పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తఃతః అభిప్రాయం:

    09/07/2012 12:34 am

    సాహిత్యభావం-రాగభావం ఒకటి కావని, గాయకుడికి రాగభావమే ముఖ్యమని రాళ్ళపల్లి వారన్నారు ఓ ఆకాశవాణి సంభాషణలో.

    నమస్తే శ్రీనివాస్: రాగానికి భావము అంటూ ఒకటి ఉంటుందా? రాగానికి సంచారాలు మాత్రమే కదా ఉంటాయి. రాగానికి భావము ఉండదు అని అనటంలొ నేనేమయినా పొరపాటు చేస్తున్నానా ? నాకు తెలిసినంత వరకూ రాగానికి ఒక నిర్ధిష్టమైన భావము అని ఉంటుందని బాలమురళి అనరని అనుకుంటాను.

    “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్న బాంబే జయశ్రీ మాటలని వినే అదృష్టం వ్యాసరాయర్ కి లేకపొయింది. శాస్త్రీయ సంగీతంలో సాహిత్యం ప్రాధాన్యత లేనిదే అని అంగీకరించినా ‘సాహిత్యం పిప్పి’అని (ప్రధానంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో) శ్రీ పినాకపాణి అనటం ఎటువంటి సందేశం ఇస్తుంది?

    (నా దురదృష్టం ఏమిటొ తెలీదుకానీ ఎమ్మెస్ అమ్మ పాడిన ఏ పాటా నేను ఇష్టంగా వినలేను)
    తఃతః

    తా. క.: ఆపాతమధురమైన సాహిత్యమూ ఆలోచనామృతమైన సంగీతమూ ఉన్నాయని రాళ్ళ పల్లి వారన్నట్టు గుర్తుకొస్తోంది

  2. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Aruna అభిప్రాయం:

    09/06/2012 11:30 pm

    ఇక్కడ అంతా పెద్దవారు సంగీత జ్ఞానం ఉన్నవారు మాట్లాడుతున్నారు. నాకు పెద్దగా సంగీత జ్ఞానం లేకపోయినా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. త్యాగరాజు, అన్నమయ్య ప్రస్తావన వచ్చింది, మరి వారు రచించినవి భగవంతుని కీర్తిస్తూ, పొగుడుతూ, తెగుడుతూ కూడా వ్రాసారు. శాస్త్రీయ సంగీతం లో దాదాపు ౯౦% రచనలు భక్తి సంప్రదాయాన్ని అనుసరించి ఉన్నవే. మరి అందులో భావము వదిలేస్తే పరిపూర్ణత ఉంటుందా? నేను చిన్నప్పుడు వీణ ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. ఆమెకు తెలుగు రాదు కాని తెలుగు లోనే వ్రాసి ఇచ్చేవారు. కాని ఏ రోజు పాడనే లేదు.అర్ధం కూడా చెప్పలేదు. ఏమైనా చెప్పినా అర్ధం అయ్యే వయసు కాదు కూడా. ఇప్పుడు మల్లి ౩౫ వస్త్రాల తరువాత సంగీతం ఒక తమిళ్ టీచర్ దగ్గర నేర్చుకుంటున్నాను. ఆమెకు తెలుగు వాళ్ళంటేనే చిన్న చూపు. ఆమె దగ్గర ఉన్న తెలుగు వాళ్ళకి కూడా అదే ఉద్దేశ్యం. సో వాళ్ళు ఆమె ఏది నేర్పితే అదే కరెక్ట్ అనే రకం. కాని ఏమైనా సాహిత్యంలో దోషాలు ఉంటే సరి చేస్తే నచ్చదు.

    నాకు భావముతో కూడి పాడితేనే తృప్తి. లేదంటే ఏదో ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ తో పాడించవచ్చు కదా? భగవంతుని నామ స్మరణ మనస్పూర్తిగా అవగాహనతో చేయటం వేరు, కాసేట్ ప్లే చేయటం వేరు కదా? అందుకే త్యాగరాజు, అన్నమయ్య వంటి వాళ్ళతో కంపేర్ చేయటం మంచిది కాదు. టెక్నికల్ ఎక్సలెన్స్ ఉండవచ్చు. కాని నాద ఉపాసకులు కావడం కష్టం.

  3. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    09/06/2012 3:10 pm

    ఇలాంటివి చాలా దుందుడుకు అభిప్రాయాలు:
    “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్నారట బాంబే జయశ్రీ.

    మరి యమన్ కల్యాణి మీదే శ్రద్ధ ఉన్నప్పుడు పాటెందుకు పాడడం. చక్కగా రాగాలాపన చేస్తూ కచేరీ చేయొచ్చుకదా? సంగీతం గురించి సాహిత్యకారుల వ్యాఖ్యలకి ఎలా విలువుండదో అలాగే పాటల్లో సాహిత్యంపై సంగీత కారుల వ్యాఖ్యల్నీ పట్టించుకోనవసరం లేదు. సాహిత్య రహితంగా ఒక కచేరీ చేసి, మామూలు శ్రోతలని అవసరం లేదు, సంగీతం వచ్చిన వాళ్ళనే రంజింపచేయమనండి. ఎంతమంది అటువంటి కచేరీలకి వెళతారో?
    ఇదంతా ఎందుకంటే – మనం కూడా ఇలా వితండ వాదం చెయ్యచ్చు.

    పాట పాడేటప్పుడు స్వరాలు తప్పితే సంగీతకారులు ఎంత తప్పుగా పరిగణిస్తారో, సాహిత్యాన్ని ఉచ్ఛారణ దోషాలతో ఖూనీ చేయడం సాహిత్యకారులూ ఖండిస్తారు. ఒకటి ఎక్కువా, మరొకటి తాక్కువా కాదు. రెండూ కలిసున్నప్పుడు ఆ రెండు కళలకీ గౌరవం ఇవ్వడం సంస్కారం. అది లేనప్పుడే కళలమీదా, కళాకారులమీద గౌరవం పోతుంది.

    పాటలో సాహిత్యం గౌణం అన్న శ్రీపాదవారే క్షేత్రయ్య పదాలు ఎంత భావ స్పూర్తినీ , రస స్పందన్నీ కలిగిస్తాయో అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పాటల్లో సాహిత్యం తుక్కు అన్న రాళ్ళపల్లి వారే అన్నమయ్య కీర్తనల్లో సాహిత్యాన్ని ఆకాశానికి ఎత్తేశారు. త్యాగరాజు – ఎందరో మహాను భావులు” కీర్తనలో భావం ఎంత గొప్పదో అన్న వారే కొన్ని కీర్తనలు ఏరి, వీటిలో సాహిత్యం లేదనీ అన్నారు. ప్రతీ వ్యాఖ్యకి సమయం, సందర్భం ఉంటాయి కదా? వారు ఏ వయసులో, ఏ కాలంలో, ఏ సందర్భమ్లో అటువంటి వివాద వ్యాఖ్యలు చేసారో చూడ్డం చాలా అవసరం.
    అన్నింటికీ అన్నీ ఆపాదిస్తే వచ్చే చిక్కే ఇది.

    రాళ్ళపల్లీ, శ్రీపాద వారి వారి రంగాల్లో మేధావులే, ఎవరూ కాదనరు. కానీ వారేం చెప్పినా అదే వేదం, ప్రమాణం అని అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు.

    -బ్రహ్మానందం

  4. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/06/2012 2:28 pm

    నండూరి పార్ధసారధి గారు శ్రీపాద పినాక పాణి గారిని చేసిన ఇంటర్వ్యూ ఆసాంతం చదివాకా నాకు అర్ధమైన విషయాలు ఇవి. సాహిత్యం గురించి తక్కువగా శ్రీపాద వారు ఏమీ అనలేదు. ఆయన ఆ మాటల్ని అన్న సందర్భం అక్కడ పూర్తిగా వేరు. సంగీతకారులకి రాగం పాడేటప్పుడు దాని మీద ఎక్కువ శ్రధ్ధ ఉంటుందే తప్ప ఆ రాగానికి సహాయకారిగా ఉన్న అక్షరాల మీద ఏమాత్రమూ కాదు అన్నది శ్రీపాద పినాకపాణి గారి భావన. ఇది కృతుల లోని సాహిత్యానికి సంబంధించిన విషయమే గానీ విడిగా సాహిత్యం మొత్తానికి గానూ లేదా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన మహా కవులని గురించి గానీ ఆయన చేసిన వ్యాఖ్య కాదు. అలాగే సాహిత్య ప్రేమికులైన వారి అన్నగారు సైతం కావ్య సాహిత్యాన్ని కవిత్వాన్ని గురించి అన్నది కాదది. వాగ్గేయకారుల రచనలని మాత్రమే ఆయన ప్రస్తావన చేశారు “సాహిత్యం” అని అన్నప్పుడు. ఆయనకి కూడా – గానం లోని రాగ స్వరూపమే ముఖ్యం అంతే! అందుకు ఉపయోగపడే అక్షర సముదాయం కాదు. అందుకే సాహిత్యానికి ఎంతో అభిమాని అయిన ఆయనే వారి అమ్మాయి “డుబుక్కు” 🙂 లని పాడుతూ ఉంటే ఏమాత్రమూ పట్టించుకోలేదు. అందుకు ఇబ్బంది కూడా పడలేదు. “వాగ్గేయకారుల రచనలలో కవిత్వం గురించి వెతకడం దండగ” అన్న అభిప్రాయాన్ని ఈ శ్రీపాద బ్రదర్స్ వ్యక్తం చేయడం మనం గమనించవచ్చు.

    అందువలననే త్యాగరాజు మంచి సంగీతకారుడే గాని మంచి కవి కాదు అని వారు అనుకున్నారు. ఇందులో అంతగా విబేధించవలసిన అవసరం నా వరకూ నాకేమీ కనిపించలేదు. చాలా సార్లు ఆయన రచనలని విన్నప్పుడు అది నిజమే కూడాను అని నాకు అనిపించినది సత్యమే! అయితే అక్కడ త్యాగరాజు గారి ప్రధాన ఉద్దేశ్యం కూడా తన సంగీతమే తన రామ భక్తే! ఆయన కవిత్వం రాస్తున్నానని బహుశా అనుకోలేదేమో? లేదా ఆయనకి శక్తి చాలకనే కవిత్వం రాయలేదో లేక సంగీతానికి అవసరమైనంత అక్షరాలని చాలు లెమ్మని అనుకునే రాయలేదో మనం ఇవాళ చెప్పలేకపోయినా, సాహిత్యం దృష్ట్యా చూస్తే మాత్రం త్యాగయ్య తప్పక కిందిశ్రేణి కవి గానే అనిపించక మానడు. ఇక్కడ మళ్ళీ చెబుతున్నాను శ్రీపాద వారి అభిప్రాయం కేవలం కృతులలోని కీర్తనలలోని సాహిత్యం మాత్రమే! ఆయనకి ఒక గాయకునిగా తాను పాడే కృతిలోని సంగీతమే ముఖ్యం గానూ సాహిత్యం ఆ తరువాతిది గానూ అనిపిస్తే అందులో విడ్డూరం నాకేమీ కనిపించలేదు మరి.

    అయితే ఇది వాగ్గేయకారుల అందరి రచనలలోనూ పూర్తిగా నిజమా? అందులో కవిత్వం ఉండదా అంటే చాలాసార్లు ఉండకపోవడాన్నే మనం గమనించవచ్చు. ఒక్క అన్నమయ్య మాత్రమే ఇందుకు మినహాయింపు. అయితే ఒక సాహిత్య స్వరూపాన్ని సంపూర్తిగా ఆవిష్కారం చేయాలీ అంటే అది సంగీతపు జంజాటం లేని పక్షం లోనే సాధ్యం అని కూడా మనం చెప్పవచ్చు. అందువలననే సంగీతం కోసం పాడుతున్నప్పుడు సాహిత్యం గురించి పట్టించుకోనవసరం లేదని వారు అనుకున్నదీ, అన్నదీను. ఈ రెండూ రెండు రకాలైన విషయాలు.

    ఐతే మరి మనకెందుకని సంగీతం పాడేవాళ్ళు అక్షరాలని చిత్రవధ చేసి పాడుతున్నప్పుడు చెప్పనలవి కాని బాధ కలుగుతున్నాదీ అంటే తెలుగు భాష లోని వాళ్ళకి ఆ భాష మీద ఉండే మమకారం అత్యంత సహజం! మనం దాని ఉచ్చారణలో ఎటువంటి అపసవ్యతనీ సహించలేం! కష్టం అది మనకి. అయితే అది సంగీతం పాడేవారికి మాత్రం సమస్య కావడం లేదు. అక్కడ వారి దృష్టి వేరు. గాయకులుగా వారు రాగానికే బాధ్యులు గానీ అక్షరానికి కాదలుచుకోవడం లేదు. వాళ్ళకి సంగీతపు పానం చేయడంలో రాగపు రసం గ్రోలాలి. సాహిత్యాన్ని పిప్పిగా పక్కకి పడేయడానికి వాళ్ళు వెనకాడటం లేదు అని మనకి పినాకపాణి గారి మాటలు తెలియజేస్తున్నాయి అయితే ఇక్కడ మళ్ళీ ఒక తేడా చాలా స్పష్టం గానే మనముందుకి వస్తూంది. అదేమంటే ఈ ఉచ్చారణా రీతి తెలుగు వచ్చిన వారిలో ఒక తీరుగా ఉండి మళ్ళీ పరాయి భాష వారి గాత్రంలో అదే కృతి మరొక తీరున పలకడం. ఇందుకు మాతృభాష అయిన వారు మరీ అంతగా తప్పులని పలకలేకపోవడాన్నే మనం కారణంగా అర్ధం చేసుకోవాలి.

    అయితే ఇక్కడ భక్తి అన్న అంశం కూడా అంతే ముఖ్యమైనది. ఆ రామ భక్తే తనని నడిపించకపోయి ఉంటే అంతటి త్యాగయ్య కేవలం సంగీతం కోసమే ఏవో కృతులూ వర్ణాలూ అంటూ అల్లేవారా? త్యాగయ్య సంగీతానికి మూలమైన రామ భక్తిని మనం తక్కువ అంచనా వేయలేము. అయితే మళ్ళీ భక్తి భావం వేరు. సాహిత్యపు స్థాయి వేరూను. మనం ఈ రెండింటినీ కలిపి చూడకూడదనే నేననుకుంటాను.

    అందువల్లనే “సాహిత్యం కావాలని అనుకునే వాళ్ళు సంగీతం వినడానికి రావడం దండగ” అని పినాకపాణి గారు అక్కడ అలా అన్నది. అది బయటకి కొంత కరుకుగా వినిపిస్తున్నా వారి సంగీతపు పరిమితి లోని సాహిత్యానికి సంబంధించి అది అక్కడ సత్యమే మరి. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తూందంటే వారన్న “సంగీతమూ సాహిత్యమూ రసమూ పిప్పీ” లాంటి పోలికలని ఒక విస్తృతార్ధంలో మొత్తం సాహిత్యానికి కాక పరిమితమైన అర్ధంలో కేవలం సంగీత రచనల వరకూ మాత్రమే అని మనం అర్ధం చేసుకోవాలి. అప్పుడు శ్రీపాద వారి అభిప్రాయం పట్ల అంత కోప ప్రకటన సాహిత్యం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయనవసరం లేదని తెలుస్తుంది.

    అయితే గాయకులు ఎక్కువాను కవులు తక్కువానా? అన్నారు మోహన గారు. మోహన గారూ! పినాకపాణి గారి మాటలని మీరు మిగతా చోట్లకి అంతగా విస్తృతపరిచి చూడనవసరం లేదు. వారు మంచి కవులు అయినప్పుడు వారు ఏది రాసినా బహుబాగుగా రాయగలరు. అక్కడ అది ఏ చోటైనా ఏ ప్రక్రియ అయినా ఎప్పుడైనా కవిత్వానిదే పై చేయి అవుతుంది. అలాంటి రచనల విషయంలో శ్రీపాద పినాకపాణి గారు కాదు కదా ఎవరేమన్నా అది ఒప్పదు. అలాగే ఆ రాసే వారి లోని ప్రతిభ అందుకు తగిన స్థాయిలో లేదంటారా అక్కడ అక్షరపు ప్రభావం ఏమీ ఉండదు. ఇంక సినిమా రంగమూ అక్కడి పారితోషికాలూ సంగీతపు సాహిత్యపు తూనిక రాళ్ళు కానేరవు. సినిమా రంగాన వారు ఉత్తమ కవులనైనా తక్కువగా కొనగలరు. డబ్బులు వస్తాయని అనుకుంటే ఒక డబ్బా సంగీత దర్శకుని ముందు డబ్బులు కుమ్మరించనూగలరు.

    కాకపోతే పినాకపాణిగారు అన్నమయ్య విషయంలో మాత్రం అన్నమయ్య అక్షరం గురించి సరిగ్గా తెలియక నోరు జారారనే అనుకోవాలి. పినాకపాణి గారికి తెలుగు భాషా సాహిత్యాల గురించేమీ అంతగా తెలిసినట్టు లేదు. అన్నమయ్య గురించి అంటూ “ఆయన అచ్చతెనుగు రాసేడు” అనో లేదా త్యాగయ్య అక్షరాన్ని గురించి చెబుతూ ” త్యాగయ్య సంస్కృతమూ తెలుగూ కలిపి రాసేడు” అనో అన్నమాటలు మనకి ఏమీ ప్రత్యేకంగా చెప్పవు. దానికీ అన్నమయ్య గారి కవితా బలానికీ ఏమి సంబంధం? అన్నమయ్య గారు తన పద్నాల్గు లైన్ల పదాలలో అంత గొప్ప కవిత్వాన్ని పలికించడం అన్నది తప్పకుండా ఆయన అసమాన ప్రతిభకి తార్కాణమే! అన్నమయ్యకి బహుశా తన భావ ప్రచారం ప్రధానమూ సంగీతం అటు తరవాతా అయి ఉండాలి. లేదూ సహజం గానే కల్పనాచతురుడై ఉత్తమ భావుకుడైన ఆయన పరిమితమే అయిన తన పద చట్రంలోనే కవిత్వాన్ని అంత అలవోకగా ఒలికించి ఉండాలి. అన్నమయ్య గారి సాహిత్యం విషయం లో మాత్రం శ్రీపాద పినాకపాణి గారి అభిప్రాయం అయోమయంగానూ కాస్త తొందరపాటుగానూ అపరిపక్వంగానూ మిగిలిపోతుంది.

    రమ

  5. తథాస్తు గురించి ప్రసాద్‌ అభిప్రాయం:

    09/06/2012 11:41 am

    ఈ కధలో భార్య అన్న మాటలు, ““వీళ్ళంతా పరాన్నజీవులలాగా ఎవరైనా దొరక్కపోతారా అని కాచుకొని ఉంటారు. మీ లాగా ఒక్కరు దొరికితే చాలు. అలాగే అంటుకు పోతారు. మనమేమైనా సత్రం కట్టి పెట్టామా? ఊళ్ళో అన్నార్తులుగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి విందు భోజనం పెట్టడానికి?”, చాలా కరెక్టు.

    తమకు మాలిన ధర్మం లేదని ఆర్యోక్తి . ఎవరైనా, తమ భావి జీవితాలు రోడ్డు మీద పడకుండా చూసుకోవాలి. లేకపోతే, ఇంకొకరి మీద ఇలా పరాన్న జీవులుగా బతక వలసి వస్తుంది. “మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండీ” అంటే, బతుకులు గడవ్వు. సంసార మనేది వున్నప్పుడు, బతుకు తెరువు ఏదో ఒకటి చూసుకోవలిసిందే. ఆ తాతలు నేతులు తాగింది మాత్రం వాళ్ళ కష్టార్జితం తోనా? ఎవరెవరి శ్రమ ఫలితాలో అవి. అందుకని వాళ్ళకి, పని చెయ్యకుండా రోజులు గడవాలి అంటే కుదరదు.

    ఈ మనిషి బాగా సంప్తాదిస్తున్న మనిషి అయితే, అంటే, ఆఫీసులో ఎడ్వాన్సు అప్లికేషనుతో డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, పెట్లోంచి డబ్బు తీసి ఇచ్చే పరిస్థితి వుంటే, అది వేరే సంగతి. ఒక పూట తిండి పెడితే, సర్వం కోల్పోక పోవచ్చు. అయితే, అదే సాగుతూ వుంటే, కొన్నాళ్ళకి వాళ్ళ లాగే, తమకి ఇంకెవరు తిండి పెడతారా అని చూసుకోవాల్సి వస్తుంది. ఆ భార్య అన్న మాటలు పెడసరంగా వుండొచ్చు గానీ, తప్పు మాటలు కావు.

    “పెళ్ళైన ఈ రెండేళ్ళలో ఆరోజే మొదటి సారిగా నా భార్యను చెయ్యి చాచి కొట్టాను.” అని కధ ముగుస్తుంది. నేనే ఆ భార్య అయి వుంటే, తిరిగి రెండు లెంప కాయలు వేసే వాడిని ఆ భర్తకి, “మూర్ఖుడా, కీర్తి పిచ్చి వదిలించుకుని, బతుకు లోని నిజాలు అర్థం చేసుకోరా” అంటూ. అయితే, నేను ఆ భార్యని కాదు కాబట్టి, ఒక పాఠకుడిగా ఆ భర్త పాత్రకి నాలుగు లెంప కాయలు వేస్తున్నాను.

    ప్రసాద్

  6. తథాస్తు గురించి Nellutla Sudarshan Rao అభిప్రాయం:

    09/06/2012 4:46 am

    ఇతివృత్తం, కథనం హృదయపుటంచులను తాకేట్టుగా వున్నాయి. మధ్య తరగతి జీవన విధానం, వాళ్ళ మనస్తత్వం చిరు కథలో చిత్రించబడింది!

  7. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/06/2012 3:16 am

    పాటలో సాహిత్యం గౌణమనే శ్రీపాద వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. సాహిత్యం సహాయం లేకుండా కర్నాటక సంగీతాన్ని ఆనందించగలగడం కనీసం కొన్ని సందర్భాలలో వీలు పడుతుంది కదా.

    ఈమని వీణ మీద విన్న “రఘు వంశ సుధాంబుధి…”, ఎల్.సుబ్రమణ్యం వయొలిన్ పై వినిపించిన “బ్రోవ భారమా…” రెండింటినీ కృతి సాహిత్యంతో పరిచయం లేకుండానే విని ఆనందించగలిగాను నేను. ఆ తరువాత విన్న ఎమ్మెస్ అమ్మ పాడిన “రఘువంశ సుధాంబుధి” నాకు వాద్యం మీద విన్నప్పటి ఆనందాన్నివ్వలేక పోయింది. “బ్రోవ భారమా” సాహిత్యాన్ని చదువుకున్నప్పుడు “ఓస్, ఇంతేనా!” అనిపించింది.

    మొన్నెప్పుడో చదివాను: “‘కృష్ణా నీ బేగనే బారో’ పాడినప్పుడు కృష్ణుడి మీద భక్తి కాదు నాకు ముఖ్యం, యమన్ కల్యాణి మీదే నా శ్రద్ధ అంతా” అన్నారట బాంబే జయశ్రీ. సాహిత్యభావం-రాగభావం ఒకటి కావని, గాయకుడికి రాగభావమే ముఖ్యమని రాళ్ళపల్లి వారన్నారు ఓ ఆకాశవాణి సంభాషణలో.

    సాహిత్యమే ప్రధానమనుకుంటే – దాని వెనకాలే గాయకుడి ఉచ్చారణా దోషాలు, వాగ్గేయకారుడి భావజాలం, గాయకుడి/శ్రోతల సైద్ధాంతిక నేపథ్యం, కళలను ప్రజల పరం చేయాల్సిన ఆవశ్యకతా… లాంటి “noisy” సమస్యలన్నీ చర్చలోకి ప్రవేశిస్తాయి. అవన్నీ అనవసరమని నేను అనను గానీ ఇంత చర్చలో సంగీతం ఆపాతమధురం కాకుండా పోతుందని భయం.

    అన్నట్లు హిందుస్థానీ సంగీతంలో సాహిత్యానికి అట్టే విలువ లేదు కదా…

  8. ఒక సరళ నిర్వచనం గురించి నారాయణ. అభిప్రాయం:

    09/05/2012 8:55 pm

    రవికిరణ్ గారు మరియు శివశంకర్ గారు, మీ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. ధన్యవాదాలు.

    రవికిరణ్ గారు, మీరు కవితాత్మకంగా ఉదహరించిన మనుషులు బాగున్నారు.
    నారాయణ.

  9. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి మోహన అభిప్రాయం:

    09/05/2012 4:16 pm

    తః తః గారు,
    సంగీతానికీ సాహిత్యానికీ సమాన స్థానాన్ని మన పూర్వులు ఇవ్వలేదనే నా అభిప్రాయం.
    నేను నా అభిప్రాయాన్ని క్రింది శ్లోకముపైన ఆధారము చేసికొని వ్రాసినాను –
    సంగీత మపి సాహిత్యం
    సరస్వత్యా స్తనద్వయం
    ఏక మాపాత మధురం
    అన్య దాలోచనామృతం
    నా ఉద్దేశములో ప్రజలు ఎక్కువగా సంగీతాన్ని ఎందుకు ఆదరిస్తారంటే, దానిని వినేటప్పుడు సామాన్యముగా మరే ఆలోచన చేయనక్కరలేదు. కాని సాహిత్యపు సంగతి అలా కాదు. చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని కొద్దిగానైన ఏకాగ్రత చూపాలి. లేకపోతే ఏమి అర్థము కాదు. నా ఉద్దేశములో కవిత్వము పాడుటకు ఉపయోగపడేటట్లు మాత్రమే వ్రాయాలి. సంగీతము ఆ పాటలోని భావాన్ని బాగుగా బహిర్గతము చేయాలి. అప్పుడే ఆ సరస్వతీదేవికి సంతృప్తి కలుగుతుంది. ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ అంటే ఆ తల్లిని అవమానించినట్లే. విధేయుడు – మోహన

  10. ఛందస్సులో గణితాంశములు గురించి మోహన అభిప్రాయం:

    09/05/2012 3:43 pm

    కామేశ్వర రావు గారు, అక్షర గణాలకు, అంశ గణాలకు గణ మేరువు ఒకటే, అనగా గురువులు లేని వృత్తము, ఒక గురువుతోటి వృత్తములు, రెండు గురువులతోటి వృత్తములు, ఇత్యాదులు. అక్షరమేరువులో ఒక గురువుతోటి వృత్తములన్నిటికి మాత్రల సంఖ్య ఒక్కటే. ఆ వృత్తాలలో వాటి స్థానములు మాత్రము వేరు, అంతే. కాని అంశగణములలో అలా కాదు. బ్రహ్మ గణములు ఉండే రెండవ ఛందములో గురువులు లేనిది III, ఒక గురువుతో రెండు UI, IIU, రెండు గురువులతో UU. ఒక గురువుతో ఉండే రెంటికీ మాత్రల సంఖ్య ఒకటి కాదు. ఒకే మాత్రల సంఖ్యతో ఉండే సంఖ్యలను కలిపినప్పుడే మనకు విరహాంకుని (ఫిబనాచ్చీ) అంకెలు లభిస్తాయి. అందుకే ఒకే మాత్రల సంఖ్యలు గల వృత్తముల సంఖ్యలను వేరుపరచవలసి వచ్చింది. అంశ గణములకు అక్షరగణములవంటి మేరువును నిర్మిస్తే అందులో గురులఘువుల సంఖ్య తప్ప యితరార్థములను ఇచ్చుటకు వీలు కాదు. విధేయుడు – మోహన