పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఈమాట మే 2013 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:

    05/05/2013 5:47 pm

    పి బి శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు, వారిని అడుగగా వారు తన స్వహస్తముతో వ్రాసి శ్రీ బ్రహ్మానందం గొర్తి గారికి ఒక చిన్న వ్యాసమును బహూకరించారు. అది ఈమాటలో సరిగా ఆఱు సంవత్సరాలకు ముందు, అనగా మే 2007లో ప్రచురించబడినది. పిబిఎస్ నివాళి సంచికలోని వ్యాసాలతోబాటు దానిని కూడ పాఠకులు తప్పక చదవాలి.

    విధేయుడు – మోహన

  2. రచయితలకు సూచనలు గురించి SADHU MAHENDER అభిప్రాయం:

    05/05/2013 2:20 pm

    గౌరవ ఎడిటర్ గారికి నమస్కారములు! ఈ మాటకు భావ గీతాలు, తెలుగు గజల్స్, ఎక్కడ ప్రచురితం కానివి తమ పత్రికకు పంపవచ్చునా ? తెలుపగలరు.

    [పంపండి. పరిశీలించి ప్రచురణార్హం అనుకుంటే ప్రచురిస్తాము. – సం]

  3. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/05/2013 1:44 pm

    శంకర్ గారు:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం. ఈ వ్యాసకర్తలుగా మేము ఘంటసాల గారి ప్రతిభ తెలియని తక్కువవారమేమీ కాదు. మీరు మీ వాఖ్య రాసే ముందు ఘంటసాల వారి పై ఈమాటలో వచ్చిన వ్యాసాలు చదివి ఉంటే మీ వ్యాఖ్య ఇలా ఉండేది కాదు. మీ అభిమానం మెచ్చుకోతగిందే! ఘంటసాల వంటి వారు పిబియెస్ ను తమ సంగీత దర్శకత్వంలో ఎన్నుకున్నారంటే ఘంటశాల వితరణశీలత మీకు తెలియదని అనుకోవాలి.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి shankarvoleti అభిప్రాయం:

    05/05/2013 12:52 pm

    మధుర గాయకుడు శ్రీ పి.బి. శ్రీనివాస్ గారిపై చక్కటి వ్యాసం రాశారు. అలాగే పాటల లింకులు ఇచ్చారు బావుంది. ధన్యవాదములు. శ్రమ పడ్డారు. పి.బి గారి పాటలంటే మాకు అభిమానమే. కాని మధ్య మధ్యలో శ్రీ ఘంటసాల గారిని తక్కువ చేస్తూ రాయడం, పి.బి. గారిని ఘంటసాల గారి కంటె ఎక్కువ చేస్తూ రాయడం, పోల్చడం బాగులేదు. ఒకరిని పొగడ డానికి వేరొకరిని విమర్శించనక్కర లేదు.. ఏనుగు విలువను సింహంతో పోలుస్తామా. అవి హీరో అభిమానులైన చౌకబారు మనుషులు చేసే పని. మీలా ఎంతో వున్నత చదువులు చదివిన వాళ్ళు చేయవలసిన వారు కాదు. ఘంటసాల గారు ఆ రోజుల్లో తన సమకాలీన గాయకులైన పి.బి, పిఠాపురం, మాధవపెద్ది వారిని ఎంత ప్రోత్సహించారో అందరికీ తెలుసు. అప్పటి ప్రేక్షకులు, నిర్మాత దర్శకులు, హీరోలు అంతా ఘంటసాల వారి పాటలను ఎంతో గొప్పగా ఆదరించారు, అభిమానించారు. అందుకే ఈనాటికీ ఏనాటికీ తెలుగు వాడు బతికి వున్నంత కాలం ఘంటసాల గారికి ఎదురులేని అభిమానులు వుంటారు.. ఘంటసాల వారి పేరున వున్నన్ని వెబ్ సైట్లు ఏ ఇతర గాయకునికి లేవు..

  5. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/05/2013 8:55 am

    పూలలో దాగిన పరిమళం ..పీబీ గారి స్వరం!

    ఈ మధుర గాయకుని గురించి ఎంత చెప్పకున్నా, కొంత మిగిలే వుంటుంది. నాకు ఊహ తెలిసినప్పట్నించీ వింటున్న స్వరం. ఆ కంఠంలో ఒలుకుతున్నది లాలిత్యమో, మార్దవమో, భక్తో, రక్తో, అదేమో తెలీని తనం నించీ, నాన్ను అమితంగా ఆకట్టుకున్న స్వరం. ఇక్కడ పేర్కున్న పాటలన్నీ వింటుంటే బాల్యం గుర్తొస్తూ, ఆనందంగానూ, అయ్యో ఈయనిక లేరే అని బాధగానూ అనిపించింది.

    కొన్ని పాటల్లో ఆయన స్వరం గుండెల్లో తెలీని అలజడి రేపుతుంది అంటే అతిశయోక్తి కాదు. మా అబుచ్చికి ఆయన పాడిన పాట ‘జీవితాన మరువలేము.. అదే రోజు… మన జీవితాలు ఒకటిగా ముడి వేసిన రోజు. అదే పెళ్ళి రోజు’ ఈ పాట వింటూ ఆవిడ కళ్ళ నీళ్ళు పెట్టుకునేది. “ఎందుకు అబుచ్చీ?” అని అడిగేదాన్ని. “ఎందుకో తెలీదే, నాకీ పాట వింటుంటే బాధేస్తుంది” అని చెప్పేది. నాకెప్పుడు ఈ పాట వింటున్నా ఆవిడే గుర్తొస్తుంది.

    నాకు ఇప్పటికీ ప్రాణంగా అనిపించే పాటలు భానుమతి గారితో ఆయన పాడిన పాట ‘నీటిలోనా.. నీడా లోనా.. కలసి వున్నాములే.., చిగురాకుల ఊయలలో.. ఇల మరచిన ఓ చిలుకా.., నీలి మబ్బుల నీడల లోనా.. లేత వలపుల దారుల లోనా.., ఎల్లారీశ్వరితో తో పాడిన పాట – సడన్ గా గుర్తుకు రావడం లేదు.. అలాగే, పూవు వలే విరబూయ వలే, కనులు పలకరించెనూ, బుజి బుజి పాపాయీ.. బుల్లి బుల్లి పాపాయి, ఇలా ఎప్పుడు నే పాడుకునే పాటలు. లేత మనసులులో పాట అస్సలు మరుపుకు రాదు. అందాల ఓ చిలుకా అందుకో నా లేఖా ఎవర్ గ్రీన్ రొమాంటిక్ సాంగ్ కదూ?

    ‘కంటికి రెప్ప కాపలా.. ‘ ఎప్పుడు విన్నా శ్రధ్ధ ఆలపింప చేస్తుంది. శ్రీనివాస్ గారి పాటలకింత ప్రత్యేకత వుండటానికి కారణం. ఆయన స్వరం లో ఒక మెత్త్తదనంతో బాటు మనిషిలో సహజ సిధ్ధమైన సాహిత్య సంస్కారపు మెండుదనం వల్లేనని నాకనిపిస్తుంది.

    ఈ ప్రపంచం నించి అందరూ తరలి వెళ్ళి పోయే వారే కానీ, మరలి పోకుండా వుండి పోయే వారు కొందరే కదూ? వారిలో మనకు ప్రియంగా వినిపిస్తూ చిరంజీవులై చిరస్మరణీయులై నిలిచి పోయే వారిలో పి.బి. శ్రీనివాస్ గారు కూడా!

    పుష్పాంజలి ఘటిస్తూ..
    బాధతో ..
    ఆర్.దమయంతి

  6. రచయితలకు సూచనలు గురించి SADHU MAHENDER అభిప్రాయం:

    05/04/2013 11:18 pm

    గౌరవ సంపాదకుల వారికి నమస్కారాలు!
    ఈ మాట తెలుగు వారికి, తెలుగు మరచే వారికి కనువిప్పు కావాలి
    ఈ మాట ఆలోచించే మెదళ్ళకు పదును కత్తి కావాలి
    ఈ మాట పలువురిని మెప్పించే తీయటి పాట కావాలి
    ఈ మాట తెలుగు వాళ్ళకు పూల బాట కావాలి
    ఈ మాట ప్రపంచపు బావుటా కావాలి
    ఈ మాట అన్యాయాన్ని ఎదురించె తూటా కావాలి
    ఈ మాట అవినీతి నెదురించే అంకుశం కావాలి
    ఈ మాట అవనికి నీతి మూట కావాలి

  7. Good Bye. గురించి రవిశంకర్ అభిప్రాయం:

    05/04/2013 8:44 pm

    వేలూరి గారు – మీ సంపాదకత్వంలో ఈమాట ఎంతో నాణ్యత, ప్రత్యేకత సంతరించుకుంది. అనేకమంది కొత్త, పాత రచయితల్ని ఆకర్షించింది. ఈ మాట ద్వారా వెలుగు చూసిన మీ రచనలు అపురూపమైనవి. సంపాదత్వం నిర్వహించకపోయినా, ఇక ముందు కూడా మీ రచనలు ఈ మాటలో వస్తూనే ఉండాలని కోరుకొంటున్నాను . Wish you all the best! – రవిశంకర్

  8. ఈమాట మే 2013 సంచికకు స్వాగతం! గురించి lyla yerneni అభిప్రాయం:

    05/04/2013 1:28 pm

    ఈ సంచికలో: …వ్యాసాలు: …ఏల్చూరి మురళీధర రావు;…

    ఏల్చూరి – బయో/సి.వి.; లో చెప్పబడిన -ద్రోణ పర్వంపై ధీసిస్ చదవాలని ఉంది. దొరుకుతుందాండి? ధేంక్స్.

    లైలా

  9. రచయితలకు సూచనలు గురించి G V GANESH KUMAR అభిప్రాయం:

    05/04/2013 1:01 pm

    ఈమాట మాగజైన్ కు ఏమైనా సహకారం సాహిత్యపరంగా చేయగలనా చూడాలి. మాగజైన్ చాలా బాగుంది. ఆలస్యంగా చూశాను, తెలుసుకున్నాను. ఆనందంగా ఉంది.

  10. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/04/2013 12:26 pm

    నాకు ఆయుక్షీణం కాగలదన్న విషయాన్ని కూడా గుర్తు ఉంచుకుని, ప్రార్థన, క్షమాపణ ఈ పదాలన్నీ వెనక్కి తీసుకోవాలని నేనూ ప్రార్థిస్తున్నాను

    అయ్యయ్యో అదేం మాటండీ సౌమ్య గారు! భగవంతుని మీకు ఆయురారోగ్యైశ్వర్యాలను, జ్ఞానబుద్ధివైరాగ్యాలను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. మీరు ఆసక్తితో చదివి మీ సదభిప్రాయాలను తెలియజేసినందులకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. – మోహన