పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. సిరినివాస వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    07/04/2013 1:36 pm

    పాదమునకు ఆఱునుండి పండ్రెండు అక్షరములు కలిగిన ఛందములకు వరుసగా గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుభ్, బృహతి, పంక్తి, త్రిష్టుభ్, జగతి అని పేరులు. సూర్యుని రథమునకు ఉండే సప్తాశ్వముల పేరులు ఇవి అని కూడ అంటారు. ఛందస్సు రెండు విధములు – వైదిక, లౌకిక. వేదములలోని ఛందస్సును వైదిక ఛందస్సు అంటారు. వేదములలో పాదమునకు 11 అక్షరములు ఉండే త్రిష్టుభ్ ఎక్కుబగా వాడబడినది. పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే ఛందస్సు మూడు పాదముల త్రిపదగాయత్రిగా, నాలుగు పాదముల అనుష్టుప్పుగా, ఐదు పాదముల పంక్తిగా, ఆఱు పాదముల మహాపంక్తిగా, ఏడు పాదముల శక్వరిగా వాడబడినది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. లౌకిక ఛందస్సులో పాదమునకు పది అక్షరములు ఉంటే అది పంక్తి అవుతుంది. కాని వైదిక ఛందస్సులో ఎనిమిది అక్షరములు గల ఐదు పాదములు పంక్తిగా పరిగణించబడును. పాదమునకు 12 అక్షరములు ఉండే జగతి కూడ చాల వాడబడినవి. ఇవి గాక, మూడు విధములైన త్రిపదలు (8,8,12; 8,12,8; 12,8,8) కూడ వాడబడినవి. జూలై సంచికలోని నా త్రిపదల వ్యాసములో ఇవి చర్చించబడినవి. ఇవి గాక 8-8, 12-8 అక్షరముల బృహతి, 12-8, 12-8 అక్షరముల సతోబృహతి, 8-8-8, 8-8, 12-8 అక్షరముల అతిశక్వరి, 12-12-8, 8-8, 12-8 అక్షరముల అత్యష్టి వీటిని కూడ వాడినారు. బృహతి + సతోబృహతి మనకు బార్హత ప్రగాథను ఇస్తుంది; కకుభ్ + సతోబృహతి మనకు కాకుభ ప్రగాథను ఇస్తుంది. ఈ ప్రగాథలకు మొత్తము 72 అక్షరాలు ఉండాలి. ఈ ప్రగాథలు త్రిపదలే. మీరు ఇచ్చిన శ్లోకములో అస్తు ను విడదీసి, ఓం, నమః కలిపితే మనకు 72 అక్షరాలు లభిస్తుంది. అయినా వాటిని 12, 8 అక్షరాలుగా విడదీయడము కష్టము అనుకొంటాను. వీటిని irregular ఛందములు అని మాత్రమే చెప్పవచ్చును. ఇది నాకు తెలిసిన వైదిక ఛందస్సు. నేను వేదాధ్యయనము చేయలేదు కాబట్టి ఇంతకన్న ఎక్కువ చెప్పలేను. విధేయుడు – మోహన

  2. త్రిపదలు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    07/04/2013 1:14 pm

    మీ వ్యాసం చాలా బాగుంది మోహన రావు గారు.

    ఇంత పెద్ద వ్యాసాలు రాయడానికి ఎంత ఓపిక కావాలో.
    ఈ విషయాల పట్ల ఎంత ఆసక్తి ఉండాలో..

    The old pond;
    A frog jumps in —
    The sound of the water – Basho

    ఇది నాకు చాలా ఇష్టం.

    ఎడ్నా మిల్లే రాసిన ఈ పంక్తులు కూడా అంతే ఇష్టం.

    I will be the gladdest thing
    Under the sun!
    I will touch a hundred flowers
    And not pick one.

    మంచి వ్యాసాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

    ఇంద్రాణి.

  3. సిరినివాస వృత్తము గురించి rajashankar అభిప్రాయం:

    07/04/2013 12:27 pm

    ఆదినారాయణ గారు,
    నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ… శతరుద్రీయం (రుద్ర ప్రశ్న లేక రుద్రం) లోనిది కాదు. ఇది చాలా రూఢిగా చెప్పవచ్చు. “హస్తే దిక్ష్విషవఉభాభ్యాం ద్వావిగ్ం శతిశ్చ” అని సూత్రం. సూత్రంలోని ఒక్కొక్క పదముతో (హస్తే, దిక్షు, ఇషవః, ఉభాభ్యాం) క్రమంగా ఒక్కొక్క పనస (పంచదశ అంటే 50 పదాలు) ముగుస్తుంది. సూత్రం చివర ఇచ్చిన సంఖ్య ఆఖరి పనస తరువాతి పదాల సంఖ్యను తెలియచేస్తుంది. అంటే మొదటి అనువాకంలో నాలుగు పనసలు పైన 22 పదాలు. ఈ లెక్కన నమస్తే అస్తు భగవన్ అన్న స్లోకాన్ని చేర్చినట్లైతే సూత్రంలో ఇచ్చిన సంఖ్య కన్నా ఎక్కువ పదాలు మొదటి అనువాకంలో ఉండాలి. అంతే కాక రెండవ అనువాకం “నమో హిరణ్యబాహవే” తొ మొదలౌతుంది. ఈ స్లోకాన్ని పూజా విధానంలో (రుద్రాభిషేకములో) మాత్రమే ఉపయోగిస్తారు. ఇది సంహితలోనిది ఏమాత్రమూ కాదు. అయితే ఇది శ్లోకము అయినప్పిటికీ ఎవరో మహానుభావడి నోటి వెంట ఉచ్చరింప బడుట వలన ఇది మంత్రము వలే సుస్వరమైయుంటుందని నా భావన.
    భవదీయుడు,
    రాజాశఙ్కర్

  4. భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    07/04/2013 10:27 am

    వ్యాసం చాలా ఆసక్తికరంగాను, విషయ బోధకంగాను ఉంది. ధన్యవాదాలు.

    లిపి భగవత్ప్రసాదం ఆని ప్రజలను నమ్మించి తద్వారా కొరియన్ ప్రజలను చైనీస్ లిపి నుండి తాను కనిపెట్టిన ’హంగూల్’ లిపి వైపు కొరియన్ రాజైన సెజోంగ్ మళ్ళించినట్లు ఒక కథ చదివాను. తాను కనిపెట్టిన లిపి గురించి సెజోంగ్ చక్రవర్తి ఇలా అన్నాడట: ” తెలివైన వాళ్ళు నా హంగూల్ లిపిని ఒక్క పూటలో నేర్చుకోవచ్చు. మూర్ఖులైన వారుకూడా దీన్ని పదిరోజుల్లో నేర్చుకుంటారు. హంగూల్ లిపిలో వ్రాయలేని శబ్దం ఏదీ ఉండదు. గాలి చేసే శబ్దాన్ని, కుక్క మొరిగే ధ్వనిని కూడా హంగూల్లో ఖచ్చితంగా వ్రాయవచ్చు”.

    మంచి వ్యాసానికి మరొక్కమారు ధన్యవాదాలు.

  5. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి karanam srinivas అభిప్రాయం:

    07/04/2013 7:30 am

    చిన్నప్పుడు చిమ్మచీకటి రాత్రి కురిసిన హోరువానకు కోడిపిల్లల వలె చూరుకింద దాక్కొన్నఅనుభవం ఆరనే లేదు. గుండెల్లొ వర్షం కురుస్తునే వుంది. మళ్ళీ నన్ను మా గుడిసెలో వదిలారు. ధన్యవాదాలు.

  6. నింగి-నేల గురించి karanam srinivas అభిప్రాయం:

    07/04/2013 7:02 am

    చాలా బాగుంది.

  7. సిరినివాస వృత్తము గురించి Adinarayana అభిప్రాయం:

    07/04/2013 4:56 am

    కృష్ణ మోహన్ గారికి నా నమస్కారములు,

    జాబులో కొంచం బిజి అవడం వల్ల ఈ మద్యన ఆన్లైన్ రాలేక పోయాను. మీ రిప్లైని ఇవ్వాళనే చదివాను. చాలా ధన్యవాదాలు.

    ఈ పై శ్లోకము యజుర్వేదములోని కృష్ణపక్షములోని రుద్ర ప్రశ్న (దీనినే శ్రీరుద్రం అని కూడ అంటారు) యొక్క మొదటి అణువాక యొక్క తుదలో వున్నది. ఎన్నొ గ్రంథాలలో దీనిగురించి అన్వేషణ చేశాను. అన్నిటిలో ఇది చతుష్పాదముగానే ఇవ్వబడింది. (చూడండి : రుద్రం).

    మీరు చేసిన పద విభజన, అక్షర సంఖ్యలు కూడా చాల బాగుంది మఱియు విచారార్హనీయమైనది. కాని ఏ ఛందస్సో తెలియటం లేదు. నాకు ఇది ప్రగాథ గా తోచుచుంది.

    ప్రగాథ :- నాలుగు పాదాలు గలదై, ప్రతిపాదానికి ఎన్నైనా అక్షరాలు వుండవచ్చునని వికిపీడియలో చదివాను. మీ అభిప్రాయము ఏంటిదో తెలుపగోరుతున్నాను.

    మీ శ్రేయోభిలాషి,
    గూడూరు ఆదినారాయణ

    మఱోవిషయమేమిటంటే అన్ని గ్రంథాలలో “నమస్తే అస్తు” అని విడివిడిగానే వ్రాయబడి వుంది. ఎక్కడకూడ అవగ్రహయుక్తముగా ఈ రెంటిని కలిపి “నమస్తేऽస్తు” అని వ్రాయడం చూడలేదు. బహుశః అక్షరాలను ఛందస్సులో కూర్చోబెట్టడానికె ఆలా వ్రాయబడి వున్నదోనని కూడ అనుమానము వస్తున్నది. ఉదాహరణానికి ఈ క్రింది శ్లోకమును చూడండి. ఈ క్రింది శ్లోకము శ్రీరుద్రములోని మొట్టమొదటిది.

    నమస్తే రుద్ర మన్యవ, ఉతోత ఇషవే నమః,
    నమస్తే అస్తు ధన్వనే, బాహుభ్యాముత తే నమః

    ఈ శ్లోకము అనుష్టుభ్ ఛందస్సులో వ్రాయబడ్డది. దీనిని 4 పాదాలుగా విభజిస్తే ప్రతిపాదానికి 8 అక్షరాలు వస్తాయి. ఇందులో “ఉతోత ఇషవే” ను గుణసంధితో కలిపి “ఉతోతేషవే” అని మఱియు “నమస్తే అస్తు” ను “నమస్తేऽస్తు” అని కలిపి వ్రాస్తే 2వ మఱియు 3వ పాదములో 7 అక్షారలు మాత్రము మిగిలి, ఛందస్సులో సరిపోదు.

  8. అవధారు గురించి jagannadhasharma అభిప్రాయం:

    07/04/2013 4:19 am

    బాగుంది. ఏడుపొచ్చింది.
    -జగన్నాథశర్మ

  9. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Sathyam అభిప్రాయం:

    07/04/2013 2:19 am

    పద్యముల్ చాలా బాగున్నవి శుభం

  10. తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం గురించి lalitha p. అభిప్రాయం:

    07/04/2013 12:03 am

    ముక్కలైన అంబుధర కూ ద్రుక్కుచంబు లకూ బుధులు ఏ విధం గా పోలిక తెచ్చారో పద్యం చదవగానే అర్ధం కాలేదు. ఇంత చక్కని పద్యాన్ని, మంచి వివరణ నూ ఇచ్చి రామక్రిష్ణుని చమత్కారాన్నిపరిచయం చేసినందుకు ధన్యవాదాలు.