పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్రేమ కవితలు గురించి swapna అభిప్రాయం:

    06/06/2013 1:57 am

    మీ కవిత నాకు చాలా బాగా నచ్చింది.

  2. ఊపిరిపాటకు చూపేదీ? గురించి రత్నశిఖామణి అభిప్రాయం:

    06/04/2013 10:51 am

    “మురళితోబాటు మహాబలిపురాన్నే
    సంచిలో పెట్టుకున్నాడా”

    “నమస్కార ముద్రలో తడుముకున్నాడు
    వేణువు వొంటిపైన తన ఏడు కళ్ళనీ”

    ఎంత ముద్దుగా ఉన్నాయి ఈ భావాలు! మహాద్భుతం.
    వేకువల్ని వణికించే ఆ వేణువుకి సరి తూగే కమ్మని కవిత ఇది.

    ~రత్నశిఖామణి

  3. సత్య మొహంతితో ముఖాముఖి – 2: సాహిత్యంలో సాంస్కృతిక దురతిశయం గురించి jayaprabha అభిప్రాయం:

    06/03/2013 2:41 pm

    వేమూరి గారూ! తెలుగులోకి “కట్టుదిట్టంగా” అనువాదం చేశారని మీరు ఈ అనువాదకుని మెచ్చుకున్నారని నేను కష్టపడి మరీ ఈ వ్యాసాన్ని చదవాలనే ప్రయత్నం చేశాను. అయితే ఈ వ్యాసంలో ఈ అనువాదకుడు ఏమి చెప్పారో నాకైతే నిజంగా అర్ధం కాలేదు మరి. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్లకి భాష వచ్చునని అనుకుంటారు. అందునా తెలుగు విషయంలో అయితే ఇది మరీ తరుచుగా ఎదురయ్యే అనుభవం నాకు! అయితే చాలా సార్లు తెలుగు రాకుండానే తెలుగు వాక్యాల సరళి సరిగ్గా తెలుసుకోకుండానే గభాల్న అనువాద ప్రక్రియని చేపడతారు. ఇక్కడ ఈ అనువాదం సైతం తెలుగులో అసంబధ్ధమైన వాక్యాలతో నిండి అయోమయంగా సాగింది. తెలుగు వాక్యం ఈ అనువాదంలో మాదిరి నడవదు. అందువలనే నాకు ఈ వాక్యాలనించి విషయం స్పష్టంగా అర్ధం కావడం కష్టం అయింది. ఇటువంటి వాక్యాలు తెలుగు రచనా విధానం కావు .

    విషయం అర్ధం కావడానికి క్లుప్తమైన, అదే సమయంలో వివరంగా అర్ధం కాగలిగిన, తెలుగు పదాలతోనూ అలాగే తెలుగులో తెలిసిన సులువైన పారిభాషిక పదాలతో మాత్రమే [కల్పించిన కృతకమైన పదాలతో కాదు] తెలుగు వాక్యాలు నడవాలి. బహుశా అనువాదకుడు తెలుగులో రాసే వాళ్ళ సహాయంతో సంయుక్త కృషిగా ఈ అనువాదం కావించి ఉంటే బాగుండేది. ఆయన ఇంగ్లీషులో అర్ధం చేసుకుని తెలుగులోకి దించినట్టుగా ఉంది తప్పితే తెలుగుకి సహజమైన రీతిలో ఈ అనువాదం సాగలేదు. ఈ తెలుగు అనువాదం నించి ఇందుకోసం ఎంచి ఉదాహరణల్ని నేను ఇవ్వడం లేదు. ఎందుకంటే దాదాపుగా చాలా వాక్యాలూ చాలా పదాలూ తెలుగు వాడకంలో ఇమిడేవి కావు. ఇంతకన్నా సత్యా మొహంతీ ఇంటర్వ్యూని ఇంగ్లీషు లోనే చదవడం మెరుగేమో అనిపించేలాగా సాగిందీ అనువాదం! కొల్లిపర భరణి అనువాదపు శ్రమని నేను గుర్తిస్తూనే, ఆ శ్రమ సద్వినియోగం కావాలని కూడా కోరుకుంటున్నాను. ఈమాట సంపాదకులు అలాగే ఈ అనువాదాన్ని అచ్చుకి చదివి తలూపిన ఈమాట పీరులూ ఈ వాక్యాల సరళిని ఇందులో కొరవడిన తెలుగుతనాన్నీ గుర్తించకపోవడం సైతం పాఠకులని ఆశ్చర్య పరిచే విషయమే అవుతుంది. చదివించగలగడమే ఏ రచనకైనా ప్రధాన గుణం కావాలి. అప్పుడే అది దాని ఫలితాన్ని దాని పాఠక వర్గాన్నీ పొందగలదు.

    జయప్రభ.

  4. సత్య మొహంతితో ముఖాముఖి – 2: సాహిత్యంలో సాంస్కృతిక దురతిశయం గురించి Rao Vemuri అభిప్రాయం:

    06/03/2013 9:38 am

    క్లిష్టమైన విషయాన్ని కష్టపడి అనువాదం చేసిన భాస్కర్‌ గారి శ్రమకి ధన్యవాదాలు. ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్‌ పట్టా అందుకున్న ఒక వ్యక్తి తెలుగులోకి ఇంత కట్టుదిట్టంగా అనువాదం చేసేరంటే అది మెచ్చుకోదగ్గ విషయమే మరి!

  5. గోసిగుడ్డ గురించి ennela అభిప్రాయం:

    06/02/2013 7:05 pm

    ఉంటుందా! బయటపడకుండా.. లాంటి పదాల దగ్గర కొంచెం నిరుత్సాహం కలిగింది కానీ “శేరిత్తులుసుక దోసిళ్ళ పడ్తలేవు” హృద్యంగా చెప్పారండీ!

  6. జాతర గురించి saidulu అభిప్రాయం:

    06/01/2013 5:30 am

    చాలా బాగున్నావి మీ కవితలు.

  7. పై గదిలో ప్రేమికుడు గురించి arpee అభిప్రాయం:

    05/30/2013 4:54 am

    నా మటుకు ఈ కథ బావుంది

  8. చతురదూతిక గురించి lyla yerneni అభిప్రాయం:

    05/29/2013 5:11 pm

    Smart plot. Being so ac’custom’ed, to the double standards in the society, I could not even grasp for awhile, how the messenger got her message across, to the hero. Ah! The great expectations of males. They are so adorable.

    అమరకోశము అంటే ఏంటో తెలియదండి. అఖండ యతి అంటే కూడా. ఐనా గాని, నళిని నగల గురించి వస్తే – మెఱుపుతీవలకు, ప్రాలంబములకు, పోలికే బాగుంది. గణికకు, ఆమె ప్రేమికునకు పొరపొచ్చం ఎందుకొచ్చిందో, ఆ ఒకే కారణం ఎందుకు రెండు సార్లు చెప్పారు? పొరపాటా?

    I am enjoying reading Telugu stories told in metrical poetry. Beautiful. Thanks.

    లైలా

  9. కతికితే అతకదు గురించి T Narasimha Murty అభిప్రాయం:

    05/28/2013 12:59 pm

    కథ చెప్పడానికి వాడిన భాష హాయిగా ఉంది. ఇది కూడా వాడుక భాషే, కొన్ని కొన్ని కుటుంబాలల్లొ. కథనం బాగానే ఉంది. కథ మామూలుగా ఉంది.

  10. చతురదూతిక గురించి దేశికాచారి అభిప్రాయం:

    05/25/2013 4:14 pm

    ఈ ఖండికయందలి ‘నిగనిగన్నిగలాడు’ అనే సీసపద్యంలోని గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద మురమందు ప్రాలంబములు ధరించి – అను నాల్గవ చరణాన్ని గిరిశిరంబులఁ దోఁచు మెఱుపుతీవెలచంద మురమందు ముత్యాలసరులు దాల్చి – అని మార్చడమైనది.

    “ప్రాలంబ మృజులంబి స్యాత్, కణ్ఠాద్వైకక్షకం తు తత్” – అని అమరకోశము. ప్రలంబతే – ప్రాలంబి, లబి – లమ్బనే (వ్రేలాడునది)- అని దీనికి వ్యుత్పత్తి. అనగా కంఠమునుండి పొడవుగా నురస్సునందు వ్రేలాడు దండకు ప్రాలంబమని పేరు. ఈ ‘లబి’ధాతువునుండే వచ్చిన మఱొక పేరు ‘ప్రాలంబిక’. కాని ఇది కంఠమునుండి వ్రేలాడే బంగారుదండకు పేరుగా, “స్వర్ణెః ప్రాలంబికా” అని ప్రత్యేకంగా అమరకోశంలో చెప్పబడింది. పైపద్యంలో ఉపమేయమైన ముత్యాలదండ ఉపమానమైన మెఱుపుతీగకు అధికసదృక్షంగా ఉంటుందనియు, మునుపున్న అఖండయతిని పరిహరించుటకుగాను ఈమార్పు చేయడమైనది.