పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తః తః అభిప్రాయం:

    12/05/2012 4:23 pm

    ఒక పది నిమిషాల క్రితం “ఆంధ్ర ప్రభ సౌజన్యంతో” అని చివరలో చెబుతూ సామవేదం వారి ఋషిపీఠం అక్టొబరు 2012 సంచిక – పుటలు 27-28- లో వచ్చిన ‘ఈ శతాబ్దపు హిమనగం’ అన్న వ్యాసం చదివి ఆసక్తి గలవారలకు తెలియజేయాలని ఇది రాస్తున్నాను. వ్యాస రచయిత పినాకపాణి గారి పెద్దన్న గారి అల్లుడయిన శ్రీ గొల్లపూడి మారుతీరావు.

    తః తః

  2. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి తః తః అభిప్రాయం:

    12/05/2012 4:03 pm

    “…దీని నొక
    చోద్యముగా గణియింప బోక
    సత్సమ్మతిగా నెసంగు కవి
    తా రసమున్ జవిచూడు భూవరా”

    అన్న దానికి అర్థం “పాండిత్య విన్యాసాల ప్రదర్శన విద్యగా కాక, కవిత్వ దృష్టి ఏ మాత్రమైనా ఇందులో ఉండాలిరా నాయనా!అని వాపోవడం…” అని ఎలా చెప్పారొ లక్ష్మన్న గారు తెలియటం లేదు. విన్యాసంగా మాత్రమే చూడవద్దు, ఇందులొ కవిత్వం గూడా ఉంది. రాజా ఆ కవిత్వ రసాన్ని [సత్సమ్మతిగా నెసంగు కవితా రసమున్] చవి చూడుమని స్పష్టంగా లేదా? పైగా “చోద్యముగా గణియింప బోక ” అన్నారు. అంటే ”దొమ్మరి’తనాన్ని downplay చేశారు చెళ్ళపిళ్ళ.

    అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను” – [కామేశ్వర రావు గారితో ఏకీభవిస్తూ] వ్యాసం లోని కొన్ని ఇతర ముఖ్య విషయాలతొ పాటు ఈ విషయాన్ని గూడా ఒప్పుకోలేకనే నేను ప్రచురించే ముందు ఈ వ్యాసాన్ని [వేరొక] అవధానికి ఎవరికైనా చూపించారా అని అడిగాను.

    తః తః

  3. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    12/05/2012 4:52 am

    అవధానాన్ని యిష్టపడే ఒక పామరునిగా నా అభిప్రాయాలివి:

    1. కవిత్వం అనే బ్రహ్మపదార్థానికి కాలానుగుణంగా అర్థం మారుతూ వచ్చింది. అంచేత ఒకప్పుడు ఆశువు, అవధానమూ కవిత్వంగా, కవిత్వవిద్యగా చెలామణీ అయి ఉండవచ్చు, అందులో ఆశ్చర్యమూ అసంగతమూ ఏమీ లేదు. ప్రస్తుతం కవిత్వమంటే ఉన్న అవగాహన (“మేధావి” వర్గానికి) మేరకు అది కవిత్వం కాదన్నది కచ్చితమే. అయితే అందులో అక్కడక్కడా కవిత్వఛాయలు కనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది, అది వేరే సంగతి. అవధానికీ, పృచ్ఛకులకూ, ప్రేక్షకులకూ కవిత్వదృష్టి ఉంటే అందులో కొంత కవిత్వం పండే అవకాశం ఉంది. లేకపోతే లేదు. అయితే ఆ విద్య ప్రాధాన్యం అది కాదు.

    2. అవధానానికీ దొమ్మరి ఆటకూ పోలికలుండడమూ వాస్తవమే, అందులో వాదనకి తావు లేదు. అయితే, దొమ్మరాటను “తక్కువ”గా చూడాల్సిన అవసరం ఏముందో నాకు బోధపడటం లేదు. అది కూడా కష్టించి సాధించాల్సిన ఒక విద్య. మనుషులకి ఆహ్లాదాన్ని కలిగించే ప్రక్రియ. దానివల్ల సమాజానికి నష్టమేమీ లేదు. అలాంటి ప్రక్రియ జనాదరణ పొంది అభివృద్ధి చెందితే మంచిదే కదా. అవధానమూ అంతే.

    ఇక వ్యాసం చివరలో పేర్కొన్న కొన్ని విషయాల గురించి, పృచ్ఛకునిగా కొన్ని అవధానాలలో పాల్గొన్న అనుభవాల ఆధారంగా, నా అభిప్రాయాలు:

    1. పృచ్ఛకులను గద్దించో బతిమాలో ఒక క్లిష్ట సమస్యని మార్చడం అనేది నేను చాలా కొద్ది సందర్భాలలో మాత్రమే చూసాను. అంచేత అది ఒక “టెక్నిక్”గా ఎక్కువ ఉపయోగపడక పోవచ్చు, కేవలం అరుదైన అత్యవసర పరిస్థితుల్లో తప్ప.
    2. “అవధాని గారికి కోపం వస్తే శాపం పెట్టేస్తారేమో!” అనే అనుమానం ఇతరుల మనస్సుల్లో కలిగించగలిగిన అవధానికి ఇంక ఎలాటి ఢోకా లేదు. – ఇలాంటిది నా కొద్ది అనుభవంలోనూ ఎప్పుడూ చూడలేదు.
    3. “మొదటిది పృఛ్ఛకుల్ని మంచి చేసుకోవటం. అవధానం మొదలుకావటానికి ముందుగా వాళ్ళని పలకరించి ఎవరు తనని పరీక్షించటానికి వచ్చారో ఎవరు తన మిత్రులో తెలుసుకుని మొదటి వర్గంలోని వాళ్ళని తనకు అనుకూలంగా తిప్పుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి.” – ఇలాంటిది కూడా నేనుప్పుడూ చూడలేదు.

    4. “అవధానం అయి వెళ్ళేప్పుడు “ఆహా! ఆ పద్యం ఎంత బాగా వచ్చింది!” అనుకునే ప్రేక్షకుల్ని ఇంతవరకు చూడలేదు నేను” – అలా అనుకున్న ప్రేక్షకులలో నేను ఉన్నాను. (వ్యాస రచయిత నన్ను “చూడలేదు” కాబట్టి అతనన్నది ఇప్పటికీ నిజమనే అనుకోవచ్చు :-)) నేనిచ్చిన ఒక సమస్యను గరికపాటివారు పూరించిన విధానమూ, న్యస్తాక్షరిని కడిమెళ్ళవారు పూరించిన విధానమూ చూసి, ఎంత బాగా వచ్చాయి పద్యాలు అని అనుకున్నాను.

    6. “ఇటీవలి కాలంలో జరుగుతున్న అవధాన కార్యక్రమాల వల్ల భాషకు ఏమీ ఉపయోగం కలక్కపోగా ఒకరకమైన కీడు కూడ జరుగుతున్నదేమో అనిపిస్తున్నది.” – ఎలాంటి కీడు జరుగుతోందో వివరిస్తే బాగుంటుంది.

    5. “ఏమైనా అవధాన ప్రక్రియ వల్ల భాషాసాహిత్యాల మీద ఉండే ప్రభావం గురించి ఎవరైనా సాధికారికంగా పరిశోధిస్తే బాగుంటుంది.” – అవును బాగుంటుంది. అలాంటి ప్రభావం (మేలు కాని, కీడు కాని) చాలా తక్కువ అని అభిప్రాయం. బహుశా ప్రేక్షకులకి పద్యాల మీద కొంత ఆసక్తిని పెంచే అవకాశం ఉంది, అంతే. అవధాన స్వరూపంలోనూ, సమస్యల పూరణల స్వరూప స్వభావాలలోనూ, కాలానుగుణంగా చాలా మార్పు వచ్చింది. అవధానం గురించిన ఏ పరిశీలన అయినా దీన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. గరికపాటివారి అవధాన పద్యాలు కొన్ని పుస్తకాలుగా వచ్చాయి. వాటిని పూర్వ కవుల అవధాన పద్యాలతో పోలిస్తే తేడా చక్కగా బోధపడుతుంది. వీటి ఆధారంగా యీ వ్యాసంలో పేర్కొన్న కొన్ని అంశాలని పునస్సమీక్షించు కోవలసిన అవసరం ఉంది.

  4. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj అభిప్రాయం:

    12/04/2012 3:48 pm

    లక్ష్మన్న గారూ !!

    ఇక్కడ చర్చ “అవధానాలలో కవిత్వం ఉందా లేదా” అన్నది కాదు. అవధానాల పరిమితీ ప్రయోజనమూ కూడా కాదు. అది దొమ్మరి ఆటే అయినా అందులో కవితా రసం చిప్పిల్లక పోయినా అది ఒక మేధో ప్రదర్శన. దాని సామాజిక ప్రయోజనం గురించి కాదు మనం చర్చించుకుంటున్నది. అది జెమినీ సర్కస్సే అయినా కూడా అందులో అందరూ పాల్గోలేరే? ఆ విద్యా ప్రదర్శనని అందరూ చేసెయ్యలేరే? ఆ “వీటి విద్యకి” కూడా దానిదే అయిన పరిమితీ ప్రయోజనమూ ఉన్నాయి. ఈ స్పష్టత దానిని గురించి చర్చ చేసేవారికీ దానిని విమర్శించే వారికీ దానిని అర్ధం చేసుకుని విశ్లేషణ చేసేవారికీ ఖచ్చితంగా ఉండాలి మరి.

    అవధానాలలో వారు కవిత్వం చెప్పుతున్నట్టు మాట్లాడినప్పుడు మాత్రమే మీరన్న ఇటువంటి మాటలకి చోటు. కాని అది కేవలం “పామర” రంజన కోసమే అయినా అప్పుడు కూడా అది ఒక కళే! దానిని సైతం అందరూ చేయలేరు. దానికి పద్య విద్యలోని మెలకువలు తెలియాలి. సమయస్పూర్తి ఇత్యాదులు అవసరం! ఒక పక్క తెలుగు భాషే అనేకానేక పరిణామాలలో గిరిగిళ్ళు తిరుగుతూ ఉంటే ఆ అవధానాలు అన్నవి ఏవో అందరూ చేసేయగలిగినట్టు, అదేమంత బ్రహ్మ విద్య కానట్టు దానిని బహిష్కరించేటంతటి తీవ్రతని చూపనఖ్ఖరలేదు. వీరేశలింగంపంతులు గారు ఒక పాపులర్ ఆర్ట్ గా దానిని ప్రదర్శించబోయి దాని పట్ల విసుగొచ్చి మానేసి ఉండొచ్చు. దానిని” దొమ్మరి ఆటగా” చెప్పిన చెళ్లపిళ్ల కవిద్వయం (ఇవాళ్టి యెన్నారైలు అమెరికాకి టికెట్టు ఇస్తే నాలుగు డబ్బులకోసం అవధానులు వెళ్ళినట్టే…) ఆనాడు “నానారాజ సందర్శనం” చేసుకుంటూ ఆ విద్య ద్వారానే నాలుగు డబ్బులు గడించుకునే పని చేశారు మరి.

    మనం వినోదం కోసం అని సర్కస్ చూసేందుకు పోమా? కానీ మనకి మనమే ఆ గెడ మీదికి ఎక్కి అదుపు తప్పకుండా నాలుగు అడుగులు వేయలేమే? ఆ అడుగులు వేసే అమ్మాయి కూడా సంవత్సరాలు శిక్షణ చేస్తేనే వచ్చిన వారికి ఇంత సంరంభాన్ని పంచగలదు. అందువలన మనం చేయలేని ఆ “దొమ్మరి ఆట” కూడా ఒక కళే. అక్కడ గడసానులున్నట్టే ఇక్కడ అవధానులూ ఉన్నారు అనే అనుకోండి పోనీ!! (ఆ గడసానులు) అదే ఆ అవధానులు ఆనాడు పంతులుగారు, వేంకటశాస్త్రి గారూ కావొచ్చు. ఈనాడు మరొకరు కావొచ్చు. దానివల్ల ఆనందం పొందే వారున్నారు కదా? అందులో “పండితులూ” “కవులూ” “మేధావులూ” లేకపోతే అక్కడ కూర్చుని ఆ అక్షర విన్యాసానికి అబ్బురపడుతూ వాటిని వీక్షించే వారికి కలిగే ఆనందానికి వచ్చే లోటేమీ లేదే? అలాంటప్పుడు ఆ “కవులూ మేధావులూ” వాటి పట్ల అంత గాఢమైన అసహనాన్ని మాత్రం ఎందుకూ కలిగి ఉండడం?

    తెలుగులో ఎక్కాలూ కిందినించి పైకి అప్పచెప్పే వాళ్ళున్నారు. ఇంగ్లీషులో స్పెల్లింగులు చెప్పే వాళ్ళున్నారు ఒక్క తప్పు రాకుండా. అలాంటి వాళ్లకి మీ అమెరికాలో డాలర్లలో ప్రైజ్ మనీలు సైతం ఉన్నాయి. వాటికి ఇంగ్లీషులో మెప్పు కూడా ఉంది. రష్యాలో జిమ్నాసిజం ఎంతో ఆదరణ ఉంది. మరి అలాంటి ఒక పనిని భాషని వాహికగా వాడుకుని “పామరులని” రంజింపజేయడానికే అనుకుందాం పోనీ, ఆ అవధాని గనక ప్రయత్నిస్తే దాన్లో ఎవరికైనా ఏమిటీ ఇబ్బందీ? ఒక సర్కస్ చూసినట్టే ఒక అవధానాన్నీ చూడండి. ఆ కళ “మనలాంటి వాళ్ళకోసం కాదు” అని అనుకునే “మేధావులు” వెళ్ళకండి. అంతేగానీ అవధానాలలోని అక్షరాల గారడీ మీద “మేధావులకి” దేనికీ వైరం? అవధానులనీ వారి విద్యనీ ఎకసెక్కెం చేసి “అబ్బే అందులో ఏముందీ” అని అనుకునే ముందు, “నేర్చుకుని అందరూ ఆ అవధానాలని చేసేయగలరని” రాసేసే ముందు .. అసలు అలాంటి ఒక విద్య కేవలం తెలుగులోనే ఉందనీ అది తెలుగు భాషకి మాత్రమే సాధ్యమైన ఒక అక్షరాల గారడీ అని కూడా గుర్తించండి.

    ఒకనాడు ఎంతో ఘనత వహించిన విప్రవినోదుల విద్యలు ఆదరణ లేకనే కదా కనుమరుగై పోయాయి! అలాగే ఎవరూ పట్టించుకోకపోతే ఈ అవధానాలూ కొద్ది కాలానికి కొట్టుకు పోవచ్చు. సూడో వెస్ట్రన్ ప్రభావంతో వాదనలు చేసుకుంటూ ఒక విద్యని పోగొట్టుకుని ఎవరైనా సాధించేది ఏముందీ? నిలుపుకోవడంలో గొప్పదనం ఉంది గానీ? ఆదరించడంలో ఘనత ఉందిగానీ! ఇలా మహా ఘనమైన పని చేసినట్టూ విద్యల్ని ఎగతాళి చేసే “మేధావుల” కన్నా విద్యల్ని తమదైన రీతిలో నిలుపుకునే “పామరులు” గొప్పవాళ్ళు కాదా? అలాకాదూ పోనీ అంతకన్నా మేలుగా ఆ విద్యని తీర్చి దిద్దుకోవడం ఎలాగో దాని గురించి ఆచరణ లో చేసికదా చూపాలీ? ఎప్పుడైనా ఒక మెరుగైన విమర్శ వలన ప్రయోజనం ఉంటుంది గానీ నిస్సారమైన విమర్శ వలన ఒక కళకీ మేలు లేదు. విద్యకీ లేదు. భాషకీ లేదు. అలాంటి విమర్శ దృష్టిలో వ్యతిరేకమైనది. దానివలన ఒరిగేదేమీ ఉండదు ఎవరికైనా!! ఆలోచించి చూడండి మీరు కూడా ఏ ధోరణి మంచిదో!!

    రమ

  5. కొండ నుంచి కడలి దాకా గురించి surya lakshmi అభిప్రాయం:

    12/04/2012 2:40 am

    Namaste Srinivas sir,

    As you said to send an email to you, I send an email to you about the song ‘valapuluchindaga’ and ‘neejaada kananaitira’. Please if you find these songs send me those songs.

    Waiting for your reply,

    Thanking you Sir,

    V.Surya Lakshmi,
    lakshmi.kavipurapu@gmail.com
    Ph.no.9789853068.

  6. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    12/02/2012 12:56 pm

    అవధానాల మీద ఇంత చర్చ జరుగుతోంది కదా అని కొన్ని పాత పుస్తకాలు తిరగేసాను.

    అవధాన శిరోమణులుగా ప్రసిద్ధి పొందిన తిరుపతి వేంకట కవులు 1891 లో తొలిసారిగా కాకినాడలో సంపూర్ణ శతావధానముతో రంగప్రవేశం చేయడానికి పదిహేడేళ్ళ ముందే అవధాన విద్యలో బుద్ధి పెట్టినట్టు వీరేశలింగం పంతులుగారి “స్వీయచరిత్ర” చెపుతోంది. వీరేశలింగం గారి కంటే కొంచెం వయస్సులో పెద్ద అయిన మాడభూషి వెంకటాచార్యులు గారు 1855 ప్రాంతాలకే అష్టావధానం చేసారని వినికిడి.

    పంతులుగారి “స్వీయచరిత్ర”లోని ఈ వ్యాఖ్య చూడండి.

    “ఊరక పామరుల వేడుక కొరకు దక్క దీని వలన లోకమునకు గాని, నాకు గాని, నిజమైన ప్రయోజనము లేదని భావించి తరవాత ఎందరెన్ని విధముల బ్రార్ధించినను మేధస్సునకు వేదనాకరమైన యష్టావధానమును జేయమానితిని” [స్వీయ 1936 సం. ముద్రణ. 93 వ పేజీ]

    తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్తిగారి ‘కథ-గాథలు’ రెండవ సంపుటంలో ” అష్టావధానమంటే?” అన్న వ్యాసంలో ” చిరకాలంనాడే మాకీ విద్య యందు అనాదరం” అని స్పష్టంగా ఉంది. అని చెపుతూ –

    దొమ్మరసాని యెంతయును
    దుడ్కుమెయిల్ గడనెక్కి యాడు పో
    ల్కిమ్మడి బల్మికల్మి కడు
    గీరీతికై యధానముం బొన
    ర్చు మ్మనుజుండు దీని నొక
    చోద్యముగా గణియింప బోక
    సత్సమ్మతిగా నెసంగు కవి
    తా రసమున్ జవిచూడు భూవరా!

    పాండిత్య విన్యాసాల ప్రదర్శన విద్యగా కాక, కవిత్వ దృష్టి ఏ మాత్రమైనా ఇందులో ఉండాలిరా నాయనా! అని వాపోవడం ఇక్కడ కనిపిస్తుంది.

    “సంచలనం” అన్న వ్యాసం సంపుటిలో శ్రీ ఇంద్రకంటి శ్రీకాంత శర్మ గారు ‘అవధానం పామరులకే’ అన్నవ్యాసాన్ని ఈ క్రింది వాక్యాలతో ముగించారు.

    ” పద్యాన్ని ఆశువుగా చెప్పడాన్ని విని ఆశ్చర్యంగా తల ఊగించి ‘కవిత్వ భ్రమ’ తో దణ్ణం పెట్టే శ్రోత నిస్సంశయంగా పామరుడే!”

    విష్ణుభొట్ల లక్ష్మన్న

    Lucky.Vishnubhotla@Globalfoundries.com

  7. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి తః తః అభిప్రాయం:

    12/01/2012 2:33 am

    సంపాదకులకు :
    ఒక పుష్కరం క్రిందటి వ్యాసం మీద ఇప్పుడు వస్తున్న అభిప్రాయాలు చదువుతున్నాను .
    మొట్ట మొదటగా ఒక సందేహం – కష్టమైన ప్రశ్నే : మీ దస్త్రాల్లొ ఎక్కడైనా ఈవ్యాసాన్ని ప్రచురించే ముందు – ఈ వ్యాసావిర్భావం మీద శ్రీ లక్ష్మన్న ఇచ్చిన వివరణ ఎలాఉన్నా – ఎవరైనా అవధానికి – రామారావు గారు ఒక వేళ స్వయం గా అవధానులే అయినా – పంపించి నట్టుగా ఉందేమో చూచి చెప్పగలరా.
    నమస్కారాలతొ
    తః తః

  8. ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం! గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    11/30/2012 11:16 pm

    Sreenivas garu,
    I am sorry that for what you have expressed is valid.
    My remark fails to distinguish between the indifference meted out an erudite scholar on his attiring the ripe age of one hundred years and the apathy that was accorded to two distinguished cultural genii, whose demise took place in the same period of time. And the loss incurred by the demise of Rohiniprasad garu and Dr Bhadriraju garu and the loss caused by the cessation of intellectual contribution by Dr Pinakapani garu, as a result of his confinement to bed could have been kept apart. I should have been more specific as to making the dissimilarity conspicuous. I should not have been so casual as to cause the ambiguity, resulting in anguish. I tender my sincere
    I should have kept the difference apart and split the sentence. I feel ashamed for adding my own contribution to the disrespect meted out to the music genius by being flaccid in my syntax. I tender my sincere apology to Dr Pinakapani garu and his family.
    Siddineni Bhava Narayana

  9. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/30/2012 3:57 pm

    లైలా గారన్నది నిజం. అది ఎర్ర గురివింద. నా పొరపాటు.

  10. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి lyla yerneni అభిప్రాయం:

    11/30/2012 1:54 pm

    “నల్ల గురివింద తన నలుపెరుగనట్లు” -K.V.S. Ramarao

    Pardon me, is that your own coinage?

    Even though the plant -Abrus Precatorius- can produce different colored seeds, the most eye catching and popular are the red seed with black bottoms. ( I have to review basic botany to recall, if the part of seed that is attached to the inside of the pod – if it is the bottom or top or what exactly is its botanical technical term.)

    The usage in common practice in Telugu is “ఎర్ర గురివింద తన నలుపెరుగనట్లు” – like in the movie LavaKusa:

    ఎర్ర గురివింద తన నలుపెరుగనట్లు
    చెప్పుచున్నావు మీ రాము గొప్పలెల్ల
    చాలు చాలింక ధర్మ పన్నాలు మాని
    చేవ గలదేని యుద్ధంబు చేయవయ్య.

    My ancestral ladies in my Indian homes, sportive, 🙂 never calling a truce, used often – ఎర్ర గురివింజకి తన ముడ్డి కింద నలుపు తెలియదు – to harangue their men. They had the right body language to go with it too.

    లైలా

    PS: I am learning not only Telugu words, but also botany, birds and other things from ఆంధ్రభారతి నిఘంటువు. It’s fun.