మనసంతోషం కోసం వ్రాస్తే అది ఎవరికీ పంపనవసరం లేదు. ప్రతీ రచయితా కొంచం స్పందన చదువరుల నుండి ఆశిస్తాడు. స్పందన లేనిదే చేసే రచనలు అడవి కాచిన వెన్నెలలని నా అభిప్రాయం. మరియు ఫలాన టాపిక్ పైన వ్యాసాలు, కధలు వ్రాయమని అడగడం మీలాటి సీనియర్ రచయతలకి ఆనందం కలిగించవచ్చేమో నాలాటి వారికి కొంచం కష్టమే.
ఇంద్రాణికి : మీకు మెయిల్ రాసిన వారు శ్రీ కొడవళ్ళ అయితే వారికి నేను రాసిన అభిప్రాయం చూడమని చెప్పగలరా!
వారు రాసిన చాలా కాలానికి ఆ వ్యాసాలు నేను చదివాను అవి – కొన్ని ఇతర వ్యాసాల విషయాల మీద లా- ఉన్న పళంగా అభిప్రాయాలు చెప్పగలిగిన వ్యాసాలు కావు. వాటిని నేను నా మిత్రులు కొంత మందికి పరిచయం కూడా చేశాను.
కొంత స్వగతం: నా అభిప్రాయం లో ఎన్ని వ్యాసాలు రాసినా చెప్పటం కష్టమయిన దాన్ని – లెక్కల పాఠాలు చెప్పటంలో హోం వర్క్ లాంటిదాని మీద ‘కాంతా సమ్మితంగా’ చెప్పటానికి చేసిన ప్రయత్నమే ‘లెక్కల పాఠం’. [ఈమాట మే, 2013.]
ఒక ‘పాడుతా తీయగా’ నిర్వహణ: బాలు. బహుమతి ప్రదాన నిర్ణేతలు: విశ్వనాథన్ , బాలమురళి — మనలో- నేనే కాక మరికొందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఉండవచ్చు.
కార్యక్రమం చివర మెచ్చుకోళ్ళు:
బాలమురళి [కొంచమటూ ఇటూగా] ” బాలు నన్ను నాన్న గారు అని పిలుస్తాడు కాబట్టి బాలుని పొగడలేను. తండ్రి కొడుకుని [బహిరంగం] గా మెచ్చుకోకూడదు. బాలు సంగీతం నేర్చుకోకపోయినా చూసి పాడేయగలడు. మేము నేర్చుకుని [మాత్రమె] పాడతాం. కొంత ప్రయత్నిస్తే బాలు బాలమురళి లాగా పాడగలడు గానీ బాల మురళి బాలూలా పాడ లేడు.”
[బాలమురళి అన్న మాటల ‘అర్థమేమి తిరుమలేశ!] అర్థమేమైనా నేను బాలమురళి పక్షం. ఈ కార్యక్రమం లోనే విశ్వనాథన్ , బాలచందర్ “అపూర్వ రాగంగళ్” లో చివరి పాటఎత్తుగడకి బాలమురళి సృజించిన ఒక ‘అపూర్వ’ రాగాన్ని వాడటం ఎలా జరిగిందో తమిళంలొ చెప్పిన దాన్ని బాలూ తెలుగు లొ వివరించాడు.
ఈమాటలో ఇదివరకు సైన్సు/గణితం కు సంబంధించిన వ్యాసాలు కొన్ని రాశానని కానీ పాఠకులనుండి ఆదరణ లేకపోవడం తనను చాలా నిరాశకు గురి చేసిందని పెద్దలు ఒకరు మెయిలు చేశారు నిన్న.
వారి వ్యాసాలు ఎంతో ప్రతిభావంతంగా ఉంటాయి. వారి బాధని అర్ధం చేసుకోగలను. చదివిన వారు బాగుంది అని రాస్తే రచయితకి ఎంతో సంతోషంగా ఉంటుంది.మళ్ళీ రాయాలనే ఉత్సాహం కలుగుతుంది.
నా అప్రస్తుత ప్రసంగం:
నిజానికి ఎవరైనా రాసేది వారి సంతోషం కోసమే అని ప్రశంసలు దానికి బోనస్ లాంటివి అని అనుకుంటాను.
తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు- లాంటి మాటలు వింటుంటాము.ప్రజలను చైతన్యపరచడం కోసం ఎవరైనా రచనలు చేసారంటే/చేస్తున్నారంటే అందులో పెద్దగా నిజం లేదని నమ్ముతాను. ఆ వ్యక్తికి అటువంటి భావాలు ఇష్టం కాబట్టి వాటిని తనకి నచ్చిన విధంగా కథ/కవిత/వ్యాసం రూపంలో బయట పెట్టి ఆనందిస్తున్నాడన్న మాట.
ఎవరో రచయిత చెప్పినట్టు చాలామంది ప్రేమలో ఉన్నాము అన్న అనుభూతిని అస్వాదిస్తూ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాము అనే భ్రమలో ఉంటారట. మనకు ఇష్టమైనది రాయడం అయితే లేదా మనవైనా భావాలను ప్రకటించడం అయితే మన సంతోషం కోసం మన జీవితకాలమూ ఆ పని చేస్తూ అనందించడం మంచిది అని నేను భావిస్తున్నాను.
ప్రేమించి చూడు సినిమా నేను అమెరికా రాక ముందు ఎక్కువ సార్లు చూసిన సినిమాల్లో ఒకటి! ఈ సినిమా మొదట తమిళంలో (కాదులిక్క నేరమిల్లై) వచ్చింది. ఆ సినిమాలో పిబిఎస్ పాడిన అన్ని పాటలకు ప్రజాదరణ బాగా వచ్చింది.
ఆ రోజుల్లో NTR, ANR వంటి అగ్రనాయకులు తమ ప్రతిష్ట జాగ్రత్తగా మలుచుకుంటూ వచ్చిన రోజులు. ఘంటసాల ఉండగా వేరొకరు అగ్రనాయకులకి పాడే అవకాశాలు చాల తక్కువ. అందుకు దాఖలాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, చెంచులక్ష్మి సినిమా కోసం ముందు పిబిఎస్ ని ఎన్నుకొని, పాటల రికార్డింగ్ అయిన తరవాత ఘంటసాలతో కూడా పాటలు రికార్డ్ చేయించి ఆ పాటలే విడుదల చేసిన సందర్భాలు ఇప్పుడు చెప్పిన విషయాన్ని సమర్ధిస్తాయి! తమిళంలో విజయవంతమైన సినిమా కాబట్టి తెలుగులో కూడా పిబిఎస్ పాడారు అనుకోవాలి!
హిందూస్తానీ కళావతి (కర్నాటక సంగీతంలో వలజ రాగం) రాగంలో బాణీ ఇవ్వబడ్డ పాట ‘వెన్నెలరేయీ ఎంతో చలి చలి ‘ తమిళ మూలంలో లేదు. ఈ పాట పిబిఎస్, సుశీల మాష్టర్ వేణు సంగీతదర్శకత్వంలో ‘ప్రేమించి చూడు” సినిమా కోసం పాడారు. ఇది ఒక అద్భుతమైన పాట!
అలాగే ఇదే సినిమాలో మరొక అద్భుతమైన పాట ‘అది ఒక ఇదిలే!’ పాట.
ఇప్పుడు చెప్పిన పాట ఒక రోజు బాగా పొద్దుపోయిన ఒక రాత్రి టివిలో ప్రసారం అయిన తరవాత పిబిఎస్ కి ఒక ఫోన్ ఒచ్చిందట. ఫోన్ ఎత్తి మాట్లాడాలని చూస్తే అవతల వైపు నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం తప్ప మరేమీ వినపడలేదుట! కొంతసేపు తరవాత అవతల వైపు సన్నగా ఒక స్ర్తీ గొంతు వినిపించిందిట. కొంత సమయం అయిన తరవాత “మీరు పాట ఎంత బాగ పాడారండీ! మీ పాట విని నేను ఏడుపు ఆపుకోలేకపోయాను” అన్నారట ఆవిడ! పిబియెస్ ఈ మాటలకి ఎంతో సంతోషించగా అసలు విషయం ఆవిడ బయట పెట్టింది. “నేనేనండీ! ఎస్. జానకిని!”
ఈ పై సంఘటన పిబిఎస్ స్వయంగా ఒక టివి ఇంటర్వ్యూలో చెప్పారు!
బాలూ గారి గొంతులో మాధుర్యము, ఆయన గొంతులు మార్చి పాడే విధానము నాకు ఎంతో నచ్చుతాయి.
బాలు-వేటూరి-ఇళయరాజా త్రయం పాటలు చాలా ప్రత్యేకమైనవి చాలా ఉన్నాయి.
ఈ పాటలో రాధా.. అని బాలూ గారు తీసే ఆలాపన ఆ తరువాత వేటూరి గారి సుందర ప్రయోగం: “రాధా బాధితుణ్ణిలే ప్రేమారాధకుణ్ణిలే” కోసం ఈ పాటని ఒక రోజంతా వింటూనే ఉన్నాను.
అయ్యా బ్రహ్మానందం గారూ — మీ పేరులోనే బ్రహ్మానందం దాగి ఉన్న కారణంగానే మీరు ఇంతటి గొప్ప ఆనందాన్ని అందరికీ పంచగలిగినారని నా అభిప్రాయం. త్యాగరాజస్వామి పేరును తలచుకోవడానికే కోటి జన్మాల పుణ్యం చేసుకుని ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇన్ని విషయాలను ఇంత ఓపిగ్గా మీరు ఎలా తెలుసుకోగలుగుతారు, ఎలా రాయగలుగుతారు. నాహంకర్తా హరిః కర్తా అని టిటిడి ప్రసాద్ గారు చెప్పినట్టుగా చేస్తున్నది నేనుకాదు చేయిస్తున్నది రామభద్రుడే అని మనం మనసావాచా నమ్మినంతకాలం కర్మను ఆ దేవదేవుడే నియంత్రిస్తాడు. ఎప్పడు, ఎక్కడ, ఏం చేయాలో నిర్ణయిస్తాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడు.
పలుమారులు జనియించుచుచు పాపకూపమ్ముల
బడుచు గతించెనెన్నియో జన్మంబులు నిరర్ధకమ్ములై
ఈ జన్మంబునకిట్టులీరీతి కన్నులుందెరచి నా రాముని
కీర్తింప వరమయ్యెనాకునొక సద్గురు త్యాగరాయకృతి.
సంస్కృతాంగ్ల పదాల చివరలో సున్నా బదులు మ్ వాడడం, భూరుహం బదులు భూరుహమ్, కాలం బదులు కాలమ్, — ఇలాగా. ఇంకా ఒక నిర్దిష్టమైన నియమం అంటూ ఏమీ లేదు కానీ ప్రయత్నిస్తున్నాం.
సంస్కృత శ్లోకాలలో బేసి పాదాంతములలో భూరుహం అనియు, సరి పాదాంతములలో భూరుహమ్ అనియు వ్యవహరించుట వాడుక. ఈ దంత్యాక్షరాలు నిజముగా తెలుగు భాష ప్రత్యేకత అనే చెప్పాలి. దంత్యములు కాశ్మీర, మరాఠీ, బహుశా ఒరియా, పారసీక (దాని ద్వార ఉర్దూ హిందీలలో) భాషలలో మాత్రమే ఉన్నాయి. నన్నయ కాలములో దంత్యము లేదనే నా భావన. తిక్కన కాలమునుండి ఇది తెలుగులో ప్రవేశించినది. ఎందుకు తెలుగులో అది ఒక భాగమైనదో అన్నది ఒక కుతూహలజనకమైన విషయమే. అంతే కాక ఇకారానికి ఎకారానికి దీనిని ఎందుకు చేర్చలేదో? ఉర్దూలో జిందగీ వంటి పదాలు ఉన్నాయి కదా? ఈ దంత్యాక్షరములను సరిగా పలుకలేకపోవడమే తెలుగు పాటలను ఇతరులు పాడితే తెలుగువారికి నచ్చక పోవడానికి ఒక కారణమని నా నమ్మకము. ఉంటాను. విధేయుడు – మోహన
పై గదిలో ప్రేమికుడు గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:
05/10/2013 8:17 pm
ఇంద్రాణి గారు:
మనసంతోషం కోసం వ్రాస్తే అది ఎవరికీ పంపనవసరం లేదు. ప్రతీ రచయితా కొంచం స్పందన చదువరుల నుండి ఆశిస్తాడు. స్పందన లేనిదే చేసే రచనలు అడవి కాచిన వెన్నెలలని నా అభిప్రాయం. మరియు ఫలాన టాపిక్ పైన వ్యాసాలు, కధలు వ్రాయమని అడగడం మీలాటి సీనియర్ రచయతలకి ఆనందం కలిగించవచ్చేమో నాలాటి వారికి కొంచం కష్టమే.
పై గదిలో ప్రేమికుడు గురించి తఃతః అభిప్రాయం:
05/10/2013 4:08 pm
ఇంద్రాణికి : మీకు మెయిల్ రాసిన వారు శ్రీ కొడవళ్ళ అయితే వారికి నేను రాసిన అభిప్రాయం చూడమని చెప్పగలరా!
వారు రాసిన చాలా కాలానికి ఆ వ్యాసాలు నేను చదివాను అవి – కొన్ని ఇతర వ్యాసాల విషయాల మీద లా- ఉన్న పళంగా అభిప్రాయాలు చెప్పగలిగిన వ్యాసాలు కావు. వాటిని నేను నా మిత్రులు కొంత మందికి పరిచయం కూడా చేశాను.
కొంత స్వగతం: నా అభిప్రాయం లో ఎన్ని వ్యాసాలు రాసినా చెప్పటం కష్టమయిన దాన్ని – లెక్కల పాఠాలు చెప్పటంలో హోం వర్క్ లాంటిదాని మీద ‘కాంతా సమ్మితంగా’ చెప్పటానికి చేసిన ప్రయత్నమే ‘లెక్కల పాఠం’. [ఈమాట మే, 2013.]
నమస్కారాలతొ
తః తః
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి తఃతః అభిప్రాయం:
05/10/2013 3:47 pm
బాలమురళి – బాలు:
ఒక ‘పాడుతా తీయగా’ నిర్వహణ: బాలు. బహుమతి ప్రదాన నిర్ణేతలు: విశ్వనాథన్ , బాలమురళి — మనలో- నేనే కాక మరికొందరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి ఉండవచ్చు.
కార్యక్రమం చివర మెచ్చుకోళ్ళు:
బాలమురళి [కొంచమటూ ఇటూగా] ” బాలు నన్ను నాన్న గారు అని పిలుస్తాడు కాబట్టి బాలుని పొగడలేను. తండ్రి కొడుకుని [బహిరంగం] గా మెచ్చుకోకూడదు. బాలు సంగీతం నేర్చుకోకపోయినా చూసి పాడేయగలడు. మేము నేర్చుకుని [మాత్రమె] పాడతాం. కొంత ప్రయత్నిస్తే బాలు బాలమురళి లాగా పాడగలడు గానీ బాల మురళి బాలూలా పాడ లేడు.”
[బాలమురళి అన్న మాటల ‘అర్థమేమి తిరుమలేశ!] అర్థమేమైనా నేను బాలమురళి పక్షం. ఈ కార్యక్రమం లోనే విశ్వనాథన్ , బాలచందర్ “అపూర్వ రాగంగళ్” లో చివరి పాటఎత్తుగడకి బాలమురళి సృజించిన ఒక ‘అపూర్వ’ రాగాన్ని వాడటం ఎలా జరిగిందో తమిళంలొ చెప్పిన దాన్ని బాలూ తెలుగు లొ వివరించాడు.
పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy అభిప్రాయం:
05/10/2013 2:57 pm
ఈమాటలో ఇదివరకు సైన్సు/గణితం కు సంబంధించిన వ్యాసాలు కొన్ని రాశానని కానీ పాఠకులనుండి ఆదరణ లేకపోవడం తనను చాలా నిరాశకు గురి చేసిందని పెద్దలు ఒకరు మెయిలు చేశారు నిన్న.
వారి వ్యాసాలు ఎంతో ప్రతిభావంతంగా ఉంటాయి. వారి బాధని అర్ధం చేసుకోగలను. చదివిన వారు బాగుంది అని రాస్తే రచయితకి ఎంతో సంతోషంగా ఉంటుంది.మళ్ళీ రాయాలనే ఉత్సాహం కలుగుతుంది.
నా అప్రస్తుత ప్రసంగం:
నిజానికి ఎవరైనా రాసేది వారి సంతోషం కోసమే అని ప్రశంసలు దానికి బోనస్ లాంటివి అని అనుకుంటాను.
తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచాడు- లాంటి మాటలు వింటుంటాము.ప్రజలను చైతన్యపరచడం కోసం ఎవరైనా రచనలు చేసారంటే/చేస్తున్నారంటే అందులో పెద్దగా నిజం లేదని నమ్ముతాను. ఆ వ్యక్తికి అటువంటి భావాలు ఇష్టం కాబట్టి వాటిని తనకి నచ్చిన విధంగా కథ/కవిత/వ్యాసం రూపంలో బయట పెట్టి ఆనందిస్తున్నాడన్న మాట.
ఎవరో రచయిత చెప్పినట్టు చాలామంది ప్రేమలో ఉన్నాము అన్న అనుభూతిని అస్వాదిస్తూ ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాము అనే భ్రమలో ఉంటారట. మనకు ఇష్టమైనది రాయడం అయితే లేదా మనవైనా భావాలను ప్రకటించడం అయితే మన సంతోషం కోసం మన జీవితకాలమూ ఆ పని చేస్తూ అనందించడం మంచిది అని నేను భావిస్తున్నాను.
ఇంద్రాణి.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
05/10/2013 11:31 am
ఉమామహేశ్వర రావు గారు:
ప్రేమించి చూడు సినిమా నేను అమెరికా రాక ముందు ఎక్కువ సార్లు చూసిన సినిమాల్లో ఒకటి! ఈ సినిమా మొదట తమిళంలో (కాదులిక్క నేరమిల్లై) వచ్చింది. ఆ సినిమాలో పిబిఎస్ పాడిన అన్ని పాటలకు ప్రజాదరణ బాగా వచ్చింది.
ఆ రోజుల్లో NTR, ANR వంటి అగ్రనాయకులు తమ ప్రతిష్ట జాగ్రత్తగా మలుచుకుంటూ వచ్చిన రోజులు. ఘంటసాల ఉండగా వేరొకరు అగ్రనాయకులకి పాడే అవకాశాలు చాల తక్కువ. అందుకు దాఖలాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, చెంచులక్ష్మి సినిమా కోసం ముందు పిబిఎస్ ని ఎన్నుకొని, పాటల రికార్డింగ్ అయిన తరవాత ఘంటసాలతో కూడా పాటలు రికార్డ్ చేయించి ఆ పాటలే విడుదల చేసిన సందర్భాలు ఇప్పుడు చెప్పిన విషయాన్ని సమర్ధిస్తాయి! తమిళంలో విజయవంతమైన సినిమా కాబట్టి తెలుగులో కూడా పిబిఎస్ పాడారు అనుకోవాలి!
హిందూస్తానీ కళావతి (కర్నాటక సంగీతంలో వలజ రాగం) రాగంలో బాణీ ఇవ్వబడ్డ పాట ‘వెన్నెలరేయీ ఎంతో చలి చలి ‘ తమిళ మూలంలో లేదు. ఈ పాట పిబిఎస్, సుశీల మాష్టర్ వేణు సంగీతదర్శకత్వంలో ‘ప్రేమించి చూడు” సినిమా కోసం పాడారు. ఇది ఒక అద్భుతమైన పాట!
అలాగే ఇదే సినిమాలో మరొక అద్భుతమైన పాట ‘అది ఒక ఇదిలే!’ పాట.
ఇప్పుడు చెప్పిన పాట ఒక రోజు బాగా పొద్దుపోయిన ఒక రాత్రి టివిలో ప్రసారం అయిన తరవాత పిబిఎస్ కి ఒక ఫోన్ ఒచ్చిందట. ఫోన్ ఎత్తి మాట్లాడాలని చూస్తే అవతల వైపు నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం తప్ప మరేమీ వినపడలేదుట! కొంతసేపు తరవాత అవతల వైపు సన్నగా ఒక స్ర్తీ గొంతు వినిపించిందిట. కొంత సమయం అయిన తరవాత “మీరు పాట ఎంత బాగ పాడారండీ! మీ పాట విని నేను ఏడుపు ఆపుకోలేకపోయాను” అన్నారట ఆవిడ! పిబియెస్ ఈ మాటలకి ఎంతో సంతోషించగా అసలు విషయం ఆవిడ బయట పెట్టింది. “నేనేనండీ! ఎస్. జానకిని!”
ఈ పై సంఘటన పిబిఎస్ స్వయంగా ఒక టివి ఇంటర్వ్యూలో చెప్పారు!
విష్ణుభొట్ల లక్ష్మన్న
పలుకుబడి – కాలమానము II గురించి Rao Vemuri అభిప్రాయం:
05/10/2013 10:13 am
ఈ విషయం అర్థంకాక ఎన్నాళ్లబట్టో ఇబ్బంది పెడుతోంది. అందుకోసమే అడిగేను తప్ప తప్పు ఎత్తి చూపాలని కాదు.
ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి indrani Palaparthy అభిప్రాయం:
05/10/2013 8:55 am
బాలూ గారి గొంతులో మాధుర్యము, ఆయన గొంతులు మార్చి పాడే విధానము నాకు ఎంతో నచ్చుతాయి.
బాలు-వేటూరి-ఇళయరాజా త్రయం పాటలు చాలా ప్రత్యేకమైనవి చాలా ఉన్నాయి.
ఈ పాటలో రాధా.. అని బాలూ గారు తీసే ఆలాపన ఆ తరువాత వేటూరి గారి సుందర ప్రయోగం: “రాధా బాధితుణ్ణిలే ప్రేమారాధకుణ్ణిలే” కోసం ఈ పాటని ఒక రోజంతా వింటూనే ఉన్నాను.
ఇంద్రాణి పాలపర్తి.
మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి మల్లాది వేంకటగోపాలకృష్ణ అభిప్రాయం:
05/10/2013 8:34 am
అయ్యా బ్రహ్మానందం గారూ — మీ పేరులోనే బ్రహ్మానందం దాగి ఉన్న కారణంగానే మీరు ఇంతటి గొప్ప ఆనందాన్ని అందరికీ పంచగలిగినారని నా అభిప్రాయం. త్యాగరాజస్వామి పేరును తలచుకోవడానికే కోటి జన్మాల పుణ్యం చేసుకుని ఉండాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఇన్ని విషయాలను ఇంత ఓపిగ్గా మీరు ఎలా తెలుసుకోగలుగుతారు, ఎలా రాయగలుగుతారు. నాహంకర్తా హరిః కర్తా అని టిటిడి ప్రసాద్ గారు చెప్పినట్టుగా చేస్తున్నది నేనుకాదు చేయిస్తున్నది రామభద్రుడే అని మనం మనసావాచా నమ్మినంతకాలం కర్మను ఆ దేవదేవుడే నియంత్రిస్తాడు. ఎప్పడు, ఎక్కడ, ఏం చేయాలో నిర్ణయిస్తాడు. మనల్ని ముందుకు నడిపిస్తాడు.
పలుమారులు జనియించుచుచు పాపకూపమ్ముల
బడుచు గతించెనెన్నియో జన్మంబులు నిరర్ధకమ్ములై
ఈ జన్మంబునకిట్టులీరీతి కన్నులుందెరచి నా రాముని
కీర్తింప వరమయ్యెనాకునొక సద్గురు త్యాగరాయకృతి.
– మల్లాది వేంకటగోపాలకృష్ణ శాస్త్రి
పై గదిలో ప్రేమికుడు గురించి N.Venkateswararao అభిప్రాయం:
05/10/2013 8:18 am
శారద గారు, పై గదిలో ప్రేమ చాలా చప్పగా ఉంది. సారీ.
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి మోహన అభిప్రాయం:
05/10/2013 8:12 am