జయప్రద గారు: మీరు రాస్తున్నది ఎంత అసంబద్దంగా ఉందో గమనించారా? “ఒక ఉదాహరణ లాగా మాత్రమే సుమా శ్రీ రాములు నాయుడునీ, అప్పల్రాముడినీ, అతడి కొడుకునీ వివిధ పార్టీల ఉదాహరణలిచ్చి పేర్కొన్నారు. అంతే కానీ అప్పటికి యెం యెల్ పార్టీలు ఏర్పడ్డాయని కాదు.” అన్నారు. పుట్టని పార్టీల గురించి ఆయనెలా రాయగలిగారో దానిని మీరు ఎలా చెప్పగలుగుతున్నరో అర్దం కాదు. బహుశ ఈ విషయం ఆయన 70ల తరు వాత ఎప్పుడో చెప్పి వుంటారు. నిజానికి కథ రాసిన కాలానికి అలా అనుకొనే అవకాశము లేదు. ఒకవేళ రచయిత ముందు చూపుతో అప్పుడు న్న పార్టీల కంటె మెరుగైన పార్టీని ఊహించాడనుకున్నా, ఆ ఊహ ఏమి నమ్మకంగా లేదు. భవిష్యత్ యిలా భీభత్సంగా ఉండబోతుందని జోస్యం చెప్పా రంటారా! జోస్యాల గురించి అయితే మాట్లాడుకొనక్కరలేదు.
రెండవ విషయం “మీరు మాటవరసగా చెప్పిన ఉదాహరణని పట్టుకుని అదేదో తారీఖులు వేసి చెప్పిన చారిత్రక యదార్ధం లాగా భావించి మాట్లాడుతూ ఆనాటికి యెం యెల్ పార్టీ పుట్టలేదు అని అంటే మాత్రం నవ్వొచ్చింది. ఆ సంగతి ఆ ఉదాహరణ ఇచ్చిన కారా మాస్టారికీ తెలుసు. నాకూ తెలుసు.“అంటున్నారు. మీరు యిలా రాయటం సమంజసమేnA. .యిక్కడ మీరు విద్యాసాగరు గారు మాత్రమే ఉన్నారా. మాలాంటి వాళ్ళం దానిని ఎలా అర్ధం చేసుకొవాలో! విద్యాసాగరు గారి మాటలకు మీకు నవ్వొచ్చిందొ లేదో గాని మీ మాటలు చూస్తుంటే మాకు మాత్రం నవ్వోస్తోంది. మాట వరసగా కొన్ని, మామూలుగా కొన్ని రాస్తుంటారా!
మా గురువు గారు సంజీవ దేవుల సమక్షంలో చిత్ర కళారంగంలో దిద్దుకున్న ఓనమాలు ఇంతకాలం వెన్నంటి ఉన్నాయంటే అది వారి గొప్పతనమే.వారి ముఖతః రామారావు గారి గురించి విన్నాను. మో మొదటి కవితా సంకలనం చితి- చింత ముఖచిత్రంగా వారి నైరూప్య చిత్రం ఆకట్టుకొనేది.ఇంత కాలానికి ఈ మాటలో గొప్ప చిత్రకారుల మీద ఇంత పెద్ద వ్యాసం ప్రకటించడం అభినందనీయం.వేలూరి వారు ముందు ముందు ఇంకొన్ని వ్యాసాలూ రాసి అలరించ బోతున్నందున ముందు జాగ్రత్తగా నాలుగు వాక్యాలు కుదురుగా రాయబోతాను.
అనువాదం ఎవరు చేశారో ఏమో గాని ఈ బృహత్ వ్యాసం కొరకరాని కొయ్య అయి కూచుంది. పీర్లు ఫకీర్లు వారి నెమలీకల మంత్రదండం ఏమైపోయింది ? అచ్చుతప్పులు కోకొల్లలు సరే! అవి అలా ఉండనిద్దాం. అక్కడక్కడ అన్వయం లేని వాక్యాలు (మచ్చుకు రెండు:)
“రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటిపోయాయి.” (ఇంకా నయం , ఒకటికి పోయాయి, అని పడలేదు, అదే జరిగుంటే , పాఠకుడికి పిచ్చి కుదిరేది )
“ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు.”
కాపీ ఎడిటింగ్ లోపాలు అని వీటిని సరిపెట్టుకుందాం. ఈ వ్యాసానికి ఆయువు పట్టు అన దగ్గ పారిభాషిక పదాల ఎంపికలో తబ్బిబ్బు కనిపిస్తుంది. వ్యాసంలో ఒక భావానికి ఒక పదాన్ని చివరి కంటా ఒకే విధంగా వాడితే కాని పాఠకుడికి అర్థబోధ జరగదు.
చిత్ర కళ ఎక్కువ సార్లు సారూప్యం (representive/figurative ), కొండొకచో వైరూప్యం (distortion), బహు సకృతుగా నైరూప్యం (abstraction) కావచ్చు. తెలుగులో చిత్ర కళా విమర్శకు ఆద్యులు సంజీవ దేవ్ గారు representativeను సారూప్యంగా అనువదించి వున్నారు. ఇంకా లోతుకు వెళ్లి, సారూప్యం, వైరూప్యం, నైరూప్యం రస శాస్త్రంలోని అభిద , లక్షణ, వ్యంజనలతో తూగుతాయి అని ఎంతో మీమాంస చేసి వున్నారు. చిత్రకళ రూపానికి సంబంధించినది, కాబట్టి, representative కు సారూప్యం అని ఇదివరకు ఉన్న పారిభాషిక పదాన్ని వాడటమే సబబు. ప్రాతినిథ్యం అనడంలో పాత మార్క్సిస్టు తొంగి చూస్తున్నాడు. అంతేగాక, సారూప్యం, వైరూప్యం,నైరూప్యం అన్నీ రూపంతో ముడివడిన రూపాలే., కాబట్టి, ఇది వరకు పెద్దలు ఏర్పరచిన పారిభాషిక పదాలను వాడటం వల్ల ఎంతో గందర గోళం తప్పుతుంది. ఇక్కడ తమాషా ఏమిటంటే , వ్యాసం చివరి పేజీలో ఒక వాక్యంలో ” నైరూప్యం నుండి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు ” అన్న వాక్యంలో representative ని సారూప్యంగానే పట్టుకొచ్చారు. ఇదే , వాక్యాన్ని ” నైరూప్యం నుండి ప్రాతినిథ్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలుగక పోదు ” అని రాసి చూస్తే, మాట్లాడుతున్న విషయం చిత్రకళ కాదేమో అనిపించ వచ్చు.ఇటువంటి వాక్యం ఒకటి ఈ వ్యాసంలో ఉన్నది కూడా “రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిణ పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే.”
మరో రెండు ముఖ్యమైన పారిభాషిక పదాలు: impression అంటే మానసిక ముద్ర , expression అంటే అభివ్యక్తి expression భావ ప్రకాశంగా అనువదించడం కొంత గందరగోళానికి దారి తీసే విషయమే. abstract expressionను నైరూప్య భావ ప్రకాశత గా పట్టుకు రావడం ఏమంత బాగాలేదు. నైరూప్య అభివ్యక్తి అంటే సరిపోయే దానికి ఇంత ద్రవిడ ప్రాణాయామం అవసరమా?
abstract painter (నైరూప్య చిత్రకారుడు) అంటే చాలు, నైరూప్య భావ ప్రకాశ చిత్రకారుడు అనడం దాన వీర శూర కర్ణ అనడం కన్నా వేయి రెట్లు బరువుగా ఉంది. అలాగే , ప్రతిమా రూప చిత్రాల్లో అనకుండా చిత్రాల్లో అంటే చాలు. ఆంగ్లం లా, తెలుగు విశేషణ బహుళమైన భాష కాదు. అనువాదకులు ఇంత ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తే పని జరగదు.
‘భావ ప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్ర’ అనడం కూడా trపొసగలేదు. సారూప్యం నుంచి నైరూప్యానికి సాగించిన యాత్ర అనడం అర్థవంతం. ప్రాథమిక భావనల పట్ల అవగాహన లోపిస్తే రచయిత / అనువాదకుడు ఏమి చెప్ప దలచుకోన్నారో ఒక పట్టాన అర్థం కాదు.
“1964లో అనామిక అన్న ఈ చిత్రం ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.”
“ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు”
ఇవన్నీ తెలుగు వాక్యాలేనా ?? అన్న సందేహం రావడంలో అనుమానం లేదు. ఈ ఒక్క వ్యాసంతో, అయోమయంలో మూడు లాంతర్ల కనక ప్రసాద్ ను జయించ గలిగారు ఈమాట ప్రధాన సంపాదకులు.
“ఫిజిక్స్ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్”.
దీనికన్నా చిత్రకళా విమర్శ లో సంజీవ్ దేవ్ గారి వ్యాసాలను చదువుకొంటే రచయితకు, పాఠకులకు ఉభయతారకంగా ఉంటుంది అని ఈ బుధజన విధేయుడి అభిప్రాయం.
ఎస్.వి. రామారావు గారి చిత్రకళా ప్రతిభ గురించి చాలా విశేషాలు తెలిసేలా ఈ వ్యాసం రాశారు. హాల్డేన్ ఉదంతంతో ప్రారంభించటం విభిన్నంగా ఉంది. తెలుగు భాషపై హాల్డేన్ ప్రశంస తెలుసు గానీ, ఆ ప్రశంస పరిమితులు ఈ వ్యాసం ద్వారానే తెలిశాయి. చాలా ఏళ్ళ క్రితం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన పెయింటింగ్ ల ప్రదర్శన జరిగితే చూశాను. తన నైరూప్య చిత్రాల్లో కొన్నిటి గురించి రామారావు గారే స్వయంగా ప్రేక్షకులకు వివరిస్తుండగా విన్నాను!
ఈ కధ పై మళ్ళీ మళ్ళీ చర్చించటం ఆ కధకు మరింత ప్రాచుర్యం కలిగించి నట్టవు తుందేమో, కానీ ఆ కధ యొక్క అసంబద్దత తెలియజెప్పటం కూడా అవసరం. ఈ కధని అనవసరంగా కొన్ని దశాబ్దాల పాటు మన నెత్తి కెత్తి మోయించారు పాత తరం రచయితలు, విమర్శకులున్ను. నిజానికి దానంత తిరోగమన భావజాలపు కధ మరొకటి లేదేమో అనిపిస్తుంది.
సి యస్ రావు గారి విమర్శ కూడా పాతపద్దతి లోనే సాగింది. కధ ముగింపు గురించి పాత్రల స్వభావ చిత్రణ లోని అసంబద్దత గురించి చాగంటి తులసి గారు చాలా రోజుల క్రితమే ‘విశాలాంధ్ర’ పత్రికలో రాసారు. కధ పుట్టుకే నిజాలతో సంబంధం లేని అబద్దపు పుట్టుక. అప్పల రాముడు నాటికే కాదు అతని తండ్రినాటికే దళితులకు భూమి ఉన్నదనటం పెద్ద అబద్దం. దళితులకు భూమే లేని కాలంలో భూమి గురించిన ఘర్షణ దాని కొరకు ఒక హత్య! చేసి భీ భత్సాన్ని సృష్టించాడు రచయిత. దానిలో ఏదో ఉందని అగోచరమని దాన్నో బ్రహ్మ పదార్దాన్ని చేసి చూపెట్టారు తన తోటి రచయితలు, విమర్శకులు. నిజానికి చాల అన్యాయమైన ప్రతిపాదనలు కధలో ఉన్నాయి. ఈ కధపై సవివరమైన విమర్స నవంబర్-2011 ప్రస్థానం సంచికలో వచ్చింది. యస్ ఎ విద్యాసాగర్ రాశాడు. దయచేసి చదవండి. జనవరి 2012 మరియు మార్చి 2012 సంచికలలో చర్చ జరిగింది .ఈ చర్చలో పాల్గొంటున్న మిత్రులు వాటిని చదివి చర్చిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని మనవి.
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/05/2012 12:13 am
గౌరవనీయులైన జంపాల చౌదరి గారికి, విష్ణువందన గారికి, నరేన్ గారికి కృతజ్ఞతలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో-
ఆర్.దమయంతి.
ఉరుము ఉరిమి… గురించి naren అభిప్రాయం:
07/04/2012 11:57 pm
సహజంగానే అనిపించింది.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:
07/04/2012 8:08 pm
జయప్రద గారు: మీరు రాస్తున్నది ఎంత అసంబద్దంగా ఉందో గమనించారా? “ఒక ఉదాహరణ లాగా మాత్రమే సుమా శ్రీ రాములు నాయుడునీ, అప్పల్రాముడినీ, అతడి కొడుకునీ వివిధ పార్టీల ఉదాహరణలిచ్చి పేర్కొన్నారు. అంతే కానీ అప్పటికి యెం యెల్ పార్టీలు ఏర్పడ్డాయని కాదు.” అన్నారు. పుట్టని పార్టీల గురించి ఆయనెలా రాయగలిగారో దానిని మీరు ఎలా చెప్పగలుగుతున్నరో అర్దం కాదు. బహుశ ఈ విషయం ఆయన 70ల తరు వాత ఎప్పుడో చెప్పి వుంటారు. నిజానికి కథ రాసిన కాలానికి అలా అనుకొనే అవకాశము లేదు. ఒకవేళ రచయిత ముందు చూపుతో అప్పుడు న్న పార్టీల కంటె మెరుగైన పార్టీని ఊహించాడనుకున్నా, ఆ ఊహ ఏమి నమ్మకంగా లేదు. భవిష్యత్ యిలా భీభత్సంగా ఉండబోతుందని జోస్యం చెప్పా రంటారా! జోస్యాల గురించి అయితే మాట్లాడుకొనక్కరలేదు.
రెండవ విషయం “మీరు మాటవరసగా చెప్పిన ఉదాహరణని పట్టుకుని అదేదో తారీఖులు వేసి చెప్పిన చారిత్రక యదార్ధం లాగా భావించి మాట్లాడుతూ ఆనాటికి యెం యెల్ పార్టీ పుట్టలేదు అని అంటే మాత్రం నవ్వొచ్చింది. ఆ సంగతి ఆ ఉదాహరణ ఇచ్చిన కారా మాస్టారికీ తెలుసు. నాకూ తెలుసు.“అంటున్నారు. మీరు యిలా రాయటం సమంజసమేnA. .యిక్కడ మీరు విద్యాసాగరు గారు మాత్రమే ఉన్నారా. మాలాంటి వాళ్ళం దానిని ఎలా అర్ధం చేసుకొవాలో! విద్యాసాగరు గారి మాటలకు మీకు నవ్వొచ్చిందొ లేదో గాని మీ మాటలు చూస్తుంటే మాకు మాత్రం నవ్వోస్తోంది. మాట వరసగా కొన్ని, మామూలుగా కొన్ని రాస్తుంటారా!
ఈమాట జులై 2012 సంచికకి స్వాగతం! గురించి Katta G. Murty అభిప్రాయం:
07/04/2012 2:16 pm
మీ గ్రంధాలయం లో కామవేదం చదివాను. అద్భుతంగా ఉంది.
ఉరుము ఉరిమి… గురించి vishnuvandana అభిప్రాయం:
07/04/2012 11:18 am
చెప్పటానికి మాటలు లేవు. హ హ హ
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
07/04/2012 5:47 am
మా గురువు గారు సంజీవ దేవుల సమక్షంలో చిత్ర కళారంగంలో దిద్దుకున్న ఓనమాలు ఇంతకాలం వెన్నంటి ఉన్నాయంటే అది వారి గొప్పతనమే.వారి ముఖతః రామారావు గారి గురించి విన్నాను. మో మొదటి కవితా సంకలనం చితి- చింత ముఖచిత్రంగా వారి నైరూప్య చిత్రం ఆకట్టుకొనేది.ఇంత కాలానికి ఈ మాటలో గొప్ప చిత్రకారుల మీద ఇంత పెద్ద వ్యాసం ప్రకటించడం అభినందనీయం.వేలూరి వారు ముందు ముందు ఇంకొన్ని వ్యాసాలూ రాసి అలరించ బోతున్నందున ముందు జాగ్రత్తగా నాలుగు వాక్యాలు కుదురుగా రాయబోతాను.
అనువాదం ఎవరు చేశారో ఏమో గాని ఈ బృహత్ వ్యాసం కొరకరాని కొయ్య అయి కూచుంది. పీర్లు ఫకీర్లు వారి నెమలీకల మంత్రదండం ఏమైపోయింది ? అచ్చుతప్పులు కోకొల్లలు సరే! అవి అలా ఉండనిద్దాం. అక్కడక్కడ అన్వయం లేని వాక్యాలు (మచ్చుకు రెండు:)
“రామారావు చిత్రాలలో ఈ ప్రాక్పశ్చిమాలు కలిసి ఒకటిపోయాయి.” (ఇంకా నయం , ఒకటికి పోయాయి, అని పడలేదు, అదే జరిగుంటే , పాఠకుడికి పిచ్చి కుదిరేది )
“ఎంతటి చిత్రకారుడైనా తన చిత్రాల్లో నలుపుని నియంత్రించేటప్పుడు కొంచెం జంకుతారు.”
కాపీ ఎడిటింగ్ లోపాలు అని వీటిని సరిపెట్టుకుందాం. ఈ వ్యాసానికి ఆయువు పట్టు అన దగ్గ పారిభాషిక పదాల ఎంపికలో తబ్బిబ్బు కనిపిస్తుంది. వ్యాసంలో ఒక భావానికి ఒక పదాన్ని చివరి కంటా ఒకే విధంగా వాడితే కాని పాఠకుడికి అర్థబోధ జరగదు.
చిత్ర కళ ఎక్కువ సార్లు సారూప్యం (representive/figurative ), కొండొకచో వైరూప్యం (distortion), బహు సకృతుగా నైరూప్యం (abstraction) కావచ్చు. తెలుగులో చిత్ర కళా విమర్శకు ఆద్యులు సంజీవ దేవ్ గారు representativeను సారూప్యంగా అనువదించి వున్నారు. ఇంకా లోతుకు వెళ్లి, సారూప్యం, వైరూప్యం, నైరూప్యం రస శాస్త్రంలోని అభిద , లక్షణ, వ్యంజనలతో తూగుతాయి అని ఎంతో మీమాంస చేసి వున్నారు. చిత్రకళ రూపానికి సంబంధించినది, కాబట్టి, representative కు సారూప్యం అని ఇదివరకు ఉన్న పారిభాషిక పదాన్ని వాడటమే సబబు. ప్రాతినిథ్యం అనడంలో పాత మార్క్సిస్టు తొంగి చూస్తున్నాడు. అంతేగాక, సారూప్యం, వైరూప్యం,నైరూప్యం అన్నీ రూపంతో ముడివడిన రూపాలే., కాబట్టి, ఇది వరకు పెద్దలు ఏర్పరచిన పారిభాషిక పదాలను వాడటం వల్ల ఎంతో గందర గోళం తప్పుతుంది. ఇక్కడ తమాషా ఏమిటంటే , వ్యాసం చివరి పేజీలో ఒక వాక్యంలో ” నైరూప్యం నుండి సారూప్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలగక పోదు ” అన్న వాక్యంలో representative ని సారూప్యంగానే పట్టుకొచ్చారు. ఇదే , వాక్యాన్ని ” నైరూప్యం నుండి ప్రాతినిథ్యానికి వస్తున్నాడా అన్న అనుమానం కలుగక పోదు ” అని రాసి చూస్తే, మాట్లాడుతున్న విషయం చిత్రకళ కాదేమో అనిపించ వచ్చు.ఇటువంటి వాక్యం ఒకటి ఈ వ్యాసంలో ఉన్నది కూడా “రామారావుకు ప్రాతినిధ్య కళ నుండి నైరూప్య కళకు జరిగిణ పరిణామం ఖచ్చితమైన రూపు తీసుకున్నది అతను స్లేడ్ స్కూల్‌లో వున్న చివరి సంవత్సరం (1964) లోనే.”
మరో రెండు ముఖ్యమైన పారిభాషిక పదాలు: impression అంటే మానసిక ముద్ర , expression అంటే అభివ్యక్తి expression భావ ప్రకాశంగా అనువదించడం కొంత గందరగోళానికి దారి తీసే విషయమే. abstract expressionను నైరూప్య భావ ప్రకాశత గా పట్టుకు రావడం ఏమంత బాగాలేదు. నైరూప్య అభివ్యక్తి అంటే సరిపోయే దానికి ఇంత ద్రవిడ ప్రాణాయామం అవసరమా?
abstract painter (నైరూప్య చిత్రకారుడు) అంటే చాలు, నైరూప్య భావ ప్రకాశ చిత్రకారుడు అనడం దాన వీర శూర కర్ణ అనడం కన్నా వేయి రెట్లు బరువుగా ఉంది. అలాగే , ప్రతిమా రూప చిత్రాల్లో అనకుండా చిత్రాల్లో అంటే చాలు. ఆంగ్లం లా, తెలుగు విశేషణ బహుళమైన భాష కాదు. అనువాదకులు ఇంత ప్రాథమిక విషయాన్ని విస్మరిస్తే పని జరగదు.
‘భావ ప్రకాశత నుంచి నైరూప్యతకు సాగించిన యాత్ర’ అనడం కూడా trపొసగలేదు. సారూప్యం నుంచి నైరూప్యానికి సాగించిన యాత్ర అనడం అర్థవంతం. ప్రాథమిక భావనల పట్ల అవగాహన లోపిస్తే రచయిత / అనువాదకుడు ఏమి చెప్ప దలచుకోన్నారో ఒక పట్టాన అర్థం కాదు.
“1964లో అనామిక అన్న ఈ చిత్రం ప్రాతినిధ్య కళ నుంచి పూర్తిగా వైదొలగి తన అభివ్యక్తతకు ఒక రూపంగా రూపరాహిత్యాన్ని ఎంచుకున్న తీరును తెలియజేస్తుంది.”
“ఒక సృజనాత్మకుడైన వ్యక్తికి తన అంతరంగంలోని జ్ఞానిని ఏ విషయమైతే మరుగు పరుస్తుందో, మొదట దాన్ని అన్వేషించడం ప్రధాన లక్ష్యమౌతుంది. ఆ తరువాతే అతను తన మదిలోని శక్తిని కూడగట్టుకుంటాడు”
ఇవన్నీ తెలుగు వాక్యాలేనా ?? అన్న సందేహం రావడంలో అనుమానం లేదు. ఈ ఒక్క వ్యాసంతో, అయోమయంలో మూడు లాంతర్ల కనక ప్రసాద్ ను జయించ గలిగారు ఈమాట ప్రధాన సంపాదకులు.
“ఫిజిక్స్ డిగ్రీ వచ్చింతరువాత కొన్నాళ్ళపాటు నిరుద్యోగిగా ఉండవలసిన అవసరం వచ్చి, ఊసుపోక ఆడిట్ చేసిన మోడర్న్ ఆర్ట్ అప్రీషియేషన్ కోర్సులు బహుశా ఇప్పుడు నాకు పనికి రావచ్చు. – వీవీఆర్”.
దీనికన్నా చిత్రకళా విమర్శ లో సంజీవ్ దేవ్ గారి వ్యాసాలను చదువుకొంటే రచయితకు, పాఠకులకు ఉభయతారకంగా ఉంటుంది అని ఈ బుధజన విధేయుడి అభిప్రాయం.
లోకాస్సమస్తా స్సుఖినో భవంతు సర్వేజనా స్సుఖినో భవంతు!!
తమ్మినేని యదుకుల భూషణ్.
[ఒక అచ్చుతప్పుని పట్టిచ్చినందుకు మీకు మా కృతజ్ఞతలు – సం.]
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి తః తః అభిప్రాయం:
07/04/2012 4:25 am
వ్యాసం చదువుదామని మొదలెట్టి 1950 చివరి దశకంలో దాకా చదివి అంటే ఎప్పుడా , 1950ల్లో చివర ఒక దశకం ఉన్నదా అని ఆలోచిస్తూ ఉండి పొయాను.
[తప్పు దిద్దుకున్నాము. సహృదయంతో ఇంత సరళంగా చెప్పిన మీకు మా కృతజ్ఞతలు – సం.]
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి వేణు అభిప్రాయం:
07/04/2012 2:11 am
ఎస్.వి. రామారావు గారి చిత్రకళా ప్రతిభ గురించి చాలా విశేషాలు తెలిసేలా ఈ వ్యాసం రాశారు. హాల్డేన్ ఉదంతంతో ప్రారంభించటం విభిన్నంగా ఉంది. తెలుగు భాషపై హాల్డేన్ ప్రశంస తెలుసు గానీ, ఆ ప్రశంస పరిమితులు ఈ వ్యాసం ద్వారానే తెలిశాయి. చాలా ఏళ్ళ క్రితం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన పెయింటింగ్ ల ప్రదర్శన జరిగితే చూశాను. తన నైరూప్య చిత్రాల్లో కొన్నిటి గురించి రామారావు గారే స్వయంగా ప్రేక్షకులకు వివరిస్తుండగా విన్నాను!
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aditya reddi అభిప్రాయం:
07/03/2012 9:57 pm
ఈ కధ పై మళ్ళీ మళ్ళీ చర్చించటం ఆ కధకు మరింత ప్రాచుర్యం కలిగించి నట్టవు తుందేమో, కానీ ఆ కధ యొక్క అసంబద్దత తెలియజెప్పటం కూడా అవసరం. ఈ కధని అనవసరంగా కొన్ని దశాబ్దాల పాటు మన నెత్తి కెత్తి మోయించారు పాత తరం రచయితలు, విమర్శకులున్ను. నిజానికి దానంత తిరోగమన భావజాలపు కధ మరొకటి లేదేమో అనిపిస్తుంది.
సి యస్ రావు గారి విమర్శ కూడా పాతపద్దతి లోనే సాగింది. కధ ముగింపు గురించి పాత్రల స్వభావ చిత్రణ లోని అసంబద్దత గురించి చాగంటి తులసి గారు చాలా రోజుల క్రితమే ‘విశాలాంధ్ర’ పత్రికలో రాసారు. కధ పుట్టుకే నిజాలతో సంబంధం లేని అబద్దపు పుట్టుక. అప్పల రాముడు నాటికే కాదు అతని తండ్రినాటికే దళితులకు భూమి ఉన్నదనటం పెద్ద అబద్దం. దళితులకు భూమే లేని కాలంలో భూమి గురించిన ఘర్షణ దాని కొరకు ఒక హత్య! చేసి భీ భత్సాన్ని సృష్టించాడు రచయిత. దానిలో ఏదో ఉందని అగోచరమని దాన్నో బ్రహ్మ పదార్దాన్ని చేసి చూపెట్టారు తన తోటి రచయితలు, విమర్శకులు. నిజానికి చాల అన్యాయమైన ప్రతిపాదనలు కధలో ఉన్నాయి. ఈ కధపై సవివరమైన విమర్స నవంబర్-2011 ప్రస్థానం సంచికలో వచ్చింది. యస్ ఎ విద్యాసాగర్ రాశాడు. దయచేసి చదవండి. జనవరి 2012 మరియు మార్చి 2012 సంచికలలో చర్చ జరిగింది .ఈ చర్చలో పాల్గొంటున్న మిత్రులు వాటిని చదివి చర్చిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని మనవి.
ఉరుము ఉరిమి… గురించి జంపాల చౌదరి అభిప్రాయం:
07/03/2012 5:50 pm
బాగుంది.