పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. పై గదిలో ప్రేమికుడు గురించి Murthy Akella అభిప్రాయం:

    06/13/2013 2:39 pm

    కథ బానే ఉంది, ఎవరో చప్పగా అన్నారు, అలా లేదు, ట్రాన్స్‌లేషన్ అని తెలుస్తోంది, తెలుగు నేటివిటీ కి దూరంగా.

  2. కనిపించడం లేదు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    06/12/2013 1:10 am

    ఈ వెబ్ సైట్ ఇటీవలే చూడటం మొదలెట్టాను. ఈ కవిత ఇప్పుడే చదివాను. ఎంత మధురమైన ఊహ. ఎంత అందమైన కవిత.

  3. లెక్కల పాఠం గురించి Muddu venkata lakshmi అభిప్రాయం:

    06/11/2013 10:14 am

    లెక్కల పాఠం లాగే మీ కవిత కూడ అస్పష్టంగా ఉంది. కాలేజీల్లో అమ్మాయిలపై, భార్యలపై జరుగుతున్న అత్యాచారాల గురించి అయితే ధన్యవాదాలు.

  4. మల్లే పూల్ మల్లే పూల్ గురించి Muddu venkata lakshmi అభిప్రాయం:

    06/11/2013 6:19 am

    ఇంద్రాణి గారూ – మంచి పద చిత్రాలు సృష్టించ గల భావుకత ఉంది మీలో. ఇంకా ఇలాంటి కవితలు వ్రాస్తూ ఉండండి.

  5. నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం గురించి Muddu venkata lakshmi అభిప్రాయం:

    06/11/2013 4:08 am

    నన్నెచోడుని పద్యాలలో అచ్చతెనుగు నుడికారం, భావాలకు తగిన పదాలు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతపద్యం లోని మనోహరమైన వర్ణనను చక్కగా వివరించారు.

  6. టోపీలు పెట్టబడును గురించి Muddu venkata lakshmi అభిప్రాయం:

    06/11/2013 3:20 am

    ఈ వ్యంగ్య కవిత బాగుంది. కాని కల్లలు హాయిగా ఎగురుతున్న ఈ కాలం లో “నేల రాలిన కల్లలు” అని ఎందుకు అన్నారో అర్థం కాలేదు సామాన్యుడికి ప్రతి కాలమూ టోపీల కాలమే కదా అన్న పంక్తి వాస్తవికతకు అద్దం పట్టింది.

  7. చతురదూతిక గురించి శ్రీరామం దగ్గుబాటి అభిప్రాయం:

    06/10/2013 11:37 pm

    చక్కటి ఖండిక దేశికాచారిగారు. దూతికచే నడిపించిన ప్రేయసి ప్రియ సమాగము అద్భుతము. దూతిక సాధించిన నాయక పరిరంభణము, అప్పుడు వర్ణించిన రీతి కందపద్యముతో — “విద్యుల్లతికను మేఘుఁడు
    హృద్యంబుగఁ బొదివినట్టు లెదలోఁ బొదివెన్” — ఆ ఉపమాలంకారము చాల నచ్చినది.

    అభినందనములతో.
    శ్రీరామం

  8. సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి Muddu venkata lakshmi అభిప్రాయం:

    06/10/2013 1:39 pm

    శ్రీ మురళీధరరావు రావు గారికి,

    నమస్కారములు. భక్తిరసం, మార్దవం తొణికిసలాడే గొంతుకతో మధురమైన పాటలు పాడే బహుభాషా నేపధ్య గాయకుడిగా మాత్రమే నాకు తెలిసిన పీ బీ శ్రీనివాస్ ను “సంగీతాన్ని ఆపాతమధురం గానూ , సాహిత్యాన్ని ఆలోచనామృతం గానూ ఆస్వాదించి, ఆస్వాదింప జేసిన, ఆలోచించి, ఆలోచింప జేసిన సంగీత సాహిత్య శ్రీనివాసునిగా” నా కళ్ళ ముందు సాక్షాత్కరింప జేసిన మీకు శతకోటి ధన్యవాదాలు. శ్రీనివాస్ మాతృభాష అయిన తెలుగులోని ప్రాచీన కావ్యాలను జీర్ణించుకొని , పద్యవిద్యను అభ్యసించి నూతన వృత్తాలు అయిన ‘గాయత్రీ , శ్రీనివాస’ వృత్తాలను ఆవిష్కరించారని, తెలుగులోనూ, ఆంగ్లంలోనూ చక్కటి గేయాలను, వ్యాసాలను వ్రాశారని తెలుసుకొని చాలా ఆనందం కలిగింది. వారి ‘ప్రతివాద భయంకర ‘ వంశ విశిష్టతను కూడా చక్కగా విశదీకరించారు. జలధిని త్రవ్వుతున్న కొద్దీ రత్నాలు లభించినట్లు మీ వ్యాసం చదువుతున్న కొద్దీ శ్రీనివాస్ గారి ప్రతిభావిశేషాలు తెలుస్తున్నాయి. తెలుగు నేలపై జన్మించిన ఆ మహనీయునికి తెలుగువారి నుండి అతి తక్కువ సన్మానాలు జరిగిన లోటును మీ వ్యాసం పూరించింది. మీ ‘నివాళి రచన ‘ద్వారా ఆ కవిపండితునికి అత్యున్నతమైన, శాశ్వతమైన సత్కారాన్ని అందించినందుకు తెలుగువారందరి తరఫునా మీకు మళ్లీ మళ్లీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

    మీ వ్యాసం ద్వారా శ్రీనివాస్ గారి జీవితంతో సుదీర్ఘ మైన అనుబంధం ఉన్న సంగీత సాహిత్య సినీ రంగాలలోని ప్రముఖులను గురించి కూడా చదివి చాలా ఆనందం కలిగింది. వివిధ అంశాలకు చెందిన మీ వివరణలు ఔత్సాహికులకు ఆసక్తికరంగా, స్ఫూర్తి దాయకంగా ఉన్నాయి . మీ వ్యాసం ‘ఈనాడు ఆదివారం అనుబంధం’లో ప్రచురితమవుతే తెలుగువారందరూ చదవడానికి అవకాశం ఉంటుంది. ఒక కవి విమర్శకుని హృదయంలో మీ పేరుతో ‘మురళీ వృత్తం’ ఉద్భవించినందుకు ఎంతో సంతోషం కలిగింది.

    మీ వ్యాసం లోని కొన్ని పదాలు నాకు అర్ధం కాలేదు -వివరించగోరెదను. 1) ‘గాయకులు’, ‘గాయనులు’ – వీరి మధ్య తేడా ఏమిటి? 2) వాచక్నవి అంటే ఎవరు?

    నమస్కారములతో
    భవదీయురాలు
    ఆకొండి [ముద్దు ] వెంకట లక్ష్మి

  9. మంత్ర భాషణం గురించి Mangu Siiva Ram Prasad అభిప్రాయం:

    06/07/2013 2:18 am

    కవిత్వంలో అస్పష్టత ఉంది. ఈ క్రింద పంక్తులలో కవి ఏం చెప్పదల్చుకున్నాడో అగమ్యగోచరం.

    “సూటిదనం మొహం చాటేసి
    ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
    ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
    జల్లెడ లోంచి జారిపోయే నీళ్లు
    అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్”

    కవిత ఆస్వాదయోగ్యం కావాలంటే అది పాఠకుని అవగాహన పరిధిలోకి రావాలి. కవిత్వంలో శబ్దానికి అర్థానికి అవినాభవ సంబంధముంది, అద్భుతమైన పదచిత్రాలు ఆ కార్యాన్ని సాధించలేవు. కవి సహృదయుడై అర్థం చేసుకుంటారని భావిస్తూ…

  10. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి పాలూరి వేంకట రామారావు అభిప్రాయం:

    06/07/2013 1:32 am

    విపులమైన వ్యాసం ఆసక్తితో చదివించేలా వ్రాసిన రచయితలకు కృతజ్ఞతలు. పిబిఎస్, బాలు గురుశిష్యులుగా పాడిన మరో ఆణిముత్యం – కోకిలమ్మ చిత్రం నుంచి:

    మధురం మధురం నాదం, అది అమరం అమరం వేదం.
    శ్రీవాణీ వీణా జనితం, సురమౌని మహతీ సరితం, అతిలోక బ్రహ్మానందం, ఓంకార నాదం!

    సినిమాలో అనుకోని సన్నివేశంలో, కథకు మరీ పెద్ద సంబంధంలేని పాత్రల మధ్య వచ్చిన ఈ పాట నిజంగా అతిలోక బ్రహ్మానందమై సంభ్రమాశ్చర్యాలలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. బాలచందర్ దర్శకత్వ ప్రతిభకు, పిబిఎస్ గానామృతం కలిపిన ఆణిముత్యం ఈ పాట, ముఖ్యంగా పల్లవి, అనుపల్లవీను.