‘ కథ విషయం కంటే శైలి చాలా బాగుంది. నాకైతే మధురాంతకం రాజారాం గారి హాస్య శైలి గుర్తుకు వచ్చింది ‘
-Krishnamohanreddy
* హబ్బ! నాకెంతో ప్రియమైన రచయిత – మధురాంతకం రాజారాం గారు! నా కథ చదువుతూంటే..వారి శైలి గుర్తుకొచ్చిందని, మీరంటే – ..ఎంత ఆనందమేసిందో..చెప్పలేను.
ఇంత మంచి ప్రశంసనిచ్చినందుకు – థాంక్యూ, కృస్హ్ణమోహన్ రెడ్డి గారూ! థాంక్యూ!
నమస్కారాభినందనలతో-
ఆర్.దమయంతి.
సురేశ్ గారు,
ఓపికతో వివరించినందుకు కృతజ్ఞతలు, దేశ్‌పాండేగారి వ్యాసం గూగులమ్మ ప్రసాదించినంత వరకూ చదివాను. 🙂 నాకు అర్థమైనంతవరకూ “ళ”కారానికీ యితర మూర్ధన్యాలకీ కొంత తేడా ఉంది. యితర మూర్ధన్యాలు ప్రధానంగా ఉత్తరభారతంలోని పశ్చిమభాగానికి చెందిన ఉచ్చారణ వల్ల ఏర్పడినవైతే, యీ “ళ”కారం తూర్పు భాగానికి చెందిన ప్రాంతాలలోని ఉచ్చారణ వల్ల వచ్చింది. ఆ ప్రాంతాలలో “డ”, “ఢ”లకు కొన్నిసందర్భాలలో “ళ”కార ఉచ్చారణ ఉండేదని, మనకు లభ్యమవుతున్న శాకల్యుని ఋగ్వేద పదపాఠం ఆ ప్రాంతంలో గ్రంథస్థమై ఉంటుందని, పాణిని పశ్చిమభాగానికి చెందిన వాడు కాబట్టి అతనికి లభించిన పదపాఠంలో “ళ”కారం లేకపోవడం వల్ల అతను తన శిక్షలో దాన్ని చేర్చలేదని దేశ్‌పాండే చెప్పినట్టుగా నాకర్థమయ్యింది. ఇది ఆసక్తికరమైన విషయం. తర్వాత కాలంలో తూర్పుభాగానికి చెందిన భాషలలో యీ “ళ”కారం ఎలా మాయమయ్యిందో మరి! బెంగాలీలో “డ”కారంలా వినిపించే “ర”కారం మాత్రం ఇప్పటికీ ఉంది! “హౌరా”లో “ర”కారం వాళ్ళు “డ”కారానికి దగ్గరగా పలుకుతారు (నా పేరుని కూడా వాళ్ళు కామేశ్ వడ రావ్ అని పలికేవారు! 🙂 , దీనికీ వేదవాఙ్మయంలో కనిపించే “ళ”కారానికీ ఏమైనా సంబంధముందేమో!
తెలుగులో “ల”కారం “ళ”కారంగా మారడం గురించి కూడా మీరిచ్చిన వివరణ బాగుంది. “ర”కారం ముందున్న పదాలలో “ల”కారం “ళ”కారంగా మారడం నేనుకుడా గమనించాను కాని అలా కాని సందర్భాలలో కూడా చాలాచోట్ల కనిపించడంతో అదిక్కడ వర్తించదేమో అనుకున్నాను. రెండు మూడు రకాలుగా మార్పు జరిగుండవచ్చునని తట్ట లేదు. సంస్కృతంలో (నతిసూత్రం ప్రకారం) “న”కారం “ణ”కారంగా మారడానికి అడ్డువచ్చే “ల”కారం తెలుగులో తానే “ళ”కారంగా మారడం ఆశ్చర్యం!
ఈ వ్యాసాన్ని విశ్లేషించడానికి నా అర్హత చాలదు. చాలా గొప్పగా ఉంది. ద్రౌపది వ్యక్తిత్వాన్నీ, ఆమె ఆక్రోశాన్ని కవి తిక్కన ఆవిష్కరిస్తే బృందావన రావుగారు ఆ వైనాన్ని ఒడిసిపట్టి మనకు అందించారు. ఈ సైట్ చూడడం ఇదే ప్రథమం. తొలిసారే నన్ను ఆకట్టుకుంది.
ఎప్పుడో 2006 ప్రాంతంలో చెప్పిన ఇక్కడి భావాలని ‘సప్రర’ గారి వ్యాఖ్యకి మూలమేమిటా అని వెనక్కి వచ్చి ఇప్పుడే చదివాను. దీని మీద ఇవాళ మాట్లాడడానికి ఈ చర్చ లోని విషయాలు వెనకబడి పోయినవి ఇప్పటికీ ఏవీ లేవు గనక ఆరేళ్ళ తరవాత కూడా ఈ సంగతులమీద చర్చ చేయవచ్చుననే నేను అనుకుంటున్నాను. అయితే నేను 2006 కాదు కదా ఇవాళ్టికీ తెలుగు పత్రికలనీ అందులో వచ్చే సంగతులనీ శ్రధ్ధగా చదవడం లేదు గనక తెలుగు పత్రికలలో వచ్చే సాహిత్య వాద వివాదాల గురించి నాకు తెలియదని మాత్రం ఒప్పుకుంటూ, నేను గుడిపాటి, ఇంకా వెల్చేరుల భావాలని కూడా చదవలేదని చెప్పుకుంటూనే నాకు తొచినవీ నాకు అర్ధమైనవీ చెప్పడానికి ఈ నాలుగు మాటల్నీ రాస్తున్నాను.
ఇక్కడి అభిప్రాయాలలో వ్యక్తమైన భావాలలో అందరి భావాలలో కూడా కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. మరి కొన్ని వట్టి భావోద్వేగాలకి సంబంధించీ ఉన్నాయి. ఇందులో ఎక్కువ బాగున్న అభిప్రాయం కొడవళ్ళ హనుమ గారిదే అని చెప్పాలి. ఆయన అంటున్నది ఏమంటే ఎవరు దేని గురించైనా మాట్లాడండి గానీ, సోదాహరణగా మాట్లాడండి. అప్పుడు చదివే వాళ్ళకి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందీ అని. ఆ అలవాటు తెలుగులో వ్యాసాలు రాసే చాలా మందికి లేకపోవడం అన్నది తెలుగు విమర్శనా వ్యాసాలు చదివే వారికి తెలియని సంగతి ఏమీ కాదు.
ఇంక వెల్చేరు అన్నది విమర్శని కవిత్వాన్నీ నేర్పే వ్యవస్థ ఒకటి తెలుగున ఏర్పడాలని. బహుశా ఆయన ఉద్దేశ్యం – పశ్చిమ దేశాల్లోని ఉండే వ్యవస్థ నమూనా లాంటిది. అక్కడి విశ్వవిద్యాలయాలలో ఉండే creative courses లాంటివి తెలుగు నేల మీద కూడా ఏర్పడాలని. [యూనివెర్సిటీలలోనో ఇతరత్రానో అని కాబోలు.] కానీ తెలుగులో విశ్వవిద్యాలయాలలో బోధనాభాషగానే తెలుగుకి గతి లేని స్థితి లో ఈ పనిని ఊహించే వాళ్ళెవరు. ఇందుకు డబ్బులు సమకూర్చే వారెవరు? ఇవన్నీ జరిగినా వీటిని బోధించే అర్హతలున్న వారెందరూ? అన్నవి ముందుకొచ్చే విషయాలు. కార్యాచరణ కావాలి అంటే అందుకు మరి ఇన్ని విషయాలూ మాట్లాడాలి. అయితే ఆ పనిని ఎవరు చేస్తారో చెప్పకుండా, పైగా రాసే వారే వీటిని ఏర్పాటు చేసుకోవాలనే అర్ధంలో కాబోలు కవులనీ, విమర్శకులనీ ఇందుకు పూనుకోమన్నట్టు ఆయన సూచన చేస్తున్నారు. ఇందులో క్లారిటీ కనబడటం లేదు. కట్టకలిపి కవులూ రచయితలూ కొండొకచో విమర్శకులూ అన్నవారు ఏమి చెయ్యాలని వెల్చేరు అనుకుంటున్నారూ? స్కూళ్ళు పెట్టుకోవాలా? తామే నడుపుకోవాలా? నాకు బోధ పడలేదు. అయోవా యూనివెర్సిటీ లాగా తెలుగున [ఇవాళ తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోందట గనక] ప్రపంచంలోని పెద్ద విశ్వవిద్యాలయాలలో ఏవైనా వచ్చి ఒక కోర్సుని ఇక్కడి స్కూళ్ళలో మొదలుపెడతాయా? తెలుగులో ప్రొఫెషనల్ రీతిలో కవిత్వాన్నీ విమర్శనీ రాయాలని ఆశించే వారు ఎవరన్నా అసలు తెలుగులో రాస్తున్న వాళ్ళు ఏయే రంగాలలోంచి వచ్చి తెలుగున రాస్తున్నారూ అన్నది సైతం చర్చని చేయాలి కదా? వాళ్ళ భాషా పరిజ్ఞానం అందుకు చాలుతోందా అన్నది కూడా చర్చ చేయాలి కదా? ఒక విషయంలోనేమో ఉదార స్వభావాన్నీ మరొక విషయం లోనేమో ప్రొఫెషనల్ స్థితినీ చెప్పడంలో, లేదా అలా ఆశించడంలో అయోమయం లేదా??
అసలు ఇన్నీ చేసి ఇటువంటివి అంటే మంచి కవిత్వం లేదా ఉత్తమ విమర్శ అన్నవి తయారు చేయడానికి తగిన పాఠ్యాంశాలు ఏవి? వాటిని ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎవరు బోధిస్తారు? అందుకు ఉండే అర్హతలు ఏమిటి? ఇవన్నీ బహుశా ఇంకా రాబోయే చర్చలలో వెల్చేరు గానీ వీటిని చెప్పిన ఇతరులు గానీ చెబుతారు కాబోలును. అందుకు వేచి చూడాల్సి ఉందన్నమాట.
కొన్ని విషయాలు బోధన చేస్తేనో లేదా అటువంటి వాటిలో శిక్షణ నిస్తేనో వచ్చేవి కావనీ ఎందులోనైనా వారిలో సహజంగా ఉండే కల్పనా శక్తీ, తార్కిక శక్తీ బోధన వలన అబ్బవనీ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఒప్పుకున్న విషయాలే! ముఖ్యంగా మేలైన కవులు విశ్వవిద్యాలయాలలోంచి పుట్టుకు రాలేరు. జీవితం లోంచి రావాల్సిందే! విమర్శకి సైతం విశ్వవిద్యాలయాలు చాలలేదని కుప్పతెప్పలుగా – సాహిత్య రంగాలని అటుంచండి వాటిలో డిగ్రీలకి విలువ పోయి బహుకాలమైంది – ఇతర రంగాలలో సైతం ఇవాళ ఇదే స్థితి ఉంది అక్కడ. ఇంక “ప్రమాణం” అన్నదానికి చోటు ఏదీ?
అప్పటికే తయారై ఉన్న దాని లోని మంచి చెడులని తర్కించక, అటువంటి రచనలని పక్కన పడేసి లేని దాని వైపు చర్చని నడపడంలో ఫలితం ఎప్పుడూ ఉండదు. తెలుగులో వచ్చిన మంచి పుస్తకాలని గురించి మనస్పూర్తిగా మాట్లాడడం చేయలేని వారు, లేని వాటిని గురించి వాపోవడంలో అర్ధం లేదు. అలా ప్రవర్తించడం సైతం తెలుగులో రాస్తున్న వారి పట్ల సరైన గౌరవ మర్యాదలని చూపక పోవడమే అవుతుంది. రాస్తున్న వారిని, వారి రచనలనీ మేము మాట్లాడము, రాయని వాటినీ, పసలేని రచనలనీ ముందు పెట్టుకుని చర్చలు నడుపుతామూ విమర్శిస్తామూ అన్న వైఖరి వలన సమకాలంలోనూ మీకు రచయితల పట్ల సహృదయత లేదనీ, రాబోయే వారి పట్ల అసలే ఉండదనీ మాత్రం అర్ధం అవుతుంది. ఎందుకంటే ఆ రాబోయే రచయితలు మీరు ఊహించే వ్యవస్థాగతమైన స్కూళ్లలోంచి వచ్చి తెలుగు సాహిత్యాన్ని ఉధ్ధరించాల్సి ఉంది ఇంకా! అప్పటికి ఇంకా ఈ నేల మీద తెలుగు మిగిలి ఉంటేనూ! మీ పాశ్చాత్య భావనలతో మీరు, కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఇక్కడ మిగిలిన తెలుగుని అసలు మననిస్తేనూ, అప్పుడు కదా!
కొంతమంది భాషావేత్తల అభిప్రాయం ప్రకారం వైదిక భాషకు సోదర భాష అయిన అవెస్తీయ భాషలాగా (Avestan) వైదిక సంస్కృతంలో మూర్ధన్య అక్షరాలే ఉండేవి కావు. ఆపై ఒక్క “ర” కారం మాత్రమే మూర్ధన్యం (retroflex) గా పలికేవారు. తరువాతి కాలంలో మనం ఇంతకు ముందు చర్చించిన నతి సూత్రం ఆధారంగా ర-కారం తరువాత వచ్చే న- కారం ణ-కారంగా (మూర్ధన్యంగా) మారింది. అంతేకాక, వైదిక సంస్కృతంలో ర-కారానికి ల-కారానికి తేడా ఉండేది కాదు రలయోర్ అబేధః అన్నది సంస్కృత వ్యాకర్తలందరూ అంగీకరించిన సూత్రం. మూల భాషలో ర- కారంగా ఉన్న దాన్ని ల-కారంగా పలికే మాండలికాల్లో అది మూర్ధన్య ళ-కారంగా పలికేవారని ఒక వాదం.
ఇప్పుడు మనం వేదవాఙ్మయంగా భావించే సాహిత్యం తరువాతి కాలంలో (బహుశా మహరాష్ట్రీ ప్రాకృతంలో) పలికే ఉచ్చారణ బట్టి గ్రంథస్థం అయ్యుండవచ్చని కొంతమంది అభిప్రాయం. ఉదాహరణకు మాధవ్ దేశ్‌పాండే రాసిన ఈ వ్యాసం చూడండి: “Genesis of Retroflexion in Rgveda: A historical and socio-linguistic investigation”.
ఇక తెలుగు, కన్నడ మొదలైన భాషలలో సంస్కృత పదాలలో కనిపించే “ళ” కారం చాలావరకు నతి సూత్రం ద్వారానే వివరించవచ్చు. ఈ కింది పదాలలో ర- కారం తరువాతే వచ్చే ల-కారం ళ-కారంగా మారింది, గమనించండి:
అరళము, కేరళము, ఖురళి, గరళము, తరళము, ధారళము, పరళులు, ప్రళయము, మురళి, విరళము, విరళి, సరళ వంటి పదాలలో ర-కారం తరువాత ళ-కారం కనిపిస్తుంది. అలాగే, ప్రక్షాళన, క్ష్వేళితము, క్షాళితము, ఇక్షునాళిక వంటి పదాల్లో ష-కారం తరువాత ళ-కారం కనిపించడం నతి వంటి ధ్వనిపరిణామమే.
అయితే, తెలుగులో “ళ” కారం కనిపించే కొన్ని పదాలు కన్నడ తమిళాలలో ళ-కారం కనిపించదు. ఉదహారణకు
కళ్యాణి (తెలుగు), కల్యాణి (కన్నడ, తమిళం);
కళ (art) కలా (కన్నడ, తమిళం);
అలాగే కన్నడలో “ళ” కారం కనిపించే కొన్నిపదాలు తెలుగులో మామూలు ల-కారంతో కనిపిస్తాయి:
ఈ పదాలలో ళ-కారాన్ని వివరించడానికి ఆరోజుల్లోని వివిధ ప్రాకృత భాషలను పరిశీలించవలసి ఉంటుందని నా అభిప్రాయం.
రమ గారు: సుబ్బులక్షి “సొలసి చూచినను సూర్య చంద్రులను లలి వెదజల్లెడు లక్షణుడు” అన్న అన్నమయ్య వాక్యాన్ని “లలివేద జల్లడు” అని పాడిందనేగా మీరు చెప్పదలుచుకున్నది? ఆ తప్పు ఉచ్చారణకు తమిళ వర్ణనిర్మాణానికి అంతగా సంబంధం లేదండి. ఉచ్చారణలో అంతగా తప్పులు చెయ్యని సుబ్బులక్ష్మికి ఈ అన్నమయ్య సాహిత్యాన్ని ఎవరో తప్పుగా రాసి ఇచ్చి ఉంటారు కర్ణాటిక్.కాం వెబ్ సైటులో లాగా (ఆ వెబ్ సైటులో చేరి యశోదకు సాహిత్యం చూడండి). ఆమె పాడిందే ప్రామాణికమై అందరూ అలాగే పాడుతుండవచ్చు. అయితే, మిగిలిన తమిళ గాయకులు సరళ, పరుషాలను తారుమారు చేయడానికి తమిళ వర్ణనిర్మాణమే కారణమని చెప్పవచ్చు. మూల ద్రావిడంలో పదాదిలో క, చ, ట, త, ప-లు గా, అచ్చుల మధ్య గ, స, డ, ద, వ-లు గా, అనునాసికాల తరువాత (ద్రుతం తరువాత) గ, జ, డ, ద, బలు గా పలుకేవారు. ద్విత్వాక్షరాలు మాత్రం క్క, చ్చ, ట్ట, త్త, ప్ప- లుగానే పలికేవారు. ప్రాచీన తెలుగులో ఇదే పద్ధతి ఉండేదని శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
వూరుపుటూరి గారు: దంత్య-చ, జలు నిజానికి దంతమూలీయ (alveolar) స్పర్శోష్మాలు (affricates). తాలవ్య-చ, జలు palatal stops. తాలవ్యాలను నాలిక మధ్య భాగంతో అంగులి మధ్యభాగం తాకడం ద్వారా పలుకుతారు. దంతమూలీయాలు నాలిక కొస (apical) దంతమూలం దగ్గర తాకడం ద్వారా పలికే ధ్వనులు.
ఇటు నేనే – అటు నేనే గురించి వంశీ అభిప్రాయం:
07/24/2012 12:36 pm
Don’t know if it is poetry or not, కానీ “అన్నంలో తెల్ల వెంట్రుక తీయటం కష్టమైంది.” లాంటి ఝలక్ తిని చాలా రోజులైంది.
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/22/2012 11:34 pm
‘ కథ విషయం కంటే శైలి చాలా బాగుంది. నాకైతే మధురాంతకం రాజారాం గారి హాస్య శైలి గుర్తుకు వచ్చింది ‘
-Krishnamohanreddy
* హబ్బ! నాకెంతో ప్రియమైన రచయిత – మధురాంతకం రాజారాం గారు! నా కథ చదువుతూంటే..వారి శైలి గుర్తుకొచ్చిందని, మీరంటే – ..ఎంత ఆనందమేసిందో..చెప్పలేను.
ఇంత మంచి ప్రశంసనిచ్చినందుకు – థాంక్యూ, కృస్హ్ణమోహన్ రెడ్డి గారూ! థాంక్యూ!
నమస్కారాభినందనలతో-
ఆర్.దమయంతి.
నాకు నచ్చిన పద్యం: ద్రౌపది పరివేదన గురించి Kameswara Rao Chavali అభిప్రాయం:
07/21/2012 10:39 pm
చక్కటి పద్యాన్ని అందించిన బృందావనరావు గారికి ధన్యవాదాలు.
కామెశ్వర రావు చావలి, విన్నిపెగ్, కెనడా.
ఉరుము ఉరిమి… గురించి Krishnamohanreddy అభిప్రాయం:
07/21/2012 11:14 am
కథ విషయం కంటే శైలి చాలా బాగుంది. నాకైతే మధురాంతకం రాజారాం గారి హాస్య శైలి గుర్తుకు వచ్చింది
వానలో ఓ జాణ గురించి Mrithyunjaya Rao అభిప్రాయం:
07/21/2012 7:03 am
చాలా బాగుంది
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
07/21/2012 2:55 am
సురేశ్ గారు,
ఓపికతో వివరించినందుకు కృతజ్ఞతలు, దేశ్‌పాండేగారి వ్యాసం గూగులమ్మ ప్రసాదించినంత వరకూ చదివాను. 🙂 నాకు అర్థమైనంతవరకూ “ళ”కారానికీ యితర మూర్ధన్యాలకీ కొంత తేడా ఉంది. యితర మూర్ధన్యాలు ప్రధానంగా ఉత్తరభారతంలోని పశ్చిమభాగానికి చెందిన ఉచ్చారణ వల్ల ఏర్పడినవైతే, యీ “ళ”కారం తూర్పు భాగానికి చెందిన ప్రాంతాలలోని ఉచ్చారణ వల్ల వచ్చింది. ఆ ప్రాంతాలలో “డ”, “ఢ”లకు కొన్నిసందర్భాలలో “ళ”కార ఉచ్చారణ ఉండేదని, మనకు లభ్యమవుతున్న శాకల్యుని ఋగ్వేద పదపాఠం ఆ ప్రాంతంలో గ్రంథస్థమై ఉంటుందని, పాణిని పశ్చిమభాగానికి చెందిన వాడు కాబట్టి అతనికి లభించిన పదపాఠంలో “ళ”కారం లేకపోవడం వల్ల అతను తన శిక్షలో దాన్ని చేర్చలేదని దేశ్‌పాండే చెప్పినట్టుగా నాకర్థమయ్యింది. ఇది ఆసక్తికరమైన విషయం. తర్వాత కాలంలో తూర్పుభాగానికి చెందిన భాషలలో యీ “ళ”కారం ఎలా మాయమయ్యిందో మరి! బెంగాలీలో “డ”కారంలా వినిపించే “ర”కారం మాత్రం ఇప్పటికీ ఉంది! “హౌరా”లో “ర”కారం వాళ్ళు “డ”కారానికి దగ్గరగా పలుకుతారు (నా పేరుని కూడా వాళ్ళు కామేశ్ వడ రావ్ అని పలికేవారు! 🙂 , దీనికీ వేదవాఙ్మయంలో కనిపించే “ళ”కారానికీ ఏమైనా సంబంధముందేమో!
తెలుగులో “ల”కారం “ళ”కారంగా మారడం గురించి కూడా మీరిచ్చిన వివరణ బాగుంది. “ర”కారం ముందున్న పదాలలో “ల”కారం “ళ”కారంగా మారడం నేనుకుడా గమనించాను కాని అలా కాని సందర్భాలలో కూడా చాలాచోట్ల కనిపించడంతో అదిక్కడ వర్తించదేమో అనుకున్నాను. రెండు మూడు రకాలుగా మార్పు జరిగుండవచ్చునని తట్ట లేదు. సంస్కృతంలో (నతిసూత్రం ప్రకారం) “న”కారం “ణ”కారంగా మారడానికి అడ్డువచ్చే “ల”కారం తెలుగులో తానే “ళ”కారంగా మారడం ఆశ్చర్యం!
నాకు నచ్చిన పద్యం: ద్రౌపది పరివేదన గురించి manibhushan అభిప్రాయం:
07/20/2012 12:37 pm
ఈ వ్యాసాన్ని విశ్లేషించడానికి నా అర్హత చాలదు. చాలా గొప్పగా ఉంది. ద్రౌపది వ్యక్తిత్వాన్నీ, ఆమె ఆక్రోశాన్ని కవి తిక్కన ఆవిష్కరిస్తే బృందావన రావుగారు ఆ వైనాన్ని ఒడిసిపట్టి మనకు అందించారు. ఈ సైట్ చూడడం ఇదే ప్రథమం. తొలిసారే నన్ను ఆకట్టుకుంది.
ఇటు నేనే – అటు నేనే గురించి మోహన అభిప్రాయం:
07/19/2012 4:00 pm
యివాల కవులకు ఎసిడిటీ ప్రొబ్లమనుకుంటాను.
నిజంగా నాకు తెలీదు, ఎసిడిటీ ప్రొబ్లము అంటే ఏమిటి? విధేయుడు – మోహన
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
07/19/2012 3:39 am
ఎప్పుడో 2006 ప్రాంతంలో చెప్పిన ఇక్కడి భావాలని ‘సప్రర’ గారి వ్యాఖ్యకి మూలమేమిటా అని వెనక్కి వచ్చి ఇప్పుడే చదివాను. దీని మీద ఇవాళ మాట్లాడడానికి ఈ చర్చ లోని విషయాలు వెనకబడి పోయినవి ఇప్పటికీ ఏవీ లేవు గనక ఆరేళ్ళ తరవాత కూడా ఈ సంగతులమీద చర్చ చేయవచ్చుననే నేను అనుకుంటున్నాను. అయితే నేను 2006 కాదు కదా ఇవాళ్టికీ తెలుగు పత్రికలనీ అందులో వచ్చే సంగతులనీ శ్రధ్ధగా చదవడం లేదు గనక తెలుగు పత్రికలలో వచ్చే సాహిత్య వాద వివాదాల గురించి నాకు తెలియదని మాత్రం ఒప్పుకుంటూ, నేను గుడిపాటి, ఇంకా వెల్చేరుల భావాలని కూడా చదవలేదని చెప్పుకుంటూనే నాకు తొచినవీ నాకు అర్ధమైనవీ చెప్పడానికి ఈ నాలుగు మాటల్నీ రాస్తున్నాను.
ఇక్కడి అభిప్రాయాలలో వ్యక్తమైన భావాలలో అందరి భావాలలో కూడా కొన్ని మంచి సూచనలు ఉన్నాయి. మరి కొన్ని వట్టి భావోద్వేగాలకి సంబంధించీ ఉన్నాయి. ఇందులో ఎక్కువ బాగున్న అభిప్రాయం కొడవళ్ళ హనుమ గారిదే అని చెప్పాలి. ఆయన అంటున్నది ఏమంటే ఎవరు దేని గురించైనా మాట్లాడండి గానీ, సోదాహరణగా మాట్లాడండి. అప్పుడు చదివే వాళ్ళకి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందీ అని. ఆ అలవాటు తెలుగులో వ్యాసాలు రాసే చాలా మందికి లేకపోవడం అన్నది తెలుగు విమర్శనా వ్యాసాలు చదివే వారికి తెలియని సంగతి ఏమీ కాదు.
ఇంక వెల్చేరు అన్నది విమర్శని కవిత్వాన్నీ నేర్పే వ్యవస్థ ఒకటి తెలుగున ఏర్పడాలని. బహుశా ఆయన ఉద్దేశ్యం – పశ్చిమ దేశాల్లోని ఉండే వ్యవస్థ నమూనా లాంటిది. అక్కడి విశ్వవిద్యాలయాలలో ఉండే creative courses లాంటివి తెలుగు నేల మీద కూడా ఏర్పడాలని. [యూనివెర్సిటీలలోనో ఇతరత్రానో అని కాబోలు.] కానీ తెలుగులో విశ్వవిద్యాలయాలలో బోధనాభాషగానే తెలుగుకి గతి లేని స్థితి లో ఈ పనిని ఊహించే వాళ్ళెవరు. ఇందుకు డబ్బులు సమకూర్చే వారెవరు? ఇవన్నీ జరిగినా వీటిని బోధించే అర్హతలున్న వారెందరూ? అన్నవి ముందుకొచ్చే విషయాలు. కార్యాచరణ కావాలి అంటే అందుకు మరి ఇన్ని విషయాలూ మాట్లాడాలి. అయితే ఆ పనిని ఎవరు చేస్తారో చెప్పకుండా, పైగా రాసే వారే వీటిని ఏర్పాటు చేసుకోవాలనే అర్ధంలో కాబోలు కవులనీ, విమర్శకులనీ ఇందుకు పూనుకోమన్నట్టు ఆయన సూచన చేస్తున్నారు. ఇందులో క్లారిటీ కనబడటం లేదు. కట్టకలిపి కవులూ రచయితలూ కొండొకచో విమర్శకులూ అన్నవారు ఏమి చెయ్యాలని వెల్చేరు అనుకుంటున్నారూ? స్కూళ్ళు పెట్టుకోవాలా? తామే నడుపుకోవాలా? నాకు బోధ పడలేదు. అయోవా యూనివెర్సిటీ లాగా తెలుగున [ఇవాళ తెలుగు ప్రపంచ భాషగా ఎదుగుతోందట గనక] ప్రపంచంలోని పెద్ద విశ్వవిద్యాలయాలలో ఏవైనా వచ్చి ఒక కోర్సుని ఇక్కడి స్కూళ్ళలో మొదలుపెడతాయా? తెలుగులో ప్రొఫెషనల్ రీతిలో కవిత్వాన్నీ విమర్శనీ రాయాలని ఆశించే వారు ఎవరన్నా అసలు తెలుగులో రాస్తున్న వాళ్ళు ఏయే రంగాలలోంచి వచ్చి తెలుగున రాస్తున్నారూ అన్నది సైతం చర్చని చేయాలి కదా? వాళ్ళ భాషా పరిజ్ఞానం అందుకు చాలుతోందా అన్నది కూడా చర్చ చేయాలి కదా? ఒక విషయంలోనేమో ఉదార స్వభావాన్నీ మరొక విషయం లోనేమో ప్రొఫెషనల్ స్థితినీ చెప్పడంలో, లేదా అలా ఆశించడంలో అయోమయం లేదా??
అసలు ఇన్నీ చేసి ఇటువంటివి అంటే మంచి కవిత్వం లేదా ఉత్తమ విమర్శ అన్నవి తయారు చేయడానికి తగిన పాఠ్యాంశాలు ఏవి? వాటిని ఎవరు రూపొందిస్తారు? వాటిని ఎవరు బోధిస్తారు? అందుకు ఉండే అర్హతలు ఏమిటి? ఇవన్నీ బహుశా ఇంకా రాబోయే చర్చలలో వెల్చేరు గానీ వీటిని చెప్పిన ఇతరులు గానీ చెబుతారు కాబోలును. అందుకు వేచి చూడాల్సి ఉందన్నమాట.
కొన్ని విషయాలు బోధన చేస్తేనో లేదా అటువంటి వాటిలో శిక్షణ నిస్తేనో వచ్చేవి కావనీ ఎందులోనైనా వారిలో సహజంగా ఉండే కల్పనా శక్తీ, తార్కిక శక్తీ బోధన వలన అబ్బవనీ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఒప్పుకున్న విషయాలే! ముఖ్యంగా మేలైన కవులు విశ్వవిద్యాలయాలలోంచి పుట్టుకు రాలేరు. జీవితం లోంచి రావాల్సిందే! విమర్శకి సైతం విశ్వవిద్యాలయాలు చాలలేదని కుప్పతెప్పలుగా – సాహిత్య రంగాలని అటుంచండి వాటిలో డిగ్రీలకి విలువ పోయి బహుకాలమైంది – ఇతర రంగాలలో సైతం ఇవాళ ఇదే స్థితి ఉంది అక్కడ. ఇంక “ప్రమాణం” అన్నదానికి చోటు ఏదీ?
అప్పటికే తయారై ఉన్న దాని లోని మంచి చెడులని తర్కించక, అటువంటి రచనలని పక్కన పడేసి లేని దాని వైపు చర్చని నడపడంలో ఫలితం ఎప్పుడూ ఉండదు. తెలుగులో వచ్చిన మంచి పుస్తకాలని గురించి మనస్పూర్తిగా మాట్లాడడం చేయలేని వారు, లేని వాటిని గురించి వాపోవడంలో అర్ధం లేదు. అలా ప్రవర్తించడం సైతం తెలుగులో రాస్తున్న వారి పట్ల సరైన గౌరవ మర్యాదలని చూపక పోవడమే అవుతుంది. రాస్తున్న వారిని, వారి రచనలనీ మేము మాట్లాడము, రాయని వాటినీ, పసలేని రచనలనీ ముందు పెట్టుకుని చర్చలు నడుపుతామూ విమర్శిస్తామూ అన్న వైఖరి వలన సమకాలంలోనూ మీకు రచయితల పట్ల సహృదయత లేదనీ, రాబోయే వారి పట్ల అసలే ఉండదనీ మాత్రం అర్ధం అవుతుంది. ఎందుకంటే ఆ రాబోయే రచయితలు మీరు ఊహించే వ్యవస్థాగతమైన స్కూళ్లలోంచి వచ్చి తెలుగు సాహిత్యాన్ని ఉధ్ధరించాల్సి ఉంది ఇంకా! అప్పటికి ఇంకా ఈ నేల మీద తెలుగు మిగిలి ఉంటేనూ! మీ పాశ్చాత్య భావనలతో మీరు, కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఇక్కడ మిగిలిన తెలుగుని అసలు మననిస్తేనూ, అప్పుడు కదా!
రమ.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
07/18/2012 7:19 am
కామేశ్వరరావు గారు,
కొంతమంది భాషావేత్తల అభిప్రాయం ప్రకారం వైదిక భాషకు సోదర భాష అయిన అవెస్తీయ భాషలాగా (Avestan) వైదిక సంస్కృతంలో మూర్ధన్య అక్షరాలే ఉండేవి కావు. ఆపై ఒక్క “ర” కారం మాత్రమే మూర్ధన్యం (retroflex) గా పలికేవారు. తరువాతి కాలంలో మనం ఇంతకు ముందు చర్చించిన నతి సూత్రం ఆధారంగా ర-కారం తరువాత వచ్చే న- కారం ణ-కారంగా (మూర్ధన్యంగా) మారింది. అంతేకాక, వైదిక సంస్కృతంలో ర-కారానికి ల-కారానికి తేడా ఉండేది కాదు రలయోర్ అబేధః అన్నది సంస్కృత వ్యాకర్తలందరూ అంగీకరించిన సూత్రం. మూల భాషలో ర- కారంగా ఉన్న దాన్ని ల-కారంగా పలికే మాండలికాల్లో అది మూర్ధన్య ళ-కారంగా పలికేవారని ఒక వాదం.
రూబర్ (లాటిన్), రోత (గ్రీక్) రోహిత (మూల సంస్కృతం) > లోహిత ( వేద సంస్కృతం) ళోహిత
ఇప్పుడు మనం వేదవాఙ్మయంగా భావించే సాహిత్యం తరువాతి కాలంలో (బహుశా మహరాష్ట్రీ ప్రాకృతంలో) పలికే ఉచ్చారణ బట్టి గ్రంథస్థం అయ్యుండవచ్చని కొంతమంది అభిప్రాయం. ఉదాహరణకు మాధవ్ దేశ్‌పాండే రాసిన ఈ వ్యాసం చూడండి: “Genesis of Retroflexion in Rgveda: A historical and socio-linguistic investigation”.
ఇక తెలుగు, కన్నడ మొదలైన భాషలలో సంస్కృత పదాలలో కనిపించే “ళ” కారం చాలావరకు నతి సూత్రం ద్వారానే వివరించవచ్చు. ఈ కింది పదాలలో ర- కారం తరువాతే వచ్చే ల-కారం ళ-కారంగా మారింది, గమనించండి:
అరళము, కేరళము, ఖురళి, గరళము, తరళము, ధారళము, పరళులు, ప్రళయము, మురళి, విరళము, విరళి, సరళ వంటి పదాలలో ర-కారం తరువాత ళ-కారం కనిపిస్తుంది. అలాగే, ప్రక్షాళన, క్ష్వేళితము, క్షాళితము, ఇక్షునాళిక వంటి పదాల్లో ష-కారం తరువాత ళ-కారం కనిపించడం నతి వంటి ధ్వనిపరిణామమే.
అయితే, తెలుగులో “ళ” కారం కనిపించే కొన్ని పదాలు కన్నడ తమిళాలలో ళ-కారం కనిపించదు. ఉదహారణకు
కళ్యాణి (తెలుగు), కల్యాణి (కన్నడ, తమిళం);
కళ (art) కలా (కన్నడ, తమిళం);
అలాగే కన్నడలో “ళ” కారం కనిపించే కొన్నిపదాలు తెలుగులో మామూలు ల-కారంతో కనిపిస్తాయి:
మంజుళ (కన్నడ), మంజుల (తెలుగు);
తుళసి (కన్నడ, తమిళ), తులసి (తెలుగు).
ఈ పదాలలో ళ-కారాన్ని వివరించడానికి ఆరోజుల్లోని వివిధ ప్రాకృత భాషలను పరిశీలించవలసి ఉంటుందని నా అభిప్రాయం.
రమ గారు: సుబ్బులక్షి “సొలసి చూచినను సూర్య చంద్రులను లలి వెదజల్లెడు లక్షణుడు” అన్న అన్నమయ్య వాక్యాన్ని “లలివేద జల్లడు” అని పాడిందనేగా మీరు చెప్పదలుచుకున్నది? ఆ తప్పు ఉచ్చారణకు తమిళ వర్ణనిర్మాణానికి అంతగా సంబంధం లేదండి. ఉచ్చారణలో అంతగా తప్పులు చెయ్యని సుబ్బులక్ష్మికి ఈ అన్నమయ్య సాహిత్యాన్ని ఎవరో తప్పుగా రాసి ఇచ్చి ఉంటారు కర్ణాటిక్.కాం వెబ్ సైటులో లాగా (ఆ వెబ్ సైటులో చేరి యశోదకు సాహిత్యం చూడండి). ఆమె పాడిందే ప్రామాణికమై అందరూ అలాగే పాడుతుండవచ్చు. అయితే, మిగిలిన తమిళ గాయకులు సరళ, పరుషాలను తారుమారు చేయడానికి తమిళ వర్ణనిర్మాణమే కారణమని చెప్పవచ్చు. మూల ద్రావిడంలో పదాదిలో క, చ, ట, త, ప-లు గా, అచ్చుల మధ్య గ, స, డ, ద, వ-లు గా, అనునాసికాల తరువాత (ద్రుతం తరువాత) గ, జ, డ, ద, బలు గా పలుకేవారు. ద్విత్వాక్షరాలు మాత్రం క్క, చ్చ, ట్ట, త్త, ప్ప- లుగానే పలికేవారు. ప్రాచీన తెలుగులో ఇదే పద్ధతి ఉండేదని శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
వూరుపుటూరి గారు: దంత్య-చ, జలు నిజానికి దంతమూలీయ (alveolar) స్పర్శోష్మాలు (affricates). తాలవ్య-చ, జలు palatal stops. తాలవ్యాలను నాలిక మధ్య భాగంతో అంగులి మధ్యభాగం తాకడం ద్వారా పలుకుతారు. దంతమూలీయాలు నాలిక కొస (apical) దంతమూలం దగ్గర తాకడం ద్వారా పలికే ధ్వనులు.
సురేశ్.
suresh.kolichala [at] gmail.com