పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నదిలోని నీరు గురించి daamu అభిప్రాయం:

    07/03/2013 11:24 pm

    ప్రకృతి లోని మార్మికత, మనిషిలోని మార్మికత రెండూ కలిశాయి. మీ పదాలతో విజువలైజేషన్ అద్భుతం.

  2. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి jayaprabha అభిప్రాయం:

    07/03/2013 3:23 pm

    అప్పారావు గారి కన్యాశుల్కం ఎన్నేళ్లైనా ఎందుకని పాతబడదో నాకు బాగా అర్ధం అయ్యే సందర్భాలు ఎన్నో !! ఇదిగో ఇలాంటప్పుడు మరీను !!

    జయప్రభ .

  3. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/03/2013 2:29 pm

    ఈ వ్యాసం పై వచ్చిన స్పందనలకి ప్రతిస్పందనగా నారా గారి వ్యాఖ్య చదివి నవ్వు ఆపుకోలేకపోయాను!

    ఈమాట రచనలపై (అన్ని స్పందనలు కాకపోయినా) కొన్ని స్పందనలుగా వచ్చే వాదాలకి తర్కం ఇలాగే ఉంటుంది!

    Happy July 4th!!!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి Velcheru Naraayana Rao అభిప్రాయం:

    07/03/2013 1:32 pm

    అబ్బూరి రామకృష్ణారావుగారు ఒక ఉదాహరణ చెప్పేవారు, కొన్ని వాదాల తీరు చూసి: ఒక న్యాయవాది ఒక నూనె వర్తకుడు నూనె కల్తీ చేసేడనే అభియోగంలో ఆ నూనెవర్తకుడి తరపున వాదిస్తూ ఇలా అన్నాడట:
    Your honor, this case is about oil. Oil is grease and Greece is a foreign country. This court has no jurisdiction to take up this case.

    ఇది ఇలాంటి వాదనలా తయారవుతోంది … ఇంక ఇది నా చేతిలో లేదు.
    –నారా

  5. భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి sivasankar ayyalasoamayjula అభిప్రాయం:

    07/03/2013 1:25 pm

    పప్పు నాగరాజు గారూ, పరుచూరి శ్రీనివాస్‌ గారూ,
    Thanks for providing most comprehensive article about history of Language and it’s roots. It’s very useful and informative. I am sure this article will be a kind of reference document for many people. We look forward more from you. Keep doing the good work.

    Reg
    Siva

  6. భార్యోత్సాహం గురించి mohan అభిప్రాయం:

    07/03/2013 8:21 am

    కథ పేరేమో భార్యోత్సాహం,
    జరిగిందేమో భర్తోత్సాహం,
    నాకేమో నిరుత్సాహం. హు హూ!

  7. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    07/03/2013 6:39 am

    ఈ వ్యాసం చదవగానే వచ్చిన అనుమానం – దీన్ని వ్రాసిన నారాయణ రావుగారూ, కవితా విప్లవాల స్వరూపం వ్రాసిన నారాయణ రావుగారూ ఒకరేనా? అని. 🙂 అయితే యీ వ్యాసం మరో రెండుసార్లు చదివి, ఆ పుస్తకం మరోసారి తిరగేస్తే కాని నేను పొరబడ్డానా, లేక నా అనుమానం నిజమేనా అన్నది చెప్పలేను!

  8. నదిలోని నీరు గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    07/03/2013 6:16 am

    మీరు ఎవరినిగురించి రాశారో తెలియదు గానీ తెలిసిన ముఖాలు కొన్ని కనబడ్డాయి

    “పద్యం మాత్రం రాత్రింబవళ్ళూ రొదగా వినబడుతూనే ఉందని ఆ దారి మీదుగా వచ్చినవాళ్లు చెబుతుంటారు.”

    ఇలాంటి ఒకానొక సందర్భం కోసం నేను కూడా వరుసలో నిలబడాలనిపిస్తుంది.

  9. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 గురించి jayaprabha అభిప్రాయం:

    07/03/2013 4:44 am

    కవుల జీవిత చరిత్రల్ని వేరే వాళ్ళు కాక ఆ కవులే తమ ‘ఆత్మ కధ’ గా రాసుకుంటేనో? — నారాయణ రావు సిధ్ధాంతం ప్రకారం ఆ జీవితకధని ఆ కవి చెప్పినట్టా? లేక ఆ కవిలో దాగి ఉన్న ఇంకో మనిషి ఎవరో “లౌక్యంగా” చెప్పినట్టా? ఈ ప్రకారం మనం ఏ కవి మాటల్నీ ఎప్పటికీ అసలు నమ్మనవసరం లేదు అనేకదా అర్ధం వస్తుందీ? కవులేనా? ఏ నాయకుల కధల్నీ నమ్మనఖ్ఖరలేదు. అందరూ అసత్యాలో అర్ధ సత్యాలో అయి మిగులుతారు చివరికి లోకంలో! మానవ జాతిమీదే నమ్మకం ఉంచనఖ్ఖర్లేని మాటలు ఇవి. ఇంక కవులు వాళ్ల గురించి వాళ్ళు చెప్పినా నమ్మకూడదు. ఆ కవులని గురించి ఇంకెవరన్నా చెప్పినా నమ్మకూడదు, ఎందుకంటే వాళ్లకి కవి జీవితాన్ని గురించి చెప్పే విషయంలో “ఆర్ధిక పరమైన ఆసక్తి” మాత్రమే ఉంటుంది గనక ఏవో మసాలాలకి ప్రాధాన్యం ఇచ్చి కవి అసలు జీవితాన్ని వదిలేసే ప్రమాదం ఉంది. ఇంక విమర్శకులు అన్న వాళ్ళు మాత్రం తాము సదా తెర వెనకే ఉంటూ వాళ్ల వాళ్ల అస్తిత్వాలని కాపాడుకుంటూనో / దాచుకుంటూనో / చెరిపేసుకుంటూనో వాళ్ల వాళ్ల సిధ్ధాంతాలలోంచి కవులందరి కవిత్వాలని గురించి వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు ఎప్పటికీ! దురదృష్టం ఏమంటే ఇలాంటి విమర్శకుల విశ్లేషణలలోంచే వీరిని బట్టే పాఠకులు ఒక కవి కవిత్వాన్నీ.. [మళ్ళీ కవి జీవితాన్ని కాదు సుమా :0] అందులోని అందాలనీ లేదా రహస్యాలనీ పాఠకులు అర్ధం చేసుకోవాలి అదీ కొన్ని వందల ఏళ్ళు గడిచేకా! అయితే ఎప్పుడూ విమర్శకునికి ఒక అస్తిత్వం ఉండదు. అతడు తెరవెనకే ఉంటాడు గనక నిజంగా తన సిధ్ధాంతానికి బాధ్యత వహించాల్సిన పని ఎప్పుడూ ఉండదు. ఒక విమర్శకుడు ఒకలా చెప్పొచ్చు. మరొకరు మరొకలా చెప్పొచ్చు. కానీ కవి తన గురించి చెప్పే మాట మాత్రం అది కవిత్వం రూపంలో ఒకటే ఉంటుంది. దానిని కవి మార్చుకోలేడు / లేదు. ఈ మాటలలో బోలెడన్ని కప్పదాట్లు కాంట్రడిక్షన్స్ కనిపిస్తూంటే నారాయణరావు కొన్ని కధల్ని చెప్పి మిగిలినవి చదివే వాళ్ళే ఎవరికి వాళ్ళు ఊహించుకోవాలీ అని అంటాడు.

    ఐతే నారాయణ రావు ఊహల ప్రకారం అది కవే కానఖ్ఖరలేదు కళాకారులైనా నటులైనా పేరున్న ఏ వ్యక్తికైనా ఈ పరిస్థితి వర్తిస్తుంది. చిక్కు ఎక్కడ వస్తుందంటే, నారాయణ రావు తన వ్యాసంలో చర్చ అంతా తెలుగు సాహిత్యం లోని కవులని గురించి చెప్తూ తాను ఇచ్చిన ఉదాహరణలు మాత్రం అక్కడెక్కడో ఒక అమెరికన్ కవయిత్రిని గురించో లేదా వేల ఏళ్ల వెనకటి కవి విమర్శకుల గురించో ప్రస్తావన చేయడంలో ఉంటుంది.

    బహుశా సమకాలంలో మాత్రమే కవులని వారి వారి గొంతుకలతో ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని వందల ఏళ్ళు గడిచేకా ఆయా గొంతుకలు అసలు ఆ కవివో లేక ఆ కవి పేర చెలామణీ అయినవో అయిపోతాయి. ఒక వ్యాసునికి మల్లే / ఒక వాల్మీకికి మల్లే! ఐతే ఇలా ఆధునిక కాలంలో శ్రీ శ్రీ రాసిన కవిత్వంలో సైతం శ్రీ శ్రీ తనని తాను ప్రస్తావన చేసుకుంటూనే మహా ప్రస్థానంలో కవిత్వం చెప్తాడు. పఠాభి సైతం తన పేరుని తన కవిత్వం లోనూ వాడతాడు. మహా ప్రస్థానం కధాకావ్యం కాదు గనక అక్కడ శ్రీ శ్రీ, పఠాభిలు తమ కవిత్వంలో ‘పాత్రలు’ కాకుండా పోయేరా , వ్యాస వాల్మీకుల లాగా? అస్తిత్వ స్పృహ అన్నది ఆధునిక కాలంలో మాత్రమే వచ్చింది. మళ్ళీ కవికి తానుండే సమ కాలం గడిచేకా కొన్ని వందల లేదా వేల ఏళ్ళ పిదప ఈ అస్తిత్వం ఏమీ మిగలదు.

    నారాయణ రావు మాటల ప్రకారం కొన్ని వందల ఏళ్ళ తర్వాత శ్రీ శ్రీ మహా ప్రస్థానం రాసేడో లేదో? అది ఏక కర్తృత్వమో లేక బహుకర్తృత్వమో కూడా కావొచ్చు [బద్దెన/ భీమనల లాగానే]. అలా ఏ కవి రచన అయినా [ఈ విమర్శకుని సిధ్ధాంతం ప్రకారం సుమా] కొన్నేళ్ళ తర్వాత సందేహాస్పదం కావొచ్చు. గమనించండి నారాయణ రావు తన వ్యాసం లోని విషయాన్ని ఒక పక్క సమకాలం చేస్తూ ఉదాహరణల్ని మాత్రం గడిచిన కొన్ని వేల ఏళ్ళ వెనకటివో / లేక తెలుగు సమాజానికి చెందనివో చెప్తాడేమీ? తెలుగు కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు తెలుగు కవులని తీసుకుని మాట్లాడటం కదా సబబు. ఒక కాలం ఒక సమాజం అన్ని కాలాలకీ అన్ని సమాజాలకీ ప్రాతినిధ్యం ఎలా వహిస్తాయీ? పాశ్చ్యాత్య కవయిత్రిని గురించిన సందర్భం తెలుగు కవయిత్రికి/ కవికీ నప్పదు. సంస్కృత ఉదాహరణలు ఇవాళ చెల్లుబాటు కావు. పోనీ కాసేపు ఈ కవుల్ని పక్కన పెడదాం!

    నారాయణ రావూ! నా ప్రశ్న ఏమంటె మరి కొన్ని వందల ఏళ్ల తర్వాత ఏ రచన తాలూకు కర్తృత్వమైనా అంతే కద? అసలు వెల్చేరు నారాయణ రావు అన్న ఒక విమర్శకుడు ఉండి ఉండెడి వాడా? ఒకవేళ ఉన్నచో అతడు నిజంగా అతడేనా? లేక కొన్ని గొంతుకలకి ప్రతీకా? ఏళ్ళ తర్వాత ఆయన “కవితావిప్లవాల స్వరూపం ” స్వరూపం ఏమిటీ? దానిని వెల్చేరు నారాయణ రావే రాSAడన్న ఆధారం ఏమిటీ? ఒక వేళ రాస్తే ఆ రాసింది వ్యక్తిగా వెల్చేరా? లేక ఒక ‘లోపలి వ్యక్తి’గా వెల్చేరా? నువ్వు జవాబు చెప్పవు.

    ఏ రచనకైనా చివరికి వర్తించే ఈ రకమైన సంగతుల్ని ఆయనే మన ముందుకి తెచ్చి ఈ సందేహాలకి పూచీ మాత్రం తనది కాదని అంటున్నాడు. ఆ “నిబ్బరం” తనకి లేదనీ అంటున్నాడు. భలే భలే!

    జయప్రభ.

  10. అవధారు గురించి ఆ. సౌమ్య అభిప్రాయం:

    07/03/2013 4:37 am

    ఎంతో ఆప్యాయంగా, నిజాయితీగా, ఇష్టంగా, చివర్లో ఆవేదనగా ఉన్నాయి మీ జ్ఞాపకాలు. త్రిపుర అంటే ఏమిటో కొంచం తెలిసినట్టే ఉంది. వేల్చూరి వారు చెప్పినట్టు త్రిపుర కథని ఆయన రచనల్లో తెలుసుకోవాలి ఇక మీదట.