డి. వెంకటేశ్వర రావు గారు — మీ వ్యాఖ్య నన్ను నేను తిరిగి ఆలోచించేలా చేసింది. ….అసలు నేను ఏమి రాశాను అనే సందేహమూ కలిగింది.
“క్షణికమైన భయం మాటున వొదిగి” — అలా ఒదిగిన ఫ్లిప్ ఆప్ సెకన్ గురించిన ఆలోచన తీసుకున్నాను. ధర్మరాజు గాని, పేతురుగాని అబద్దం చెప్పిన తర్వాత ఏమయ్యింది? అనేది పాఠకుడిగా మీ స్థాయీ పఠనాసక్తిని బట్టి అర్థం చేసుకోవచ్చు. దానికి నా అభ్యంతరం ఏమీలేదు.
అడుగులు లిఖించే
అబద్ధాల చిట్టాకు కొలమానమెక్కడ?
భయం లేకుండా నిర్భయంగా
అడ్డొచ్చిన నీటి ప్రవాహాన్ని దాటాల్సిందే!
పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు కదా!
ఇలా విడివిడిగా చదవాలేమో!
ఎంతైనా … పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు.
స్పందనకు ధన్యవాదములు
ముందుగా, ఈ వ్యాసం నారాయణ రావు గారి ఇతర పరిశోధనల స్థాయికి చేరుకోలేదని నా అభిప్రాయం. మరీ నీరసంగా వున్న అనువాదం కూడ ఈ అభిప్రాయం కలగటానికి బాగానే దోహదం చేసిందనిపిస్తున్నది. మూలం చదవకుండా అంటున్న మాట ఇది. మూలం కూడ ఇదే స్థాయిలో వుంటే అనువాదకులకి క్షమాపణలు.
ఇకపోతే, జయప్రభ గారి అభిప్రాయంలో వున్న తర్కం కొంత వింతగా అనిపించి దాని గురించి రెండు మాటలు చెప్పదల్చుకున్నాను. నారా కాని, ఆరుద్ర కాని, మరొకరు గాని చేసేపని ఒక విషయం గురించిన సమాచారాన్ని వాళ్లకి అందుబాటులో వున్నంతవరకు కూలంకషంగా సేకరించి, నిశితంగా పరిశీలించి, వాళ్లు పరిశోధిస్తున్న సమస్యకి ఒక సిద్ధాంతాన్ని తయారుచెయ్యటం. సమర్థుడైన పరిశోధకుడు తన ఎదురుగా వున్న సమాచారాన్నంతటినీ వివరించేగలిగే విధంగా ఆ సిద్ధాంతాన్ని తీర్చిదిద్దుతాడు. కనక ఒకే సమాచారం అందుబాటులో వున్న పరిశోధకులంతా ఒకే సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం లేదా ఒకేరకమైన సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం అతార్కికం. సిద్ధాంతాలు కేవలం ఊహలే అనుకున్నా ఇద్దరు పరిశోధకుల ఊహలు ఒకటే కావు. అలాగే, ఊహ ఐనది ఏదైనా సరే సమానంగా అనుమానాస్పదం అనటం కూడ అతార్కికం.
ఈ వ్యాసంలో గాని, మరో దాన్లో గాని తను చెప్పేది “సత్యం”అని నారా ఎప్పుడూ అన్నారనుకోను, ఒక కొత్తకోణంలో చూస్తున్నట్టో లేక ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నట్టో తప్ప మరెవరికీ తెలియని కొత్త నిత్యసత్యాన్ని కనుక్కున్నానని ఆయన అనుకుంటారని నేననుకోను.
పాశ్చాత్యులకు ముందు గ్రంథసంస్కరణ ఎలా చేసేవారు అనేది ఆసక్తికరమైన ప్రశ్నే. ఐతే పాశ్చాత్యప్రభావం వల్ల వచ్చిన గ్రంథసంస్కరణ పద్ధతుల్లో లోపాల్ని ఎత్తిచూపటానికి అంతకుముందున్న పద్ధతులు విధిగా తెలిసితీరాలనటం సమంజసంగా కనిపించదు. చివరగా, ఒక విషయం గురించిన ఒక వ్యాసం దానికి సంబంధించిన అన్ని విషయాల్నీ స్పృశించి తీరాలని, అలా చెయ్యకపోతే అది లోపభూయిష్టమని ప్రతిపాదిస్తే, ఇక లోపభూయిష్టం కాని పరిశోధన లోకంలో ఉండనే వుండదు కదా !
ఒక మంచి వ్యాసాన్ని రాసినందుకు హనుమంతరావుగారిని అభినందించాలి. నా వరకూ చండిదాస్‌ని మించిన రచయిత, అనుక్షణికంని మించిన రచన తెలుగులొ ఇప్పటి వరకూ రాలేదు. చండీదాస్ అంతటి మహా రచయితని గుర్తుపెట్టుకోలేక పోవటం, ఆయనని సత్కరించుకోలేక పోవటం మన దురదృష్టం. ఇదే రచన వేరే భాషలో వచ్చుంటే ఏ బుకర్సో లేక నోబులో వచ్చుండేది. అయాన్ రాండ్ ఫౌంటెన్‌హెడ్‌తో పోల్చదగ్గ రచన.
అపరంజి గారు — ఏదో చెప్పబోతూ సగంలో ఆపేసినట్టు ఉన్నారు?
నూతక్కి రాఘవేంద్ర రావు గారు — స్పందనకు ధన్యవాదములు. ఎక్కడనుండి ఊరతాయో అనేది నాకూ సందేహం వస్తూవుంటుంది.
రేణుక అయోల గారు — చిన్న సవరణ. “తప్పదు కొన్ని సార్లు అబద్దాల వెన్నెల చూపించాలి. ” కాదు. “తప్పదు కొన్ని సార్లు అబద్దాల్ని వెన్నెలలో చూపించాలి.” అని సవరించాలేమో 🙂
పూర్ణిమ సిరి గారు — స్పందనకు ధన్యవాదములు. జీర్ణం కాకపోయినా నిజం నిజమేగా!
ఆధునిక భారతీయ చిత్రకళ లో నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన చిత్రకారుడు శ్రీ గణేష్ పైన్. ఆయన నిన్న కలకత్తాలో గుండెపోటుతో మరణించారు. ఆధునిక చిత్రకళలో గొప్పగా చెప్పుకోవలసిన చిత్రకారుడు ఆయన. సృజనలో ఆయనకి ధీటైన మరొకరు నాకు కనరాలేదింత వరకూ! గణేష్ పైన్ గారి మృతికి నా నివాళి.
వలస పాలనే లేకపోతే తెలుగులో అసలు “అచ్చు పుస్తకమే” లేదు. అంతకు ముందు అంటే బ్రౌన్ కి ముందు ఏదో ఒక పధ్ధతిలో అయినా తెలుగులో “పుస్తక పరిష్కరణ” ఉన్నదా, ఉంటే అది ఏ పధ్ధతిలో ఉండేదీ అన్న విషయాన్ని కనీసం ఒక ప్రశ్నగా కూడా ఈ వ్యాసం సంధించదు. అటువంటప్పుడు ఇంక “ప్రభావం” అన్న ఊహకి అసలు ఆస్కారం ఏదీ? ఆధునిక పధ్ధతులు అన్నీ ఆ వలస పాలకుల ప్రభావమే! ఈ వ్యాసం ప్రతిపాదించే అనేకానేక ఊహలతో సహా! అంటే మౌఖిక సుమతీ శతకం, లిఖిత సుమతీ శతకం వగైరా మాటలతో సహా! ఇంక పరిష్కరణ అన్నది పాశ్చాత్యుల పధ్ధతి అని మనం అనుకుంటే- తత్పూర్వపు తాటి ఆకుల ప్రతుల లేఖన విధానాల ని గురించిన “మనదైన” ఒక పధ్ధతి, దానిని గురించిన ఒక సమాచారం భిన్నమైనది ఏమన్నా మరొకటి మనముందు ఉన్నదా అన్నది మరో ప్రశ్న. అందువలన ఈ వలస పాలనకి ముందు మనదేశం లోని అమలులో ఉన్న ఆ “ఆధునికత” పూర్వాపరాలని గురించిన ఒక స్పస్టమైన ఊహని వ్యాసకర్త పాఠకుల ముందు ఉంచవలసి ఉంటుంది. కానీ ఆ దిశగా ఒక్క వాక్యం కూడా ఈ వ్యాసంలో లేదు. అయితే ఈ వ్యాసం చూసేక ఆరుద్రది ఒక లాంటి “నమ్మకం” అయితే వెల్చేరుది మరొకలాంటి “నమ్మకం” అని మాత్రమే అనుకోవాలి. సరి అయిన ఆకరాలు లేనప్పుడు ఎవరు చేసేవైనా ఊహలే అవుతాయి అవి నిరూపించబడేదాకా!
బ్రౌన్ దొర ఏ కారణంగా ఏ నమూనాని తన ముందు పెట్టుకుని తెలుగు గ్రంధాల అచ్చు పని దాని పరిష్కరణనీ చేపట్టినా ఆ పని చేసిన తెలుగు లేఖకులూ ఆ కొద్దిపాటి తెలుగు పండితులూ ఉన్న “బ్రౌన్ యూనివెర్సిటీ వే అంతకు ముందు తెలుగు లో ఏ కొందరికో అందుబాటులో ఉన్న గ్రంధాలని తెలుగు సమాజం ముందుకి తెచ్చిందన్నది ఒక వాస్తవం! ఆ పనిని తెల్ల దొరే చేశాడు గానీ అప్పటికి ఇంకా చెల్లా చెదురుగా తెలుగునేలని బుక్కుతున్న ఏ పిల్ల జమీందారూ చెయ్యలా! మనం ఎలాగైతే ఎడ్లబళ్లని వదిలి రైలు బళ్ల బాట పట్టామో ఆ “వలస పాలన” ఆధారం గానే తాటాకులమీంచి బ్రౌన్ దొర ముద్రింపించి ఇచ్చిన పుస్తకాన్నీ దొరకపుచ్చుకున్నాం. లేకపోతే ఏ సరస్వతీ మహలు లోనో మరోచోటనో లేదా ఏ కొందరి రాజుల సొంత గూళ్లలోనో చెదలు పట్టి ఉండేది పాత సాహిత్యం! మరి బ్రౌన్ “ఉధ్ధరించకపోయి ఉంటే” మరి ఎవరు వచ్చి ఉధ్ధరించి ఉండేవారో మనకి తెలీనప్పుడు తెలుగు వాళ్లకి బ్రౌన్ దొరమీద గౌరవం ఉండటంలో అసహజం ఏమీ లేదు.
కొన్నాళ్ళు వేలం వెర్రిగా ఇంగ్లీషు పధ్ధతులని అనుకరించిన దశ నించీ ఇవాళ వాళ్ల శైలి లోనే వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే రీతిలో మళ్ళీ ఆ ఇంగ్లీషు లోనే మరి కొన్ని “కొత్త మాటల” పట్టిక గా ఆధారాలు లేకుండా తయారవుతున్న కొత్త ఊహల వ్యాసాలు ఇవి. నిడదవోలు వెంకట్రావు, ఆరుద్రా ఇవాళ ఏం జవాబులు చెప్పుకోవాలీ ఈయన సందేహాలకీ? మౌఖిక లిఖిత సాహిత్య వర్గీకరణలు అన్నవి మాత్రం ఇంగ్లీషు ప్రభావం వల్ల తయారైనవే కదా ఆధునిక విమర్శలో! అది మాత్రం వలసపాలకుల ప్రభావం కాదా?
చివరగా- తెలుగు సాహిత్యం లో మధ్య యుగాల దాకా అంటే వలస పాలకుల ప్రమేయం లేక ముందు దాకా ఆ పురాతన కాలంలో మన కవి పండితులు ఆ తాటాకు పుస్తక నిర్మాణం లో అనుసరించిన ప్రత్యేకమైన లేఖన విధానాలూ అలాగే తాళపత్ర ప్రతులకి తిరిగి తిరిగీ పుత్రికలని పుట్టించుకోవడంలో వాటిని పరిష్కరణ చేసుకోవడంలో అనుసరించిన విధానాలూ అన్నవి [అసలు ఒకటి ఉంటే] ఆ పధ్ధతులూ ఏవో వాటిని కూడా సమగ్రంగా వివరించనిదే పట్టించుకోనిదే చర్చలో వాటినీ భాగం చేయనిదే వెల్చేరు చేసిన బ్రౌన్ ప్రమేయం లేకముందటి తెలుగు దేశంలో ఉన్న “ఆధునికత” అన్న తర్కానికి అసలు బలం లేదు. అలాగే “వలస పాలన ప్రభావం” అన్న ఒక్క మాట తోనే ఇప్పటివరకూ తెలుగులో వెలిబుచ్చిన ఇతర విమర్శకుల పాత పధ్ధతులనీ పాత ఊహలనీ కాదనీ తాను చేయబూనుకున్న ఈ “కొత్త విశ్లేషణకి” కూడా ఒక సాధికారత ఏదీ సమకూరనూ లేదు. ఈ వ్యాసం వెల్చేరు ఎంతగా అమెరికన్ విశ్వవిద్యాలయాల పరిశోధనా ప్రభావంలో ఇరుక్కుని ఉన్నదీ చెప్పడానికి ఒక ఉదాహరణగా మాత్రం పనికొస్తుంది. ఆయన పాఠక వర్గం ఎవరో కూడా స్పష్టం గానే ఈ వ్యాసం ద్వారా రూపుకడుతుంది.
గాయకుడు, స్వరకర్త, డాక్టర్ శ్రీపాద పినాకపాణి మృతి భరతావనికి, సంగీత లోకానికి తీరని లోటు. ఆయన కు నా నివాళి. ఆయన కుటుంబానికి, సంగీతాభిమానుల అందరి తరఫున నా సంతాపం తెలుపుకుంటున్నాను.
కవితలోని చివరి పాదం నాకు నచ్చింది, జాన్ గారు!
“పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు కదా! ”
ఆ ముందటి పాదాల్లో మీరు వాడుకున్న కొత్త సందర్భాలు బాగున్నాయి కానీ, వాటిల్లో కవిత్వం ఎంత అన్నది తేల్చుకోలేకపోతున్నా. వాక్యాల పదును వేరు, కవిత్వ పదును వేరు అనిపిస్తుంది వాటిని చదివినప్పుడు!
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి lyla yerneni అభిప్రాయం:
03/13/2013 8:34 pm
చాలా బాగుంది నారాయణరావ్. నాకు నచ్చింది. బాగా రాశావ్. మళ్ళీ సెభాష్!
I can’t even imagine how this essay would read in English. I want to check it out. How do I get it?
లైలా
[The original essay is appended as a link at the end of this article. A better pdf copy will be uploaded soon. -Ed.]
క్షణికమైన భయం మాటున వొదిగి గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/13/2013 5:54 pm
డి. వెంకటేశ్వర రావు గారు — మీ వ్యాఖ్య నన్ను నేను తిరిగి ఆలోచించేలా చేసింది. ….అసలు నేను ఏమి రాశాను అనే సందేహమూ కలిగింది.
“క్షణికమైన భయం మాటున వొదిగి” — అలా ఒదిగిన ఫ్లిప్ ఆప్ సెకన్ గురించిన ఆలోచన తీసుకున్నాను. ధర్మరాజు గాని, పేతురుగాని అబద్దం చెప్పిన తర్వాత ఏమయ్యింది? అనేది పాఠకుడిగా మీ స్థాయీ పఠనాసక్తిని బట్టి అర్థం చేసుకోవచ్చు. దానికి నా అభ్యంతరం ఏమీలేదు.
అడుగులు లిఖించే
అబద్ధాల చిట్టాకు కొలమానమెక్కడ?
భయం లేకుండా నిర్భయంగా
అడ్డొచ్చిన నీటి ప్రవాహాన్ని దాటాల్సిందే!
పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు కదా!
ఇలా విడివిడిగా చదవాలేమో!
ఎంతైనా … పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు.
స్పందనకు ధన్యవాదములు
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
03/13/2013 3:15 pm
ముందుగా, ఈ వ్యాసం నారాయణ రావు గారి ఇతర పరిశోధనల స్థాయికి చేరుకోలేదని నా అభిప్రాయం. మరీ నీరసంగా వున్న అనువాదం కూడ ఈ అభిప్రాయం కలగటానికి బాగానే దోహదం చేసిందనిపిస్తున్నది. మూలం చదవకుండా అంటున్న మాట ఇది. మూలం కూడ ఇదే స్థాయిలో వుంటే అనువాదకులకి క్షమాపణలు.
ఇకపోతే, జయప్రభ గారి అభిప్రాయంలో వున్న తర్కం కొంత వింతగా అనిపించి దాని గురించి రెండు మాటలు చెప్పదల్చుకున్నాను. నారా కాని, ఆరుద్ర కాని, మరొకరు గాని చేసేపని ఒక విషయం గురించిన సమాచారాన్ని వాళ్లకి అందుబాటులో వున్నంతవరకు కూలంకషంగా సేకరించి, నిశితంగా పరిశీలించి, వాళ్లు పరిశోధిస్తున్న సమస్యకి ఒక సిద్ధాంతాన్ని తయారుచెయ్యటం. సమర్థుడైన పరిశోధకుడు తన ఎదురుగా వున్న సమాచారాన్నంతటినీ వివరించేగలిగే విధంగా ఆ సిద్ధాంతాన్ని తీర్చిదిద్దుతాడు. కనక ఒకే సమాచారం అందుబాటులో వున్న పరిశోధకులంతా ఒకే సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం లేదా ఒకేరకమైన సిద్ధాంతాన్ని తయారుచేస్తారనటం అతార్కికం. సిద్ధాంతాలు కేవలం ఊహలే అనుకున్నా ఇద్దరు పరిశోధకుల ఊహలు ఒకటే కావు. అలాగే, ఊహ ఐనది ఏదైనా సరే సమానంగా అనుమానాస్పదం అనటం కూడ అతార్కికం.
ఈ వ్యాసంలో గాని, మరో దాన్లో గాని తను చెప్పేది “సత్యం”అని నారా ఎప్పుడూ అన్నారనుకోను, ఒక కొత్తకోణంలో చూస్తున్నట్టో లేక ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నట్టో తప్ప మరెవరికీ తెలియని కొత్త నిత్యసత్యాన్ని కనుక్కున్నానని ఆయన అనుకుంటారని నేననుకోను.
పాశ్చాత్యులకు ముందు గ్రంథసంస్కరణ ఎలా చేసేవారు అనేది ఆసక్తికరమైన ప్రశ్నే. ఐతే పాశ్చాత్యప్రభావం వల్ల వచ్చిన గ్రంథసంస్కరణ పద్ధతుల్లో లోపాల్ని ఎత్తిచూపటానికి అంతకుముందున్న పద్ధతులు విధిగా తెలిసితీరాలనటం సమంజసంగా కనిపించదు. చివరగా, ఒక విషయం గురించిన ఒక వ్యాసం దానికి సంబంధించిన అన్ని విషయాల్నీ స్పృశించి తీరాలని, అలా చెయ్యకపోతే అది లోపభూయిష్టమని ప్రతిపాదిస్తే, ఇక లోపభూయిష్టం కాని పరిశోధన లోకంలో ఉండనే వుండదు కదా !
ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి Jarugumilli Vishnu Shankar అభిప్రాయం:
03/13/2013 11:28 am
ఒక మంచి వ్యాసాన్ని రాసినందుకు హనుమంతరావుగారిని అభినందించాలి. నా వరకూ చండిదాస్‌ని మించిన రచయిత, అనుక్షణికంని మించిన రచన తెలుగులొ ఇప్పటి వరకూ రాలేదు. చండీదాస్ అంతటి మహా రచయితని గుర్తుపెట్టుకోలేక పోవటం, ఆయనని సత్కరించుకోలేక పోవటం మన దురదృష్టం. ఇదే రచన వేరే భాషలో వచ్చుంటే ఏ బుకర్సో లేక నోబులో వచ్చుండేది. అయాన్ రాండ్ ఫౌంటెన్‌హెడ్‌తో పోల్చదగ్గ రచన.
క్షణికమైన భయం మాటున వొదిగి గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/13/2013 11:22 am
త: త: గారు — ధన్యవాదములు.
అపరంజి గారు — ఏదో చెప్పబోతూ సగంలో ఆపేసినట్టు ఉన్నారు?
నూతక్కి రాఘవేంద్ర రావు గారు — స్పందనకు ధన్యవాదములు. ఎక్కడనుండి ఊరతాయో అనేది నాకూ సందేహం వస్తూవుంటుంది.
రేణుక అయోల గారు — చిన్న సవరణ. “తప్పదు కొన్ని సార్లు అబద్దాల వెన్నెల చూపించాలి. ” కాదు. “తప్పదు కొన్ని సార్లు అబద్దాల్ని వెన్నెలలో చూపించాలి.” అని సవరించాలేమో 🙂
పూర్ణిమ సిరి గారు — స్పందనకు ధన్యవాదములు. జీర్ణం కాకపోయినా నిజం నిజమేగా!
ఈమాట గురించి గురించి jayaprabha అభిప్రాయం:
03/13/2013 12:21 am
ఆధునిక భారతీయ చిత్రకళ లో నాకు అత్యంత ప్రీతిపాత్రుడైన చిత్రకారుడు శ్రీ గణేష్ పైన్. ఆయన నిన్న కలకత్తాలో గుండెపోటుతో మరణించారు. ఆధునిక చిత్రకళలో గొప్పగా చెప్పుకోవలసిన చిత్రకారుడు ఆయన. సృజనలో ఆయనకి ధీటైన మరొకరు నాకు కనరాలేదింత వరకూ! గణేష్ పైన్ గారి మృతికి నా నివాళి.
జయప్రభ.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి jayaprabha అభిప్రాయం:
03/12/2013 3:28 pm
వలస పాలనే లేకపోతే తెలుగులో అసలు “అచ్చు పుస్తకమే” లేదు. అంతకు ముందు అంటే బ్రౌన్ కి ముందు ఏదో ఒక పధ్ధతిలో అయినా తెలుగులో “పుస్తక పరిష్కరణ” ఉన్నదా, ఉంటే అది ఏ పధ్ధతిలో ఉండేదీ అన్న విషయాన్ని కనీసం ఒక ప్రశ్నగా కూడా ఈ వ్యాసం సంధించదు. అటువంటప్పుడు ఇంక “ప్రభావం” అన్న ఊహకి అసలు ఆస్కారం ఏదీ? ఆధునిక పధ్ధతులు అన్నీ ఆ వలస పాలకుల ప్రభావమే! ఈ వ్యాసం ప్రతిపాదించే అనేకానేక ఊహలతో సహా! అంటే మౌఖిక సుమతీ శతకం, లిఖిత సుమతీ శతకం వగైరా మాటలతో సహా! ఇంక పరిష్కరణ అన్నది పాశ్చాత్యుల పధ్ధతి అని మనం అనుకుంటే- తత్పూర్వపు తాటి ఆకుల ప్రతుల లేఖన విధానాల ని గురించిన “మనదైన” ఒక పధ్ధతి, దానిని గురించిన ఒక సమాచారం భిన్నమైనది ఏమన్నా మరొకటి మనముందు ఉన్నదా అన్నది మరో ప్రశ్న. అందువలన ఈ వలస పాలనకి ముందు మనదేశం లోని అమలులో ఉన్న ఆ “ఆధునికత” పూర్వాపరాలని గురించిన ఒక స్పస్టమైన ఊహని వ్యాసకర్త పాఠకుల ముందు ఉంచవలసి ఉంటుంది. కానీ ఆ దిశగా ఒక్క వాక్యం కూడా ఈ వ్యాసంలో లేదు. అయితే ఈ వ్యాసం చూసేక ఆరుద్రది ఒక లాంటి “నమ్మకం” అయితే వెల్చేరుది మరొకలాంటి “నమ్మకం” అని మాత్రమే అనుకోవాలి. సరి అయిన ఆకరాలు లేనప్పుడు ఎవరు చేసేవైనా ఊహలే అవుతాయి అవి నిరూపించబడేదాకా!
బ్రౌన్ దొర ఏ కారణంగా ఏ నమూనాని తన ముందు పెట్టుకుని తెలుగు గ్రంధాల అచ్చు పని దాని పరిష్కరణనీ చేపట్టినా ఆ పని చేసిన తెలుగు లేఖకులూ ఆ కొద్దిపాటి తెలుగు పండితులూ ఉన్న “బ్రౌన్ యూనివెర్సిటీ వే అంతకు ముందు తెలుగు లో ఏ కొందరికో అందుబాటులో ఉన్న గ్రంధాలని తెలుగు సమాజం ముందుకి తెచ్చిందన్నది ఒక వాస్తవం! ఆ పనిని తెల్ల దొరే చేశాడు గానీ అప్పటికి ఇంకా చెల్లా చెదురుగా తెలుగునేలని బుక్కుతున్న ఏ పిల్ల జమీందారూ చెయ్యలా! మనం ఎలాగైతే ఎడ్లబళ్లని వదిలి రైలు బళ్ల బాట పట్టామో ఆ “వలస పాలన” ఆధారం గానే తాటాకులమీంచి బ్రౌన్ దొర ముద్రింపించి ఇచ్చిన పుస్తకాన్నీ దొరకపుచ్చుకున్నాం. లేకపోతే ఏ సరస్వతీ మహలు లోనో మరోచోటనో లేదా ఏ కొందరి రాజుల సొంత గూళ్లలోనో చెదలు పట్టి ఉండేది పాత సాహిత్యం! మరి బ్రౌన్ “ఉధ్ధరించకపోయి ఉంటే” మరి ఎవరు వచ్చి ఉధ్ధరించి ఉండేవారో మనకి తెలీనప్పుడు తెలుగు వాళ్లకి బ్రౌన్ దొరమీద గౌరవం ఉండటంలో అసహజం ఏమీ లేదు.
కొన్నాళ్ళు వేలం వెర్రిగా ఇంగ్లీషు పధ్ధతులని అనుకరించిన దశ నించీ ఇవాళ వాళ్ల శైలి లోనే వాళ్లకి మాత్రమే అర్ధమయ్యే రీతిలో మళ్ళీ ఆ ఇంగ్లీషు లోనే మరి కొన్ని “కొత్త మాటల” పట్టిక గా ఆధారాలు లేకుండా తయారవుతున్న కొత్త ఊహల వ్యాసాలు ఇవి. నిడదవోలు వెంకట్రావు, ఆరుద్రా ఇవాళ ఏం జవాబులు చెప్పుకోవాలీ ఈయన సందేహాలకీ? మౌఖిక లిఖిత సాహిత్య వర్గీకరణలు అన్నవి మాత్రం ఇంగ్లీషు ప్రభావం వల్ల తయారైనవే కదా ఆధునిక విమర్శలో! అది మాత్రం వలసపాలకుల ప్రభావం కాదా?
చివరగా- తెలుగు సాహిత్యం లో మధ్య యుగాల దాకా అంటే వలస పాలకుల ప్రమేయం లేక ముందు దాకా ఆ పురాతన కాలంలో మన కవి పండితులు ఆ తాటాకు పుస్తక నిర్మాణం లో అనుసరించిన ప్రత్యేకమైన లేఖన విధానాలూ అలాగే తాళపత్ర ప్రతులకి తిరిగి తిరిగీ పుత్రికలని పుట్టించుకోవడంలో వాటిని పరిష్కరణ చేసుకోవడంలో అనుసరించిన విధానాలూ అన్నవి [అసలు ఒకటి ఉంటే] ఆ పధ్ధతులూ ఏవో వాటిని కూడా సమగ్రంగా వివరించనిదే పట్టించుకోనిదే చర్చలో వాటినీ భాగం చేయనిదే వెల్చేరు చేసిన బ్రౌన్ ప్రమేయం లేకముందటి తెలుగు దేశంలో ఉన్న “ఆధునికత” అన్న తర్కానికి అసలు బలం లేదు. అలాగే “వలస పాలన ప్రభావం” అన్న ఒక్క మాట తోనే ఇప్పటివరకూ తెలుగులో వెలిబుచ్చిన ఇతర విమర్శకుల పాత పధ్ధతులనీ పాత ఊహలనీ కాదనీ తాను చేయబూనుకున్న ఈ “కొత్త విశ్లేషణకి” కూడా ఒక సాధికారత ఏదీ సమకూరనూ లేదు. ఈ వ్యాసం వెల్చేరు ఎంతగా అమెరికన్ విశ్వవిద్యాలయాల పరిశోధనా ప్రభావంలో ఇరుక్కుని ఉన్నదీ చెప్పడానికి ఒక ఉదాహరణగా మాత్రం పనికొస్తుంది. ఆయన పాఠక వర్గం ఎవరో కూడా స్పష్టం గానే ఈ వ్యాసం ద్వారా రూపుకడుతుంది.
జయప్రభ.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి s. kalanjali అభిప్రాయం:
03/12/2013 1:24 am
గాయకుడు, స్వరకర్త, డాక్టర్ శ్రీపాద పినాకపాణి మృతి భరతావనికి, సంగీత లోకానికి తీరని లోటు. ఆయన కు నా నివాళి. ఆయన కుటుంబానికి, సంగీతాభిమానుల అందరి తరఫున నా సంతాపం తెలుపుకుంటున్నాను.
ఎస్. కళాంజలి.
క్షణికమైన భయం మాటున వొదిగి గురించి అఫ్సర్ అభిప్రాయం:
03/11/2013 7:59 pm
కవితలోని చివరి పాదం నాకు నచ్చింది, జాన్ గారు!
“పాదం మోపినప్పుడు
తడిసే కాలు అబద్దం కాదు కదా! ”
ఆ ముందటి పాదాల్లో మీరు వాడుకున్న కొత్త సందర్భాలు బాగున్నాయి కానీ, వాటిల్లో కవిత్వం ఎంత అన్నది తేల్చుకోలేకపోతున్నా. వాక్యాల పదును వేరు, కవిత్వ పదును వేరు అనిపిస్తుంది వాటిని చదివినప్పుడు!
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి బ్రహ్మానందం అభిప్రాయం:
03/11/2013 10:17 am
ఇప్పుడే తెలిసిన వార్త!
శ్రీపాద పినాకపాణి గారు భౌతికంగా ఇహ లేరు.
సంగీత సామ్రాజ్యం మరో విద్వాంసుణ్ణీ, పండితుణ్ణీ కోల్పోయింది.