పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    03/31/2013 8:14 am

    Janaki Padhuka గారు – ధన్యవాదములు

    భాస్ బాపట్ల గారు – ధన్యవాదములు

    అఫ్సర్ గారు – మీ అభిప్రాయం కొంచెం ఆలోచింపచేసింది. అందుకే స్పందనలో ఆలస్యం.

    ఎన్ని సార్లు చదివి నన్ను నేను తర్కించుకున్నా మీరన్నదానిలో — “వాటిల్లో కవిత్వం ఎంత అన్నది తేల్చుకోలేకపోతున్నా. వాక్యాల పదును వేరు, కవిత్వ పదును వేరు అనిపిస్తుంది వాటిని చదివినప్పుడు!” — వాటి మధ్య తేడాను గమనించలేకపోయాను.

    ఇలాంటి ప్రతీకల్తో అరుదుగా రాశాను. ఇలాంటివి రాస్తున్నపుడు ఒక ఉద్వేగం, ఒక ప్రవాహం నన్ను తొందరచేస్తూ వుంటుంది. అదే రాతల్ని పాఠకుడిగా చదువుతున్నప్పుడు వ్యక్తిగా నాకూ సందేహాలు వస్తుంటాయి. మీ సూచనను ముందుముందు దృష్టిలో వుంచుకుంటాను.

    ధన్యవాదములు

  2. పాఠకులకు సూచనలు గురించి DARA SUGUNAKAR అభిప్రాయం:

    03/31/2013 1:12 am

    గౌరవనీయులైన సంపాదకులవారికి,

    ఈ రోజు అనగా 31-03-2013 తేదిన ఆనుకోకుండా ఈమాటను చూశాను. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. హృదయం ఆనందముతో గంతులు వేసింది. నిజంగా ఇది తెలుగు తల్లికే గర్వ కారణం. ఈ పత్రికను సృష్టించిన వారికి కొనసాగిస్తున్న వారికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు. ఇందులో తప్పులెన్నో వుండవచ్చు. దయచేసి క్షమించండి. తెలుగు బిడ్డనై వుండి తెలుగును స్పష్టంగా మాట్లడలేక పోవడము మరియూ వ్రాయలేక పోవడము నాకే అవమానము. అయితే నేను నేర్చుకుంటాను.

    ఈ అవకాశము ఇచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు.

  3. నిన్నటి కల గురించి DARA SUGUNAKAR అభిప్రాయం:

    03/31/2013 12:50 am

    ఈ కధ చాలా బాగుంది. ఆయితే డొక్కా ఫణి గారి అభిప్రాయముతో నేనూ ఏకీభవిస్తాను.

  4. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:

    03/30/2013 11:37 am

    ఈ వ్యాసములో నందించిన పాటలు మాత్రమే కాక, శ్రీమద్గోపవధూ, జిహ్వే కీర్తయ పాటలను ఇక్కడ వినగలరు. విధేయుడు – మోహన

  5. నాకు నచ్చిన పద్యం: తొలికోడి కూత గురించి Mangu Siiva Ram Prasad అభిప్రాయం:

    03/30/2013 7:41 am

    పిన వీర భద్రుని పద్య పంక్తులలోని భావ పరిమళాన్ని తొలి కోడికూతలో గుభాళింపజేసారు. పాల్కుర్కి సోమన పద్యాన్ని ఉటంకించడంతో పువ్వుకి తావి అబ్బినట్లైనది.ఫ్రాచీన సాహిత్యంలోని రసాస్వాదన కలిగించినందుకు ధన్య వాదాలు

  6. దోసిట్లో నక్షత్రాలు గురించి Mangu Siiva Ram Prasad అభిప్రాయం:

    03/30/2013 7:02 am

    సుబ్రహమణ్యం గారు కవిత చాలా బాగుంది. భావజాలానికి అద్దం పట్టే పదచిత్రాలను చక్కగా ప్రయోగించారు. మంచి కవిత చదివిన ఆనుభూతి కలిగీంది.

  7. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు అభిప్రాయం:

    03/28/2013 2:16 pm

    ప్రియమిత్రులు శ్రీ కొలిచాల సురేశ్ గారికి,

    అర్ధబిందుప్రాస విషయమై చర్చింపవలసినది ఏమిటో నాకు అర్థం కాలేదు. 1) అర్ధబిందు (లేదా) ఖండప్రాస 2) పూర్ణబిందు ప్రాస 3) ఈ రెండింటి సాంకర్యమైన ఖండాఖండ ప్రాసల అన్నవి లక్ష్య-లక్షణాలు రెండింటిలోనూ రూఢమై ఉన్నవే. అందులో చర్చనీయాంశమేమీ లేదు.

    “చీకటి”, “మూడు” మొదలైన కొన్ని శబ్దాలలో అరసున్న ఉండాలో ఉండకూడదో అన్న విషయమై లాక్షణికులలోనూ, కవులలోనూ, నిఘంటుకర్తలలోనూ ఏకాభిప్రాయం లేదు. కనుక ఈ ప్రాసోదాహరణల మూలాన కవి కావ్య కాలనిర్ణయం సాధ్యం కాదు.

    “వీండు”, “మూండు”, “పోండిమి” మొదలైన శబ్దాలలో ఒకప్పుడు పూర్ణబిందువు ఉండి, కాలక్రమేణ అది ఉచ్చారణలో నుంచి తొలగిపోయి ఆ శబ్దాలు “వీడు”, “మూడు”, “పోడిమి” అని పలుకబడిన రోజులలో ఒకనాటి ఆ పూర్ణబిందువుకు స్మారికగా ఎటువంటి ఉచ్చారణమూ లేని అర్ధబిందువు ఉచ్చారణ లేకపోయినా తత్తత్పదపూర్వస్వరూపసంకేతంగా లిఖితరూపాలలో మాత్రం “వీఁడు”, “మూఁడు”, “పోఁడిమి” అని నిలిచిపోయింది. భాషాశాస్త్రవిద్యార్థు లందఱికి ఇది తెలిసిన సంగతే.

    అయితే కొందఱు కవులు పూర్ణబిందువు సహజంగా ఉన్న “పండు”, “నిండు”, “రెండు” వంటి పదాలతో ఒకనాటి “వీండు”, “పోండిమి” మొదలైన పదాలను ప్రాసస్థానంలో ప్రయోగించినప్పుడు మాత్రమే ఆ సాంకర్యంతోడి ప్రయోగం కవి కాలనిర్ణయానికి కొంతవఱకు సాధకం కాగలుతుంది. అదీ కొంతవఱకే. కవి తెలిసి తెలిసి కావాలని అటువంటి ప్రయోగం చేసి ఉంటే మనము దానిని బట్టి కవి కాలనిర్ణయం చేయలేము.

    నన్నెచోడుడు ఆధునికుడా? నిజంగానే పూర్వుడా? అన్న సమస్య ఇదమిత్థంగా తేలలేదు. ఇరవయ్యవ శతాబ్దికంటె పూర్వుడు కాడని నాకూ అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు వివాదాస్పదుడైన ఆ కవి ప్రయోగాలు కాలనిర్ణయానికి నిర్వివాదంగా పనికిరావు. నన్నెచోడ – బద్దెనల పౌర్వికతను నిర్ధారించటానికి ప్రామాణికాలైన సాధనాలు లేవు. బద్దెన “నీతిశాస్త్రముక్తావళి” సుమతి శతకం కాలనిర్ణయానికి ఉపయోగిస్తుందనుకోవటం పొరపాటు.

    యతి విషయం కొంతవఱకు కాలనిర్ణయానికి పనికివస్తుంది. అది కూడా “నేను నన్నయగారి యతి పద్ధతిలోనే వ్రాస్తాను” అని ఒక ఆధునిక కవి వ్రాసి ఉంటే – అది కాలనిర్ణయానికి ఉపకరింపదు.

    పార్యంతికంగా చెప్పదలచినది ఏమంటే – యతి-ప్రాసలు కొంత వఱకు భాషాపరిణామ పరిశీలనకు, సంఖ్యానకానికి దోహదం చేస్తాయి. వివాదాస్పదమైన విషయాలలో తథ్యమిథ్యావివేచనకు, కాలనిర్ణయానికి ఎంత మాత్రమూ పనికిరావు. సుమతి శతకం విషయానికీ ఇది అనువర్తిస్తుంది.

    నిజానికి సుమతి శతకం విషయమై దాని ప్రచారవేళాగతంగా మౌఖిక – లిఖిత రూపాలని రెండు అవాంతర శాఖలు అనుశీలనీయంగా ఉండటం; “పేరణము” మొదలైన కొన్ని శబ్దాల అర్థనిర్ణయం ప్రయోగచరిత్రను బట్టి గాక నిఘంటువులను బట్టి చేయటం; వ్యాసముఖ్యోద్దేశం అది కానప్పటికీ శతకం బద్దెన రచనమా? భీమన రచనమా? అది ఒకరి రచనమైతే ఒక వర్గానికి అనుకూలంగా ఉండటం, వేఱొకరి రచనమైతే మఱొక వర్గానికి సహకరించటం; “నీతి” శబ్దార్థ పరిణామచరిత్ర – ఇత్యాదిగా శ్రీ వెల్చేరు నారాయణరావు గారు ప్రతిపాదించి చర్చించిన విషయాలలోని యుక్తాయుక్తాలు – ఈ వ్యాసంలో తప్పక పరిశీలించి నిగ్గుతేల్పవలసిన విషయాలు.

    ఆ సమంజసమైన చర్చపై ఈమాట పాఠకులు దృష్టి నిలిపితే విలువైన అంశాలు వెలుగులోకి వస్తాయి.

    ప్రేమతో,
    భవదీయుడు

  8. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    03/28/2013 11:44 am

    Sree suresh,

    I am amazed at the speed with which you came up with the examples. I am happy for me too. This is real research that interests every one. I really thought that it would not be appropriate to counter an honest researcher as Sree Mohana with ‘parodies’. You got your point and I trust Sree Mohana will surely give a thought to the post Tikkana అరసున్నా ప్రాస. Let me also add that I apologize if the way I wrote is not to your liking.

    తః తః

  9. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/28/2013 11:00 am

    తిక్కన భారతంలోనూ, తిక్కన తరువాతి కాలంలోనూ అర్ధబిందు ప్రాస పాటించిన పద్యాలు/గేయాలు చాలా దొరికాయి. మచ్చుకు కొన్ని:

    నేఁ డీ బ్రాహ్మణు చేతం
    బోఁడిమి సెడి యేను జిక్కి పోవక యుండన్
    వేఁడిమి మెఱయు శరంబుల
    వాఁడిమి సొం పెల్లఁ జూప వలయుం జుమ్మీ. — తిక్కన కర్ణ పర్వము 7_1_232

    ఆఁడుఁదనంబు నిక్కమున కారసి చూచిన లేదు పుంస్త్వముం
    బోఁడిమి దప్పి యున్నది నపుంసక జన్మ మవశ్యభోగ్య మై
    వాఁడిమి గల్గుశాపమున వచ్చెఁ బురాకృతకర్మభావ్య మె
    వ్వాఁడును నేర్చునే తొలఁగ వైవఁగ నోర్వక పోవ వచ్చునే. — తిక్కన విరాట పర్వము 238

    పోఁడను బ్రాహ్మణుండు యదుపుంగవు వీటికి వాసుదేవుఁడున్
    రాఁడను నింకఁ బోయి హరి రమ్మని చీరెడి యిష్టబంధుఁడున్
    లేఁ డను రుక్మికిం దగవు లే దిటఁ జైద్యున కిత్తు నంచు ను
    న్నాఁ డను గౌరి కీశ్వరికి నావలనం గృప లేదు నేఁడనున్ — భాగవతము, రుక్మిణీ కల్యాణము 50, పోతన, 15వ శతాబ్దము.

    పూఁతపసిండివంటి వలపున్‌ బచరించు కులంబు నీతికిన్‌
    లేఁత గదమ్మ యిత్తెఱఁగు? లేమ! సురాంగన లెల్ల నిట్టి నీ
    చేఁతకు మెత్తురమ్మ? దయసేయక తిన్నని మేను వెన్నెలన్‌
    వేఁతురటమ్మ? యింత కనువేఁదుఱు సెల్లునఁటమ్మ యింతికిన్‌? — మను చరిత్రము తృతీయాశ్వాసము 33, అల్లసాని పెద్దన, 16వ శతాబ్దము.

    లేఁత నీచిత్తములోఁ దాలిమి గలుగఁగఁ బట్టి
    చేఁతల నీయలుకెల్లఁ జెల్లెఁగాక
    పూఁతమాఁటల సొలపుబొంకులనె దూరేవు
    యీఁతలేని చల్లులాట యేమిసేసేవే — అన్నమయ్య రేకు. 64 కీర్తన 196

    పూఁత నీ గర్వముల చూపులే వారకములు
    లేఁత నీ నగవులే పళ్ళెములో కూడు
    పూఁతగాని చిత్తమనే వుప్పరిగెనుండినా
    బాఁతి పడి నీ గుబ్బలపైడి కుండలెత్తఁడా — అన్నమయ్య రేకు. 66 కీర్తన 206

    పోఁడిమి గల తత్పురమున
    లేఁడు ఖలుఁడు దుష్టకామి లేఁడు చదువులన్
    వాఁడిమి మీఱనిపురుషుఁడు
    లేఁ డట నాస్తికుఁడు నెందు లేఁడు వెదకినన్. ౨౫౯ శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణము – వావిలికొలనుసుబ్బారావు గారు

    తా.క. my silly poem was a result of my own efforts of late-night wordsmithing, not a parody of any known poem.

  10. మరియ గురించి రాజా పిడూరి అభిప్రాయం:

    03/28/2013 10:56 am

    “ఉండనీ లే” అనడం (వద్దు లే, ఫర్వా లేదులే అనే అర్థం లో – ఏదైనా ఆఫర్ చెయ్యబోతే వద్దు – అన్నట్టుగా ) రాయలసీమ ప్రాంతంలో (ముఖ్యంగా చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాలలో) ప్రాచుర్యంలో ఉన్న మాటే. – రాజా పిడూరి