వలస పాలన సంస్కృతి అనే విషయం పై నారాయణ రావు గారి ఆలోచనలను మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. మీ పూర్వపరాలను పాఠకులతో పంచుకున్నందున మీ పరిచయానికి ఒక రకమైన నిండుతనం వచ్చినట్టు అనిపించింది.
ఒక వందకు పైగా పద్యాలు గ్రంథాలయములో గాథాసప్తశతి శతకం అనే చోట ఉన్నది. మిగిలినవి కూడ అనువదిస్తున్నాను. వీలైనప్పుడు అవి కూడ ప్రచురింపబడుతాయి. విధేయుడు – మోహన
హాలుని గాథా సప్తశతి లోని పద్యాలకు సంస్కృత, తెలుగు అనువాదాలతో బాటు ఇంగ్లిష్ వ్యాఖ్యానం కూడా ఇవ్వడం ముదావహం. జె. కృష్ణ మోహన్ గారి కృషి ప్రశంసనీయం. ఈ పద్యాలన్ని ఒక చోట చదువుకో గలిగితే బాగుంటుంది.
ఆశ్చర్యం! ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం రాసిన వ్యాసానికి ఇప్పుడు స్పందన వచ్చింది. కనుక మనం రాసిన వాటి మీద వెనువెంటనే స్పందన రాకపోతే కంగారు పడనక్కర లేదు!
ఆర్యా, స్పందించవచ్చును, కాని పది పన్నెండు సంవత్సరాల తరువాత స్పందిస్తే పునః స్పందించడానికి నాలాటి ముసలివాళ్లు బ్రదికి ఉంటారో ఉండరో? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడితే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
శ్రీ సురేశ్: నా అభిప్రాయం అచ్చుకు పంపిన కొంత సేపటికి నాది లిపివల్ల కనబడుతున్న రూపసామ్యం తెచ్చిన సందేహం గా మీరు గుర్తిస్తారని తోచింది. దీంతోపాటు, శ్రీ సునీతి కుమార్ ఛటర్జీ పరమపదించిన తరుణాన ఆయన గురించి ఒక తెలుగు పత్రికలో వచ్చిన వ్యాసంలో , శ్రీ ఛటర్జీ ‘చారల మెకము’ అన్న పదమే ‘శార్దూలము’ గా రూపొందినదని అన్నారని చదవడం గుర్తు రావడం తొ ద్రావిడ పదాలనుంచి సంస్కృత శబ్దాలు రావన్న రూఢి లేదేమోనని అనిపించి, ఈ సందర్భంలో ఈవిషయం కూడా మీతో ప్రస్తావించ వచ్చునని మీనించి సమాధానం వచ్చేదాకా ఊరుకున్నాను.
నేల శబ్దానికి మూలద్రావిడ ధాతువు -*ఞాల శబ్దమని భాషావేత్తల అభిప్రాయం. — సురేశ్ కొలిచాల
‘ఇల’ కూడా ఇలా వచ్చిందేనేమో ననిపిస్తొంది — తః తః
తెలుగు లిపిలో రాయడంలో -*ఞాల (ñāla) ‘ఇల’ (ila) దాదాపు ఒకే రకంగా కనిపిస్తాయి. ఈ రూపసామ్యం తప్ప ఞాల నుండి ఇల అన్న శబ్దాన్ని నిష్పన్నం చేయడానికి వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
నాకు తెలిసి ñā > i ద్రావిడ భాషలలో ఎక్కడ కనిపించదు. అదీకాక, ‘ఇల’ శబ్దం తత్సమమని (‘ఇలా’ శబ్దానికి సమమని) నిఘంటువులు పేర్కొంటాయి. ఋగ్వేదంలో ‘ఇలా/ఇళా’దేవిని అగ్నితో సమానంగా ప్రాచీన దేవతగా పూజించడం కనిపిస్తుంది:
వలస పాలన, సంస్కృతి: నారాయణ రావు గారి ఆలోచనలు కొన్ని గురించి Halley అభిప్రాయం:
02/06/2013 11:22 am
వలస పాలన సంస్కృతి అనే విషయం పై నారాయణ రావు గారి ఆలోచనలను మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. మీ పూర్వపరాలను పాఠకులతో పంచుకున్నందున మీ పరిచయానికి ఒక రకమైన నిండుతనం వచ్చినట్టు అనిపించింది.
గాథాసప్తశతి శతకం గురించి Mothiki kumara Ganesh అభిప్రాయం:
02/06/2013 4:26 am
భావాలను కూడా తెలుగులొ ఇస్తే ఇంకా ఎక్కువగా అనంద పడే వాళ్ళం.
వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి మోహన అభిప్రాయం:
02/05/2013 6:45 pm
ఒక వందకు పైగా పద్యాలు గ్రంథాలయములో గాథాసప్తశతి శతకం అనే చోట ఉన్నది. మిగిలినవి కూడ అనువదిస్తున్నాను. వీలైనప్పుడు అవి కూడ ప్రచురింపబడుతాయి. విధేయుడు – మోహన
వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) గురించి Mangu Siva Ram Prasad అభిప్రాయం:
02/05/2013 12:35 pm
హాలుని గాథా సప్తశతి లోని పద్యాలకు సంస్కృత, తెలుగు అనువాదాలతో బాటు ఇంగ్లిష్ వ్యాఖ్యానం కూడా ఇవ్వడం ముదావహం. జె. కృష్ణ మోహన్ గారి కృషి ప్రశంసనీయం. ఈ పద్యాలన్ని ఒక చోట చదువుకో గలిగితే బాగుంటుంది.
అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి Prasad అభిప్రాయం:
02/04/2013 11:41 pm
అయ్యా,
దేవరకొండ తిలక్ గారి గురించి google సెర్చ్ చేస్తూంటే ఈ వ్యాసం తారసపడింది.
చాలా బాగా వ్రాశారు.
I have been living in Atlanta for the last 20 years. I might have seen you.
This was beautifully written…
Appreciate the opportunity to read …
Prasad
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి మోహన అభిప్రాయం:
02/04/2013 11:18 am
ఆర్యా, స్పందించవచ్చును, కాని పది పన్నెండు సంవత్సరాల తరువాత స్పందిస్తే పునః స్పందించడానికి నాలాటి ముసలివాళ్లు బ్రదికి ఉంటారో ఉండరో? ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటి కా మాటలాడితే బాగుంటుందేమో? విధేయుడు – మోహన
ఘంటసాల గొంతులో జీవించిన ఉదయశ్రీ పద్యాలు గురించి Dr.Madhusudana Rao Pola అభిప్రాయం:
02/04/2013 6:56 am
Dear Lakshmanna,
I am able to recall the days of our M.Sc when you used to enjoy singing these songs for us. It is a great work that you are doing to the society.
Keep doing, all the best
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి తః తః అభిప్రాయం:
02/04/2013 2:16 am
శ్రీ సురేశ్: నా అభిప్రాయం అచ్చుకు పంపిన కొంత సేపటికి నాది లిపివల్ల కనబడుతున్న రూపసామ్యం తెచ్చిన సందేహం గా మీరు గుర్తిస్తారని తోచింది. దీంతోపాటు, శ్రీ సునీతి కుమార్ ఛటర్జీ పరమపదించిన తరుణాన ఆయన గురించి ఒక తెలుగు పత్రికలో వచ్చిన వ్యాసంలో , శ్రీ ఛటర్జీ ‘చారల మెకము’ అన్న పదమే ‘శార్దూలము’ గా రూపొందినదని అన్నారని చదవడం గుర్తు రావడం తొ ద్రావిడ పదాలనుంచి సంస్కృత శబ్దాలు రావన్న రూఢి లేదేమోనని అనిపించి, ఈ సందర్భంలో ఈవిషయం కూడా మీతో ప్రస్తావించ వచ్చునని మీనించి సమాధానం వచ్చేదాకా ఊరుకున్నాను.
నమస్కారాలతో,
తః తః
ఈమాట జనవరి 2013 వెల్చేరు నారాయణ రావు విశేష సంచికకు స్వాగతం! గురించి Tirunaghari Udaya Kumar అభిప్రాయం:
02/03/2013 12:44 pm
సంపాదకులకు శుభాకాంక్షలు,
మధురమైన తెలుగులో రమణీయ సాహిత్యపు పరిమళాలు వెదజల్లుతున్న మీ కృషికి అభినందనలు.
తిరునఘరి ఉదయ కుమార్
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
02/02/2013 4:10 pm
తెలుగు లిపిలో రాయడంలో -*ఞాల (ñāla) ‘ఇల’ (ila) దాదాపు ఒకే రకంగా కనిపిస్తాయి. ఈ రూపసామ్యం తప్ప ఞాల నుండి ఇల అన్న శబ్దాన్ని నిష్పన్నం చేయడానికి వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా?
నాకు తెలిసి ñā > i ద్రావిడ భాషలలో ఎక్కడ కనిపించదు. అదీకాక, ‘ఇల’ శబ్దం తత్సమమని (‘ఇలా’ శబ్దానికి సమమని) నిఘంటువులు పేర్కొంటాయి. ఋగ్వేదంలో ‘ఇలా/ఇళా’దేవిని అగ్నితో సమానంగా ప్రాచీన దేవతగా పూజించడం కనిపిస్తుంది:
త్వామ్ అగ్నే ప్రథమమ్ ఆయుమ్ ఆయవే
దేవా అకృణ్వన్ నహుషస్య విశ్పతిమ్ |
ఇలామ్ అకృణ్వన్ మనుషస్య శాసనీమ్పి
తుర్ యత్ పుత్రో మమకస్య జాయతే || 1-31-11
‘ఇల’ మూల ద్రావిడ శబ్దం అనిగానీ, అది *ఞాల నుండి నిష్పాదన చెయ్యవచ్చని చెప్పడానికి గానీ ఏమైనా ఆధారాలు ఉంటే వివరించగలరు, తఃతః గారు.