పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు అభిప్రాయం:

    04/16/2013 2:28 pm

    ఈమాట సంపాదక మిత్రులకు,

    విషయం విషయాంతరంలోకి ప్రవేశించి శాఖాంతరచంక్రమణానికి దిగింది. “సుమతి శతకం” సుమతీ శతకం” అన్న ప్రయోగాలలో ఏది సరైనది? అన్న చర్చ బహుముఖీనంగానూ, వైయక్తికంగానూ విస్తరిస్తున్నది. అందువల్ల వ్యక్తివిమర్శను పరిహరించి విషయవిమర్శను సుందరంగా చేయాలని నా తహతహ.

    ముందుగా శాఖాంతరాల విషయం:

    (1) “వాడి మయూఖముల్” అన్నది వైరిసమాసం కాదు. పైగా నన్నయ్యగారు ప్రయోగించినది కనుక నిరాఘాటం. అందువల్ల కవులు యథేచ్ఛగా వాడుకోవచ్చును. “మయూఖవాడి” అన్నట్లయితే, అది వైరిసమాసం. ఇది సమాసవీధిలో అతిప్రాథమికమైన విషయం.

    (2) వ్యక్తినామాలైన రామారావు, సుబ్బారావు మొదలైనవి రామరావు, సుబ్బరావు అని మాత్రమే ఉండాలని ఎక్కడా ఏ అనుశాసనమూ లేదు. పైగా, ప్రౌఢవ్యాకర్త “కర్మధారయం బిరుదాద్యుత్తరపదం అయితే అదంతములైన రెండక్షరాల స్త్రీ పుంస సంజ్ఞావాచకం అయిన పూర్వపదం చివరి అక్షరానికి అంతటా దీర్ఘం బహుళంగా వస్తుందని సూత్రీకరించి (సమాస. సూ. 2) రామారావు, సుబ్బారావు పదాలను వ్యవస్థీకరించాడు. నిజానికి దీర్ఘాంతాల ప్రాచుర్యమే భాషలో కనుపిస్తుంది. చిన్నదేవి, ఎఱ్ఱప్రెగ్గడ మొదలైనవే విరళంగా కనబడతాయి.

    (3) అధ్యక్ష శబ్దానికి ప్రత్యయాంతవిధుల వల్ల అధ్యక్షత, ఆధ్యక్ష్యం భావార్థకాలుగా ఏర్పడుతాయి. రెండూ సరైనవే. అధ్వర్యు శబ్దం పైని అణ్, య ప్రత్యయాంతవిధుల విధానం వల్ల ఆధ్వర్య, ఆధ్వర్యవ అన్న రెండు రూపాలూ సాధ్యాలే. కనుక ఒకటి సరైనదని, ఒకటి అపకృష్టమని భావించటం వ్యాకరణముఖీనం కాదు.

    (4) “సుమతీ శతకం” అంటున్నట్లు భక్తీ శతకం, నీతీ శతకం అంటున్నామా? అన్నది ప్రత్యుత్థాపిత సమస్య. భక్తి, నీతి ఇకారాంత స్త్రీలింగశాబ్దాలు. కనుక భక్తీ, నీతీ అన్న రూపవిధికి ఆస్కారం ఉండదు.

    నీతిశాస్త్రం, సామదానాద్యుపాయవిధి అన్న అర్థంలో నీతీ అనే రూపం ఏర్పడదు కనుక నీతీ శతకం ఉండదు. “నీతి” అనే యువతిని సంబోధిస్తూ “నీతీ” అన్న మకుటంతో పద్యశతకాన్ని వ్రాస్తే, అది నీతీ శతకమే అవుతుంది. దేవీ శతకం అన్నట్లు. కనుక వ్యక్తి సంస్కారాన్ని బట్టి, విషయవివేకాన్ని బట్టి రూపభేదాలు, తద్విధులు విధింపబడుతున్నాయి. వీటిని స్థితగతిచింతనగా పరిశీలించటమే కాని ప్రభుసమ్మితంగా నిర్దేశించటం సాధ్యం కాదు.

    “సుమతీ శతకం”, “నీతీ శతకం” ఒకతీఱు ఉదాహరణలు కావు. సుమతి ఇకారాంత స్త్రీలింగం. క్తిన్ ప్రత్యయాంతం కావటం వల్ల సుమతీ అనే రూపసిద్ధి ఉండదనుకోవటం సహజమే కానీ శతపథ బ్రాహ్మణంలో “మతీ” శబ్దంకూడా ఉన్నది. ఆ ప్రకారం సుమతీ సుష్ఠుప్రయుక్తమే కాగలదు.

    సుమతీ శతకం ఏ పాఠకలోకంలోకి వ్యాపించిందో, ఆ పాఠకులలో అధికసంఖ్యాకులు సుమతీ శతకం అనే అంటున్నారు. అందువల్ల అది ప్రసిద్ధమైంది. చదువుకొన్నవారిలో కొద్దిమంది మాత్రమే సుమతి శతకం అంటున్నారు. అంత మాత్రాన అది ప్రమాణం కాదు.

    అంతే కాదు. ఇకారాంతాలైన ఇతర శతకాల పేర్లను చూడండి. భక్తచింతామణీ శతకం, ఆర్తరక్షామణీ శతకం ఆ విధంగానే వ్యాప్తమై ఉన్నాయి. మణి శబ్దానికి ఈకారాంత రూపం ఉన్నప్పటికీ అది ఇక్కడ అన్వయింపదు. చింతామణి శబ్దం “మణి” అన్న అర్థంలో “చింతామణీ” అని ఏర్పడదు. అయినా, భక్తచింతామణీ శతకం అనే అంటున్నాము. చింతామణీ మంత్రమైనప్పుడు మాత్రమే దీర్ఘాంతం ఉన్నది. అది ఇక్కడ ఉద్దేశించిన అర్థం కాదు. ముక్తావళీ శతకం కూడా ఇటువంటిదే.

    సుమతీ శతకం తెలుగులో తప్పు కాదు. ఇంకా వివరణ కావలసివస్తే, అహోబలపండితీయంలో “న నామ్ని” అన్న సూత్రం వృత్తిని చూడండి.

  2. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి RVS Sundaram అభిప్రాయం:

    04/16/2013 11:53 am

    తఃతః గారూ దయచేసి మన్నించండి. మీరు అలా అన్నారని కాదు, ఏవైనా పొరపాట్లు దొర్లినప్పుడు మనం సంతోషించాలా అన్నదే నా మథన. దీన్ని పొడిగించటమే నాకు బాధగా ఉంది. ఇతర భాషలనుండి మనం తీసుకొనేటప్పుడు ఆ మర్యాదల్ని పాటించాలి. కాని మనం పాటించం. ప్రవహినీ దేశ్యా అని ఏనాడో ఆంధ్రశబ్దచింతామణికారుడు చెప్పాడు. రూఢిలో స్థిరపడిన ఎన్నో పొరపాట్లని మనం అంగీకరించి వాడుతున్నాం. కాని అలా వాడటంలో కూడా ఒక క్రమం ఉంటుంది. ఫలము అనేదాన్ని ఫలం అంటున్నాం. అది వ్యవహారంలో అన్నిచోట్లా వస్తోంది. సుమతీ శతకం అన్నట్లు భక్తీ శతకం, నీతీ శతకం అంటున్నామా?

    రామారావు, సుబ్బారావు మొదలైనవి రామరావు, సుబ్బరావు అనే ఉండాలి. కానీ దాన్ని ఒప్పుకొని అన్నిచోట్లా అలాగే వాడుతున్నాము. అధ్యక్షత అన్నదాన్ని ఆధ్యక్ష్యం అనీ అధ్వర్యం అన్నదాన్ని ఆధ్వర్యవం అనీ అనాలి. కాని ఇలాంటివి వాడుకలోకి వచ్చాయి, అది కేవలం ఒక్క చోట కాదు, కాని సుమతీ శతకం లాగా పుల్లింగాలకన్నిటికీ సమాసంలో మనం దీర్ఘం వాడటం లేదు. మిమ్మల్ని విసిగించి ఉంటే మన్నించండి.

    రాళ్ళపల్లి సుందరం

  3. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి chudamani అభిప్రాయం:

    04/16/2013 8:28 am

    శ్రీనివాస్ గారికి, నమస్కారం.

    లలితగీతాలంటే నాకు చాలా ఇష్టం. విశ్వనాధంగారు లేని లోటు తీర్చలేనిది. ఇంత మంచి పాటలు మళ్ళీ వస్తాయా, వింటామా అని అనిపిస్తూ ఉంటుంది. నేను ఒక పాట కోసం వెతుకుతున్నాను. ఆ పాట “దినదినము పాపండి దీవించి పొండి, దేవలోకములోన దేవతల్లారా”. ఈ పాట మా అమ్మ పాడేది. కాబట్టి ఈ పాటని పాడిన గాయకులు ఎవరో, రచన ఎవరిదో నాకు తెలియదు. దయచేసి ఆ పాట మీ వద్ద ఉంటే ఈ సంచికలో ఇవ్వగలరా?

    అలాగే, నా చిన్నప్పుడు ధనుర్మాసంలో ఒక పాట విశాఖపట్టణం రేడియో కేంద్రం నుంచి వచ్చేది. ఆ పాట “ఏది ఏది నీ దయా వీక్షణం ఇంతించుక పరపుము మాపై మాపై”. ఈ పాట వివరాలు కూడా తెలియవు. ఈ పాటను కూడా మీరు ఈ సంచిక ద్వారా అందించగలిగితే చాలా కృతజ్ఞతలు తెలుపుకోగలను.

    చూడామణి.

  4. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    04/16/2013 1:56 am

    “అందరం కలిసి తప్పులు రాయటమే గొప్ప…” ఇటువంటి మాట నేనన్నట్టుగా ఇతరులకనిపించాలన్నట్టుగా మీరు చాలా బాగా రాశారు. ఒక వాదంలొ ఎదుటి వాళ్ళు అననివి అన్నట్టుగా భాసింప చేయగలిగినట్లుగా మాట్లాడ /రాయ గలిగిన వారిని చూసే ‘కలివిడంబనం’ వంటి కావ్యాలు వచ్చి ఉంటాయేమో గదా సుందరం గారూ.

    నమస్కారాలతో
    తః తః

  5. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి nagamurali అభిప్రాయం:

    04/16/2013 1:44 am

    నరసింహారావు గారూ, ఏ దినపత్రికలో మీరు చెప్పిన విషయం ప్రచురితమయ్యిందో, ఇంకా ఇతర వివరాలేమైనా తెలియచెయ్యగలరా?

    ఒక వేళ నిజమే అయితే

    నిజం కాదని నా నమ్మకం

    ఈ విషయం పై మీ స్పందన ఏమిటి

    ఒకవేళ నిజమే అనుకున్నా, ఒకటి రెండు ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ వల్ల నిరూపితమయ్యేది ఏమీ ఉండదు. ఆ జ్యోతిష్కుడు శాస్త్రీయమైన పరిశీలనకి లోబడి అనేకసార్లు ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ ఇవ్వగలిగితే, అప్పుడు జ్యోతిషం గురించిన శాస్త్రీయమైన పరిశోధన కొంత ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుంది. అయితే ఏ జ్యోతిష్కుడైనా అందుకు సిద్ధపడతాడని నేను అనుకోను.

    మరొక సంగతి, ఆ జ్యోతిష్కుడు నాకు తారసపడితే నేనొక సలహా ఇస్తాను. విమానం బయల్దేరే వివరాలు ఇచ్చి అది ఖచ్చితంగా ఎప్పుడు లాండవుతుందో చెప్పే జ్యోతిష సూత్రం ఏదైనా ఉంటే, ఆ సూత్రాన్ని ఉపయోగించి ఒక చిన్న మొబైల్ అప్లికేషన్ తయారు చెయ్యవచ్చు కదా. దాని సాయంతో ప్రయాణీకులకి ముందుగానే ఈ విమానం సమయానికి వెళ్తుందా, ఆలస్యం అవుతుందా, మధ్యలో కూలుతుందా – ఇలాంటి వివరాలు అన్నీ తెలిసిపోయి చాలా ఉపయోగం కలుగుతుంది కదా. దీన్ని కార్లకీ, బస్సులకీ, రైళ్ళకీ కూడా అన్వయిస్తే, జ్యోతిషం వల్ల గొప్ప లోకోపకారం (ముఖ్యంగా ఇండియాలో) జరగడమే కాకుండా, మనకి తెలిసిన సైన్సు మొత్తం మారిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా.

    (జ్యోతిషం యొక్క లాజిక్ కంప్యూటర్ సూత్రాలకి అందదు అంటే అది వేరే చర్చ. పోనీ అప్పుడు మొబైల్ అప్లికేషన్ బదులు, జ్యోతిష్కులే న్యూస్ లో ప్రతిరోజూ ఈ బస్సుల, రైళ్ళ వివరాలు తెలియచెయ్యవచ్చు.)

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి నరసింహా రావు అభిప్రాయం:

    04/15/2013 5:28 pm

    శ్రీ నాగ మురళీ గారూ,

    విషయంతో ఏమాత్రం (సూదిమొన అంత కూడా) పరిచయం లేని వాడిని. గాలి వాటుగా విన్న మాటలు చెప్పాలనిపించిది.

    చెన్నయ్ లో ఎవరో ప్రఖ్యాత జ్యోతిష్కుడు ఒక విమానం యొక్క చలన స్థితి మీద ఖచ్చితమైన జ్యోతిష్యం చెప్పారని విన్నాను. విమానం పేరు, బయలుదేరిన ప్రదేశం, బయలుదేరిన సమయం వంటి వివరాలు తెలుసుకుని, ఆ విమానం చెన్నయ్ విమానాశ్రయంలో ఏ సమయానికి నేలకు తాకుతుంది, ఏ సమయానికి పూర్తిగా ఆగిపోతుంది వంటి వివరాలు ముందుగానే వ్రాసి, ఓ కవరులో పెట్టి సీలు కూడా వేసి పరిశీలకులకు ఇచ్చారని, ఆ వివరాలు నిజమయ్యాయని, జ్యోతిష శాస్త్రం యొక్క సమర్ధతను చాటడానికే ఆయన అలా చేసారని, ఈ విషయం దిన పత్రికలలో కూడా ప్రచురితమయ్యిందనీ విన్నాను.

    ఇది నిజమేనా, ఒక వేళ నిజమే అయితే, పై వ్యాస కర్తగా, ఈ విషయం పై మీ స్పందన ఏమిటి?

  7. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి RVS Sundaram అభిప్రాయం:

    04/14/2013 12:55 pm

    వ్యవహారంలో ఉండే ఎన్నో మాటలు రచయితల ద్వారా గ్రంథాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి.

    వాడి మయూఖములని నన్నయ వాడాడని అన్ని చోట్లా అరిసమాసాలే వాడవలసిన అవసరం లేదు. భారతమును భారతం అంటున్నాం కదా అలాగే సుమతీ శతకం అంటే తప్పేముంది అని వాదించే వారితో పేచీ లేదు. నారా గారు సుమతీ శతకం అని వాడితే సంతోషించేట్లయితే మంచిదే. అందరం కలిసి తప్పులు రాయటమే గొప్ప అని ప్రచారం చేసుకుందాం తఃతః గారూ.

    రాళ్ళపల్లి సుందరం

  8. పాఠకులకు సూచనలు గురించి S.V.S.M.SASTRY అభిప్రాయం:

    04/14/2013 9:06 am

    ఈమాట చదివి రసానందాన్ని పొందుతున్నవారిలొ నేనొకడిని. సంపాదకులకు, నిర్వాహకులకు, రచయితలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    మల్లికార్జునశాస్త్రి

  9. ఓ నాలుగు చిన్న కవితలు గురించి Malleswara Rao P అభిప్రాయం:

    04/14/2013 3:01 am

    బాగున్నాయండి.

  10. నాకు నచ్చిన పద్యం: తొలికోడి కూత గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    04/13/2013 3:57 pm

    ఈ పద్యంలో నాకింకొక గమ్మత్తు కూడా కనిపించింది. తుమ్మెదల్ని, చిలుకల్ని, కోకిలల్ని గొడవ చెయ్యొద్దంటూనే ‘కొక్కొరోకో’ అంటూ కోడి అరిచింది!

    ‘సాయుధ శకటాలనెక్కి సత్యాహింసలగూర్చి అశాంతములదరునట్లు అరవాలని ఉంది నాకు’ (గజ్జెల మల్లారెడ్డి – ఆకాంక్ష)

    తొలికోడి కూత గురించిన పద్యం అనగానే పాల్కురికి సోమన పద్యమే అయ్యుంటుందని అనుకున్నాను. మీరన్నట్టుగా తొలికోడి కూతను సోమన వర్ణించిన తీరు అద్భుతం. కానీ పిల్లలమర్రి పద్యంలో కోడి కూత వ్యంగ్యార్ధంతో కూడుకున్నదేమోననిపిస్తోంది. ప్రేయసీ ప్రియుల తెల్లవారి శృంగారానికి భంగం కలిగించకూడదంటూనే అరిచి లోకాన్ని మేలుకొలిపి మరీ భంగం కలిగించిందేమోననిపించింది నాకు!