పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. కిటికీ గురించి gayathri అభిప్రాయం:

    09/11/2012 1:36 am

    కథ బాగుంది,మీ అనువాదం బాగుంది, ఐతే నాకు కథ చివరిలో అర్థం కాలేదు. comments చూసాక అర్థమయ్యింది. చివరిలో ఇంకొద్దిగా రాసింటే బాగుండు అని అనిపించింది నాకు. 🙂

  2. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/10/2012 6:37 pm

    పోయిన ఏడే రోహిణీ ప్రసాద్ గారు న్యూయార్క్ కి వచ్చినప్పుడు కలవడం జరిగింది. ఆరోగ్యం గా ఉషారుగా ఉన్నేరు. ఇక్కడ హిందుస్తాన్నీ సంగీతం, సినిమా సంగీతం గురించి ఒక చిన్న సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒక కీ బోర్డు ముందర పెట్టుకుని పాడుతూ, మాట్లాడుతూ, విపులీకరిస్తూ దాదాపు మూడు గంటల సేపు శ్రోతలని అలరించారు. మళ్ళా ఇండియా కి తిరిగిపోయేప్పుడు వస్తానన్నారు, కానీ రాలేకపోయేరు. ఇప్పుడిక ఎప్పటికీ రారు.

    ఒక గొప్ప వ్యక్తికి కొడుకుగా వుండటం లో ఒక పెద్ద సమస్య వుంది. నాన నీడలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. అది కూడా కుటుంబరావంత గొప్ప మనిషి నీడ నుంచి బయటపడి, తనకు తనుగా తన పేరు నిలబెట్టుకోవటం ఒక గొప్ప విషయం. సైంటిస్టుగా, సితార విధ్వాంసుడిగా, ఒక హేతువాదిగా, రచయితగా, సంగీతాన్ని, సైన్సు ని పామర లోకానికి పరిచయం చేసిన ఒక గొప్ప మనీషి శ్రీ రోహిణీ ప్రసాద్ గారు.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  3. కిటికీ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    09/10/2012 5:19 pm

    కిటికీ లోంచీ వెళ్ళడం, కిటికీ లోంచీ రావడం – అర్థం కాలేదు. అదేం పెద్ద విషయం కాదు లెండి. హాస్యం బాగానే వుంది.
    ఇక అనువాదం – “ఆవిడ భర్త తెల్లని కోటులో, ఆవిడ చిన్న తమ్ముడు రోనీ పెద్దగా పాటలు పాడి ఆవిడని విసిగిస్తూ, వాళ్ళ వెంట ఆ రోజు వెళ్లిన చిన్న కుక్క, అన్నీ ఆవిడకి బాగా జ్ఞాపకం.” – ఈ వాక్యం, “తెల్లని కోటులో ఆవిడ భర్తా, పెద్దగా పాటలు పాడి విసిగించే ఆవిడ చిన్న తమ్ముడు రోనీ, వాళ్ళ వెంట ఆ రోజు వెళ్ళిన చిన్న కుక్కా, అన్నీ ఆవిడకి బాగా జ్ఞాపకం.” అని వుంటే, ఇంకా సులభంగా అర్థం అయ్యేది.

    నాకైతే, “చెప్పింది వేరా జాలిగా.”, బదులు, “చెప్పింది వేరా అల్లరిగా.” అనో, “చెప్పింది వేరా నవ్వుతూ.” అనో వుంటే, ఇంకా బాగుండేదనిపించింది.

    ప్రసాద్

  4. కిటికీ గురించి Vanaja Tatineni అభిప్రాయం:

    09/10/2012 12:23 pm

    శారద గారు,

    మంచి కథ చదివించారు. బావుంది..

  5. కిటికీ గురించి sarma అభిప్రాయం:

    09/10/2012 6:17 am

    మంచి కధ చదివించారు

  6. ప్రేమ కవితలు గురించి pournami అభిప్రాయం:

    09/10/2012 3:24 am

    మీ కవితలు చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది.

  7. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Ramanath అభిప్రాయం:

    09/09/2012 10:48 pm

    రోహిణీ ప్రసాద్ గారి మరణం భరించడానికి ఎంత వేదాంతవూ పనికిరావడం లేదు. పనికొచ్చే వేదాంతం అని ఆయన నాతో మా ఇంటికి వొచ్చినప్పుడు ఓ చిన్న సరదా చర్చ చేసేరు. ఆలోచన, మాట, ఆచరణ.. ఒక్కటిగా కుదుర్చుకున్న మనిషి. ఇలాటివాళ్ళు చాలా అరుదు. ఇంకా.. ఎన్నో గుర్తులు, అనుభవాలు.. ఇవన్నీ బాధ కలగకుండా నెమరేసుకోడానికి సమయం పడుతుంది. అంతవరకు తప్పదు ఎవరికైనాను.

    – రమానాథ్

  8. వర్ష రచన గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:

    09/09/2012 9:52 pm

    మీ పేరు లాగే మీరు చెప్పే పద్దతి కూడ వైవిధ్యంగా ఉంది.

  9. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:

    09/09/2012 9:42 pm

    నేను నా బ్లాగులో “సవాయి గంధర్వ సంగీత మహోత్సవం” గురించి వ్రాస్తే , శ్రీ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు స్పందించి ఇలా వ్రాశారు. 

    Rohiniprasad said:

    మూడు దశాబ్దాలకు పైగా ముంబయిలో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి మాత్రమే (1971లో) సవాయీ గంధర్వ ఉత్సవానికి హాజరయాను. ఎందుకంటే అక్కడికి వచ్చే కళాకారులందరూ ముంబయిలో తరుచుగా కచేరీలు చేసేవారు. కిరానా సంప్రదాయానికి చెందిన భీంసేన్ జోషీ తన గురువు పేరిట జరిపే ఈ 3 రోజుల సంగీతోత్సవం చలికాలంలో జరిగినప్పటికీ అప్పట్లో అయిదారు వేలమంది ప్రేక్షకులను ఆకర్షించేది. రాత్రి 8 ప్రాంతాల మొదలైన కచేరీలు పొద్దున్న 6 దాకా ఎడతెగక సాగేవి. చివరిరోజున మాత్రం మధ్యాహ్నం 12 దాకా జరిగేది. అందరికన్నా తరవాత భీంసేన్ కచేరీ జరిగేది. ముగింపు కోసం పాడే (సింధు) భైరవి రాగం మాత్రం సవాయీ గంధర్వ రికార్డు మోగించి వినిపించేవారు. 1971లో జరిగిన ఉత్సవంలో మా గురువు ఇమ్రత్ ఖాన్‌గారి సితార్ కచేరీ, బిర్జూ మహారాజ్ కథక్ నృత్యానికి శాంతాప్రసాద్ తబలా సహకారం, కిరానా గాయని హీరాబాయీ బడోదేకర్‌కు సన్మానం వగైరాలన్నీ జరిగాయి.
    January 6, 2010 8:07 PM  

    ఇది నేనెప్పుడూ మరచిపోలేను. దీనిని నేను ఒక అపురూపమైన వ్యాఖ్యగా భావిస్తాను ఎప్పటికీ. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ … 

  10. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి ramamurthy అభిప్రాయం:

    09/09/2012 1:24 pm

    తెలుగు అకాడమి వారి కావ్యాలోకం లభిస్తలేదు. దయచేసి సాహిత్యాభిమానులు నెట్ లో ఉంచగలరని మనవి. రచన డా.కే.వీరభద్ర రావు.