పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/06/2013 6:05 pm

    మురళీధరరావుగారు,

    మీరు పై వ్యాసంపై వేరొక చోట వ్యాఖ్యానిస్తూ “అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు.” అని రాశారు.

    But what he wrote is this: “కాని 1868 సంవత్సరపు ప్రచురణ నాకు ప్రపంచంలో ఏ గ్రంథాలయంలోనూ దొరకలేదు.”

    He is referring to Vavilla/Adisaraswati’s edition, reported to have been published in 1868, not about any Sumati Satakam. And his distinction throughout the essay is between “Vavilla/Popular” and “Brown” editions. Perhaps Prof. VNR may comment himself, if he should happen to check this comments page.

    Well, we all know that C.P. Brown apparently published his edition in 1842 itself (and VNR mentions it as well!), but there is no copy of it came to light so far. Even a person like late ban.gO.re could not locate a copy of it.

    Regarding your reference to Barnett’s catalogue that work contains other verses as well. I can personally speak in detail about British Library Telugu collections, also the uncatalogued ones. But, I believe, its out of topic as the question is not about pre-1868 publications in which some verses from sumati Satakam appear.

    Regards,
    Sreenivas

  2. అర్జున గురించి Rao Vemuri అభిప్రాయం:

    03/06/2013 5:02 pm

    విస్తారంగా వాడుకలో లేదు కాని wild she buffalo ని అడవి గేదె అనొచ్చు. దున్న అన్నా దున్నపోతు అన్నా he buffalo. ఈ రెండింటికి స్త్రీ లింగం గేదె అన్న మాటే. కాని నుడికారం కోసం తాపత్రయం పడేటప్పుడు, సందర్భానికి భంగం రానప్పుడు “అడవి దున్న” అన్నంత మాత్రాన వచ్చే నష్టమూ లేదు. ఇది తునిలో పెరిగిన వాడి “రెండు దమ్మిడీల” అభిప్రాయం.

  3. అర్జున గురించి మోహన అభిప్రాయం:

    03/06/2013 4:25 pm

    The book siddhArtha is available from the gutenberg site.

    Regards! – mOhana

  4. అర్జున గురించి jayaprabha అభిప్రాయం:

    03/06/2013 3:41 pm

    ఇవాళ్టి దాకా జీవితంలో అబధ్ధం ఆడవలసిన అవసరం నాకు పడలేదు నాయనా! తగువు పెట్టుకోవడం వెనక ఒక అర్ధం లేనప్పుడు ఆ తగవుపడి నువ్వు సాధించేదేమిటీ అని. అది నీ విజ్ణతకే వదిలేస్తున్నాను. నేను సిద్దార్ధ చదవలేదు ఆ సినిమా కూడా చూడలేదు అని ఒకసారి సూటిగా జవాబుగా చెప్పాకా మళ్ళీ నువ్వు “నిజంగా మీరు చదవలేదా” అని రొక్కించడం లోనే నువ్వు మనుష్యుల్ని ఏమంతగా నమ్మవని అర్ధమవుతోంది. అలాంటప్పుడు నీకు తోచిన నిర్ణయాలకి నువ్వు రా! మళ్ళీ ప్రశ్నలెందుకూ? ఒకపక్క అమ్మ అని అంటున్నావు ఇంకోపక్క అనుమానంగా ప్రశ్నిస్తూ తగువు పడతానూ అని అంటున్నావు. మీ అమ్మని కూడా నువ్వు నమ్మవా ఏమి? సరే ఏది ఏమైనా మనుష్యులని గురించిన కధల్ని చదివి, మనిషిని దాటి చూడటం చేయాలి అని చెప్పడానికని చెట్టు కధని రాయాలన్న ప్రయత్నం చేశాను నేను. అది రాయడం వరకే నా బాధ్యత . దానిమీద వచ్చిన ప్రతి అభిప్రాయానికీ వివరణని ఇవ్వడం నా పని కాదు. మీకు నచ్చితే కధ ని చదివి ఆనందించండి. నచ్చలేదూ పక్కన పడేయండి. కొంపలేం అంటుకోవు. పొగడ్త తెగడ్త అని కాదు ఎవరు ఏ అభిప్రాయమైనా చెప్పవచ్చు. కధ అన్నది పబ్లిక్ డొమైన్లోకి వచ్చాకా అది ఎవరికి ఎలా అర్ధం అవుతుంది అన్న దాని మీద ఆ రచన చేసిన వాళ్లకి ఏ అదుపూ ఉండదు. పైగా నా రచనల మీద అనేక రకాలైన భావ స్పందనలని ఎరిగిన అనుభవం పుష్కళంగా ఉన్నదానినే గానీ విమర్శకి నేను కొత్త ఏమీ కాదు కూడానూ. కానీ నా పరిశీలన ఏమంటే దేని గురించైనా మాట్లాడాలీ అని అనుకునే ముందు ఆ విషయాన్ని గురించి కాస్త ఆలొచించుకుని మాట్లాడండి. అది పాఠకులుగా మీ పరిణితిని పెంచుతుంది. ఏదో ఒకటి మాట్లాడేద్దాం అని తొందర పడే కన్నా! అలాగే వీలున్నంత వరకూ మీ మీ పఠనానుభవాన్ని విశాలం చేసుకొనే ప్రయత్నం చేయండి. అది అత్యంత అవసరం. అనుభవం తక్కువగానూ ఆర్భాటం ఎక్కువగానూ ప్రదర్శించడం మీలాంటి యువతరానికి తగదు. సెలవు ఈ తరహా చర్చలనించి.

    జయప్రభ.

  5. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    03/06/2013 3:27 pm

    శ్రీనివాస్:

    ఎంత చక్కని గుర్తులున్నాయి మీకు పాలగుమ్మివారి మీద. నిజమే!

    ఈ తరంవారికి లలిత సంగీతం ఎంత తెలుసునో నాకు తెలియదు. అయితే, ఇటువంటి వ్యాసాల ద్వారా మనస్సుని హాయిపరచే సంగీతం అందరికీ మళ్ళీ పరిచయం చెయ్యటం ముఖ్యం.

    1970, 71 ప్రాంతాల్లో హైదరాబాదులో చదువుతున్న రామన్నా, నేనూ మీరు ఉదాహరించిన పాటలు తరచు పాడుకొనేవాళ్ళం. “రాలలోపల” పాట చిత్తరంజన్ గారు పాడగా “ఈ వారం పాట” గా నేర్చుకున్నట్టు గుర్తు! వేదవతీ ప్రభాకర్ పాడిన “అమ్మ దొంగా నిన్ను…”, బాలమురళీ పాడిన “భూధరమో…” పాటల సృష్టి కర్తగా పాలగుమ్మి వారికి వలసినంత పేరు రాలేదోమో! ఎటువంటి కీర్తికండూతికి, ఎంతో ప్రతిభ ఉండీ కూడా, లొంగని ఇటువంటి వ్యక్తులను మనం ఒక్కొక్కరినే మరిచిపోతున్న సమయంలో మీ నివాళి ఎంతో ప్రతిభ ఉన్న వ్యక్తిని మళ్ళీ గుర్తు చేసింది.

    పాలగుమ్మి విశ్వనాథ గారి మిత్రులు, శ్రేయోభిలాషులు వారి గుర్తుగా వెబ్‌ సైట్ అందరి కోసం ఉంచటం మనం అందరం ఎంతో సంతోషపడాల్సిన విషయం! ఆ వివరాలన్నీ ఉన్న మీ నివాళి సముచితం!

    మూర్తిరాజు గారు కండువాలో డబ్బు పట్టుకొచ్చి పాలగుమ్మివారికి ఇస్తూ, ” ఇప్పటి మన యువతకి మన దేశభక్తి గేయాలు పరిచయం చేయండి” అన్నారని అని తెసినప్పుడు కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. అర్జున గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    03/06/2013 3:01 pm

    జయప్రభ గారు:

    చాలా బాగా వ్రాసారు!

    చదువుతుంటే కలిగిన ఆలోచనలకి ఉక్కిరిబిక్కిరి అయ్యాను.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. అర్జున గురించి ravikiran అభిప్రాయం:

    03/06/2013 2:43 pm

    “మీ కోపం లోనే బలం లేనప్పుడు దాని వ్యక్తీకరణలో మాత్రం బలం ఏముంటుందీ?”

    జయప్రభ గారు – మీ ముందర నేనేవిటటండీ, తెలుగులో పి.హెచ్.డీ కాదు కానే కాదు. ఒక గొప్ప అద్భుతవైన రచయిత్రి మీరు. నేను ఒక సారి మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాట్లాడేను కదా. అబ్బా మాయమ్మ తో మాట్లాడినట్టే అనిపించిందండీ, సరే మాయమ్మతో కూడా తగువు పెట్టుకుంటాను నేను. మీతో మాత్రం ఎందుకు తగవు పెట్టుకోను, మీరు మాత్రం మాయమ్మ కాదా?

    కానీ, నేను ఒప్పుకోనండీ, మీరు “సిద్ధార్ధ” చదవకపోతే, ఇప్పుడు చదవండి. ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన రచయిత కదా హెర్మెన్ హెష్, నిజంగా మీకు తెలీదా చెప్పండి? సిద్దార్ధ మీకు నిజంగా తెలియదా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. అర్జున గురించి jayaprabha అభిప్రాయం:

    03/06/2013 1:25 pm

    రవికిరణ్, నేను ఒక రచయితగా నా కల్పనానుభవాన్ని చెప్పినప్పుడు దాన్ని కాదనే అర్హత ఎవరికీ ఉండదు. మీకు కూడా ఉండదు! నేను నా గురించి కదా చెబుతున్నాను. మీరు చెప్పినా నేను మాత్రం ఒప్పుకోను అని మీరంటే మీ వ్యాఖ్య మీద అసలు నా ప్రతిస్పందన అనవసరం అని మాత్రమే అనుకుంటాను. అది మీ సమస్య . మీ ఒప్పుదలతో నాకెలాంటి ప్రమేయమూ లేదు. నా గురించి నేను మాట్లాడే అర్హతా హక్కూ నాకుంటాయి. నా గురించి నా మనస్పందనల గురించీ ఎప్పుడైనా నేనే మాట్లాడాలి. పైగా నేను బతికి ఉన్నప్పుడు ఇంకానూ ! ఇది లౌకిక మర్యాద సాహిత్య మర్యాద కూడాను. దీనిని గౌరవించవలసిన బాధ్యత మీది. ఆ బాధ్యత మీకుందా లేదా అన్న దాని మీద నాకు ఆసక్తి కూడా లేదు.

    ఇంక మీరేదో “వంగపండు” “ఆకలి” వగైరా అంశాల మీద అవన్నీ ఒక్క మీకే తెలుసన్నట్టు గానో లేదా మీకేదో కాపీ రైట్ ప్రత్యేకంగా ఈ అంశాల మీద ఉన్నట్టు గానో మాట్లాడకండి. నాకు ఆకలిని గురించి తెలియదనీ వంగపండు పాటల సారాంశం తెలియదనీ ఈమాట పాఠకులకీ ఆకలిని గురించి ఏమీ తెలియదనీ మీరు చెప్పడం ఏమిటసలు? మీరెవరూ అలా చెప్పడానికీ? ఇంకా నయం మీకు పురుటి నొప్పులు కూడా తెలియవని నా గురించి మీరే చెప్పేసే వాళ్లలా ఉన్నారు చూడబోతే!!

    నేను ఇవాళ్టిదాకా ఆ సిద్ధార్ధ నవలనీ చదవలేదు. ఆ సినిమా కూడా చూడలేదు. అందువలన మీకు పోలికలు మరి ఏ రకంగా కనిపించేయో అన్నదాని మీద నాకు కుతూహలమే లేదు. “కడుపునిండిన” ” హిపోక్రసీ” లాంటి పదాలని వాడి మీరు మీ గురించి చెప్పుకోండి. నాకేం అభ్యంతరం లేదు. కానీ అందులో నన్ను కలపనఖ్ఖరలేదు. ఇతరులనీ అఖ్ఖరలేదు. మీరు ఒప్పుకుంటే ఇతరులకి సానుభూతి ఉన్నట్టు మీరు అంగీకరించకపోతే అది ఇతరులకెవరికీ లేనట్టు అర్ధం రాదు. మీగురించి మీరేమన్నా చెప్పుకోవచ్చు. కానీ అందరి మనస్తత్వ వ్యక్తిత్వాల విశ్లేషణకి మీరే పూచీ తీసుకోనఖ్ఖరలేదు.

    నేను ప్రసాద్ గారికి ఇచ్చిన జవాబుని మించి ఆ తరహా అభిప్రాయాల మీద ప్రత్యేకంగా చెప్పవలసినది మరేమీ లేదు కూడా! మీ కోపం లోనే బలం లేనప్పుడు దాని వ్యక్తీకరణలో మాత్రం బలం ఏముంటుందీ? తెచ్చుకోలు విప్లవ విశ్లేషణలు మీకు ఇష్టమేమో నాకు తెలీదు. అలాంటివి నాకు రావు. నాకు ఆసక్తి కూడా లేవు.

    జయప్రభ.

  9. Cathedral – కథ నచ్చిన కారణం గురించి Purnima అభిప్రాయం:

    03/06/2013 10:37 am

    ముందుగా తెలుగు కథలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషా కథలను కూడా ఈ శీర్షికన పరిచయం చేయబూనినందుకు అభినందనలు. అలా చేయడానికి మీకుగల కారణాలు నాకు బోధపడలేదు గాని.. (ఆ పాఠకులు ఎవరో, ఆ కథా రచయితలెవరో నాకు తెలీదు) ఇతర బాషా సాహిత్యం చదవడం చాలా అవసరమని నా గట్టి నమ్మకం.

    ఇహ పోతే, ఈ కథ నాకు చాలా నచ్చింది. ఒకటే సారి చదివాను. మళ్ళీ మళ్ళీ చదివించే గుణం ఉన్న కథ. నాకు అన్నింటి కన్నా కథ చెప్పేవాడి గురించి ఒక్క ముక్క కూడా నేరుగా చెప్పకుండా, అతడు ఇతరుల గురించి మాట్లాడే విధానం బట్టి అతగాడిని గురించి చాలా విషయాలు తెల్సుకునే వీలు కలిపించే నరేషన్ వాడారిందులో. ఆ పొడి పొడి వాక్యాలు, సజావుగా నడవని కథనం వల్ల కథకుడి మనస్తత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ముగింపు కూడా అక్కడిక్కడికి అతడికి కళ్ళు తెరుచుకొని, వెనకాల హోరున నేపధ్య సంగీతం వినిపిస్తే, కళ్ళెమ్మెట నీళ్ళు తుడుచుకొని.. అన్నట్టుగా కాకుండా, అట్లాంటి మనిషికి కలిగే చిన్న స్పందనతో ముగియటం భలే ఉంది. ఒక మంచి కథను పరిచయం చేసినందుకు మీకు థాంక్స్. మరిన్ని మంచి కథలు ఈ శీర్షికన వస్తాయని ఆశిస్తున్నాను.

  10. అర్జున గురించి ravikiran అభిప్రాయం:

    03/05/2013 3:38 pm

    జయప్రభ గారు,

    ఒక అద్భుతవైన ఎమోషనల్ స్టేటస్ కి తీసుకపోగలిగే శక్తి మీ రచనకి వుంది. అద్భుతంగా వ్రాశారు. అది కథా, కవితా? ఆ డిబేట్ అనవసరం, కానీ ప్రసాద్ గారి అభిప్రాయం నాకు చాలా బాగనిపించింది. మీ కథ (కవిత) చదువుతుంటే నేనెప్పుడో దాదాపు పాతికేళ్ళ క్రితం చదివిన ఒక నవలలో ఆ పది, ఇరవై పేజీలు మళ్ళా గుర్తుకి వస్తున్నాయి.

    హెర్మెన్ హెష్ వ్రాసిన “సిద్దార్ధ” ఆ నవల. బతుకులో అన్ని అనుభవాల్ని(?) చూసిన తర్వాత సిద్ధార్ధ ఒక పడవ నడిపే వాడిగా ఒక నది వడ్డున సెటిల్ అయిపోతాడు. ఆ నది తన హితిడు, స్నేహితుడు, గురువు. నదికి ప్రవహించడం తప్ప మాట్లాడటం తెలీదు కదా. ఇవి సిద్దార్ధుడి ఆలోచనలే, అవి తన అవగాహనే, అంటే అది హెర్మన్ హెష్ అలోచన, అవగాహనే. “చాలా సార్లు రచయిత కల్పనావరణాన్ని అతిక్రమిస్తాయి పాత్రలు. అన్నిసార్లూ రచయిత స్వతంత్రుడని / రాలు .. అని మాత్రం అనుకోబోకండి. అలా అంతా రచయిత స్చాధీనం లోంచే తయారయ్యే రచన ఉంటుందని చెప్పలేం కనీశం నావరకూ నేను అలా చెప్పలేను.” కాదండీ పాత్రలు ఎప్పుడూ రచయిత(త్రి) స్వాధీనం లోనే వుంటాయి, ఎందుకంటే అవి రచయిత(ఈ “త్రి “నేను వ్రాయలేను, నన్ను మన్నించండి) మనసులోనుంచే వస్తాయి. ముఖ్యంగా ఇలాటి మ్యూజింగ్స్ తరహా రచనలు. సిద్ధార్దుడి ఆ నది హెర్మెన్ హెష్, ఈ అర్జున జయప్రభ గారే.

    ఆ పది, ఇరవై పేజీల్లో హెర్మెన్ హెష్ ఒక గొప్ప ఫిలాసఫీని ఆవిష్కరిస్తాడు, మీ ఈ కథలో లాగే (But in his novel there is no demarcation and discrimination that is so obvious in your story as noted by Mr. Prasad). మీ కథ ఆ పది, ఇరవై పేజీలకి అనుకరణలాగా నాకనిపించింది. ఒకవేళ నేను తప్పయి వుండొచ్చు జయప్రభగారు, కానీ నేను చదివింది, నా మనసుకి అనిపించిన ఆ అనుభూతి నాకు తెలుసుకదా. బహుశా, ఒక్క భాష మాత్రవే కాకుండా, నాలుగు బతుకుల్ని కూడా చూసిన గొప్ప రచయితలకి కొంచం సిమిలర్ ఆలోచనలే వస్తాయేవో, ఏవో నాకు తెలీదు.

    ఏం పిల్డో ఎల్ఎల్దమొస్తవా కలకత్తా కొస కారు కొండకి
    ఏం పిల్డో ఎల్దమొస్తవా, సిలకలు కత్తులు దులపరిస్తయట

    ఆయనకి పులి మీద కోపం, కాకపోతే పొట్టేలు మీద ప్రేమ కాదండీ. బతుకుమీద ప్రేమ, అవగాహన. నిజవే మనకు కూడా బతుకు మీద ఆ ప్రేమ, అవగాహన వుంది. కానీ మన బతుకుకు, వంగపండు గారి బతుకు వేరే అండీ. అసలేవిటి, ఈ ఆకలి ఏవిటి తెలుసుకోవాలని నేను ఒక మూడు రోజులు నిజంగానే ఒక్క మంచి నీళ్ళు తప్ప అసల ఏవీ తినటం మానేసేను, కానీ మూడో రోజు నాకు అర్థవయ్యింది. సరే ఇప్పుడు నేను కావాలనుకుంటే నాకు కడుపునిండా నాకు కావాల్సిన భోజనం దొరుకుతుంది. ఆకలంటే, ఆకలంటే, నాకు కావాలనుకున్నప్పుడు అది దొరంకందే ఆకలి. వెంటనే మానేసేను నా నిరాహార ధీక్ష. నాకెప్పటికీ ఆ ఆకలనే నిజం తెలియదు, నిజంగా తెలియదు. ఇంతకు ముందు నాకు తెలీదు, ఇక ఇప్పుడు బహుశా నాకు తెలీదు (తెలిస్తే బాగుండు). మనందరికీ మంట కాలుతుందని తెలుసు, కానీ మనం ఎప్పుడూ, మనం ఎప్పుడూ ఆ మంట మీద చెయ్యి పెట్టి, చెయ్యి కాల్చుకున్నవాళ్ళం కాదు. మనవి కడుపు నిండిన బతుకులండీ. మనకేవి తెలుసు ఆ పావు, ఆ పులి, ఆ పిట్ట, ఆ చేప ఆకలి?

    వంగపండు గారు సరే ఆయన ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి గారి మీద పాటలు వ్రాసుండొచ్చు. కానీ ఆ “ఏం పిల్డో” పాటలో ఆయన మీరు చెప్పని, మనకు తెలియని ఒక బతుకుని చెబుతున్నాడు. ఒక టోటల్ గా వేరైన ఒక ఫిలాసఫీని చెబుతున్నాడు. అది, మీరు, హెర్మన్ హెష్ గారు చెప్పిన కడుపునిండిన ఫిలాసొఫీ కాదు. అది నది, అర్జున చెట్టు కాదు, అది మనిషి, కడుపు నిండని ఆకలితో వున్న మనిషి. కలకత్తా కొస కారు కొండలో సిలకలు కత్తులు దులపరిస్తయట, అదొక ఆశ, బతుకు కోసం ఒక ఆశ, మెరుగైన బతుక్కోసం ఒక కంప్లీట్ గా టోటల్ గా మీరు చెప్పేదానికి ఒక డిఫెరెంట్ ఫిలోసఫీ. దానికి భాషకి సంబధం లేదు. అది ఆకలిలోనించి, అవమానం లో నించి, నాకొక మామూలు బతుకు కావాల, నా పెళ్ళాం రొమ్ముల్లో నా బిడ్డకి పాలే కాదు, మా ఇంటి చట్టిలో నా బిడ్డకి నాలుగు మెతుకులు కూడా కావాల అనే ఫిలాసఫీ.

    ఆకలి మీకు, నాకు, ఈ ఈమాట పాఠకులకి ఎలా తెలుస్తుందండీ, చెప్పండి పోనీ మీరే. మంచిది, మన కడుపు నిండిన మన హిపాక్రసీ లో మనం మనకున్న ఈ భాషా పాండిత్యాన్ని పండించుకుందాం. బాగుంది నా కడుపునిండిన నా మనసుకి మీ కథ, కవితా అద్భుతంగా నచ్చింది.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి