పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి Sowmya అభిప్రాయం:

    07/27/2012 12:25 pm

    కొణ్ణాళ్ళ క్రితం పుదూరి సీతారామశాస్త్రి గారి “ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం” కనిపిస్తే, కొన్నాళ్ళు చదివాను. దాని ప్రచురణ తేదీ 1859 అని ఉంది ఆ పుస్తకంలో. మీ జాబితా లో ఇది మిస్స్ అయినట్లు ఉన్నారు.

  2. మూడు లాంతర్లు – 4 గురించి bathulaprasad అభిప్రాయం:

    07/27/2012 10:10 am

    కనక ప్రసాద్ గారికి నమస్కారాలు
    నన్ను మీరు ఎరుగక పోయినా కూడా నా కథ ద్వారా నేను మీకు పరిచయం. నా పేరు బత్తులు ప్రసాద్ నేను రాసిన గంజిబువ్వను మీరు సొంతం చేసుకుని పెద్ద సమీక్ష రాసినందుకు మీకు నా ధన్యవాదాలు… నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా ఎరుగక పోయినా కూడా మీ మనసు కొంత ఎరిగి ఉన్నాను. ఎలాగంటే నా గంజిబువ్వను.,,,రా బాల్యన్ని మీరు మీ జీవితానికి అన్వయించుకున్నారు.. నా జీవితంలో నా బాల్యంలో జరిగిన ఓ వరద వచ్చిన రాత్రి అనుభవం మీ జీవితానికి దగ్గరగా ఉండటం నా అదృష్టం. మీరు రాసిన సమీక్ష ఎన్ని సార్లు చదువుకున్నా తనివి తీరడం లేదు..మీకు మరొక సారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వీలయితే నా పర్సనల్ వెబ్ సైట్ sagileru.com ను ఒక్కసారి చూడగలరు. అందులో నేను రాసిన మరి కొన్ని కథలను చూడవచ్చు..
    ధన్యవాదాలతో
    భవదీయ
    బత్తులప్రసాద్

  3. ఉరుము ఉరిమి… గురించి Sowmya అభిప్రాయం:

    07/27/2012 2:29 am

    🙂 బాగుందండీ.

  4. అమ్మ గోపెమ్మ గురించి Bharatam Srimannarayana అభిప్రాయం:

    07/26/2012 5:10 pm

    శ్రీమతి రాధమ్మ యశోదమ్మ అమ్మతనాన్ని – లక్కమ్మ అమ్మతనాన్ని కమ్మగా జుర్రుకొన్న పోతన్న నెమ్మనంలో ఇమ్ముగా క్రమ్ముకొన్న భక్తి సమ్మిళిత భావాన్ని ఇక్కడ గ్రుమ్మరించి చూపడం సహజంగా సాగింది. పద లాలిత్యం, భావ సౌందర్యం, విశ్లేషణ సామర్థ్యం గల్గిన వ్యాస కుసుమం పఠితల హృదయాలకు సుకుమార సౌరభ సౌహిత్యం అందించి విందును గావించింది. పోతయ్య అమ్మగా లక్కమ్మ, కన్నయ్య అమ్మగా యశోదమ్మ, అచ్చమైన తెలుగమ్మగా రాధమ్మ శాశ్వతకీర్తిని సొంతం చేసుకున్నారు.
    అన్నట్లు రాధమ్మ నిజంగా గోపెమ్మే కదా మరి.
    — భారతం శ్రీమన్నారాయణ.

  5. ఆఖరి మనిషి గురించి తః తః అభిప్రాయం:

    07/26/2012 12:37 am

    రవిసంకర్
    మీ కవిత చిన్నప్పుడు పదకొండవ తరగతి లొ చదువుకున్న
    T Moore రాసిన The Light of Other Days అన్న పద్యాన్ని – అందులొ లొ రెండొ భాగాన్ని ముఖ్యం గా -గుర్తు కు తెచ్చింది.
    OFT in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Fond Memory brings the light
    Of other days around me:
    The smiles, the tears
    Of boyhood’s years,
    The words of love then spoken;
    The eyes that shone,
    Now dimm’d and gone,
    The cheerful hearts now broken!
    Thus in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Sad Memory brings the light
    Of other days around me.

    When I remember all
    The friends so link’d together
    I’ve seen around me fall
    Like leaves in wintry weather,
    I feel like one
    Who treads alone
    Some banquet-hall deserted,
    Whose lights are fled
    Whose garlands dead,
    And all but he departed!
    Thus in the stilly night
    Ere slumber’s chain has bound me,
    Sad Memory brings the light
    Of other days around me.
    తః తః

  6. ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/25/2012 10:40 pm

    “ఏం! మీరు మాత్రం తక్కువా?..” నుండి పాత్రల సంభాషణ హాస్యం పండించిందండీ..”
    * థాంక్సండి రాజీవుడు గారు! పాత్రల సంభాషణ లో హాస్యం పండింది అన్నందుకు!
    ఇలాటి చిన్నిచిన్ని ప్రశంసలే పెద్ద పెద్ద ఆనందాలౌతాయి రైటర్స్ కి! . థాంక్యూ!
    * Seetha kumari గారూ! నిజంగా ఇంట్లో జరిగిందే రాశాను. మీరందరూ శైలి
    ‘చక్కదనం’ గురించి చెబుతూంటే -అదంతా ‘ మన తెలుగు భాషా సౌందర్యం కదా ‘ అని.. గర్వంగా వుంటుంది.
    మీ ఇరువురికి –
    మనః పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ..
    నమస్సులతో-
    ఆర్.దమయంతి.

  7. బింబం గురించి Seetha kumari అభిప్రాయం:

    07/25/2012 7:33 pm

    మనసుని కదిలించింది.. మంచి కథ

  8. ఉరుము ఉరిమి… గురించి Seetha kumari అభిప్రాయం:

    07/25/2012 7:13 pm

    నాకు మా ఇంట్లో సన్నివేశాల్లానే అనిపించాయి, చక్కని శైలి.

  9. ఉరుము ఉరిమి… గురించి రాజీవుడు అభిప్రాయం:

    07/24/2012 5:24 pm

    “ఏం! మీరు మాత్రం తక్కువా?..” నుండి పాత్రల సంభాషణ హాస్యం పండించిందండీ..

  10. బింబం గురించి రాజీవుడు అభిప్రాయం:

    07/24/2012 5:11 pm

    ఇలా యెంత మంది మీనాక్షులు పెళ్లి కోసం బలవంతాన మారుతున్నారో.. మోహన గారు అన్నట్టు ఆ “అగరుబత్తి – బూడిద” ఉపమానం మాత్రం ఆలోచింపజేసింది..