పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఊపిరిపాటకు చూపేదీ? గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    05/01/2013 7:51 pm

    స్వర చక్రవర్తి ,సుగుణాల మారాజుకి మీరిచ్చిన అక్షర నీరాజనం చాల బాగుంది

  2. పుష్పవివేకము గురించి దేశికాచారి అభిప్రాయం:

    05/01/2013 7:13 pm

    అవధానిగారి పద్యాలను ఈ పత్రికకై ఎత్తి వ్రాయడంలో అనేక లేఖకప్రమాదములు దొర్లినవి. ఇది సక్రమమైన భాషా,ఛందోజ్ఞానము లేని లేఖకుడు వ్రాసినట్లుగా గోచరించుచున్నది. ఈ దోషములు అందమైన ముద్దరాలి ముఖముపై మొటిమలవలె కవితాసౌందర్యమును కించపరచుచున్నవి.

    [మూలము నందు ఎట్లు యున్నదో అట్లనే ఎత్తి వ్రాసితిమి. తప్పులేవియో చూపినచో సరిదిద్దుకుందుము – సం.]

  3. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి SRINIVAS అభిప్రాయం:

    05/01/2013 6:29 pm

    మహేష్ గారు,

    మీ ద్రుక్కోణం బాగుంది. వ్యక్తిగతం, వ్యవస్థలో భాగం, చివరికి వ్యవస్దని శాసించడం; వరుసగా శివ , గాయం, సత్యా ల్లోని పరిణామక్రమం అని నేను అర్ధం చేసుకున్నది . వీటిలో: శివలో ‘భవానిని ఒక్కడిని చంపితే కాదు. వ్యవస్దనే మార్చాలి ‘ అంటాడు కాని అ[ఇ]ప్పటి తెలుగు సినిమాల లానే విలన్ అంతంతొ ముగుస్తుంది. (అలజడి, తమ్మారెడ్డిగారిది చూడండి వీలైతే). ఇక గాయం మనిరత్నం కథ అని మరువకూడదు. గ్యాంగ్ స్టార్ trilogy; సత్య, కంపెని మరియు ఢీ [god father movie మర్వద్దు].

    DR.K. SRINIVASARAO

    ps; వర్మ నాకు చాల నచ్చే దర్శకులు ఎందుకంటే… మిమ్మ్మల్ని కలిసినపుడు చెపుతాను. [మిమ్మలని కలవాలంటే….?]

  4. పై గదిలో ప్రేమికుడు గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    05/01/2013 6:25 pm

    సి.జీవి, శ్రీదేవి, మోహన్, అమీన్ సయానీ .. ROFL!! Brilliant Sarada!!

  5. మల్లే పూల్ మల్లే పూల్ గురించి అఫ్సర్ అభిప్రాయం:

    05/01/2013 6:24 pm

    ఇంద్రాణి గారు, కొన్ని వాక్యాల మనోవేగంతో వొక్కసారిగా బెజవాడలో దింపి వచ్చేశారుగా! చాలా మంచి ఫీల్!

  6. మల్లే పూల్ మల్లే పూల్ గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    05/01/2013 6:15 pm

    ఒక్కసారిగా ఎన్నో ఆలోచనలూ అనుభూతులూ ముప్పిరిగొన్నాయి. మొదటిది సుమారు పదేళ్ళ తరవాత గత వారాంతంలో సోకిన నిజమైన మల్లెపూల సువాసన. రెండోది అమరావతి కథల్లో పూల సుల్తాన్ కథ. ముచ్చటగా మూడోది .. ఇప్పటికింకా ఎదగడానికెందుకురా తోందరా అని గునుస్తున్న వసంతకాల ఉష్ణోగ్రత చలిచలిగా కితకితలు పెడుతోంటే తొలి వాక్యంలోనే “సాయంకాలమైనా చల్ల మిరపకాయలను మండిస్తోంది ఎండ ” అని చదివి నవ్వొచ్చింది. బావుంది ఇంద్రాణిగారూ.

  7. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    05/01/2013 6:10 pm

    శ్రీనివాసు గారి పాట అంత మధురంగానూ ఉన్నది మీ నివాళి మాస్టారూ.

  8. మల్లే పూల్ మల్లే పూల్ గురించి Sandhya అభిప్రాయం:

    05/01/2013 3:59 pm

    మల్లె పూలు చాలా బాగున్నాయి. వేసవి ఎండలలో చల్లని మంచులా ఉంది మీ మల్లె పూల కవిత.

  9. రాంగోపాల్ వర్మ చిత్రాల్లో కథానాయకుడి పరిణామక్రమం – ఒక సామాజిక విశ్లేషణ గురించి Ravi అభిప్రాయం:

    05/01/2013 1:34 pm

    మహేష్ గారు, మీ విశ్లేషణ చాల బాగుంది. వర్మ సినిమాలలో స్త్రీ పాత్రల మీద విశ్లేషణ కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాను, మీరు వీలు చూసుకొని వ్రాయగలరు.

  10. రచయితలకు సూచనలు గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    04/29/2013 9:52 pm

    ఈ మాట సంపాదకులకు నమస్కారం.

    మీరు సూచించిన క్విల్ పాడ్ ద్వార టైపు చేసిన తరువాత ఆ ఫైల్ నెట్ లొ ఎలా పంపాలి? అంటే ఆ ఫైల్ సేవ్ చేయడం ఎలాగొ తెలియటం లేదు కొంచెం వివరంగ చెప్పగలరు. లేదా ఇక్కడే అనగా (అభిప్రాయాల) స్పేస్ నుండి పంపవచ్చా తెలుపగలరు.

    [మీరు టైప్ చేసిన సారాంశాన్ని నేరుగా మెయిల్ లోనో, లేదా నోట్ పాడ్ కానీ ఎం.ఎస్.వర్డ్ లో కానీ పేస్ట్ చేసి పంపండి. అభిప్రాయాల పెట్టె ద్వారా పంపించకండి. – సం]