పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/09/2012 1:13 pm

    ఈమాటకు శ్రేయోభిలాషి, నాకు ఆప్తమిత్రుడు అయిన రోహిణిప్రసాద్ గారు ఇక లేరు అన్న వార్త ఇంకా నమ్మలేకపోతున్నాను. Shocking news!

    ఆయన కొంతకాలం క్రితం విజయవాడలోని చిగురుపాటి సతీశ్‌బాబుకు ఇచ్చిన ఇంటర్వ్యూ:
    “మా నాన్న ఏర్పరిచిన వాతావరణమే నా జీవితానికి బాట వేసింది”

  2. కల్యాణి రాగం – అనుబంధం గురించి Prabhakar Gundlapalli అభిప్రాయం:

    09/09/2012 9:12 am

    Sri Rohini is no more for us. Today morning, I happened to see the news in Enadu. The day was dull, thinking of him. I had long interaction with him, during his stay at BARC. May his soul rest in peace… Prabhakar Gundlapalli.

  3. చలంతో రజని ముఖాముఖి గురించి ramamohan ch అభిప్రాయం:

    09/09/2012 2:10 am

    చలం మీద ఫ్రౌఇడ్ ప్రభవం వుంది. స్త్రీ స్వేచ్చ ఆయన జీవితేచ్ఛ తన రచనల్లో సాధించాడు. కుటుంబవ్యవస్థను గౌరవించినవాడు చలం. “There are no facts, only interpretations.”- Friedrich Nietzsche (1844-1900)

  4. కిటికీ గురించి Kalyan అభిప్రాయం:

    09/08/2012 11:08 pm

    It was one of the chapters in my english non detail in my 8th or 9th class. I still remember the way my teacher explained us the story and how interestingly we were listening to the teacher.
    Its a nice effort to translate the story and present it to the telugu people.

  5. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    09/08/2012 10:28 pm

    ‘ఏవిటీ రోహిణీ ప్రసాద్ గారు కనిపించడం లేదు? కొంత రెస్ట్ కావాలనుకుంటున్నారేమో!?’ అనుకున్నాను ఈ మధ్యే గుర్తొచ్చి. కానీ పొద్దునే ఈ వార్త చూసి చాలా చలించి పోయాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ని ప్రార్ధిస్తూ… వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ చేస్తూ…
    బాధతో.

  6. తథాస్తు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/08/2012 8:25 pm

    ఆహా, కాదండీ కొన్ని సార్లు మనం తూకం తూచుకోవు, మనం మన మంచిని ఆలోచించవు, ఆ నిముషం లో అది మనకి మంచిగానే కనిపిస్తుంది. అందుకని, మనం మనుషులవి కాబట్టి కొన్ని సార్లు ఇది అపాత్ర దానవని తెలిసినా సరే, దీనిని మనం సస్టెయిన్ చెయ్యలేవని తెలిసినా సరే చేస్తావు, మనం మనుషులవి కాబట్టి, మనం ఎక్కాల పుస్తకాలవి కాదుగాబట్టి. కానీ ప్రసాదు గారు చెప్పిన ఆ రెండో కోణం మాత్రం నిజం. అదేవిటండీ ఆయన పెద్ద రచయిత అన్నారు. “పెళ్ళైన ఈ రెండేళ్ళలో ఆరోజే మొదటి సారిగా నా భార్యను చెయ్యి చాచి కొట్టాను.” అనడం అశహ్యంగా లేదు? నిజవే పెళ్ళి, ఒక రూఫ్ క్రింద బతకడం మొదలు పెడితే చాలా సమస్యలే వస్తాయి. దాంట్లో కొన్ని సార్లు కొట్టు కోవడం కూడా వుండొచ్చు. కానీ పెళ్ళయి రెండేళ్ళయి ఇదే నేను మొదట సారి నా పెళ్ళాన్ని కొట్టడం అంటే ఏవిటి రచయిత ఉద్దేశం. పేళ్ళయిన ఒక ఏడు లోనో, రెండేళ్ళలో నో, పదేళ్ళలోనో పెళ్ళాన్ని కొట్టాలా. కొడితే కొట్టండి, తిరిగి కొడితే భరించండి, మళ్ళా మరు నిముషం లోనే ఒడిలోకి తీసుకుంటే, కౌగిలోకి లాక్కుంటే ఆ విషయాలు మీ సంసారినికే పరిమితం. అంతే గానీ, రెండేళ్ళగా కొట్టలేదని గొప్పగా ఫీల్ కావడం, అభ్భా నిజంగా చాలా అశహ్యంగా ఉందండి. ఒక మంచి కథ కాదు, ఒక మామూలు కథ, అయినా ఆఖరలో ఆ చిన్న వాక్యం మొత్తం కథనే చెడిపేసింది, మొత్తం కథనే చాలా, చాలా అసహ్యంగా మార్చేసింది. ప్రసాదు గారు ఈ విషయం లో మాత్రం మీ అభిప్రాయం ఒప్పండీ.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  7. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    09/08/2012 6:48 pm

    ఎంత చెడ్డ వార్త వినవలసి వచ్చింది.

    రోహిణీ ప్రసాద్‌ మిత్రుడు, ఆత్మీయుడు, ఆత్మబంధువు (సోల్‌మేట్‌). సైన్సుని తెలుగులో రాయటానికి ప్రయత్నించే అతి కొద్ది మందిలో రోహిణీ ప్రసాద్‌ ఒకరు కావటం ఈ స్నేహబంధానికి ఒక కారణం. సంగీత పరిజ్ఞానం బొత్తిగా లేని నాలాంటివారికి సంగీతం లోని అందాన్ని అందుకోవటం ఎలాగో చెప్పగలిగేడంటే సైన్సులో పరిజ్ఞానం లేని వారికి సైన్సు అరటిపండు ఒలచినట్లు చెప్పటంలో ఎంత సిద్ధ హస్తుడో మనం ఊహించుకోవచ్చు.

    సైన్సుకి సంబంధించిన తెలుగు వ్యాసాలు రాయమనిన్నీ, రాసినవి ఆంధ్రప్రభలో ప్రతి వారం ప్రచురించమనిన్నీ నన్ను ప్రేరేపించిన వ్యక్తి రోహిణీప్రసాదే. నా చేతనే కాకుండా చాగంటి తులసి చేత కూడ ఈయన సైన్సు వ్యాసాలు రాయించేరు.

    నేను గత ఏడాది హైదరాబాదులో వారింటికి వెళ్ళినప్పుడు మళ్లా అమెరికా వచ్చే ప్రయత్నంలో ఉన్నానని చెప్పేరు. వచ్చినప్పుడు కేలిఫోర్నియాలో మా ఇంటికి వస్తానని కూడ చెప్పేరు. ఇంత పిన్న వయస్సులోనే ఆయన మనని విడచి వెళ్లిపోయారంటే నమ్మలేకుండా ఉన్నాను.

    ఆయన తల్లికీ, భార్యకీ నా సంతాపం తెలియజేస్తున్నాను.
    వేమూరి వేంకటేశ్వరరావు

  8. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి రవిశంకర్ అభిప్రాయం:

    09/08/2012 6:43 pm

    నాకు సంగీతంతో పెద్దగా పరిచయం లేకపోయినా, రోహిణీప్రసాద్‌గారు సంగీతం గురించి రాసిన వ్యాసాలు ఆసక్తిగా చదివేవాడిని. ఒకటి రెండుసార్లు సభల్లో వారిని కలిసే అవకాశం కలిగింది. ఆయన మరణవార్త విని చాలా విచారించాను. వారి మరణానికి సంతాపం తెలుపుతూ, ఈమాట ద్వారా వారి కుటుంబానికి నా సానుభూతిని అందజేస్తున్నాను. – రవిశంకర్

  9. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి jayaprabha అభిప్రాయం:

    09/08/2012 3:31 pm

    ఈమాట ఇటీవలి సంచికలలో రోహిణీప్రసాద్ గారి కబుర్లూ వ్యాసాలూ అభిప్రాయాలూ ఏవీ కనిపించలేదు. ఈ ఏడాది జనవరి తరవాత, మళ్ళీ ఆయన ఏవీ రాసినట్టులేదు. ఏమా? అని ఒకసారెప్పుడో నాలోనేనే అనుకున్నాను. మళ్ళీ ఏవో పనితొందరలు ఉంటాయి కదా అని నాకు నేనే జవాబు చెప్పుకున్నాను . ఈ వార్త చాలా విషాదకరం . ఆయనతో నాకు తగినంత పరిచయం కలగలేదు. ఒక్కసారి మాత్రం ఫొన్ లో మాట్లాడుకున్నాము . ముఖాముఖీ కలవడం కుదరలేదు. ఇలాంటి వార్త మనసుకి ఇబ్బందిని కలిగిస్తుంది ! వరూధిని గారికి ఈ వయసులో కలగకూడని దు:ఖం ఇది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను .

    జయప్రభ.

  10. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    09/08/2012 2:14 pm

    ఉదయాన్నే దుర్వార్త వినాల్సొచ్చింది.

    రోహిణీ ప్రసాద్ గారి సంగీతంపైనా వ్యాసాలు చదివాక నేనూ రాయడం మొదలు పెట్టాను. అంతకుముందు సంగీతంపట్ల అభిరుచున్నా రాయాలని అనిపించేది కాదు. సంగీతం మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల మీద నాకు అభ్యంతరాలున్నా, ఆయన రాసిన సంగీత వ్యాసాలే నాచేత కూడా రాయించాయి. ఈమెయిల్స్ లో మాట్లాడడమే తప్ప కలిసే అవకాశమే రాలేదు.

    నిస్సందేహంగా చక్కటి తెలుగు వాక్యం రాస్తారాయన. రోహిణీ ప్రసాద్ గారి వెలితి ముందు ముందు ఈమాటలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది.

    ఇలాంటి వార్తలు చదువుతూంటే, జీవితం ఎంత చిన్నదో కదా? అనిపిస్తూ ఉంటుంది. రోహిణీ ప్రసాద్ గారి తల్లి, వరూధినిగారికి ఎంత పెద్ద దుఃఖం వచ్చిందో?

    -బ్రహ్మానందం గొర్తి