పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. రచయితలకు సూచనలు గురించి chandrasejkhar. అభిప్రాయం:

    07/31/2012 6:59 am

    డియర్ సర్!

    నేను ఈ మాటకు ఒక కధ పంపదలచాను. అది ఏ పత్రికలోను ప్రచురింపబడలేదుకానీ, ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన పోటీకి పంపగా ఎంపిక కాలేదు. మీరు అంగికరిస్తే పంపుతాను.
    చంద్రశేఖర్.[-పెన్ నేం ]

    [మీ రచన ఇంకే పత్రికకు పంపించకుంటే మాకు పంపించండి. ప్రచురణకు పరిశీలించగలం – సం.]

  2. ఎవరో! గురించి మోహన అభిప్రాయం:

    07/30/2012 2:48 pm

    బహుశా సువర్ణ మన కథానాయకుని గుర్తు పట్టిందేమో? మన కథానాయకుడు ‘వినాయకుడా’? విధేయుడు – మోహన

  3. అంతరం గురించి pavan ganalola అభిప్రాయం:

    07/30/2012 1:06 pm

    నిజంగా మనసును కదిలించింది సొమ శంకర్ గారు, అన్నట్లు నేను కూడ నిమ్మకూరు లోనే చదివాను.

  4. ఈమాట గురించి గురించి Raja Sankar అభిప్రాయం:

    07/30/2012 10:00 am

    తెలుగువారు సగర్వంగా తమదని చెప్పుకునే కూచిపూడి నాట్య శైలిలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహనీయులు వెంపటి చిన సత్యం గారు మనకిక లేరన్న దుర్వార్త ఈ ఉదయమే నా చెవిన పడింది. ఈ వార్త ఈమాట వారి చెవిన ఎలా వేయాలో తెలియక ఇక్కడ తెలియ చేస్తున్నాను. ఈమాటలో ఆ మహానుభావుడికి సరియైన విధంలో నివాళులర్పించగల సామర్థ్యం ఉన్న రచయితలు ఉన్నారని ఇది మీ దృష్టికి తెస్తున్నాను.

    భవదీయుడు,
    కాశీనాథుని రాజా శంకర్

  5. ఎవరో! గురించి swathi అభిప్రాయం:

    07/29/2012 6:43 pm

    We had a lesson called “A test of true love” in our 8th class. Same story!!

  6. రచయితలకు సూచనలు గురించి Raja Kishor Duggirala అభిప్రాయం:

    07/29/2012 2:52 pm

    తెలుగు భాష ఎప్పతికీ బ్రతికే వుంటుంది. అందుకు ఈమాట వంటి వెబ్ సైట్ లే ప్రత్యక్ష తార్కాణం. ఎటొచ్చీ చాలా కాలంగా మన భావాలను తెలుగులొ వ్యక్తం చెసుకోడానికి ఉపకరించే సాధనాలే లభ్యం కాలేదు.
    ఈమాట ఇప్పుడు ఆ కొరతను తీరుస్తొంది. ఈమాట బృందానికి అభినందనలు.

  7. ఉరుము ఉరిమి… గురించి lakshmimadhav అభిప్రాయం:

    07/29/2012 8:55 am

    చాలా సహజంగా ఇంచుమించు వారానికో సారి జరిగే విషయాన్నే ఎంతో మంచి శైలితో వ్రాశారు.వ్రాసిన మీకు నా హ్రుత్పూర్వక అభినందనలు.

  8. ఆఖరి మనిషి గురించి రవిశంకర్ అభిప్రాయం:

    07/28/2012 4:51 pm

    తఃతః గారు – ఈ పద్యం నేనింతకుముందు చదవలేదుగాని, ఒక మంచి పద్యాన్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. పద్యం రెండవభాగం గురించి మీరు చెప్పింది కరక్టే. ఇందులో వర్ణించిన అనుభవం సార్వజనీనమైనదే కదా. – రవిశంకర్

  9. కళాపూర్ణోదయం -6: బ్రహ్మలోకం గురించి Sowmya అభిప్రాయం:

    07/28/2012 2:48 pm

    (ఈ అద్వితీయమైన ఘట్టాన్ని మూలంలోనే చదవాలి దాని రుచి సరిగ్గా తెలియాలంటే. మూలం కావాలంటే ఇక్కడ నొక్కండి.)

    -అక్కడ లంకె లేదండీ. ఎక్కడ నొక్కాలి?

  10. ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/27/2012 9:25 pm

    సౌమ్య గారూ, లక్ష్మి గారూ,

    కథ నచ్చినందుకు థాంక్సండీ!

    శుభాకాంక్షలతో
    ఆర్.దమయంతి.