +) అని ఉన్నవి పాదాంతయతి లేనందుకు ఉదాహృతులు. నాకు ఇంటిలో వెంటనే యెదుట కనుపించినవి:

    “పశ్యామ్యన్య ముదారభోగవిషయే తుల్యం న మే కఞ్చిద (+ +)
    ప్యన్యః కోఽహ మివాస్మి భాజన ముమాపత్యాదరస్యాపి చ.”

    “మడ్డాఽఽశాకర ఖణ్డనో వివిభునా క్షీరావసా తుల్యమా (+ +)
    సాసుం చాలితడిన్నిభాఙ్గవసనోఽవ్యాత్ సేవకం సారవాన్.” – దుర్ఘట కావ్యం.

    లక్షణశాస్త్ర చారిత్రిక పరిణామక్రమంలో తొలిరోజులలో నిజానికి 2 – 3 పాదాల మధ్య మాత్రమే పాదాంతయతి విధింపబడినదని; 1 – 3, 3 – 4 పాదాల మధ్య పాదాంతయతి లేదని భావింపవచ్చును. అందుకు సామవేదచ్ఛందోవిచితిలో చెప్పబడిన లక్షణం:

    “అథ అవసానాని ఇతి.
    ఏకపద – ద్విపదానాం అన్తతో విరామః.
    త్రిపదాప్రభృతీనాం ద్వౌ ఉక్త్వా శేషం ఆహ ఆ షట్పదాభ్యః ఇతి.
    త్రిపదా – అగ్న ఆయాహి వీతయే (1),
    చతుష్పదా – యజ్ఞాయజ్ఞో (2) వో అగ్నయే.” – (సామవేద చ్ఛందోవిచితి)

    అని. “అగ్న ఆయాహి వీతయే”, “యజ్ఞాయజ్ఞో” అన్నవి సామవేదంలో పాదాంతయతి లేనందుకు ఋగుదాహరణలు.

    పాదాంతయతి పాటింపబడనందుకు ప్రాచీన తమిళ సాహిత్యంలోనూ ఉదాహరణలున్నాయి.
    సంస్కృతంలో 1-2; 3-4 పాదాల మధ్య ఆ పాదాంతయతి తప్పనిసరి కాదు అది కవిప్రయోగాలలో రూఢమై, శ్రావ్యసుభగమైన ఒక సమయగతపాలనమే కాని, శాస్త్రవిహితం కానేరదు.

    ఒక పద్యమైనా, గీతమైనా, ప్రబంధ గద్యమైనా, కవి తనకు తెలిసి వ్రాసినా, తెలియక కూర్చినా “ఛందస్సు” అనే అతివిస్తృతమైన కట్టుబాటులోనికి (“ఛన్దోహీనో న శబ్దోఽస్తి, నచ్ఛన్దశ్శబ్దవర్జితమ్”) ఇమిడిన తర్వాత అది గానయోగ్యమే అవుతుంది. పాదాంతయతికి, ఎక్కడికక్కడ పదాల విరుపుకు ఆ గాన”యోగ్యత”తో లాక్షణికాన్వయం ఉండదు.
    ఛందస్సులో ఉన్నదంటేనే అది తంత్రీలయసమన్వితమై, “పాఠ్యే గేయే చ మధురం” అవుతుంది. పాదాంతయతి, యతిస్థానం వద్ద పదచ్ఛేదం లేని తెలుగు పద్యాన్ని ప్రసిద్ధమైన గతిలోనే గాక వివిధగతులలో హాయిగా పాడుకోవచ్చును. ఏ భాషలోని పద్యానికైనా, గద్యానికైనా, తాళవృత్తానికైనా, గీతికైనా గానయోగ్యత ఉంటుంది. దానికి “రాగ-తాళనిర్దేశం” అన్నది స్వచ్ఛందమూ, ప్రాసంగికమే కాని, లాక్షణికనియతం కాదు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  6. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:

    12/27/2015 5:12 pm

    In Response to essayist:

    Below is closer syllabic writing.
    సరిగమ గరి సరిగరి సరిగమ
    నుడివెద మరి చదువరి చదువగ
    రిగమప మగ రిగమగ రిగమప
    అడిగెద నెరి తదుపరి కలియగ

    Now, couple of lines of song changed into similar syllabic musical alphabet. (Not of any use to a singer.)

    దేవీ మది దీపము నీవై
    సారీ గరి సారిగ రీగా
    రావా హృది రంజిలు పూవై
    రీగా మగ రీగమ గామా

    అన్నీ చతురశ్రజాతి ధ్రువ తాళమే. 14 అక్షరములు. తాళము క్రమము – చతురశ్ర జాతి లఘువు, ద్రుతము, చతురశ్ర జాతి లఘువు, చతురశ్ర జాతి లఘువు.( 4-2-4-4)

    (పాఠకులు ‘కొత్త సంగీత విద్య దర్పణము’ అన్న సంగీతం పుస్తకం చూడండి. ఆ పుస్తకం ముందు పేజీల లో ‘అలంకారముల’ లో నుండి ఆ ప్రాధమిక ఉదాహరణ ఇచ్చాను. ఇంకా క్లిష్టమైన స్వర సముదాయం కల ఘనరాగ గీతముల లోకి వెడితే; “శ్రీ రామచంద్ర శ్రిత పారిజాత, సమస్త కళ్యాణ గుణాభిరామ, సీతా ముఖాంభోరుహ చంచరీక, నిరంతరం మంగళ మాత నోతు.” అనేటి చక్కని సాహిత్యం, చతురశ్రజాతి ధ్రువ తాళము లో స్వరం చూడొచ్చు. ఇందులో సాహిత్యం, ఆవర్తాలు దాటుతుంది. సంగీత రచన లో, స్వర సాహిత్యాలు ఆవర్తాలను అతిక్రమించితే, తాళం తప్పక్కర్లేదు.

    In the movie ‘The body guard’ when Whitney Houston sang the line “And I will always love you” she took the single word “I” thru a long string of notes. It is an all-time gorgeous song to listen.
    The trained classical and pop singers can do syllabic and melismatic singing and mixes.)

    ఇంతకూ, వ్యాస రచయిత – శ్రీశ్రీ పాటను వ్యాసంలో పాడవచ్చని చెప్పిన తాళంలోనే రాసి చూపమని అడిగితే, చేయలేదు. He can’t do it without contradicting himself. It is no big deal. He does not have to do it, if he does not want to.

    Lyla

  7. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/26/2015 2:14 pm

    మో.రా గారు – నమస్కారాలు. మీరు మళ్ళీ రెడ్డొచ్చె ఆట మొదలుపెట్టినారు.

    వారు అడిగినది ఏమి ?

    “ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” గేయపు సాహిత్యాన్ని – చతురశ్ర జాతి ధ్రువతాళంలో రాసి చూపండి.”

    మీరు రాసినది ఏమి ?

    “దేవీ మది దీపము నీవై”

    ఈ దేవీ దీపం ఆనందం అయ్యేదెప్పుడు, ఆ ఆనందం అనురాగం అయ్యేదెప్పుడు, ఆ అనురాగం అంబరాన్ని తాకేదెప్పుడు?

    కామేశ్వరరావు & కో: విషయాన్ని నేను పదే పదే నా అభిప్రాయాల లో రక రకాలుగా చేబుతూ వచ్చాను

    అశ్మాచం (లోపల్లోపల) : పదే పదే చదివినా ఎక్కడా ఏ అభిప్రాయమూ రకరకాలుగా నాకు కనపడలేదు. కాస్త ఎవరైనా పాయింట్ల వారీగా వివరిస్తే బాగుంటుందేమో!

    లోకాస్సమస్తా స్సుఖినోభవంతు.

    అశ్మాచం

  8. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి తః తః అభిప్రాయం:

    12/25/2015 11:31 pm

    “”మోహనగారు చెపుతున్నది లయ గురించి, ……..అనిపిస్తోంది”. కామేశ్వర రావు.

    కాదు. అర్థవంతంగా పాడుకోవటానికి వీలుగా సంస్క్ర్త త శ్లొకాల పాదాలు పదాలు విరగకుండా ముగుస్తాయి అన్న విషయాన్ని మోహన తన వ్యాసాలలో పదే పదే చెపుతున్నారు. ఈ అభిప్రాయానికి తోడుగా తెలుగు కవులు పాదాంత యతిని పాటించక పోవటాన్ని (కొంత తక్కువ చేసి) కూడా వారు ప్రస్తావిస్తున్నారు. పద్యం పాడుకోవటానికి కాదు, చదువుకోవటానికి అన్న విషయాన్ని నేను పదే పదే నా అభిప్రాయాలలో రక రకాలుగా చేబుతూ వచ్చాను. మోహన ఇక్కడ ఈ వ్యాసం మీద వచ్చిన అభిప్రాయాల పై ఇచ్చిన వివరణలో, “నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే” అని అన్నారు.

    తః తః

  9. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    12/25/2015 8:50 am

    “సరిగమ గరి సరిగరి సరిగమ. 14 అక్షరములు”
    మాత్రలు అని ఉండాలి. ఒక చిన్న పాట – 4-2-4-4 మాత్రలతో –

    దేవీ మది – దీపము నీవై
    రావా హృది – రంజిలు పూవై
    జీవ మ్మది – చెలువపు మాయలు
    భావా లవి – భవితకు ఛాయలు

    కనులకు కల – కాన్కలు కావా
    తనువున గల – తాపము నీవా
    మనసున చిరు – మంత్రము నీవే
    ప్రణయపు సుధ – పాత్రను నేనే

    నా మది నది – నవ్వులు తరగలు
    ఆమని యిది – యందపు నురగలు
    ప్రేమల విరి – ప్రియమగు పెదవులు
    కామపు సిరి – కౌగిలి ముదములు

    విధేయుడు – మోహన

  10. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:

    12/23/2015 5:42 pm

    “అద్వైతం” గేయాన్ని చతురశ్రజాతి ధ్రువతాళం వేస్తూ పాడవచ్చంటారు, వ్యాస రచయిత.

    కర్ణాటక సంగీతం పుస్తకం నుండి చతురశ్ర జాతి ధ్రువతాళం. ఒక ఉదాహరణ : సరిగమ గరి సరిగరి సరిగమ. 14 అక్షరములు. (Unless Telugu prosody has its’ own ‘Taala’ scheme.)
    వ్యాసకర్త ( జె. కె. మోహనరావు) ఉద్దేశంలో , గేయాలలో మాటలు మధ్యలో తునగరాదు. ఏ పాదానికి ఆ పాదం అంతమవ్వాలి.
    “ఆనందం అర్ణవమైతే, అనురాగం అంబరమైతే” గేయపు సాహిత్యాన్ని – చతురశ్ర జాతి ధ్రువతాళంలో రాసి చూపండి.

    Lyla.