పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
సురేశ్ గారు, తిక్కన ఎఱ్ఱాప్రగడల కాలమునుండి థ అక్షరాన్ని ధ గా పలకడము ఉన్నదనుకొంటాను. థ, ధ లకు, ద-ధ లకు నన్నయ, తిక్కనల కాలమునుండి ప్రాస చెల్లుతుంది. అన్ని వర్గాక్షరములకు (ఉదా. బ-భ, గ-ఘ, ఇత్యాదులు) ఇలాటి ప్రాస చెల్లక పోయినా థ-ధ, ద-ధ లకు మాత్రము ఇట్టి ప్రాసను ఆ కాలమునుండి కవులు అంగీకరించారు. దీనికి కారణము ఉచ్చరణ మాత్రమే అని నా అభిప్రాయము. అప్పకవి, వేంకటరమణకవి తమ లక్షణగ్రంథాలలో దీనిని పేర్కొన్నారు. వీటికి ఉదాహరణములు ఆంధ్రమహాభారతములో లభ్యము. విధేయుడు – మోహన
సంస్కృతము, తెలుగు వేర్వేరు భాషాకుటుంబాలకు చెందినవి కాబట్టి వాటి వర్ణనిర్మాణంలో తేడాలు ఉండటం సహజం. ణ, ళ వంటి మూర్ధన్య అక్షరాలు మూల ఇండో-యూరోపియన్ లో లేవు. మూర్ధన్య అక్షరాలు, దంతమూలీయ అక్షరాలు (ఱ) ద్రావిడ భాషల ప్రత్యేకత. ఇండో-యూరోపియన్ భాషలలో అల్పప్రాణాలకు, మహాప్రాణాలకు తేడా స్పష్టం. ఆ తేడా ద్రావిడ భాషలలో లేదు. ద్రావిడ భాష అచ్చులలో ఎ, ఏ, ఒ, ఓ ల మధ్య తేడా ఉంది. ఇండో-ఆర్యన్ భాషలలో లేదు (మూల ఇండో-యూరోపియన్ లో ఉండేదని ఒక వాదం). ద్రావిడ భాషలలో సంయుక్తాక్షరాలు పరిమితం: ద్విత్వాక్షరాలు, వర్గ అనునాసికాలకు గ, జ, డ, ద, బ లతో సంయుక్తాక్షరం ఏర్పడటం మాత్రమే కనిపిస్తుంది. ఇండో-యూరోపియన్ భాషలలో క్లిష్టమైన సంయుక్తాక్షర సమూహాలు కనిపిస్తాయి: స్త్ర, ప్ర, ష్ట్ర వంటి ఒత్తులు సర్వసాధారణం.
తెలుగు వర్ణనిర్మాణం గురించి నేను 2007 లో పొద్దు పత్రికలో రాసిన ఈ వ్యాసాలు చూడండి:
“ళ” ని “ల” గా, “ణ” ని “న” గా పలకడం ప్రాఙ్నన్నయ్య కాలంనుండి వస్తున్న తెలుగు సంప్రదాయమే. మూల ద్రావిడంలోని “అణ్ణ”, “మణ్ణు”, “కణ్ణు” లను మనం ఎప్పటి నుండో “అన్న”, “మన్ను”, “కన్ను” అని పలుకుతున్నాం. అలాగే, ఉల్లము, లోపల అన్న పదాలకు ద్రావిడ ధాతువు ఉళ్-, ఒళ- (లోపలకు తమిళంలో ఉళ్ళ అని, కన్నడలో ఒళగె అని అంటారు). పళ్ళ- అన్న మూల ద్రావిడ పదం తెలుగులో పల్లము అయింది. ఉళి తెలుగులో ఉలి (chisel) అయ్యింది. బండి “ఱ” సంగతి సరేసరి.
“ప్రవాహినీ భాషా”అన్నారు కదా. భాష నిరంతరం మారుతూనే ఉంటుంది. పెద్దన కాలంనాటి భాష నన్నయ్యకు నచ్చదు. జంధ్యాల పాపయ్య శాస్త్రి భాష పెద్దనకు నచ్చదు. మనం వాడుతున్న భాష మన తాతలకు నచ్చదు. వచ్చే తరం మాట్లాడే భాష మనకు నచ్చదు.
పెళ్ళి పెల్లి గానూ,కళ్ళు కల్లు గానూ, ఇళ్ళు(బహువచనం) ఇల్లు గానూ కాలక్రమేణా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనంటారా అంటే కాదనే చెబుతాను. ఈ ధ్వని మార్పులు ఎంత భాషాత్మకమో (linguistic), అంత సామాజికం (sociological) కూడానూ. ధ్వని పరిణామాలను మెజారిటీ ఒప్పుకోనిదే భాషలో భాగం అయిపోవు కదా? ఈ ధ్వని మార్పులకు మెజారిటీ అనిష్టతను, తిరస్కృతిని చూపిస్తే, ఆ ధ్వని పరిణామం అందరికీ ప్రామాణికం కాకుండా ఆగిపోతుంది. ‘ళ’ ‘ల’ ల వినిమయంపై అనిష్టతను వ్యక్తం చేస్తూ మీరు రాసిన టపా ద్వారా మీ వంతు సామాజిక బాధ్యతను మీరు నిర్వర్తించారనే నా అభిప్రాయం.
ఈ రకమైన వ్యతిరేకత లేకుండా ఈ మధ్య తెలుగులో వచ్చిన ధ్వని పరిణామాలలో ఒకటి: థ > ధ గా మారటం. తెలంగాణలో పుట్టి పెరిగిన నేను హైదరాబాదుకు వచ్చిన మొదటి రోజుల్లో నా కోస్తాంధ్ర మిత్రులందరు కధ (kadha instead of katha), రధము (radhamu instead of rathamu), విశ్వనాధం (viSwanaadham instead of viSwanaatham) అంటూ ఉంటే వినలేకపోయేవాడిని. పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
ఏ ధ్వని పరిణామమైనా ప్రామాణికుల అంగీకారం లేనిదే భాషలో భాగమైపోదు. మన దురదృష్టంకొద్ది తెలుగు భాష ప్రామాణికతను వితర్కించి, నిర్ణయించే వ్యవస్థ మనకు లేదు. తెలుగు భాషా ప్రయోగాలను ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే పండిత వర్గంకానీ, ప్రామాణికమైన ఆధునిక నిఘంటువులుగాని మనకు లేవు. బలమైన సామాజిక, రాజకీయ సంకల్పం లేకపోతే 21వ శతాబ్దంలో తెలుగు వంటి ఆంగ్లేతర భాషల మనుగడ సందేహాస్పదమేనని David Crystal వంటి భాషావేత్తలు కంఠశోష పెడుతున్నా, పట్టించుకొనే నాథుడే లేడు. ముఖ్యంగా, ప్రాథమిక స్థాయిలో తెలుగు విద్యా బోధనను ఐచ్ఛికం చేయడం తెలుగు భాష మనుగడకు గొడ్డలిపెట్టు అని నా అభిప్రాయం.
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన
Thank you for writing this article. It is most interesting and inspiring. I am the Managing Editor of a Journal on the Classical Dances of India, Nartanam. We have been looking for articles on Music for Dance and the two stalwarts about whom you have written have made great contributions towards dance music. Hope you will share your email id or telephone number so that we can get in touch with you to explore the possibility of a detailed article on the above mentioned lines.
చాలా బాగుంది కవిత ఇంద్రాణి గారూ!
ఆలస్యమైనా దీనిని నేను ఇప్పుడే చదవడం జరిగింది. ఈ కవితను నేను ఆంగ్లంలోకి తర్జుమా చేయాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా!?
మీ అనుమతి కావాలి.
నన్ను క్షమించి గట్టిగా చెప్పనివ్వండి. తెలుగు భాష మనుగడ గురించి, వ్యాకరణాల గురించి తర్వాత సంగతి, తీవ్రంగా ఆలొచించి కార్యాచరణకు దిగవలసిన పరిస్థితి వచ్చింది. ఎన్ని తెలుగు మాటలు చచ్చిపొయాయో లెక్క పెట్టలేం. ‘సరే’ అన్న మాట వాడుకలో లేదు. ‘ఓకే’ వచ్చి కూర్చుంది. ‘ఏం కావాలమ్మా?’ పోయి ‘ఏం కావాలి మేడం’ పూర్తి గా తెలుగయింది ‘అయ్యా’ అన్న మాట మా అయ్య రోజుల్లొనే పోయి ‘సారు/సారూ,’ ఇలా కనీసం ఒక వేయి తెలుగు మాటలు పూర్తిగా మరుగున పడి పొయాయనిపిస్తోంది – మరొకటి ‘రుచి’ పూర్తిగా చచ్చి పోయి [ఒక bad] taste వచ్చింది. ఆలోచించండి.
రమ గారు:
ఈమధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఒక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి సింహద్వారం మీద పెద్ద అక్షరాలతొ ‘పుస్తక మేళ’ అని రాశారు. “వాస్తవానికి చాలా దగ్గరగావుంది – చాలామందికి ‘ళ’ పలకదు” అనుకున్నాను.
తః తః
శ్రీ మోహన :
నిత్య బహు వచనానికి ఏక వచన రూపం లేదని అన్న అర్థంలో నీళ్ళు నిత్య బహు వచనమని రాయటంలో పొరపాటు దొర్లింది. నీళ్ళు అన్నప్పుడు బహు వచనంగా యెలా వాడతామో అట్లే ‘పాలు’ వాడుతాము అని చెప్పటం ఉద్దేశ్యం. ఒక వ్యాకరణ వేత్తగా కాక తెలుగు బళ్ళొ చదువుకుని తెలుగు ఒళ్ళొ పెరిగిన వాడిగా ‘పాలు’కు యేక వచన రూపం చూడలేదని మాత్రం చెప్పగలను.
మిత్రుడు
తః తః
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి indrani Palaparthy అభిప్రాయం:
07/16/2012 1:41 pm
నాగరాజు రవీందర్ గారు:
తప్పకుండా.నాకు ఏమీ అభ్యంతరం లేదు.
ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:
07/16/2012 1:38 pm
పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
సురేశ్ గారు, తిక్కన ఎఱ్ఱాప్రగడల కాలమునుండి థ అక్షరాన్ని ధ గా పలకడము ఉన్నదనుకొంటాను. థ, ధ లకు, ద-ధ లకు నన్నయ, తిక్కనల కాలమునుండి ప్రాస చెల్లుతుంది. అన్ని వర్గాక్షరములకు (ఉదా. బ-భ, గ-ఘ, ఇత్యాదులు) ఇలాటి ప్రాస చెల్లక పోయినా థ-ధ, ద-ధ లకు మాత్రము ఇట్టి ప్రాసను ఆ కాలమునుండి కవులు అంగీకరించారు. దీనికి కారణము ఉచ్చరణ మాత్రమే అని నా అభిప్రాయము. అప్పకవి, వేంకటరమణకవి తమ లక్షణగ్రంథాలలో దీనిని పేర్కొన్నారు. వీటికి ఉదాహరణములు ఆంధ్రమహాభారతములో లభ్యము. విధేయుడు – మోహన
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/16/2012 12:26 pm
రమ గారు,
సంస్కృతము, తెలుగు వేర్వేరు భాషాకుటుంబాలకు చెందినవి కాబట్టి వాటి వర్ణనిర్మాణంలో తేడాలు ఉండటం సహజం. ణ, ళ వంటి మూర్ధన్య అక్షరాలు మూల ఇండో-యూరోపియన్ లో లేవు. మూర్ధన్య అక్షరాలు, దంతమూలీయ అక్షరాలు (ఱ) ద్రావిడ భాషల ప్రత్యేకత. ఇండో-యూరోపియన్ భాషలలో అల్పప్రాణాలకు, మహాప్రాణాలకు తేడా స్పష్టం. ఆ తేడా ద్రావిడ భాషలలో లేదు. ద్రావిడ భాష అచ్చులలో ఎ, ఏ, ఒ, ఓ ల మధ్య తేడా ఉంది. ఇండో-ఆర్యన్ భాషలలో లేదు (మూల ఇండో-యూరోపియన్ లో ఉండేదని ఒక వాదం). ద్రావిడ భాషలలో సంయుక్తాక్షరాలు పరిమితం: ద్విత్వాక్షరాలు, వర్గ అనునాసికాలకు గ, జ, డ, ద, బ లతో సంయుక్తాక్షరం ఏర్పడటం మాత్రమే కనిపిస్తుంది. ఇండో-యూరోపియన్ భాషలలో క్లిష్టమైన సంయుక్తాక్షర సమూహాలు కనిపిస్తాయి: స్త్ర, ప్ర, ష్ట్ర వంటి ఒత్తులు సర్వసాధారణం.
తెలుగు వర్ణనిర్మాణం గురించి నేను 2007 లో పొద్దు పత్రికలో రాసిన ఈ వ్యాసాలు చూడండి:
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – మొదటి భాగం
తెలుగు వర్ణ నిర్మాణం (phonology) – రెండవ భాగం
“ళ” ని “ల” గా, “ణ” ని “న” గా పలకడం ప్రాఙ్నన్నయ్య కాలంనుండి వస్తున్న తెలుగు సంప్రదాయమే. మూల ద్రావిడంలోని “అణ్ణ”, “మణ్ణు”, “కణ్ణు” లను మనం ఎప్పటి నుండో “అన్న”, “మన్ను”, “కన్ను” అని పలుకుతున్నాం. అలాగే, ఉల్లము, లోపల అన్న పదాలకు ద్రావిడ ధాతువు ఉళ్-, ఒళ- (లోపలకు తమిళంలో ఉళ్ళ అని, కన్నడలో ఒళగె అని అంటారు). పళ్ళ- అన్న మూల ద్రావిడ పదం తెలుగులో పల్లము అయింది. ఉళి తెలుగులో ఉలి (chisel) అయ్యింది. బండి “ఱ” సంగతి సరేసరి.
“ప్రవాహినీ భాషా”అన్నారు కదా. భాష నిరంతరం మారుతూనే ఉంటుంది. పెద్దన కాలంనాటి భాష నన్నయ్యకు నచ్చదు. జంధ్యాల పాపయ్య శాస్త్రి భాష పెద్దనకు నచ్చదు. మనం వాడుతున్న భాష మన తాతలకు నచ్చదు. వచ్చే తరం మాట్లాడే భాష మనకు నచ్చదు.
పెళ్ళి పెల్లి గానూ,కళ్ళు కల్లు గానూ, ఇళ్ళు(బహువచనం) ఇల్లు గానూ కాలక్రమేణా మారిపోతుంటే చూస్తూ ఊరుకోవలసిందేనంటారా అంటే కాదనే చెబుతాను. ఈ ధ్వని మార్పులు ఎంత భాషాత్మకమో (linguistic), అంత సామాజికం (sociological) కూడానూ. ధ్వని పరిణామాలను మెజారిటీ ఒప్పుకోనిదే భాషలో భాగం అయిపోవు కదా? ఈ ధ్వని మార్పులకు మెజారిటీ అనిష్టతను, తిరస్కృతిని చూపిస్తే, ఆ ధ్వని పరిణామం అందరికీ ప్రామాణికం కాకుండా ఆగిపోతుంది. ‘ళ’ ‘ల’ ల వినిమయంపై అనిష్టతను వ్యక్తం చేస్తూ మీరు రాసిన టపా ద్వారా మీ వంతు సామాజిక బాధ్యతను మీరు నిర్వర్తించారనే నా అభిప్రాయం.
ఈ రకమైన వ్యతిరేకత లేకుండా ఈ మధ్య తెలుగులో వచ్చిన ధ్వని పరిణామాలలో ఒకటి: థ > ధ గా మారటం. తెలంగాణలో పుట్టి పెరిగిన నేను హైదరాబాదుకు వచ్చిన మొదటి రోజుల్లో నా కోస్తాంధ్ర మిత్రులందరు కధ (kadha instead of katha), రధము (radhamu instead of rathamu), విశ్వనాధం (viSwanaadham instead of viSwanaatham) అంటూ ఉంటే వినలేకపోయేవాడిని. పత్రికల్లో, పుస్తకాల్లో [థ]కారాన్ని [ధ]కారంగా రాయడంతో, రేడియో, టీవీలలో [థ], [ధ] లను ఒకే ఉచ్చారణతో పలకడంతో గత శతాబ్దంలో ఏ విధమైన వ్యతిరేకత లేకుండా, ఈ మార్పు అందరి ఆమోదం పొంది ఇప్పుడు భాషలో భాగమైపోయిందని నా అభిప్రాయం.
ఏ ధ్వని పరిణామమైనా ప్రామాణికుల అంగీకారం లేనిదే భాషలో భాగమైపోదు. మన దురదృష్టంకొద్ది తెలుగు భాష ప్రామాణికతను వితర్కించి, నిర్ణయించే వ్యవస్థ మనకు లేదు. తెలుగు భాషా ప్రయోగాలను ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే పండిత వర్గంకానీ, ప్రామాణికమైన ఆధునిక నిఘంటువులుగాని మనకు లేవు. బలమైన సామాజిక, రాజకీయ సంకల్పం లేకపోతే 21వ శతాబ్దంలో తెలుగు వంటి ఆంగ్లేతర భాషల మనుగడ సందేహాస్పదమేనని David Crystal వంటి భాషావేత్తలు కంఠశోష పెడుతున్నా, పట్టించుకొనే నాథుడే లేడు. ముఖ్యంగా, ప్రాథమిక స్థాయిలో తెలుగు విద్యా బోధనను ఐచ్ఛికం చేయడం తెలుగు భాష మనుగడకు గొడ్డలిపెట్టు అని నా అభిప్రాయం.
సురేశ్.
ఉరుము ఉరిమి… గురించి మోహన అభిప్రాయం:
07/15/2012 11:44 am
స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/15/2012 9:12 am
అవునండి! అందరిళ్ళల్లో జరిగే సంగతే..కథ గా రాశాను. నచ్చి నందుకు సంతోషం గా వుంది.
కృతజ్ఞతలతో ..
-ఆర్.దమయంతి.
88 ఏళ్ళ యువకులు గురించి Madhavi Puranam అభిప్రాయం:
07/15/2012 9:08 am
Dear Shri Rohini Prasad garu:
Thank you for writing this article. It is most interesting and inspiring. I am the Managing Editor of a Journal on the Classical Dances of India, Nartanam. We have been looking for articles on Music for Dance and the two stalwarts about whom you have written have made great contributions towards dance music. Hope you will share your email id or telephone number so that we can get in touch with you to explore the possibility of a detailed article on the above mentioned lines.
Best Regards
Madhavi Puranam
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:
07/15/2012 12:12 am
చాలా బాగుంది కవిత ఇంద్రాణి గారూ!
ఆలస్యమైనా దీనిని నేను ఇప్పుడే చదవడం జరిగింది. ఈ కవితను నేను ఆంగ్లంలోకి తర్జుమా చేయాలనుకుంటున్నాను. మీకేమైనా అభ్యంతరమా!?
మీ అనుమతి కావాలి.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తఃతః అభిప్రాయం:
07/14/2012 3:18 pm
నన్ను క్షమించి గట్టిగా చెప్పనివ్వండి. తెలుగు భాష మనుగడ గురించి, వ్యాకరణాల గురించి తర్వాత సంగతి, తీవ్రంగా ఆలొచించి కార్యాచరణకు దిగవలసిన పరిస్థితి వచ్చింది. ఎన్ని తెలుగు మాటలు చచ్చిపొయాయో లెక్క పెట్టలేం. ‘సరే’ అన్న మాట వాడుకలో లేదు. ‘ఓకే’ వచ్చి కూర్చుంది. ‘ఏం కావాలమ్మా?’ పోయి ‘ఏం కావాలి మేడం’ పూర్తి గా తెలుగయింది ‘అయ్యా’ అన్న మాట మా అయ్య రోజుల్లొనే పోయి ‘సారు/సారూ,’ ఇలా కనీసం ఒక వేయి తెలుగు మాటలు పూర్తిగా మరుగున పడి పొయాయనిపిస్తోంది – మరొకటి ‘రుచి’ పూర్తిగా చచ్చి పోయి [ఒక bad] taste వచ్చింది. ఆలోచించండి.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తఃతః అభిప్రాయం:
07/14/2012 2:54 pm
రమ గారు:
ఈమధ్య నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఒక పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేసి సింహద్వారం మీద పెద్ద అక్షరాలతొ ‘పుస్తక మేళ’ అని రాశారు. “వాస్తవానికి చాలా దగ్గరగావుంది – చాలామందికి ‘ళ’ పలకదు” అనుకున్నాను.
తః తః
మత్తకోకిల కథ గురించి తఃతః అభిప్రాయం:
07/14/2012 2:38 pm