పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/26/2013 11:32 pm

    ప్రసాద్ గారు,

    మీరు నన్ను సపోర్ట్ చేస్తా అభిప్రాయం వ్రాసారు. అందుకు థేంక్స్. ఇప్పటి నా అభిప్రాయం మాత్రం నా స్వంతం. మీరు చెప్పినట్టు మనలో చాలా మంది అని నేను చెప్పి ఉండాల్సింది. నేనేవి వయసులో చిన్న వాడిని కాదు, కానీ బూతు మాట్లాదని వాళ్ళని నేను చూడలేదు. నాకు మడిగట్టుకునే వాళ్ళు, రోజుకి ఐదు సార్లు నమాజ్ చేసేవాళ్ళు, నాలాగే, అసలు నమ్మకం లేని వాళ్ళు, నాకు యాభై ఏళ్ళొచ్చినా ఇంకా బిడ్డలాగే నాకు మంచి చెడు చెప్పేవాళ్ళు, ఈ రాత్రికి నా బెడ్ లో నువ్వుంటావా ఉండవా అని అడిగే వాళ్ళు అన్నిరకాల మనుషులు నాకు తెలుసు. అందరూ ఉన్నారు స్నేహితులుగా. కానీ ఎప్పుడూ బూతు మాట్లాడని వాళ్ళు మాత్రం అసలు లేరు. నాకు లేరు కాబట్టి, నేను కాదు కాబట్టి అందరూ అలానే ఉంటారని నేను అనను. మిమ్మలని, మీరు చెప్పిన మాటని నేను నమ్ముతాను, మీకు బూతే తెలియదని మనసు పూర్తిగా. దాంట్లో అసలు ఆర్గుమెంట్ ఏవీ లేదు. కానీ మీలాటి వాళ్ళు చాలా కొంచం మందే అని నా జీవితానుభవం. ఆడా, మగా కూడా. అటువంటప్పుడు, సహజంగా బతుకులో ఉండే ఈ బూతులని రచనల్లోకి తీసుకొస్తే ఏవిటి తప్పు. ఆంగ్లం లో అది మనకు తప్పుగా కనిపించటం లేదు కదా.

    దాదాపు పజ్జెమినిది, ఇరవై ఏళ్ళ క్రితం, బహుశా జ్యోతిలో అనుకుంటా, అది పత్రిక కూడా కావచ్చు. ఒక కథ పబ్లిష్ ఆయింది. మన ఆంగ్ల కథల్లాగే ఇద్దరు స్నేహితులు ఒక కాఫీహోటల్ల్లో కూచుని మాట్లాడుకుంటా ఉంటారు. మీకు తెలియకపోవచ్చు గానీ మేవు మా స్నేహితులు కలసినప్పుడు అలాగే మాట్లాడుకుంటామ్. ఆ కథ కూడా అంత అథెంటిక్ గా ఉంది. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు కలిస్తే ఎలా మాట్లాడుకుంటారో అలా. ప్రతి వాక్యంలో కనీసం రెండు బూతులు వుంటాయి. మీరు తప్పుగా అనుకోకండి, లేకపోతే మేవేవో చెడ్డవాళ్ళవి అని అనుకోకండి, అదేదో సావేత చెప్పినట్టు, భోజనం దగ్గర, శృంగారమ్ దగ్గర, స్నేహం దగ్గర మొహవాటమ్, సిగ్గు ఉండగోడదంటారు. ఆ కథ కూడా అలాగే వున్నిన్ది. నాకు వ్రాసినదెవరో తెలియదు, చాలా కాలం క్రితం సంగతి.

    కానీ మనకి ఆంగ్లం లో “ఎఫ్” వార్డ్ కనిపిస్తే ఏవీ సమస్య ఉండదు, మనకి ఆంగ్లంలో “పి” పదం కనిపించినా ఏవీ అభ్యంతరం ఉండదు, కానీ తెలుగులోనే సమస్య. ఎందుకని? ఏవీ తెలుగు వాళ్ళు సహజత్వానికి అంత దూరంగా బతుకుతున్నారా,మీలాటి ఒకరిద్దరి సంగతి నాకు తెలియదుగాని, మనకు బూతు అంత దూరవైన ఎక్సప్రేషన్ ఏవీ కాదు. ఈరోజు కాకపోతే రేపు, అది కోడా కాకపోతే మరో రోజు, ఎప్పుడో ఒకసారి, మీకు తెలియకపోవచ్చు, కానీ మెజారిటీ తెలుగువాళ్ళకి, ఆడవాళ్ళతోపాటు తెలిసిన, ఈ బూతు, సంస్కృతం లో అయితే ఏవీ అభ్యంతరం లేదుకదా, తెలుగులో మాత్రం ప్రపంచం మునిగిపోయిందా? బతుకులో బూతు లేకుండా అసలు మనకు బతుకేలాగా ఉంటుందండి అండి. నచ్చినా నచ్చకపోయినా నా యమ్మా నాయనలు బూతు చేసేరు కాబట్టే మనకీ బతుకుంది, మనం కోడా అది చేసేవు కాబట్టే మన పిలకాయలున్నారు. అది తెలుగు రచనలోకి రాకూడదు అనుకుంటే మనాలాటి హిపాక్రట్స్ ఇక ఎవరూ ఉండరు. మీరు చెప్పలేదేవో నేను నాబిడ్డకి చెప్పేను. బూతు నాకు తెలిసినంతవరకు బతుకులో ఒక అత్యంత సహజవైన విషయమ్, ప్రసాద్ గారూ. అందుకని, “ఎఫ్” పదం గాని, “దే” పదం గానీ వినపడినా, నేననా, మీరు విన్నా అంతలో ప్రపంచం ఏవీ మునిగిపోదు. సుల్లకాయ కూడా చాలా మామూలు మాటే. మీ అభిప్రాయం వేరుగా ఉండొచ్చు. నేను మామూలు మనిషిని,బూతు నాకు అత్యంత సహజవైన విషయమ్. మీకు నచ్చకపోయినా సరే , నేనే మెజారిటీ, ఇంతకూ ముందు కూడా ఎవరో అన్నారు మెజారిటీ అనకూడదని, కానీ నేను ఖచ్చితంగా మెజారిటీనే.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  2. నిశ్శబ్దం గురించి ప్రసాద్ అభిప్రాయం:

    07/26/2013 5:02 pm

    “ఆంగ్లం నావల్సు చదువుతున్నప్పుడో, సినిమాలు, టివీ చూస్తున్నప్పుడో, అతి దగ్గరి స్నేహితులతో మాట్లాడుకునేప్పుడో, చాలా సార్లు మనం బూతులని వాడుతాం. కానీ తెలుగుకి వచ్చేప్పటికి మాత్రం బూతు ఒక భయంకరవైన తప్పయిపోతుంది. రోజువారీ మన బతుకులో మనం, మన పిల్లలు కూడా (నమ్మడం కష్టవైనా సరే) ఆ నాలుగు అక్షరాల పదాలు ఉపయోగిస్తానే ఉంటాం.”

    ఇక్కడ, “మనం” అని అనే బదులు, “మనలో చాలా మంది (నాతో సహా)” అని రాస్తే, చాలా అర్థవంతంగా వుండేది. అలా జనరలైజ్ చెయ్యడం న్యాయం కాదు. ఆ పదాలని నేను ఉపయోగించను. మా పిల్లలు కనీసం నా దగ్గర ఆ పదాలు ఉపయోగించరు. ఆ పదాలని, తెలుగులో గానీ, ఆంగ్లంలో గానీ ఉపయోగించని వారు చాలా మంది తెలుసు. కనీసం ఇప్పటి వరకూ, నాకు తెలిసున్నంత వరకూ, ఈమాట రచనల్లో కూడా అలాంటి పదాలు లేవు. ఈమాట వారు అంగీకరించరనే నా అభిప్రాయం కూడా. వ్యాఖ్యల్లో మాత్రమే మూడో సారో, నాలుగో సారో చూస్తున్నాము. ఆ పదాలు బాగా ఉపయోగించే సాహిత్యమూ, దాని పాఠకులూ ఉన్నారు. అది వారి కల్చర్. దాని/వారి దగ్గరకు వెళ్ళకుండా ఉండటం మాత్రమే నా లాంటి వాళ్ళు చెయ్యగలిగేది.

    ప్రసాద్

  3. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/26/2013 3:05 pm

    ఆంగ్లం నావల్సు చదువుతున్నప్పుడో, సినిమాలు, టివీ చూస్తున్నప్పుడో, అతి దగ్గరి స్నేహితులతో మాట్లాడుకునేప్పుడో, చాలా సార్లు మనం బూతులని వాడుతాం. కానీ తెలుగుకి వచ్చేప్పటికి మాత్రం బూతు ఒక భయంకరవైన తప్పయిపోతుంది. రోజువారీ మన బతుకులో మనం, మన పిల్లలు కూడా (నమ్మడం కష్టవైనా సరే) ఆ నాలుగు అక్షరాల పదాలు ఉపయోగిస్తానే ఉంటాం. తెలుగుని, తెలుగు రచనల్ని మాత్రం ఒక ఆపరేషన్ థియేటర్, ఒక స్టెరిలైజెడ్ వాతావరణంలో ఉంచాలని చూస్తాం. మళ్ళా మాదచ్చోద్, వెదవా, ముండా అనే పదాలని మాత్రం చాలా ఈజీగా మాట్లాడేస్తాం. ఏం బతుకులో సహజత్వాన్ని, రచనల్లోకి తీసుకురావడం తప్పా?

    నేను వప్పుకుంటున్నాను, నా మొదట జవాబు ఒక నీజెర్ఖ్ రియాక్షన్. కాకపోతే నాకు తను, నేను ఉపయోగించిన పదాల గురించి అభ్యంతరం లేదు. నాకు కష్టవనిపించింది కమలా దాస్ గారి ప్రస్తావనే. అయినా కూడా నా జవాబు ఎవరిని ఉద్దేసించి వ్రాసేనో, వ్రాసిన నాకు తెలుసు, చదివిన వారికి తెలుసు. బూతుల గురించి నేను క్షమాపణ చెప్పటం లేదు ఇప్పుడు, ఆ ఎమ్మెల్ పదం వ్రాయకుండా ఉండుంటే బావుండేది.

    లైలా గారు, దయచేసి నన్ను క్షమించండి. తప్పు నాప్రక్కనించి కూడా జరిగింది.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  4. నిశ్శబ్దం గురించి ప్రసాద్ అభిప్రాయం:

    07/26/2013 12:36 pm

    న్యాయం
    =====

    నాకు కవితలు ఒక పట్టాన అర్థం కావు. కాబట్టి ఈ కవిత గురించి నేనేమీ చెప్పలేను. అయితే, ఇక్కడ జరిగిన ఒక వివాదం గురించి మాత్రం నా అభిప్రాయం చెప్పాలని వుంది. మొదట్లో, కొన్ని రోజులు, “నా కెందుకులే ఈ గోల”, అని వూరుకున్నాను, పట్టించుకోకుండా. ఇవాళ రవికిరణ్ గారి అభిప్రాయం చదివాక, ఇక వూరుకో బుద్ధి కాలేదు. ఈమాట వారు నా అభిప్రాయాన్ని సెన్సార్ చేసినా సరే, రాసెయ్యాలి అని అనుకున్నాను.

    ఈ వివాదంలో మాత్రం నేను రవికిరణ్ గారితో ఏకీభవిస్తున్నాను స్పష్టంగా. దీనర్థం, ఆయన ఆ బూతు పదం వాడొచ్చని కాదు. ఆ విషయంలో ఆయన మీద కూడా నాకు విమర్శ వుంది. అయితే, ఆయనతో ఏకీభవించేది, ” ఆడవాళ్ళు మాత్రం బూతులని నిరభ్యంతరంగా వ్రాయవచ్చు.” అన్న మాటల్లోని వ్యంగ్యంతో.

    అసలు ఆ పదాన్ని ముందుగా వాడింది లైలా గారు. అలా, లైలా గారు ఆ పదాన్ని వాడడాన్ని, జయప్రభ గారు, “ఆడవాళ్ళు రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి బహుశా లైలా ప్రయత్నం చేశారు.” అని వెనకేసుకు వచ్చారు. “బూతు పదాలు” ఆడవాళ్ళు రాసినా, మగవాళ్ళు రాసినా ఒకే లాగా వుంటాయి. దొందూ దొందే. రెండూ గాడిదలే. లైలా గారు, గతంలో, “ఎఫ్” అక్షరంతో మొదలయ్యే ఒక ఇంగ్లీషు బూతు పదాన్ని కూడా రాశారు ఒక వ్యాఖ్యలో. ఈమాట వారు దాన్ని ఎలా అంగీకరించారా అని ఆశ్చర్యం వేసింది. “సరే, వారి పత్రికా, వారి ఇష్టం. నచ్చితే చదవడం, లేకపోతే వూరుకోవడం” అనుకుని వూరుకున్నాను. ఒక్కరు కూడా ఆ విషయం గురించి అడగలేదు. ఒక స్త్రీ అలా రాస్తే, అడగడం తప్పు అనుకున్నారేమో మరి. తప్పు పురుషుడు చేసినా తప్పే, స్త్రీ చేసినా తప్పే. ఆ తర్వాత రవికిరణ్ గారి కవితకి రాసిన వ్యాఖ్యలో, లైలాగారు ముందుగా ఆ పదాన్ని వాడారు. దాన్ని కూడా ఎవరూ ప్రశ్నించలేదు. పైపెచ్చు సమర్థించిన వారే వున్నారు. లైలా గారు వాడిన ఆ పదం రాసిన వ్యాఖ్య పదాల్లో కలిసి పోయి కూర్చుంది. దానికి రవికిరణ్ గారు ఇచ్చిన జవాబులో, ఆ పదం మొదటి పదంగా కూర్చుని, అందరి దృష్టినీ ఆకర్షించింది. అప్పుడు జయప్రభ గారు చాలా న్యాయమైన ప్రశ్న అడిగారు ఈమాట వారిని, “ఇలాంటి భాషనీ ఇలాంటి అభిప్రాయాన్నీ అచ్చు ఎలా వేశారూ? అని ఒక పాఠకురాలిగా నేను సంపాదకులని అడుగుతున్నాను. దీన్ని అచ్చువేయడం లో మీ ఉద్దేశ్యం ఏమిటీ??” అని. చాలా మామూలుగా గానే వారు మౌనం వహించారు. వారి పత్రికా, వారి ఇష్టం. జయప్రభ గారు లైలా గారిని కూడా విమర్శిస్తే, ఆ పద ప్రయోగానికి, చాలా బాగుండేది. అలా జరగలేదు. రవికిరణ్‌ని మాత్రమే గట్టిగా విమర్శించారు. అప్పటికీ రవికిరణ్ గారు పాపం క్షమాపణ చెప్పుకున్నారు. అయినా వదలలేదు ఆయన్ని. వెంకటేశ్వర్రావు గారు ఆ పదం తీయించే ఏర్పాటు చెయ్యమని బోధించారు. ఇక్కడ, వెంకటేశ్వర్రావు గారిని, “మరి మీరు లైలా గారికి కూడా అలాంటి సలహా ఇవ్వలేదే?” అని ఎవరూ ప్రశ్నించలేదు. ఒకవేళ, ఎవరన్నా ప్రశ్నిస్తే, “మరి లైలా గారు తన తప్పు ఒప్పుకోలేదుగా” అని అంటారేమో, వెంకటేశ్వర్రావు గారు.

    లైలా గారూ, రవి కిరణ్ గారూ – ఇద్దరూ వాడారు ఆ బూతు మాటని. దానికి రవికిరణ్ గారిని మాత్రమే విమర్శిస్తే న్యాయం లేదు. ఎవరు ముందర వాడారూ అన్నది ఒక విషయాన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తుందే తప్ప, అంగీకరించేటట్టు చెయ్యదు. రవికిరణ్ గారు ఆ పదం వాడటానికి వచ్చిన సందర్భం అర్థం అయ్యేటట్టు చేస్తుందే గానీ, ఆయన ఆ పదం వాడటాన్ని అంగీకరించేటట్టు చెయ్యదు. రవికిరణ్ గారి చెప్పే సూక్తులు లైలా గారికి కూడా చెప్పాలి.

    నేను ఇలా రాసినందుకు, నా మీద ఎన్నో విసుర్లు వస్తాయని తెలుసు. వాటికి సిద్ధపడే రాస్తున్నాను. మొదట ఈమాట వారు ఈ వ్యాఖ్యని అంగీకరించాలి. ఆ తర్వాత కదా విసుర్లు వచ్చేవి? సరే, ఏమన్నా ఒక పాయింటు వుంటే మాత్రమే, జవాబిద్దాం, లేకపోతే ఆ విసుర్లని భరించి వూరుకుందాము అని నిర్ణయించుకుని, నా అభిప్రాయాన్ని రాస్తున్నాను.

    ప్రసాద్

  5. తెలుగువాడి జీవనాడి… కూచిపూడి గురించి నాగరాజ్ అభిప్రాయం:

    07/26/2013 11:54 am

    నేను గత ఏప్రిల్ లో ఈ కథనాన్ని ‘తెలుగు వెలుగు’ మేగజైన్ కోసం రాయడం జరిగింది. ఆ తర్వాత వాసిరెడ్డి నవీన్ గారు ఇదే కథనాన్ని తానా సావనీర్ లో వాడుకుంటామని అనుమతి తీసుకున్నారు. నా వివరాలు, కూచిపూడిపై పూర్తి కథనం ఇటీవలే అప్ డేట్ చేయడం మొదలుపెట్టిన నా బ్లాగు లో కనిపిస్తాయి. థాంక్యూ.

  6. ఊహాతీతం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/26/2013 10:44 am

    కథ బావుంది. ఆలోచింపచేసేలా వుంది.
    అభినందనలతో..
    -ఆర్.దమయంతి.

  7. నిశ్శబ్దం గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    07/25/2013 4:46 pm

    నిజవేనండి డి. వెంకటేశ్వర రావు గారు. ఆడవాళ్ళు మాత్రం ఏవన్నా వ్రాయవచ్చు. మగవాడ్ని కదా శృంగారాన్ని సున్నితంగా వ్రాసినా తప్పే, ఒక అమ్మ కష్టాన్ని, అక్క కష్టాన్ని కష్టవని వ్రాసినా తప్పే, ఆడవాళ్ళు మాత్రం బూతులని నిరభ్యంతరంగా వ్రాయవచ్చు. జవాబు నాది తప్పే, కానీ ఆ జవాబు పూర్తిగా తన మాటల్లోనే కదా వుంది?

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. కథాంతం గురించి cbs venkaramana అభిప్రాయం:

    07/25/2013 1:38 pm

    ఇది కథ ఎలా అవుతుంది? వచన కవిత్వం లాగ ఉంది. ఐతే రూపకం అవాలి. కథ ఐతే మాత్రం కాదు.

  9. నిశ్శబ్దం గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    07/25/2013 1:58 am

    ఏ రకంగానైనా తప్పు తప్పే. మీరు ఎలా వ్రాసి ఉండకూడదని అనుకుంటున్నారో అవి తొలగించే ఏర్పాట్లు చేయండి. అప్పుడే మీ తప్పులు దిద్దుకున్నవారవుతారు. ఏమంటారు రవికిరణ్ గారు?

  10. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి వలలుడు అభిప్రాయం:

    07/24/2013 7:56 am

    భక్తి, శృంగారాలు కాకుండా మిగతా రసాలను పట్టించుకుని కచేరీలలో పాడి ఒప్పించి, మెప్పించిన కర్ణాటక సంగీతకారులున్నారా? -శ్రీనివాస్ వురుపుటూరి

    టక్కున గుర్తుకొచ్చిన పేరు సుబ్రహ్మణ్య భారతి. చిన్నంచిరు కలియే, వందేమాతరం వంటి వారి కీర్తనలెన్నో ఆ పరిధికి ఆవల ఉన్నాయి. అవన్నీ పలువురు తమిళ సంగీత విద్వాంసులు కచేరీల్లో పాడుతూన్నవే. పైగా ఆయన మహాకవి కావడం మూలాన సాహిత్య విలువల్ని సంగీతం కమ్మేసే ప్రశ్నే లేదు.