పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Rao Vemuri అభిప్రాయం:

    02/02/2013 12:41 am

    ఆశ్చర్యం! ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు స్పందన వచ్చింది. కనుక మనం రాసిన వాటి మీద వెనువెంటనే స్పందన రాకపోతే కంగారు పడనక్కర లేదు! ఈమాట పాత పత్రికలన్ని అందుబాటులో ఉండడం, వాటిని శోధించే స్థోమత ఉండడం వల్లనే కదా ఇది సాధ్యం అయింది! ఈ సౌలభ్యం అచ్చు పత్రికలకి లేదు – వేమూరి

  2. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Saraswathi Durbha అభిప్రాయం:

    02/01/2013 2:17 pm

    తెలంగాణా లో దుర్భ గూడెం అనే ఊరు ఉంది. బహుశ అదే మా ఇంటి పేరు అయి ఉంటుంది. ఇలా చాల మంది కోస్తా ఆంధ్రా వాళ్ళ ( ఏ కులమైనా) ఇళ్ళ పేర్లు గల ఊర్లు తెలంగాణా లో ఉన్నాయి. అంటే ఒకప్పుడు తెలంగాణా ప్రాంతం లో ఉండి బహుశ తురకల దాడుల వలన కొన్ని వందల సంవత్సరాల క్రితం అంధ్ర ప్రాంతానికి వలస వచ్చి ఉంటారు వీళ్ళంతా. ఈ విషయం ఇప్పటి తెలంగాణ వాదులు తెలుసుకోవాలి.

  3. వేటూరి పాట గురించి phani అభిప్రాయం:

    02/01/2013 12:05 pm

    “గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు” ఇది వేటూరి సుందర్రామ్మూర్తి గారు రాసిన పాట. ఈ చరణం అర్థం ఎంటో ఎవరైనా చెప్పండి.

  4. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి తః తః అభిప్రాయం:

    02/01/2013 7:20 am

    నేల శబ్దానికి మూలద్రావిడ ధాతువు -*ఞాల శబ్దమని భాషావేత్తల అభిప్రాయం. — సురేశ్ కొలిచాల

    ‘ఇల’ కూడా ఇలా వచ్చిందేనేమో ననిపిస్తొంది

  5. మృత్యు వృక్షం గురించి గురునాథ రావు దిక్కల అభిప్రాయం:

    02/01/2013 12:34 am

    అద్భుతమైన కవితలు అందించినందుకు ధన్యవాదాలు.

  6. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    01/31/2013 2:31 pm

    @తః తః గారు: ముందుగా పరుచూరు అనే రాశాను. తరువాత, -కి అన్న ద్వితీయా విభక్తికి ఔపవిభక్తిక రూపం రాయాలేమో అని అనుమానపడి పరుచూరి అని మార్చాను. పరుచూరు అని రాయడమే కరెక్టు.

    @మోహన గారు: నా స్వస్థలము తెలంగాణలోని జగిత్యాల. దానిని కొంతమంది జెత్యాల అని, జెజ్యాల అని పలకడం నేను విన్నాను. -ఆల అన్న ప్రత్యయంతో తెలుగుదేశంలో ఉన్న ఊరిపేర్లు కోకొల్లలు: జగిత్యాల, మల్యాల, నంద్యాల, చీరాల, పేరాల, కొడిమ్యాల, పరకాల, పరిటాల, పెండ్యాల, పొన్నాల, మామిడాల, కనగాల, ఓగిరాల, కానాల, గుండాల, చిక్కాల, వావిలాల, ఇటిక్యాల, లింగాల మొ॥ కొన్ని ఉదాహరణలు.

    నేల శబ్దానికి మూలద్రావిడ ధాతువు -*ఞాల శబ్దమని భాషావేత్తల అభిప్రాయం. ఈ -ఞాల శబ్దమే -యాల శబ్దంగానూ (నంద్యాల, పెండ్యాల మొదలైన వాటిలో) -ఆల శబ్దంగాను ఊరిపేర్లలో నిలచిపోయిందని నా అభిప్రాయం.

    ద్రావిడభాషలలో పదంలో అచ్చుల మధ్య ఉండే (intervocalic) -గ- కారాన్ని తేలికగా కంఠ్యోష్మ (Velar fricative) -హ- (x) కారంగా పలకడం కద్దు. పగలు అన్న పదాన్ని పహxలు అని పలికినట్టు, జగిత్యాలను జహిత్యాలగాను, జెజ్జాలగాను పలికే అవకాశం ఉంది.

    అయితే, సంధ్య అన్న పదం సంజెగా మారినట్టు (ధ్య > జ/జె) జంధ్యాల అన్న ఇంటిపేరు కూడా జెంజాలగానూ, జెజ్జాలగాను మారే అవకాశం కూడా ఉంది. మీ గోత్రనామాలు జంధ్యాల వారి గోత్రనామాలతో ఎప్పుడైనా పోల్చి చూసుకున్నారా?

  7. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి మోహన అభిప్రాయం:

    01/31/2013 11:56 am

    స్వార్థిగా ఈ చర్చలో పాల్గొంటున్నాను. ఎన్నో ఏళ్లుగా నా ఇంటి పేరైన జెజ్జాలను గురించి వాకబు చేస్తున్నాను, కాని ఇంతవరకు ఫలితము శూన్యమే. ఈ జెజ్జాల ఎక్కడున్నది? తలిదండ్రుల ద్వారా నేను విన్నంతవరకు ఇది ఇప్పటి తెలంగాణాలోని ఒక గ్రామమని. కాని ఆ గ్రామము ఎక్కడుందో తెలియదు. గోల్కొండ వ్యాపారులైన నా పూర్వీకులు సుమారు 200-250 సంవత్సరాలకు ముందు ఇప్పటి ఆర్కాడు, చిత్తూరు ప్రాంతాలకు వలస వచ్చారు. ఇంటర్నెట్ ఫేస్‌బుక్కుల ద్వారా ఈ జెజ్జాల పేరితో ఇంకా కొందరు ఉన్నారని కనుగొన్నాను. వాళ్లకు కూడ ఈ విషయాన్ని గురించి తెలియదు. ఈ పేరు ఒక్క కులం వారు మాత్రమే ఉంచుకొన్నట్లు లేదు. అందువల్ల బహుశా ఇది ఒక గ్రామము లేక వాడ పేరై ఉండవచ్చును. అసలు ఇది జెజ్జాలయేనా లేక జజ్జాలయా అని కూడ ఒక అనుమానము. ఇంటి ఫేరును గురించి ఏమీ తెలియక జెజ్జాల ఇంటి పేరుతో చెలామణి అవుతున్న – మీ మోహన

  8. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి తః తః అభిప్రాయం:

    01/31/2013 11:29 am

    శ్రీ సురేశ్ కొలిచాల:

    పరుచూరికి చెందిన శ్రీనివాసా? పరుచూరుకి చెందిన శ్రీనివాసా? పరుచూరి శ్రీనివాస్ ని పరుచూరికి చెందిన శ్రీనివాసు అని అనడంలొ విశేషం యేముంది? ఇది యేమి “విగ్రహ వాక్యం”? ఓరుగంటి వెంకయ్య ఓరుగల్లుకు చెందిన వాడా ఓరుగంటికి చెందిన వాడా?

    తఃతః

  9. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి Ssankara Bhanu Gorthi అభిప్రాయం:

    01/31/2013 10:16 am

    What a wonderful essay! I wish it is published in any standard magazine like “Gana Kala” of Kakinada. I had the fortune of residing 2houses next to the residence of revered Dr Sripada Pinakapani garu in Official colony, Maharanipete, Visakhapatnam from 1953 to 58. In those days, Sri Nedunuri, Sri Nukala (later luminaries) in their twenties used to visit him very frequently. In spite of his busy schedule, he used to organise competitions in music to encourage youngsters. It is interesting that Dr Pinakapani garu was also a fine sportsman, good in weight-lifting, Tennis etc. He is a a legend, YUGAPURUSHA.

    Gorthi Sankara Bhanu

  10. మన పేర్లు, ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    01/30/2013 8:46 pm

    పరుచూరికి చెందిన శ్రీనివాసు: Gabriel Jouveau-Dubreuil రాసిన The Pallavas అన్న పుస్తకంలో 6వ శతాబ్దపు పల్లవుల సర్‌నేమ్‌ల (surnames) ప్రస్తావన ఉంది. అయితే ఇక్కడ ప్రస్తావించిన సర్‌నేమ్‌లు ఇంటిపేర్లు కాక బిరుదులో, కులనామాలో అయ్యే అవకాశం ఉంది. ఈ పుస్తకపు ప్రివ్యూ గూగుల్ పుస్తక విభాగంలో చూడవచ్చు.