జరిగిన కథ ఇది!
పిబియెస్ మరణవార్త విని కలత చెందిన అనేకుల్లో ఈ వ్యాసరచయితలు కూడా ఉన్నారు! నేను పిబియెస్ పై ఒక వ్యాసం రాద్దామనుకున్నాను. మధురగాయకుడైన పిబియెస్ జీవితంలో కన్నడ పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మోహన రావు గారుతో సంప్రదించా! వారు ఎంతో సంతోషముగా ఈ ప్రయత్నాకినికి అంగీకరిస్తూ, మా అందరికీ మిత్రుడైన పరుచూరి శ్రీనివాస్ ని కూడా కలుపుకుంటే బాగుంటుందని సూచించారు. ఎన్నో పాత పాటల వివరాలు, వాటి సేకరణలో నిష్ణాతుడైన శ్రీనివాస్ లేకపోతే ఎలా అని ఆయన్ని కూడా కలుపుకున్నాం. ఇంతలో మురళీధర రావు గారు గురించి మోహనరావు గారు చెసిన సూచన మేరకి వారిని కూడా కలుపుకున్నాం కానీ, వారి రచనే స్వతంత్రంగా నిలబట్టం చేత అది ఒక ప్రత్యేక రచనగా రూపొందింది.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, పిబియెస్ యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని ఈమాట పాఠకులకి వీలైనంత ఎక్కువగా ఇవ్వాలన్న తాపత్రయం వల్ల! మోహనరావు గాౠ ఎంతో శ్రమకోర్చి రచన చేసాౠ. నేను పనివత్తిడిలో ఉన్నా! వారాంతరాలలొ కూడా పని చేసే పరిస్థితి నాది. పరుచూరి శ్రీనివాస్ యధాప్రకారం ఆఫీసు పని మీద దేశాలు తిరుగుతూ, వీలున్నప్పుడు మా ఈమైల్స్ చదువుతూ తన వంతు రాతకోతలు పూర్తి చేసారు. ఈ హడావిడిలో కొన్ని అచ్చుతప్పులు కూడా జరిగాయి.
ఈ మొత్తం తీసికెళ్ళి ఈమాట సంపాదకుడు మాధవ్ మాచవరం చేతిలో పెట్టీ “మీరు చూసుకోండి” అన్నాం!
ఆయన కష్టపడి పాటలకి, లింకులు, ఎం. పి 3 ఫార్మాట్‌లో మార్చటలు, టైపోలు దిద్దటాలు. వాక్య నిర్మాణాలు సరిగా ఉన్నవో లేదో చూసుకోటాలు జరిగాయి.
తెలుగులో “గ్రంధవిస్తరభీతి” అన్న పదం ఒకటి ఉంది. చదువరలకి ఎంతో చెప్పాలనే తాపత్రయంలో ఎంతో రాస్తాం! అప్పుడప్పుడు అది విసుగుకలిగించే ప్రమాదముంది. నేను 2, 3 పాటలకి సాహిత్యం కూడా ఇచ్చాను. అవి కత్తిరింపులకి గురి అయ్యాయి. ఆ పాటల సాహిత్యం ఇక్కడ ఇస్తున్నా!
*************
అతడు) మనసు మనసు కలిసే వేళా
మౌనమేలనే ఓ చెలియా
ఆమె) కలలు నిలిచి పలికే వేళా
(పలుక లేనురా చెలికాడా)2
మోహన గారికి : ఓపిగ్గా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అంత పొడవు వ్యాఖ్య రాసింది మీ కృషిని గుర్తెరిగే … దాన్ని చిన్నబుచ్చాలని కాదు. తక్కువ వ్యవధిలో ఇన్ని వివరాలతో, పరిశోధనతో కూడిన వ్యాసం రాయడం ఎంత కష్టమో నేను ఊహించగలను. ముందే అన్నట్లు నేను ఎత్తి చూపేందుకు కాదు వ్యాఖ్య రాసింది. అలా అనుకుంటే అన్ని గంటలు కూర్చుని ఇదే టపా చదువుతు, ఇవే పాటలు వింటూ, మళ్ళీ అందరికి పోయి చదవండని చెప్పేదాన్ని కాదు – అందువల్ల మీరు పై విషయాన్నీ, నాకు ఆయుక్షీణం కాగలదన్న విషయాన్ని కూడా గుర్తు ఉంచుకుని, ప్రార్థన, క్షమాపణ ఈ పదాలన్నీ వెనక్కి తీసుకోవాలని నేనూ ప్రార్థిస్తున్నాను! 🙂
1) ఈ వ్యాసము వ్రాయాలని ఏప్రిల్ 16, 17 తేదీలలో మేము తీర్మానించాము. సుమారు పది రోజులలో వ్యాసమంతటిని వ్రాసినాము. లక్ష్మన్నగారు, శ్రీనివాస్ గారు తెలుగు చిత్రగీతాల గురించి, శ్రీనివాస్ గారు అరుదైన లలితగీతాల, చిత్ర గీతాల గురించి వ్రాసినారు. నేను తమిళ, కన్నడ చిత్రసీమలలో పిబిఎస్ కృషిని గురించి వ్రాసినాను. నావరకు నాకు గీతముల ఎంపికకోసం, వాటిని గురించి వ్రాయడముకోసం సుమారు ఒక వారము రాత్రనక పగలనక కాలము వెళ్లబుచ్చవలసి వచ్చింది. తరువాత కూడ తప్పులను సరిదిద్దడానికి దీర్ఘకాలమును గడపవలసి వచ్చినది. త్వరగా వ్రాసినందువలన కొన్ని తప్పులు దొరలడము సహజమే. వాటికి నా తరఫున, నా తోటి రచయితల తరఫున క్షమాపణలను అందుకొనవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
2) పాటగురించి చర్చ ఉన్నప్పుడు ఆ పాటను వ్యాసములోనే ఉంచడము జరిగినది. వేరే లంకెకు వెళ్లితే చదవడములో అంతరాయము కలుగుతుందని ఈ ఏర్పాటు. మరి కొన్ని వేళలలో ఇక్కడి లంకెలో ఒక వీణ పలుకో, లేక ఒక గమకమో ఎక్కువగా ఉండి ఉంటుందని అలా చేయడమైనది.
3) తమిళ చిత్రగీతముల వివరాలు –
అత్తిక్కాయ్ కాయ్ కాయ్ – బలే పాండియా
మనిదన్ ఎన్బవన్, మయక్కమా కలక్కమా – శుమై తాంగి
అనుబవం పుదుమై, నాళాం నాళాం తిరునాళాం – కాదలిక్క నేరమిల్లై
ఇంద మండ్రత్తిల్ ఓడి వరుం, పొన్ ఎన్బేన్ – పోలీస్‌కారన మగళ్
నినైప్పదెల్లాం నడందు విట్టాల్ – నెంజిల్ ఓర్ ఆలయం
నిలవే ఎన్నిడం నెరుంగాదే – రాము
నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం – కలైక్కోవిల్
కలైక్కోవిల్ పాటను గురించి ఒక మాట, ఈ చిత్రములో బాలమురళి గళముతో, చిట్టిబాబు వీణతో సరిసమానముగా పిబిఎస్ పాడినాడు, ఇక్కడ ఇవ్వబడిన యుగళగీతము నాకు నచ్చిన పిబిఎస్ యుగళగీతాలలో ఒక ముఖ్య స్థానమును ఆక్రమించుకొన్నది. మిగిలిన పాటల వివరాలు వ్యాసములోనే ఉన్నాయి.
4) ఓహిలేశ్వర చిత్రములోని పాటలోని తునకను సంపాదించుటకు చాల ప్రయత్నము చేసిన తరువాత ఇది దొరికినది. ఆ చిత్రములోని పాటలలో ఘంటసాల పాటలకు మాత్రమే లంకెలు ఉన్నాయి. ఒక టివి కార్యక్రమమునుండి దీనిని గ్రహించాను. అందువలన ఆ సంభాషణ అనివార్యము. ఉద్దేశము ఆ పాటను అందించడము కాబట్టి మాటలను మనము భరించాలి.
5) కూడి వాళ్‌న్దాల్ కోడి నణ్మై అనే చిత్రము remake, కాని ఇవ్వబడిన లంకె fusion. ఈ చిత్రమును youtubeలో చూడ వీలగును.
6) తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో పిబిఎస్ వేలకొలది పాటలు పాడారు. అందులో మాకు నచ్చినవి కొన్నిటిని పాఠకులకు పరిచయము చేసినాము. వాటికి లంకెలను ఇచ్చాము. అందులో ప్రతి భాషలో మూడో నాలుగో పాటలు దీర్ఘముగా చర్చించబడినవి. అందులో కొన్నిటికి అదే మెట్టులో అనువాదమును ఇవ్వడానికి ప్రయత్నించాను.
7) జెమినీ గణేశన్, రాజకుమార్ స్వతహాగా గాయకులు, అయినా వాళ్లకు పిబిఎస్ పాడాడు. మనము శ్రోతలు నటుడి, గాయకుడి గాత్రములు సరిపోయాయని అనుకొంటాము. ఇది ఒక ఊహ మాత్రమే అని అంటాడు పిబిఎస్. ఎందుకంటే అదే గణేశన్‌కు ఏ ఎం రాజా పాడాడు. శ్రోతలు ప్రేక్షకులు అది కూడ సరిపోయింది అన్నారు. రాజకుమార్ తరువాతి కాలములో తనకు తానే పాడు కొన్నాడు. చిత్రసీమలో ఎన్నో illusions ఉన్నాయి. అందులో ఈ గాత్రపు పొంతన కూడ ఒకటి అంటాడు పిబిఎస్, అంతే.
కొత్త సంపాదకుని తొలిమాట
జూలై 2004 » సంపాదకీయం
పాఠకలోకానికి స్వాగతం
ఐదు వసంతాలు ఈమాట పత్రికని అద్భుతంగా నడిపిన రామారావు, “కాస్త విశ్రాంతి తీసుకుంటాను, ఎవరైనా ఈమాట నడిపితే బాగుండును,” అని అనంగానే, తగుదునమ్మా అనుకుంటూ నేను ముందుకి దూకాను. ఎప్పుడో ఎక్కడో విన్నాను, దేవతలు తొందరపడి ఏ పనికీ దిగరని, రాక్షసులు సాహసించి ప్రతిపనికీ నిర్భయంగా, దూకుడుగా దిగుతారనీ. కాస్తో కూస్తో ఆ రాక్షస అంశ నాలో ఉండి ఉండాలి.
కానీ ఒక్క పాత భయం. చిన్నప్పుడు ఏలూరులో రెండు సంవత్సరాలు ఒక రాజకీయ వారపత్రిక నడిపాం. ఆ రెండేళ్ళూ పూర్తి అయ్యేటప్పటికి ఏ రాజకీయ పార్టీ లోనూ ఒక్కడంటే ఒక్కడుకూడా కనీసం పలకరించే స్నేహితుడిగానైనా మిగల్లేదు. మూడు దశాబ్దాలక్రితం, అట్లాంటాలో వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో నెలవారీ పత్రిక వచ్చేది. అందులో రాసిన స్నేహితులతో సాహిత్య పరంగా నాకు చాలా పేచీలు వచ్చిన మాట వాస్తవం. సుమారు రెండున్నర దశాబ్దాలక్రితం చికాగోలో తెలుగు సంస్థకి ఒక మాసపత్రిక రెండేళ్ళు నడపడం జరిగింది. ఇప్పటికీ కొంతమందికి నామీద కోపం తగ్గలేదు.
మీరన్న మాటలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుస్తుంది.
కొన్ని పదవులు శిరసున ధరించే ముళ్ళ కిరీటాలు. గులాబీలు పరచిన కుర్చీలు. విడిచెళ్తున్నప్పుడు హాయిలేని బాధగా వుంటుంది. బాధే కాని, బరువైన హాయీ వుంటుంది.
సంపాదకులుగా మీ అనుభవాలను హాస్యరచనలుగా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
మీ సంపాదకత్వంలో నా రచనలిక్కడ చోటు చేసుకున్నాయి. అందుకు చాలా కృతజ్ఞతలు.
మేలైన మరిన్ని మంచి రచనల్ను మీ నించి ఆశిస్తూ,
శుభాకాంక్షలతో ..
-ఆర్.దమయంతి.
అత్యంత అరుదైన మహాకవి ప్రసంగాన్ని సమీకరించి పాఠకులకు వినే భాగ్యాన్ని కలుగజేసిన మీకు శత సహస్రాభి వందనాలు. శ్రీ రామ భరద్వాజ్ గారు శ్రీశ్రీ ప్రసంగాన్ని అన్ని కోణాలనుండి విశ్లేషించారు. వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఇటువంటి అరుదైన క్లిప్పింగులను అనేకం సేకరించాలని, ఎవరివద్దనైనా అటువంటి మణిహారాలు వుంటే, వాటిని ఉదారంగా ‘ఈ మాట’ హారానికి జత చెయ్యాలని విజ్ఞులకు మనవి చేస్తూ … శ్రీ శ్రీ గారు స్వయంగా గానం చేసిన వీడీయో వుంటే (ఆడియో లభ్యం అవుతోంది కనుక) డాన్ని కూడా ‘ఈ మాట’ కు తోడు పంపండి.
వ్యాసం ఆసక్తికరంగా ఉంది. పి.బి.యస్. గారికి సంబంధించిన ఈ నెల వ్యాసాలన్నీ ఆయన గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిస్తున్నాయి. వీటిని ఇలా అంతర్జాలంలోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఈ సిరీస్ లోని తక్కిన వ్యాసాలు కూడా డిజిటైజ్ చేయబోతున్నారా? ఏకైక కొరత ఏమిటంటే, మీ పత్రిక నుండి నేను ఊహించేదానికంటే ఎక్కువే టైపోలు కనబడ్డాయి. కొంచెం సరిచూసుకోగలరు.
[కారణాలేమైనా, ఈ సంచికలో టైపోలు ఎక్కువగానే ఉన్నాయి. అందరికీ మా క్షమాపణలు. ఇప్పటికే ఒక్కో వ్యాసం సరిచేసుకుంటూ వస్తున్నాము. త్వరలోనే అన్ని టైపోలు దిద్దుతాము. – సం.]
నాకు ఈ వ్యాసం మొత్తంగా అర్థమైందని నేను చెప్పను. కానీ, మీ నివాళి మాత్రం అద్భుతంగా ఉంది. పి.బి.యస్. గారిలోని వివిధ కోణాల గురించి గొప్పగా పరిచయం చేశారు, మీ నివాళి రాస్తూనే. కొంచెం పెద్ద వ్యాసం, అందులోనా నాకు అంతగా పరిచయం లేని పదజాలం కూడా కనుక నేను కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ, అదో ఇబ్బంది కాదు మీరు పొందుపరచిన సమాచారం విలువతో పోలిస్తే. అక్కడక్కడా కొన్ని టైపోలు తప్ప… వ్యాసం అద్భుతం మురళీధరరావు గారు!
వ్యాసం బాగుందండీ. మంచి పాటలు, వివిధ భాషల్లో వినిపించారు శనివారం పొద్దున్నే. ధన్యవాదాలు. మొత్తానికి చాలాసేపు పట్టింది వ్యాసం పూర్తి చేయడానికి… నాకు నచ్చినవి కొన్నిసార్లు వింటూ వచ్చేసరికి! ఏదో, నా వ్యాఖ్య రాయబోయి, మరీ పొడుగ్గా ఉందని పేజీల వారీగా రాస్తున్నాను.
మొదటి పేజీ:
* నాకు సంగీతం గురించి ఏమాత్రం అవగాహన లేదు కానీ, మీ పరిశీలనలు (శ్రుతి నిర్ణయం వగైరా) ఆసక్తికరంగా ఉన్నాయి.
* “మనసులోని కోరిక” పాట ఆడియోలో కొంచెం noise ఎక్కువగా ఉన్నట్లు తోచింది. అలాగే, “శ్రీ రఘురాం జయ రఘురాం” మొదట్లో ఒకట్రెండు అక్షరాలు కనీసం నాకైతే వినబళ్ళేదు. పాట రాగా.కాం వర్షన్ ఈ విషయంలో క్లియర్ గా అనిపించింది. “మనసు మనసు కలిసే” – అన్న పాట చివర్లో ఎగిరిపోయింది మీరు పెట్టిన ఫైల్లో. రాగా.కాం లంకెలో మళ్ళీ పూర్తిగా వినగలిగాను. (ఈ లంకెలివ్వడం ఇక్కడ ఈకలేరడానికి కాదండి. ఆ పాటలు నాకు వినసొంపుగా అనిపించి, పూర్తిగా వినాలన్న కోరిక కొద్దీ అటు వెళ్ళానంతే! నేను ఆట్టే పరిశీలించి ఏమీ వినడం లేదు. కనుక, మీరు పెట్టిన ఫైళ్ళలో ఉండి, ఆ రాగా.కాం లంకెల్లో లేని వాక్యాలూ గట్రా ఉన్నవేమో నాకు తెలియదు. ఏమాటకామాటే, ఎగిరిపోయిన ఆ ముప్పై సెకన్లూ కూడా చాలా బాగున్నాయి వినేందుకు.)
రెండవ పేజీ:
* ఇక్కడ కూడా కొన్ని పాటల నేపథ్యగోల (అదే, background noise) ఇబ్బంది పెట్టింది కానీ, నాకు తారసపడ్డ ఇతర పాటల వెబ్సైట్లలో కూడా అదే కొనసాగింది కనుక, ఈసారికింతే అనుకుంటున్నాను.
* భక్త పోతన, భాగవతంలోని పద్యాల గురించి చెబుతూ, పక్కన ఇతర చిత్రాల పాటలు పెట్టడం కొంచెం అయోమయానికి గురి చేసింది. ప్రత్యేకించి అక్కడ ఆ పాటలు (ఎలాగే సుఖాల, ఆనంద మోహనా… వగైరా) పెట్టడానికి ఏవన్నా కారణాలున్నవా? అన్నది నాకర్థం కాలేదు. “రాదటే చెలీ రాధికా” పాట చెంచులక్ష్మి సినిమా పాటల ప్రస్తావన పక్కన పెట్టారు. కానీ, ఆ పాట గురించి కిందెక్కడో ప్రస్తావించారు. కొన్ని తమిళ పాటలకి అవే చిత్రానివో చెప్పలేదు. వెదుక్కొమ్మని మీరనవచ్చు, వెదుక్కోవడం కూడా అంత కష్టం కాదు కానీ, కొంచెం అయోమయానికి గురయ్యానని చెప్పేందుకు ఈ విషయం చెబుతున్నది. ఇలాంటి అంశాలు బహుశా వ్యాసం మాత్రం చదివేవారికో, పాటలు మాత్రం వినేవారికో, ఈ సంగతులన్నీ ఇంకోరి వివరణ లేకుండా తెలిసుకునే వారికో అయోమయం కలిగించవు కానీ – వీళ్ళందరూ కాక, వ్యాసం చదువుతూనే ఎక్కడికక్కడ ఆగి పాటలు వింటూ, మొత్తానికి అసలు విషయం గురించి ఆట్టే అవగాహన లేని వారు కూడా ఈ వ్యాసం చదివే అవకాశం ఉందని కొంచెం గమనించగలరు.
* చెంచు లక్ష్మి పాటల గురించిన విషయం ఆసక్తికరంగా ఉంది. ఎందుకోగానీ “చిలకా గోరింక కులికే పకా పకా ” మాత్రం నాకు ప్లే అవడంలేదు. నేరుగా ఎం.పీ3 ని ప్లే చేస్తే మాత్రం పని చేసింది.
* మీరు ఏ పాటలకి లంకెలిచ్చి వదిలేస్తున్నారు? ఏ పాటలు మీరే ప్లేయర్ ద్వారా పెడుతున్నారు? వేటిని ఊరికే ప్రస్తావించి వదిలేస్తున్నారు? దేనికి విడియో లంకెలిస్తున్నారు? పాటలు యూట్యూబు, రాగాల్లో ఉన్నా కొన్నింటికి లంకెలు ఎందుకివ్వలేదు? అన్నది నాకు కొంచెం కుతూహలంగా ఉంది. మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన పాటలు చాలామటుకు రాగా, యూట్యూబ్ వంటి సైట్లలో లభ్యం అవుతూనే ఉన్నాయి. లంకెలివ్వని వాటిలో కూడా కనీసం నేను విందాం అనుకుని అంతర్జాలంలో వెదికిన వాటికి లంకెలు దొరికాయి. కొంచెం ఏమనుకోకపోతే వివరించగలరా?
* కూనలమ్మ పదాలు ఇలా వినడం చాలా బాగుంది. “రోజామలరే రాజకుమారీ”, “అత్తిక్కాయ్ కాయ్ కాయ్” వంటివి ఏదో చిన్నప్పుడు మా అమ్మ ద్వారానో టీవీ ద్వారానో వినడమే కానీ ఎప్పుడూ పూర్తిగా ఇలా వినలేదు. థాంక్స్.
హిందీ సినిమా న్యూఢిల్లీ తమిళంలో ప్రతి కూడి వాళ్దాల్ కోడి నణ్మై అనే సినిమాగా తీశారు.
– మీరు చెబుతున్నది Koodi Vazhnthal Kodi Nanmai అన్న సినిమానేనా? లేదంటే ప్రతి Koodi Vazhnthal Kodi Nanmai అని వేరొక సినిమా ఉందా? తమిళ ప్రతి … అని రాసి అనే సినిమాగా తీశారు… అని మళ్ళీ రాయడంతో, ప్రతి అన్నది remake అన్న అర్థం లో కాక, సినిమా పేరులోని భాగమే నేమో అనిపించింది నాకు!
మూడవ పేజీ:
* Man to Moon పాటల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంది. పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా ఆకట్టుకోలేదు కానీ బాగున్నాయి.
* “ఈ దేహదింద – ఓహిలేశ్వర” అని పెట్టిన ఆడియో లో అసలు పాట కంటే ఇంటర్వ్యూ ఎక్కువ కనుక, మీరు ఆ విషయం అక్కడ చెప్పి ఉంటే కొంచెం సబబుగా ఉండేదేమో!
నాలుగోపేజి:
ఈ నాలుగోపేజి మాత్రం ఏదో గబగబా, బోలేడు విషయాలన్నీ అర్జెంటుగా ఒకే పేజీలో చెప్పాలన్న ఆత్రంతో రాసినట్లు తోచిందండీ నాకు. నేనింకా అన్నీ వినలేదు కానీ, విన్నంతలో పాటలు చాలా బాగున్నాయి!
ఐదవ పేజీ:
నిజంగా జెమినీ గణేశన్‌కు ఎ.ఎం.రాజా గొంతుక, తనది రెండు సరిపోతాయన్నది అలాటిదే. అదే విధంగా రాజకుమార్‌కు తన గొంతు సరిపోవడం అనేది కూడా. ఎందుకంటే వాళ్లిద్దరు స్వతహాగా మంచి గాయకులు.
– నిజానికి నాకు ఈ రెండు వాక్యాలకీ మధ్య సంబంధం ఏమిటో అర్థం కాలేదు. వాళ్ళిద్దరు స్వతహాగా గాయకులు అయినా కూడా పి.బి.ఎస్. గళం వాళ్ళకి బాగా నప్పుతుందని వినేవాళ్ళు అనుకోవచ్చుగా?
ముందే అన్నట్లు, ఇది ఏదో ఇక్కడ లోపాలు ఎత్తిచూపాలని రాస్తున్న వ్యాఖ్య కాదు. నాకు ఈ విషయాల గురించి ఇంకోరిని సరిచేసేంత అవగాహన కాదు సరికదా…ప్రాథమిక అవగాహన కూడా లేదు. గమనించగలరు.
This post really brightened up my cloudy spring morning. I started listening at about 6 am and continued with the post for the next 4, 5 hours! Thanks for that. (Although my browser may not be so thankful as its flash plugin crashed several times in the process!)
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/04/2013 11:43 am
జరిగిన కథ ఇది!
పిబియెస్ మరణవార్త విని కలత చెందిన అనేకుల్లో ఈ వ్యాసరచయితలు కూడా ఉన్నారు! నేను పిబియెస్ పై ఒక వ్యాసం రాద్దామనుకున్నాను. మధురగాయకుడైన పిబియెస్ జీవితంలో కన్నడ పాటలకు ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మోహన రావు గారుతో సంప్రదించా! వారు ఎంతో సంతోషముగా ఈ ప్రయత్నాకినికి అంగీకరిస్తూ, మా అందరికీ మిత్రుడైన పరుచూరి శ్రీనివాస్ ని కూడా కలుపుకుంటే బాగుంటుందని సూచించారు. ఎన్నో పాత పాటల వివరాలు, వాటి సేకరణలో నిష్ణాతుడైన శ్రీనివాస్ లేకపోతే ఎలా అని ఆయన్ని కూడా కలుపుకున్నాం. ఇంతలో మురళీధర రావు గారు గురించి మోహనరావు గారు చెసిన సూచన మేరకి వారిని కూడా కలుపుకున్నాం కానీ, వారి రచనే స్వతంత్రంగా నిలబట్టం చేత అది ఒక ప్రత్యేక రచనగా రూపొందింది.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, పిబియెస్ యొక్క విశిష్ట వ్యక్తిత్వాన్ని ఈమాట పాఠకులకి వీలైనంత ఎక్కువగా ఇవ్వాలన్న తాపత్రయం వల్ల! మోహనరావు గాౠ ఎంతో శ్రమకోర్చి రచన చేసాౠ. నేను పనివత్తిడిలో ఉన్నా! వారాంతరాలలొ కూడా పని చేసే పరిస్థితి నాది. పరుచూరి శ్రీనివాస్ యధాప్రకారం ఆఫీసు పని మీద దేశాలు తిరుగుతూ, వీలున్నప్పుడు మా ఈమైల్స్ చదువుతూ తన వంతు రాతకోతలు పూర్తి చేసారు. ఈ హడావిడిలో కొన్ని అచ్చుతప్పులు కూడా జరిగాయి.
ఈ మొత్తం తీసికెళ్ళి ఈమాట సంపాదకుడు మాధవ్ మాచవరం చేతిలో పెట్టీ “మీరు చూసుకోండి” అన్నాం!
ఆయన కష్టపడి పాటలకి, లింకులు, ఎం. పి 3 ఫార్మాట్‌లో మార్చటలు, టైపోలు దిద్దటాలు. వాక్య నిర్మాణాలు సరిగా ఉన్నవో లేదో చూసుకోటాలు జరిగాయి.
తెలుగులో “గ్రంధవిస్తరభీతి” అన్న పదం ఒకటి ఉంది. చదువరలకి ఎంతో చెప్పాలనే తాపత్రయంలో ఎంతో రాస్తాం! అప్పుడప్పుడు అది విసుగుకలిగించే ప్రమాదముంది. నేను 2, 3 పాటలకి సాహిత్యం కూడా ఇచ్చాను. అవి కత్తిరింపులకి గురి అయ్యాయి. ఆ పాటల సాహిత్యం ఇక్కడ ఇస్తున్నా!
*************
అతడు) మనసు మనసు కలిసే వేళా
మౌనమేలనే ఓ చెలియా
ఆమె) కలలు నిలిచి పలికే వేళా
(పలుక లేనురా చెలికాడా)2
అతడు) కన్నుల దాగిన అనురాగం
పెదవులపై విరబూయాలి
ఆమె) పెదవులకందని అనురాగం
(మదిలో గానం చేయాలి)2
ఆమె) పల్లవించు మన కలలన్ని
పరిమళించె విరజాజులుగా
అతడు) వన్నె వన్నె కోరికలన్నీ
(మిన్నుల కెగసెను గువ్వలుగా)2
ఇద్దరు) కన్నుల దాగిన అనురాగం
మన పెదవులకందని అనురాగం
అతడు) విరిసే నీ చిరునవ్వులలో
కరగిపోదునా కలకాలం
ఆమె) మెరిసే నీ కనుపాపలలో
(పరవసించనా చిరకాలం)2
*******************
Emi rAmakatha! SabarI, SabarI; EdI, mariyokasAri!
ఏమి రామకథ-రామకథా సుధ ఎంత తీయనిది!
రవికుల శశియై, రాఘవుడై;
రాముడయి, గుణధాముడయి;
అవతరించునట హరి మనకై… దాశరథీ దయాజలధి
వాలుకనుల ఆ జానకిని ఓరకనుల ఒకసారి గని,
కేల శివుని విల్లందుకొని, లీల విరిచెనట!
లీల నీరద శ్యాముడట, కల్యాణ రాముడట!!
మౌని భార్య మర్యాద చెడి, ధూళి పడి, శిలయైన: జాలిపడి,
దీనురాలి తన padamula తాకి, ప్రాణమొసగు
కారుణ్యధాముడట!!
కూరిమి తమ్మునితో, బంగారు బొమ్మ సీతమతో
నార చీరలూని అయ్య-కారడవుల కేగగా
రామచంద్రా, రాఘవేంద్రా! రామా, రామా, రామా, రామా!
రామభద్రా, గుణసముద్ర!
అని అయోధ్య ఏడ్చెనంట; అశ్రుధారలోడ్చెనంట!
ఏమి రామ కథ, వ్యధయై, సుధయై, ఏరై పొంగెడు మదిలో!
నావైనా, రేవైనా, నడిపే చుక్కానియైనా నీవేకద!
నీకు గుహుడు కావాలా, గంగదాట!
“అన్నా, వలదన్నా! అడవికి పోవలదు….”
అను తమ్ముని లాలించి, అయ్యమాట పాలించి,
పాదుకచే మహారాజ్య భారము మోయించితివా!
మరోసారి మరిన్ని వివరాలతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Sowmya అభిప్రాయం:
05/04/2013 10:50 am
అన్నట్లు, అనువాదం బాగున్నది. నాకున్న పరిమిత తమిళ పాండిత్యంలో మొత్తం అర్థం చేసుకోలేకపోయేదాన్ని మీ అనువాదం లేకపోతే!
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Sowmya అభిప్రాయం:
05/04/2013 10:48 am
మోహన గారికి : ఓపిగ్గా సమాధానం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను అంత పొడవు వ్యాఖ్య రాసింది మీ కృషిని గుర్తెరిగే … దాన్ని చిన్నబుచ్చాలని కాదు. తక్కువ వ్యవధిలో ఇన్ని వివరాలతో, పరిశోధనతో కూడిన వ్యాసం రాయడం ఎంత కష్టమో నేను ఊహించగలను. ముందే అన్నట్లు నేను ఎత్తి చూపేందుకు కాదు వ్యాఖ్య రాసింది. అలా అనుకుంటే అన్ని గంటలు కూర్చుని ఇదే టపా చదువుతు, ఇవే పాటలు వింటూ, మళ్ళీ అందరికి పోయి చదవండని చెప్పేదాన్ని కాదు – అందువల్ల మీరు పై విషయాన్నీ, నాకు ఆయుక్షీణం కాగలదన్న విషయాన్ని కూడా గుర్తు ఉంచుకుని, ప్రార్థన, క్షమాపణ ఈ పదాలన్నీ వెనక్కి తీసుకోవాలని నేనూ ప్రార్థిస్తున్నాను! 🙂
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:
05/04/2013 10:00 am
సౌమ్య గారు,
1) ఈ వ్యాసము వ్రాయాలని ఏప్రిల్ 16, 17 తేదీలలో మేము తీర్మానించాము. సుమారు పది రోజులలో వ్యాసమంతటిని వ్రాసినాము. లక్ష్మన్నగారు, శ్రీనివాస్ గారు తెలుగు చిత్రగీతాల గురించి, శ్రీనివాస్ గారు అరుదైన లలితగీతాల, చిత్ర గీతాల గురించి వ్రాసినారు. నేను తమిళ, కన్నడ చిత్రసీమలలో పిబిఎస్ కృషిని గురించి వ్రాసినాను. నావరకు నాకు గీతముల ఎంపికకోసం, వాటిని గురించి వ్రాయడముకోసం సుమారు ఒక వారము రాత్రనక పగలనక కాలము వెళ్లబుచ్చవలసి వచ్చింది. తరువాత కూడ తప్పులను సరిదిద్దడానికి దీర్ఘకాలమును గడపవలసి వచ్చినది. త్వరగా వ్రాసినందువలన కొన్ని తప్పులు దొరలడము సహజమే. వాటికి నా తరఫున, నా తోటి రచయితల తరఫున క్షమాపణలను అందుకొనవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
2) పాటగురించి చర్చ ఉన్నప్పుడు ఆ పాటను వ్యాసములోనే ఉంచడము జరిగినది. వేరే లంకెకు వెళ్లితే చదవడములో అంతరాయము కలుగుతుందని ఈ ఏర్పాటు. మరి కొన్ని వేళలలో ఇక్కడి లంకెలో ఒక వీణ పలుకో, లేక ఒక గమకమో ఎక్కువగా ఉండి ఉంటుందని అలా చేయడమైనది.
3) తమిళ చిత్రగీతముల వివరాలు –
అత్తిక్కాయ్ కాయ్ కాయ్ – బలే పాండియా
మనిదన్ ఎన్బవన్, మయక్కమా కలక్కమా – శుమై తాంగి
అనుబవం పుదుమై, నాళాం నాళాం తిరునాళాం – కాదలిక్క నేరమిల్లై
ఇంద మండ్రత్తిల్ ఓడి వరుం, పొన్ ఎన్బేన్ – పోలీస్‌కారన మగళ్
నినైప్పదెల్లాం నడందు విట్టాల్ – నెంజిల్ ఓర్ ఆలయం
నిలవే ఎన్నిడం నెరుంగాదే – రాము
నాన్ ఉన్నై శేర్న్ద శెల్వం – కలైక్కోవిల్
కలైక్కోవిల్ పాటను గురించి ఒక మాట, ఈ చిత్రములో బాలమురళి గళముతో, చిట్టిబాబు వీణతో సరిసమానముగా పిబిఎస్ పాడినాడు, ఇక్కడ ఇవ్వబడిన యుగళగీతము నాకు నచ్చిన పిబిఎస్ యుగళగీతాలలో ఒక ముఖ్య స్థానమును ఆక్రమించుకొన్నది. మిగిలిన పాటల వివరాలు వ్యాసములోనే ఉన్నాయి.
4) ఓహిలేశ్వర చిత్రములోని పాటలోని తునకను సంపాదించుటకు చాల ప్రయత్నము చేసిన తరువాత ఇది దొరికినది. ఆ చిత్రములోని పాటలలో ఘంటసాల పాటలకు మాత్రమే లంకెలు ఉన్నాయి. ఒక టివి కార్యక్రమమునుండి దీనిని గ్రహించాను. అందువలన ఆ సంభాషణ అనివార్యము. ఉద్దేశము ఆ పాటను అందించడము కాబట్టి మాటలను మనము భరించాలి.
5) కూడి వాళ్‌న్దాల్ కోడి నణ్మై అనే చిత్రము remake, కాని ఇవ్వబడిన లంకె fusion. ఈ చిత్రమును youtubeలో చూడ వీలగును.
6) తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో పిబిఎస్ వేలకొలది పాటలు పాడారు. అందులో మాకు నచ్చినవి కొన్నిటిని పాఠకులకు పరిచయము చేసినాము. వాటికి లంకెలను ఇచ్చాము. అందులో ప్రతి భాషలో మూడో నాలుగో పాటలు దీర్ఘముగా చర్చించబడినవి. అందులో కొన్నిటికి అదే మెట్టులో అనువాదమును ఇవ్వడానికి ప్రయత్నించాను.
7) జెమినీ గణేశన్, రాజకుమార్ స్వతహాగా గాయకులు, అయినా వాళ్లకు పిబిఎస్ పాడాడు. మనము శ్రోతలు నటుడి, గాయకుడి గాత్రములు సరిపోయాయని అనుకొంటాము. ఇది ఒక ఊహ మాత్రమే అని అంటాడు పిబిఎస్. ఎందుకంటే అదే గణేశన్‌కు ఏ ఎం రాజా పాడాడు. శ్రోతలు ప్రేక్షకులు అది కూడ సరిపోయింది అన్నారు. రాజకుమార్ తరువాతి కాలములో తనకు తానే పాడు కొన్నాడు. చిత్రసీమలో ఎన్నో illusions ఉన్నాయి. అందులో ఈ గాత్రపు పొంతన కూడ ఒకటి అంటాడు పిబిఎస్, అంతే.
విధేయుడు – మోహన
Good Bye. గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/04/2013 9:40 am
తొమ్మిదేళ్ళ కిందటి మాట:
మీరన్న మాటలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుస్తుంది.
కొన్ని పదవులు శిరసున ధరించే ముళ్ళ కిరీటాలు. గులాబీలు పరచిన కుర్చీలు. విడిచెళ్తున్నప్పుడు హాయిలేని బాధగా వుంటుంది. బాధే కాని, బరువైన హాయీ వుంటుంది.
సంపాదకులుగా మీ అనుభవాలను హాస్యరచనలుగా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
మీ సంపాదకత్వంలో నా రచనలిక్కడ చోటు చేసుకున్నాయి. అందుకు చాలా కృతజ్ఞతలు.
మేలైన మరిన్ని మంచి రచనల్ను మీ నించి ఆశిస్తూ,
శుభాకాంక్షలతో ..
-ఆర్.దమయంతి.
కతికితే అతకదు గురించి b. ajay prasad అభిప్రాయం:
05/04/2013 8:25 am
ఈ కథ బాగుంది. అభినందనలు.
శ్రీశ్రీ ఉపన్యాసం గురించి ఆచారం షణ్ముఖాచారి అభిప్రాయం:
05/04/2013 8:25 am
అత్యంత అరుదైన మహాకవి ప్రసంగాన్ని సమీకరించి పాఠకులకు వినే భాగ్యాన్ని కలుగజేసిన మీకు శత సహస్రాభి వందనాలు. శ్రీ రామ భరద్వాజ్ గారు శ్రీశ్రీ ప్రసంగాన్ని అన్ని కోణాలనుండి విశ్లేషించారు. వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ, ఇటువంటి అరుదైన క్లిప్పింగులను అనేకం సేకరించాలని, ఎవరివద్దనైనా అటువంటి మణిహారాలు వుంటే, వాటిని ఉదారంగా ‘ఈ మాట’ హారానికి జత చెయ్యాలని విజ్ఞులకు మనవి చేస్తూ … శ్రీ శ్రీ గారు స్వయంగా గానం చేసిన వీడీయో వుంటే (ఆడియో లభ్యం అవుతోంది కనుక) డాన్ని కూడా ‘ఈ మాట’ కు తోడు పంపండి.
హాయిగ పాడుదునా? గురించి Sowmya అభిప్రాయం:
05/04/2013 5:41 am
వ్యాసం ఆసక్తికరంగా ఉంది. పి.బి.యస్. గారికి సంబంధించిన ఈ నెల వ్యాసాలన్నీ ఆయన గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలం కలిగిస్తున్నాయి. వీటిని ఇలా అంతర్జాలంలోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఈ సిరీస్ లోని తక్కిన వ్యాసాలు కూడా డిజిటైజ్ చేయబోతున్నారా? ఏకైక కొరత ఏమిటంటే, మీ పత్రిక నుండి నేను ఊహించేదానికంటే ఎక్కువే టైపోలు కనబడ్డాయి. కొంచెం సరిచూసుకోగలరు.
[కారణాలేమైనా, ఈ సంచికలో టైపోలు ఎక్కువగానే ఉన్నాయి. అందరికీ మా క్షమాపణలు. ఇప్పటికే ఒక్కో వ్యాసం సరిచేసుకుంటూ వస్తున్నాము. త్వరలోనే అన్ని టైపోలు దిద్దుతాము. – సం.]
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Sowmya అభిప్రాయం:
05/04/2013 5:15 am
నాకు ఈ వ్యాసం మొత్తంగా అర్థమైందని నేను చెప్పను. కానీ, మీ నివాళి మాత్రం అద్భుతంగా ఉంది. పి.బి.యస్. గారిలోని వివిధ కోణాల గురించి గొప్పగా పరిచయం చేశారు, మీ నివాళి రాస్తూనే. కొంచెం పెద్ద వ్యాసం, అందులోనా నాకు అంతగా పరిచయం లేని పదజాలం కూడా కనుక నేను కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ, అదో ఇబ్బంది కాదు మీరు పొందుపరచిన సమాచారం విలువతో పోలిస్తే. అక్కడక్కడా కొన్ని టైపోలు తప్ప… వ్యాసం అద్భుతం మురళీధరరావు గారు!
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Sowmya అభిప్రాయం:
05/04/2013 4:43 am