పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి నూతక్కి రాఘవేంద్ర రావు అభిప్రాయం:

    03/08/2013 5:21 am

    మార్చి 2013 సంచికలొ శ్రీ జాన్ హైడ్ కనుమూరి గారి కవిత “క్షణికమైన భయం మాటున ఒదిగి” చదివాను. గొప్ప సందేశాన్ని చూసాను. చక్కని కవితను ప్రచురించిన సంపాదకులకు ధన్యవాదాలు. “అబద్ధం నిబద్ధతతొ చెప్పేవాడికి సత్యం ఒక సాకుగా వినిపిస్తుంది. అబద్ధం ఒకోసారి అందంగానూ నిజం నిష్టూరంగాను వున్నా సత్యం సత్యమే ఎన్నటికి. కవిత భవ్యం. సమాజానికొ భావ్యతనందిస్తూ… ఎక్కడనుండి వూరతాయండీ మీకీ యోచనలు ?

    అభినందనలు డియర్ జాన్ హైడ్ కనుమూరి

    ..శ్రేయోభిలాషి …

  2. Cathedral – కథ నచ్చిన కారణం గురించి jayaprabha అభిప్రాయం:

    03/08/2013 12:48 am

    వెల్ వేలూరీ! మీరు చెప్పిన నవలని నేను చదవ లేదు. చదవగల వీలుంటుందో లేదో కూడా తెలీదు. ఆల్పాచినో సినిమా “సెంట్ ఆఫ్ ఎ ఉమెన్” మాత్రం నాకిష్టం. నాకు కలిగిన ఇతర అభిప్రాయాలు ఊరికే కలగలేదని మాత్రం గ్రహించండి.

    జేపీ

  3. అర్జున గురించి jayaprabha అభిప్రాయం:

    03/08/2013 12:42 am

    రవికిరణ్, నన్ను అమ్మా! అని మీరు సంబోధించడం నాకు గౌరవ కారణమే! పైన ఉన్న వెటకారపు అభిప్రాయానికి మీరు ఇబ్బంది పడకండి. మనుష్యులకి ఎక్కడ హుందాతనాన్ని పాటించాలో ఎక్కడ సంయమనాన్ని చూపించాలో కూడ తెలియని రోజులివి. చర్చ ఒక ప్రయోజనానికి దారి తీసేది అయితే మంచిదే! కానీ ఎటో పోయి అసలు రచనకి హాని చేసేదిగా ఉండ కూడదని మాత్రం కోరుకుంటాను. అదే లేకపోతే తొట్టెనీళ్ళతో పాటు బిడ్దనీ పారబోసుకోవడమే అవుతుంది. అలా చాలా సార్లు జరగడం నాకు తెలుసును కూడా ఆ జాగ్రత్తకీ అజాగ్రత్తకీ మధ్య ఉన్న విభజన రేఖని పాటించడమే ఎవరైనా చేయదగ్గ పని మరి. ఉంటాను. థాంక్యూ!

    జయప్రభ.

  4. Cathedral – కథ నచ్చిన కారణం గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/07/2013 8:12 pm

    మీ చట్రం – నా చట్రం

    “జయప్రభా!” అన్న కేక వినగానే, శంకరాభరణం సోమయాజులు గారి, “శారదా!” అన్న కేక గుర్తొచ్చి, ఒక్క సారిగా హడలి పోయాను. ఆ తర్వాత, ఆ కేక, “వేలూరీ” అన్న జయప్రభ గారి కేకకి ప్రతి కేక అని అర్థం అయి, సరదా పుట్టింది. అప్పుడప్పుడు, ఇలాంటి, “కేకా-ప్రతి కేకా” లాంటివి వుంటే, చదవడానికి సరదాగా వుంటుంది. బాగుంది, బాగుంది.

    అయినా ఈ వ్యాఖ్య, కేకల గురించి కాదు. చట్రాల గురించి. 🙂 🙂

    వేలూరి గారు, ” అలాగే, అర్జున ‘కథ’ని చదివి ఆనందించడానికి కూడా చట్రం లోనుంచి బయటపడవలసిన అవసరం ఉన్నది కదూ!” అని అన్నారు. ఈ కధ చదివి, ఆనందించని నా లాంటి వాళ్ళకి, ఈ వాక్యం ఇలా వినబడింది: “మీరు ఓ చట్రంలో నిలబడి చదువుతున్నారూ, అందుకే ఈ కధని ఆనందించ లేక పోయారూ, ఆ చట్రం లోంచి బయటకి వస్తే, ఈ కధని ఆనందించగలుగుతారూ” అని.

    ఓ పెద్దాయన, వర్గాలుగా విడిపోయిన సమాజం లోని ప్రతీ మనిషీ, ఏదో ఒక చట్రంలో వుంటూ, ఏదో ఒక వర్గ ప్రయోజనాలకి అనుగుణంగా వుంటున్నాడూ అని అన్నారు. ఈ మాటలతో నేను ఏకీభవిస్తాను. ఆ మాటల ప్రకారం, ప్రతీ పాఠకుడూ ఏదో ఒక చట్రంలోనే వుండి, రచనలని చదువుతున్నాడు. చట్రంలో లేని పాఠకుడనే వాడు లేనే లేడు. ప్రతీ చట్రం ఏదో ఒక వర్గ ప్రయోజనానికి అనుగుణంగా వుంటుంది. అప్పుడు, ఇది, “మీ చట్రం గొప్పదా? మా చట్రం గొప్పదా?” అనే వివాదం లోకి దిగుతుంది.

    ఒక రచనని ఒక పాఠకుడు ఇలాగే చదవాలీ అని అనడానికి ఎవరికీ హక్కు లేదు. అది ఆ పాఠకుడు తన చైతన్యాన్ని బట్టి నిర్ణయించుకుంటాడు. తనకు కలిగిన భావనలని బయటకి వెలిబుచ్చడానికి ఒక రచయితకి ఎలాంటి హక్కు వుంటుందో, ఒక పాఠకుడికి కూడా ఆ రచన మీద తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి హక్కు వుంటుంది. నచ్చితేనే చదువు, లేకపోతే వదిలెయ్యి అని అనడానికి ఎవరికీ హక్కు లేదు. ఆ విషయం పాఠకుడే తేల్చుకుంటాడు. చదివాక, తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాలా, లేదా అని కూడా ఆ పాఠకుడే తేల్చుకుంటాడు. అప్పుడా రచయిత, ఆ అభిప్రాయం నించీ తీసుకోవాల్సింది ఏమన్నా వుంటే తీసుకుంటాడు, లేదా బదులు జవాబు ఇస్తాడు, లేదా పట్టించు కోకుండా వదిలేస్తాడు. అప్పుడేం చెయ్యాలీ అనేది ఆ రచయిత ఇష్టం. “నువ్వు ఫలానా విధంగానే రచనలు చెయ్యి” అని రచయితని అనడానికి పాఠకుడికి ఎలా హక్కు లేదో, “నువ్వు ఫలానా రచనని ఫలానా విధంగా చదువు” అని పాఠకుడిని అనడానికి, రచయితకి గానీ, ఆ రచన సమర్థకులకి గానీ అలాగే హక్కు లేదు. కాబట్టి, నువ్వీ రచన ఫలానా చట్రం లోంచి చదువూ, అప్పుడే నీకు ఆనందం కలుగుతుందీ అని అనడంలో నిరంకుశత్వం తప్ప, వేరేది ఏదీ లేదు. ఏ చట్రం గొప్పదో ఎవరు తేలుస్తారూ? ఎలా తేలుస్తారూ? చివరికి ఇది ఒక దెబ్బలాట అవుతుంది తప్ప, ఒక చర్చ అవదు, ఇలాంటి మాటల్తో.

    మొత్తానికి చెప్పొచ్చేదేమంటే, చర్చ లోకి ఇలాంటి చట్రాల గోల తీసుకు రాకూడదు. ఒక రచనతో అన్ని రకాల పాఠకులనీ ఆనందింప జేయలేం. పాఠకులు వాళ్ళ వాళ్ళ చైతన్యంతో వాళ్ళ అభిప్రాయాలు తెలియ జేస్తారు. వీలైతే జవాబు ఇవ్వడం, లేదా వూరుకోవడం. లేక పోతే, వేలూరి గారు చెప్పినట్టే, “మాటకి మాట తెగులు; నీటికి నాచుతెగులు” అవుతుంది. శృతి మీరి నప్పుడు, ఎడిట్ చెయ్యడానికి ఈ మాట సంపాదకత్వం ఎలాగూ వుంది కదా?

    ప్రసాద్

  5. Cathedral – కథ నచ్చిన కారణం గురించి V R Veluri అభిప్రాయం:

    03/07/2013 5:30 pm

    జయప్రభా!

    మాటకి మాట తెగులు; నీటికి నాచుతెగులు అని మీకు తెలుసు. నాకూ తెలుసు. వాక్యానికీ వాక్యానికీ మధ్యలో చూడటం మొదలుపెడితే రాసినవి కనిపించకపోవచ్చు; చెప్పనివి వినిపించవచ్చు. నేను కార్వర్ కథని గురించి చెపుతూ పాఠకులకి సూచించినది, కొన్ని కథలు (నవలలు, కవితలు, నాటకాలూ కూడా!), చట్రం లోనుంచి బయటికొచ్చి చదవవలసిన అవసరం ఉన్నదని, దానికి ఓర్పు, అభ్యాసం కావాలని. ఈ సూచన డయాస్పోరా రచయితలను చదవడానికి వర్తిస్తుందని అన్నాను. తెలుగు “రచయిత”లకి నేనే సూచనలూ చేయలేదు. తెలుగు దేశంలో ప్రపంచ సాహిత్యం చదువుకున్న వాళ్ళు లేరని నేను అనలేదు. సరే! నీతిబోధలు చెయ్యనూ లేదు. ఇకపోతే, నా ‘ధోరణి’ గురించీ, ఈమాట ‘ధోరణి’ గురించీ మీరు రాసిన విషయాలు మీ వ్యక్తిగత అబిప్రాయాలు. Amen!

    హోసే సారమాగో (Jose Saramago) Blindness నవల గురించి మీకు తెలిసే వుంటుంది. ఆ నవల చట్రంలోచి బయటికొచ్చి చదవాల్సిన నవల అని మీకు గుర్తు చేస్తున్నాను. నిజం చెప్పాలంటే, సారమాగో నవలలన్నీ అటువంటివే! అలాగే, అర్జున ‘కథ’ని చదివి ఆనందించడానికి కూడా చట్రం లోనుంచి బయటపడవలసిన అవసరం ఉన్నది కదూ!

    విధేయుడు — వేలూరి వేంకటేశ్వర రావు

  6. కొత్త మలుపు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/07/2013 4:35 pm

    సంవత్సరం పైగా ప్రేమించినవాడికి ఇంట్లో ముందుగా చెప్పాలన్న సంస్కారం ఉండదు.

    నిజమే! చాలా మంది పిల్లలు తమ ప్రేమ విషయాలు ఇంట్లో తొందరగా చెప్పరు. చాలా కారణాలు వుంటాయి.

    1. తమ ప్రేమ స్థిరమైనదా, కాదా అన్న సంగతి వారికే ఇంకా పూర్తిగా తెలియక పోవడం.
    2. ఇంట్లో వాళ్ళతో ఏదో ప్రేమా, గట్రా వున్నా, వారితో సరైన స్నేహం లేక పోవడం.
    3. పిల్లలు తమ ప్రేమ విషయం పూర్తిగా తమ స్వంత విషయం అనుకోవడం.

    ఇలా, చాలా కారణాలున్నాయి. ఎక్కువ కేసుల్లోని విషయాన్ని చూస్తే, ఆ పిల్లలకి ఇంట్లో వాళ్ళతో సరైన స్నేహం లేకపోవడం అసలు కారణం. ఇది పిల్లలు సరిగా లేక పోవడం వల్లా కావొచ్చు, పెద్ద వాళ్ళు సరిగా లేక పోవడం వల్లా కావొచ్చు. ముఖ్యంగా తల్లీదండ్రుల మధ్య సయోధ్య లేని కుటుంబాల్లో స్నేహం వుండదు. పిల్లలు ఎప్పటికో గానీ తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పరు. సంస్కారం లేక పోవడం అసలు కారణం కాదు.

    ఈ కధలో కొడుకు చాలా సంస్కారవంతంగా ప్రవర్తించాడు నిజానికి. తల్లి విషయం లోనూ, ఇష్ట పడ్డ యువతి విషయం లోనూ, ఆ అమ్మాయి తల్లిదండ్రుల విషయం లోనూ, చాలా సంస్కారవంతంగా ప్రవర్తించాడు. చెడ్డ తండ్రి సరిగా ప్రవర్తించనప్పుడు కూడా చాలా కాలం సహనం చూపాడు. ఆ చెత్త తండ్రి లేక పోయినా, ఆ కొడుకు తన ప్రేమ విషయం ఇంట్లో తల్లికి అంత తొందరగా చెప్పి వుండే వాడు కాదు. కారణం, తల్లి మీద ఎంతో ప్రేమ వున్నా, ఆవిడతో స్నేహం లేక పోవడమే. “అమ్మా, ఫలానా అమ్మాయి అంటే నా కిష్టం” అని కొడుకు, తన మనసులో ప్రేమ మొగ్గ తొడిగినప్పుడే చెప్పాలంటే, తల్లి మీద వుండే ప్రేమ చాలదు. మంచి స్నేహం కూడా కావాలి.

    ఎంత సేపటికీ తిరుగుబాటే సమాధానం అని అంగీకరిస్తే అన్ని ఇళ్ళూ ఈ విధంగా కూలిపోవటమే సమాధానం.

    తుమ్మితే, చీదితే వూడి పోయే ముక్కు వుంటే ఎంతా, వూడితే ఎంతా? ఈ విధంగా వున్న ఇళ్ళు, ఈ విధంగా కూలిపోవడమే చాలా మంచిది. అప్పుడైనా మంచి ఇళ్ళు రావడానికి అవకాశం వుంటుంది. నిజానికి, “ఎంత సేపటికీ చెత్త పరిస్థితులకి తిరుగుబాటే సమాధానం” అన్నది చాలా కరెక్టు. చెత్త మనుషులు ఎప్పటికీ మారరు. “ఊహ” కోసమనీ, “గొప్ప పాజిటివ్‌నెస్‌ ” కోసమనీ, ఏదో “మంచి నిర్మాణాత్మకత” కోసమనీ, లొంగుబాటుని నేర్పితే, సమాజం ఈ నాటికి ఈ స్థితికి వచ్చి వుండేది కాదు. సమాజంలో ప్రతీ మంచి మార్పూ తిరుగుబాటు వల్లే వచ్చిందని గ్రహించాలి, సమాజ చరిత్రని పరిశీలించి.

    ఒక సమస్య తర తరాలుగా వుంటూనే వున్నప్పుడు, ఆ సమస్య మీద కధలూ, వ్యాసాలూ, కవితలూ, వగైరా వస్తూనే వుండటం చాలా మంచి విషయం సమాజానికి. ఎప్పుడో ఒక సారి చెప్పేశాము కదా అని, పరిష్కార మవ్వని సమస్యలని కూడా వదిలెయ్యక్కర లేదు. అలా చెబుతూ, చెబుతూ, చెబుతూ వున్నప్పుడే, కొంత మంది బుర్రల్లోకి నెమ్మదిగా, నెమ్మదిగా, నెమ్మదిగా ఎక్కుతూ వుంటుంది. ఎప్పటికో వారు తిరగబడటం నేర్చుకుంటారు.

    సామరస్యంగా సమస్యలని పరిష్కరించడం అనేది మూడు గంటల సినిమా లోనే సాధ్యం, నిజ జీవితంలో కాదు. చెత్త మనుషుల్ని ఎవరూ బాగు చెయ్య లేదు. వారిని వదిలి పెట్టడమే తక్షణ కర్తవ్యం.

    ప్రసాద్

  7. అర్జున గురించి ravikiran అభిప్రాయం:

    03/07/2013 2:14 pm

    “ఇద్దరు రచయితలు ఒకరికొకరు తెలియకుండా ఒకర్ని మరొకరు చదవకుండా ఒకలాంటి ప్రేరణ పొందటం అంత అసాధ్యమేమీ కాదని నాకు అన్నమయ్య సాహిత్యం చెప్పింది.” అదేకదండీ నేను కూడా చెప్పేను.
    మీరంటే నాకు గొప్ప గౌరవం, ఒకవేళ నేను తప్పుగా వ్రాసి వుంటే నన్ను క్షమించండి. ఏదో తెలిసీ తెలియని వ్రాతలు.

    -రవికిరణ్

  8. అర్జున గురించి indira అభిప్రాయం:

    03/07/2013 10:33 am

    రవి కిరణ్ గారు:

    మన అమ్మని మాత్రమే అమ్మా అని పిలువవలె. పర స్త్రీ ని అమ్మా అని పిలచుట ఏల? వగచుట ఏల?

    అడుగకూడని ప్రశ్న అడిగితిరి. మహా మహా కొమ్ములు తిరిగిన రచయితలను రచయిత్రులను మీరు ఇది చదివారా అది చదివారా అని అడుగరాదు రవి కిరణ్ గారు. వారు రాసిందేదో కళ్ళకద్దుకొని చదువుకొనవలె. అంత వరకే 🙂

    కామెంట్ల మీద కామెంట్లు ఈ విధముగా ఇక్కడ పుడుతూనే ఉంటవి. మీ శక్తియుక్తులని ఇక్కడ వృధా చేసికొనక మీ కాలాన్ని సద్వినియోగము చేసికొందురు గాక.

    ఆల్ ది బెస్టు. 🙂

    ఇందిర.

  9. అర్జున గురించి jayaprabha అభిప్రాయం:

    03/07/2013 1:49 am

    పోనివ్వండి దానికేమి. నేను పాపులారిటీ వచ్చింది కదా అనో నోబుల్ ప్రైజ్ వచ్చింది కదా అనో ఒక రచయితని చదవను. నా మనసుకి నా సమయానికీ అనువుగా ఉన్నప్పుడు మాత్రమే నేను నాకు తోచిన పుస్తకాన్ని ఎంపిక చేసుకుని చదువుకునేది. చదివేవి ఎన్ని ఉంటాయో చదవనివీ అన్ని ఉంటాయి. ప్రపంచంలో వచ్చిన పుస్తకాల రచయితల లిస్టు మీద నాకు ఆసక్తి లేదు. ఒక రచయితని చదవక పోవడం నేరమూ పాపమూ ఏమీ కాదు. మీరు చెప్పేరు కదా అని కూడా నేను పోయి ఆత్రంగా ఇప్పుడు సిద్దార్ధ చదవను. కల్పనలో ఎప్పుడైనా నా మార్గం నాది. ఇంక పోలికలన్నవి యాదృచ్చికమే అవుతాయి.

    నేను అన్నమయ్యనీ ముందు చదవలేదు. కానీ నా ప్రేమ పద్యాలు రాసిన మరో ఇరవై ఏళ్ల తరవాత కాబోలు నేను అన్నమయ్యని చదివితే ఆయన శృంగార సంకీర్తనలలో నేను నా లవ్ పోయెంస్ లో చేసిన పోలికల లాంటివే కనిపించినప్పుడు నేను వింత పడి ఆయన సంకీర్తనా సాహిత్యం లోకి దూకి ఒక పదేళ్ళు ఈదులాడి మునిగి లేచేను. అందరూ స్వామి పుష్కరిణి స్నానం చేస్తారేమో గానీ నేను అన్నమయ్య అక్షర స్నానం చేశాను 🙂

    ఇద్దరు రచయితలు ఒకరికొకరు తెలియకుండా ఒకర్ని మరొకరు చదవకుండా ఒకలాంటి ప్రేరణ పొందటం అంత అసాధ్యమేమీ కాదని నాకు అన్నమయ్య సాహిత్యం చెప్పింది. అన్నమయ్య పదాన్ని జీవిత కాలంలో ఏమీ అంటని శ్రీ శ్రీ “మానవుడా!” అన్న గేయం రాసేడు. నేను మీలాగా అన్నమయ్యని శ్రీ శ్రీ అనుకరించేడు అని అనలేదు. నాకు నేను అనుకోనూ లేదు. కానీ విస్తుపోయేను. భిన్న కాలాలకి చెందిన ఇద్దరు కవులు ఒకరికొకరు ఏమి రాసిందీ తెలియకుండానే ఒకటె విషయం మీద ఒక్కలా ఎలా స్పందించేరా అని. అది మామూలు విషయం కాదు నాకు. ఒక అద్భుతం. అంతే! అద్భుతాలు జరుగుతాయి అని మాత్రం నాకు అనుభవపూర్వకంగా ఇదివరకే తెలుసు.

    జయప్రభ.

  10. అర్జున గురించి ravikiran అభిప్రాయం:

    03/06/2013 11:01 pm

    ఆత్మీయతో కూడిన గౌరవం తో మిమ్మలని మా అమ్మతో పోల్చాను. బహుశా నాదే తప్పు. ఇక్కడ మీరు రచయిత్రి, నేను పాఠకుడిని. మీకు మీ రచన మీద ఎంత స్వాతంత్రం వుందో, నాకు నా అభిప్రాయం మీద కూడా అంత స్వాతంత్రం వుంది.

    అయ్యయ్యో, ఏదో తెలుగు సరిగ్గా తెలీక నేను వ్రాశానేవో, రొక్కించటం ఏవీ లేదండి, మీరు అబద్దం చెబుతున్నారని నా ఉద్దేశం కాదండి. కానీ మీరు “సిద్ధార్ద” చదవకపోవడం నా తప్పు కాదు. నేను చదివేను కాబట్టి చెబుతున్నాను. కానీ ఇప్పటికి కూడా నేను నా మాట మీద నిలబడుతున్నాను. మీరు చదవకపోతే, కనీసం ఇప్పుడన్నా చదవండి. మీకంటే ముందర ఆయన వ్రాశాడు కదా, అందుకే.

    ఇక వంగపండు గారి గురించి మీరే డోర్ ఓపెన్ చేసేరు. తలుపు మీరు తీసిన తర్వాత ఎవరైనా ఎంత దూరవైనా పోగలరు.

    అనుకరణో కాదో, మీ కథ చాలా బాగుంది, ముందరే చెప్పేను కదా ఒక గొప్ప ఎమోషనల్ స్టేటస్ కి తీసుకపోయింది మీ కథ అని.
    -రవికిరణ్.