పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి kasi viswanadham y అభిప్రాయం:

    04/08/2013 6:59 am

    నమస్కారములు. వ్యాసం చాల బాగుంది.
    స్వగతం-
    1955వ సంవత్సరం. మరపురాని విషయమేమంటె 6 వ తరగతి ప్రవేశానికి ఇచ్చిన పద్యం

    అడిగిన జీతంబివ్వని
    మిడిమేలుపు దొరను కొలిచి మిడుగటకంటెన్
    వడిగల యెద్దుల గట్టుక
    మడిదున్నుక బ్రతకవచ్చు మహిలో సుమతీ

    ఇప్పుడు 2013. ఉద్యోగాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్న రోజుల్లో ఇది నిజమా! సాధ్యమా? అనిపిస్తుంది. ఇప్పుడు వ్యవసాయం చేయక పోయినా పరిశోధనా రంగంలో కొద్దిగా ఆ విషయాల గురించి చదివిన, చర్చించిన, సేకరించిన సమాచారం పద్యాన్ని నీతి వైపుకు నిలుపలేక పోతోంది. సుమతీ =మంచిబుద్ధి కలవాడా అని ..ఆ రోజుల్లో నేర్పింది, వ్రాసింది .. మంచిబుద్ది కలవాడా కాదు.. కోరుతున్న వాడా అని వ్రాయాలని ఇప్పుడు అనిపిస్తోంది.

  2. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:

    04/06/2013 10:45 pm

    నావి రెండు మాటలు.
    ఇంత దీర్ఘంగా ఈ వ్యాసాన్ని చర్చించిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మీరు లేవదీసిన ప్రశ్నలకి నేను రాయబోయే వ్యాసంలో సమాధానాలు ప్రస్తావిద్దామని అనుకుంటున్నాను, అంచేత క్లుప్తంగా ఒకటి రెండు వివరణలు మాత్రం ఇస్తాను.

    “ఈ వ్యాసంలో నారాయణరావుగారు, ఈ శతకం మౌఖిక సంప్రదాయంలో పుట్టి క్రమేపి లిఖిత స్వరూపం తీసుకుందని భావించినట్టుగా అనిపిస్తోంది.” అన్నారు కామేశ్వర రావు గారు.
    ఇలాటి భావం కలిగించే మాటలు ఎక్కడ అన్నాను చెప్మా!

    మనకి కనిపిస్తున్న సుమతీ శతకం పద్యాలలో రెండు రకాల శైలులు ఉన్నాయి, అందులో ఒకటి లిఖిత శైలి అనీ రెండోది మౌఖిక శైలి అనీ అంటూ ఇంగ్లీషులో రాసిన వ్యాసంలోదాన్ని oralized శైలి అన్నాను.
    లిఖిత శైలిలో వున్న పద్యాలు మౌఖిక శైలి లోకి మారిన ఆచూకీలు కొన్ని చూపించాను.

    ఇక పోతే ఈ రెండు రకాల శైలుల్లో వున్న పద్యాలు ఇద్దరు కర్తలకి ఆపాదించబడ్డాయని అన్నాను, కాని ఈ శతకాలు ఎవరు “రాశారో” నేను చర్చించలేదు.

    ఈ విషయాలు మళ్ళా వివరించడానికి అవకాశం ఇచ్చారు, సంతోషం.

    నారా

  3. విశ్వనాథగారితో వేదాంత చర్చ గురించి Halley అభిప్రాయం:

    04/06/2013 12:02 am

    చాలా బాగుంది. చర్చా పాఠం చదువుతూ రికార్డింగ్ వింటూ ఉంటే ఇంకా బాగుంది
    విన్నకోట రవిశంకర్ గారికీ ఈమాట వారికీ కృతజ్ఞతలు

  4. ఈమాట గురించి గురించి Malleswara Rao P అభిప్రాయం:

    04/05/2013 5:41 pm

    నమస్కారం,
    నేను ఆంతర్జాల పుటలలొ తెలుగు సంస్కృతిని చాటిచెప్పే మంచి పత్రిక గురించి వెతికి చివరకు “ఈమాట” చూసిన తరువాత చాలా ఆనందంగా అనిపించింది. ఈ సమయంలో నాకు కృష్ణదేవరాయల ఈమాటలు గుర్తుకు వచ్చాయి. “దేశ భాష లందు తెలుగు లెస్స”.
    ********************
    ఉగ్గు పాల నుండి ఉయ్యాలలో నుండి
    అమ్మపాట పాడినట్టి భాష
    తేనె వంటి మందు వీనులకు విందు
    దేశభషలందు తెలుగు లెస్స!
    సంస్కౄతంబులోని చక్కెర పాకంబు
    అరవ భాషలోని అమౄతరాశి
    కన్నడంబులోని తే ట తెలుగు నందు
    వేనవేల కవుల వెలుగులో రూపొంది
    దేశదేశములలో వసిగాంచిన భాష
    వేయియేoడ్ల నుండి విలసిల్లు నా ‘భాష ‘
    దేశ భాష లందు తెలుగు లెస్స!
    ***********************
    అటువంటి తెలుగు సంస్కృతిని కాపాడుతున్న “ఈమాట” పత్రికకు నా అబినందనలు.

    మల్లేశ్వరరావు

  5. సహజ గాయని ఎస్. వరలక్ష్మి గురించి Veeranarasimharaju అభిప్రాయం:

    04/04/2013 12:15 pm

    సుస్వర లక్ష్మి ఎస్ వరలక్ష్మి

  6. నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన గురించి Balamurali Krishna అభిప్రాయం:

    04/04/2013 9:43 am

    చక్కటి పద్యం ఎన్నుకున్నారు. భావం మరింత అందంగా వ్యక్త పరిచారు. ఈ మధ్యనే పోతన తాత గారు రాసిన ఆంధ్ర భాగవతం చదవడం మొదలు పెట్టాను. అందులో ప్రతీ పద్యమూ భక్తి రసంతో తేనెలూరుతూంటుంది. చూచుకములు అనే పదానికి మీరు వ్రాసిన వ్యాఖ్య చాలా అందమైన దృష్టితో చేసిన విశ్లేషణ నాకు చాలా నచ్చింది.

    ఆహా ఇది ఎంత మంచి రోజు!

    బాలమురళి కృష్ణ గోపరాజు

  7. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    04/03/2013 12:28 pm

    రామారావుగారూ, మీ వ్యాఖ్య నాకు సరిగా అర్థం కాలేదు. ఈ వ్యాసంలో ప్రస్తావించబడిన అంశాలు:

    1. “నీతి” పద అర్థ విపరిణామం,
    2. సుమతిశతక కాలము గురించిన ఆలోచన,
    3. ఛందస్స్వరూపం దృష్ట్యా అచ్చులో లభిస్తున్న ప్రతులను మౌఖిక లిఖిత సంప్రదాయాలకు చెందిన రచనలుగా వర్గీకరించడం.
    4. మౌఖిక లిఖిత సంప్రదాయాల్లో సుమతిశతకం చెందిన పరిణామాన్ని గూర్చిన ఆలోచన
    5, కర్తృత్వ చర్చ (శతకం ఏ వర్గం నుండి వచ్చింది, బద్దెన, భీమన కర్తలుగా ఎందుకయ్యారు మొదలైనవి)

    ఇందులో 1, 3 అంశాలలో నాకు చర్చనీయాంశమేదీ కనిపించలేదు. అందుకే అందులో ప్రతిపాదించిన అంశాలు విలువైనవని అన్నాను. ఇక మిగతా అంశాలు చర్చనీయాంశాలుగా అనిపించాయి కాబట్టి వాటి గురించి పట్టించుకొని చర్చ లేవనెత్తాను.

    “నారాయణరావు గారు ఏ ఆలోచనామార్గం మారాలని ప్రతిపాదిస్తున్నారో సరిగ్గా ఆ మార్గాన్నే పట్టినట్టనిపిస్తున్నది.”

    సుమతిశతకాన్ని గురించి నారాయణ రావుగారు ప్రతిపాదిస్తున్న ఆలోచనామార్గంలోని సామంజస్య ప్రయోజనాలే కదా అసలు చర్చనీయాంశాలు! తాను ప్రతిపాదిస్తున్న ఆలోచనామార్గానికి, నారాయణ రావుగారు ఈ వ్యాసంలో, సుమతిశతకం ద్వారా కొన్ని సమర్థనలు చేశారు. వాటి గురించే కదా చర్చ. వారి ఆలోచనామార్గాన్ని పూర్తిగా అంగీకరించేస్తే ఇక చర్చేముంది?

    “ఇకపోతే, రెండు మాతృకలు ఎలా వచ్చాయి, ఆ రెంటికీ ఏమైనా జన్య జనక సంబంధం ఉన్నదా, వాటి పరిణామ క్రమం ఏమిటి అనే ప్రశ్నలు కుతూహలం కలిగించేవే ఐనా వాటికి సమాధానాలు చెప్పగలిగే సమాచారం అందుబాటులో లేదని ఈ వ్యాసం స్పష్టం చేస్తుంది.”

    అంత స్పష్టంగా వ్యాసంలో చెప్పిన చోటు ఎక్కడా నాకు కనిపించలేదు. ఉన్న సమాచారాన్ని బట్టి వాటికి తమ ఆలోచనామార్గంలోనుండి సమాధానాలు వెతికే ప్రయత్నం వ్యాసంలో చేశారు. లేకపోతే వాటి గురించి అంత విసృతంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు కదా! పైగా నారాయణ రావుగారు ప్రస్తావించిన మార్గం సుమతిశతకానికి వర్తించవచ్చా లేదా అన్నదానికి, ఈ జన్యజనక సంబంధం అవసరం అని నేను భావిస్తున్నాను. ఎందుకో నా ముందరి వ్యాఖ్యలో వివరించాను.

    “ప్రముఖంగా మౌఖిక మార్గాన ప్రచారమైన ఇలాటి రచనల విషయంలో అలాటి భావాలు అర్థవంతాలు కావని చెప్పటం, అందువల్ల ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుననుకున్నవాళ్లు పప్పులో కాలేశారని చూపటం.”

    పూర్తిగా మౌఖిక మార్గానికి చెందిన రచనల గురించి మీరన్నది సమంజసమే. ఉదాహరణకు, చాటువుల మొదలైన వాటి గురించి నారాయణ రావుగారు ఇంతకుముందు ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. కానీ యిక్కడ సుమతిశతకం పూర్తిగా ఆ మార్గానికే చెందినదన్న నిర్ధారణ జరగకుండా, దాని గురించి ఎలాంటి విశ్లేషణ సరైనదని ఎలా నిర్ణయిస్తాం? పూర్తిగా లిఖిత సంప్రదాయానికి చెందినదని భావించి, ఆ రీతిలో మాత్రమే దాని గురించి విశ్లేషణ చెయ్యడం సరికాదన్నది ఒప్పుకోవలసిన అంశమే. అయితే దానికి ప్రత్యామ్నాయ విశ్లేషణా మార్గాన్ని (మౌఖికమార్గ రచనలకు నారాయణరావుగారు ప్రతిపాదించినది) ఈ వ్యాసంలో సుమతిశతకానికి కూడా వర్తింపచెయ్యాలని బలంగానే చెప్పారు. అది ఎంతవరకూ సమంజసం అన్నది ఇక్కడ చర్చనీయాంశం.

  8. గాలి మళ్ళింది గురించి Mangu Siiva Ram Prasad అభిప్రాయం:

    04/03/2013 6:56 am

    వృద్ధాప్యం కొందరికి ఒక వరం, కాని చాలామందికి అది ఒక శాపం. ఒంటరితనం పురుగులా తొలుస్తుంటే మాట్లాడడానికి ధైర్యం చెప్పడానికి తోడు ఒకరుండాలనే భావనని చక్కగా ఈ కవితలో చెప్పారు.

  9. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    04/02/2013 4:01 pm

    ఇక్కడ జరుగుతున్న చర్చ తిరిగి తిరిగి నారాయణరావు గారు ఏ ఆలోచనామార్గం మారాలని ప్రతిపాదిస్తున్నారో సరిగ్గా ఆ మార్గాన్నే పట్టినట్టనిపిస్తున్నది. ఈ వ్యాసం ముగింపులో ఆయన అన్నది ఇది – “In this essay, I have tried to demonstrate the epistemological shifts that colonial education brought about in the concepts of texts and authors in India. Using Sumati satakamu as an example, I indicated that such Western ideas are unsuitable to understand the nature of Indian texts. ..”

    morals అన్న పాశ్చాత్యభావనని “నీతి”కి సమానార్థకం చెయ్యటంతో కలిగిన వింత పరిణామాల్ని ఈ వ్యాసం సుదీర్ఘంగా విపులంగా చూపించింది. లిఖిత, మౌఖిక మార్గాల నుంచి వచ్చిన రెండు మాతృకలు అచ్చులో వచ్చిన రచనలకి మూలాలయాయని విశ్లేషించి చూపింది. “మూలకవి”, అతని కాలం అనే ప్రశ్నలతో ఈ వ్యాసానికి వున్నది విలోమ సంబంధం – ప్రముఖంగా మౌఖిక మార్గాన ప్రచారమైన ఇలాటి రచనల విషయంలో అలాటిభావాలు అర్థవంతాలు కావని చెప్పటం, అందువల్ల ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుననుకున్నవాళ్లు పప్పులో కాలేశారని చూపటం. ఇకపోతే, రెండు మాతృకలు ఎలా వచ్చాయి, ఆ రెంటికీ ఏమైనా జన్య జనక సంబంధం ఉన్నదా, వాటి పరిణామ క్రమం ఏమిటి అనే ప్రశ్నలు కుతూహలం కలిగించేవే ఐనా వాటికి సమాధానాలు చెప్పగలిగే సమాచారం అందుబాటులో లేదని ఈ వ్యాసం స్పష్టం చేస్తుంది. అలాగే భీమనా బద్దెనా మరొకరా మరికొంతమందా ఎవరు దేని కర్తలు అనేది కూడ సమాధానం ఇవ్వలేని ప్రశ్న (నా “ఊహ” భీమన, బద్దెనలు ఇద్దరూ రెండు మాతృకల్లో దేనికీ కర్తలు కారని; కాకుంటే దీనికి ఎలాటి ఆధారాలు లేవు గనక ఈ ఊహని ఎవరూ పట్టించుకోనక్కర్లేదు)

  10. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి T V Rao అభిప్రాయం:

    04/02/2013 10:14 am

    శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు.

    విశ్వనాథం గారికి ఇంకా ఎవరూ పాడని ఆణిముత్యాలని- నాదవినోదిని ద్వారా విడుదల చెయ్యాలనే కోరిక చాలా గాఢంగా వుండేది. లలిత సంగీత సాహిత్య ఉద్దండులు – కలగా, వేదవతి, హేమవతి,సోమరాజు సుశీల, రమణ, మోహన్ రాజు వగైరా దాదాపు 20 మందితో వో పెద్ద Project చేసి మొదటగా 150 గీతాలని ఎంపిక చేసి notations కూడా పూర్తి చేశారు. దీనికి అవసరమైన 5 లక్షలు మేం collect చెయ్యలేక పోయాం. ఈ ప్రయత్నంలో మా పెద్దబ్బాయి శ్రీరాం విష్ణుభొట్ల లక్ష్మన్న గారిని కూడా కలవటం జరిగింది. ఇది విశ్వనాధం గారి మిగిలి పోయిన కోరిక. వారి notations వున్నాయ్ కనుక ఈ project ని పూర్తి చెయ్యాలనేది వారి సంస్కరణ సభలో మేము తీసుకొన్న నిర్ణయం. ఇదే వారికి సరైన నివాళి. సహకారం కోసం ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి.

    నమస్కారాలతొ
    టి వి రావు.