పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. దైవం గురించి indrani Palaparthy అభిప్రాయం:

    07/30/2013 10:59 pm

    శ్రీ వేలూరి వెంకటేశ్వర రావు గారికి:

    నమస్తే.

    మీరు అన్న శ్లోకం నాకు తెలియదండీ. ఆ శ్లోకమే కాదు అసలు నాకు వేదాల్లో ఏమి చెప్పారో తెలియదు. ఎవరైనా వ్యాసాల్లో ఉదహరిస్తే చదవడం తప్ప. ఏవో ఆధ్యాత్మిక పత్రికలు,పుస్తకాలు అవీ తిరగేస్తూ ఉంటాను కానీ అన్నీ సగం సగం అర్ధమైనట్టు ఉంటాయి. అయినా విడవకుండా చదువుతూ ఉంటాను,అవి దొరికినప్పుడల్లా. ధ్యానం మీద నాకు బాగా ఆసక్తి. ధ్యానంలోనూ,పురాతన దేవాలయాల సందర్శనలోనూ దైవంతో అనుసంధానాన్ని అనుభవిస్తుంది మనసు. శివుడు నా ఆరాధ్య దైవం. యోగుల జీవిత చరిత్రలంటే ఆసక్తి.

    నేను పని చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ అప్పుడప్పుడూ దేవుడి గది వంక చూస్తూ ఉంటాను,అప్పుడాయన ఎప్పుడూ నా వంక చూస్తూ ఉన్నట్టు అనిపిస్తూంటుంది.

    ఈ వివరాలు చదివి నవ్వుకుంటారేమో మీరు. 🙂 మీ విశ్లేషణకు ఏమైనా ఉపకరిస్తుందేమో అని రాస్తున్నాను.

    ధన్యవాదాలు.
    ఇంద్రాణి.

  2. నిశ్శబ్దం గురించి lyla yerneni అభిప్రాయం:

    07/30/2013 10:50 pm

    నాకు కష్టవనిపించింది కమలా దాస్ గారి ప్రస్తావనే. – -రవికిరణ్ తిమ్మిరెడ్డి

    “కమలాదాస్ కదలు తల్సుకుని
    ఆమె తన తలుపెందుకు కొట్టదా?
    కొడితే తన గింత బోర్ కొట్టదు కదా అని”

    Those are the lines, in the reading material I provided. What is in those lines, to make one feel bad? Why did you feel bad?

    లైలా

  3. నిశ్శబ్దం గురించి lyla yerneni అభిప్రాయం:

    07/30/2013 9:47 pm

    అసలు ఆ పదాన్ని ముందుగా వాడింది లైలా గారు.

    లైలా గారు, గతంలో, “ఎఫ్” అక్షరంతో మొదలయ్యే ఒక ఇంగ్లీషు బూతు పదాన్ని కూడా రాశారు ఒక వ్యాఖ్యలో. ఈమాట వారు దాన్ని ఎలా అంగీకరించారా అని ఆశ్చర్యం వేసింది.- ప్రసాద్

    The word “Fuck” has almost lost its profanity connotation. Some may still use it that way. But, who wants to be that kind of a dud.

    Fuck – made its appearance in English Novels, initially causing some turmoil, slowly transformed its image over last few years, and now is used with great deal of freedom and joy in English literary magazines, cinema. T.V, dramas. It is now much more fashionable word than –“sexy” used to be a few years back. Its applications are multiple and are lot of fun. The editors of this magazine are pretty familiar with current English idiom. I don’t think I sneaked the word in.

    Let me give you an example of this word’s usage in the next sentence. This writing of yours; reading sentence by sentence back like a courtroom clerk; saying my name nine times, to frame me; (of what guilt?) while appearing as such an innocent who will not even write the name of his own body part; it’s fucking good. (Meaning, I really enjoyed your writing.)

    Talk to the lexicographers, and other gentlemen, who are enthusiastic in writing scientific essays in Telugu. They appear on eemaata, from time to time. They may help you find better Telugu words which are palatable to you. When I asked Microsoft Word for 🙂 “ఆ పదం” it brought up “సొరకాయ” as the word I should use.
    I don’t think so.:-)

    లైలా

  4. తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:

    07/30/2013 9:08 pm

    అంతే లేండి, ఎవరికి తోచింది వారనుకుంటారు! సైన్సు పత్రికలో ఏదో ఒక కాన్‌ఫరెన్సుకు సంబంధించిన ఆబ్‌స్ట్రాక్టులు అందరికీ తెలియడం కోసమని ప్రచురిస్తూ ఉంటారు. అంతమాత్రాన పత్రిక విలువేమీ తగ్గిపోదు. సంపాదకులకు వాటిమీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియని అమాయకులనుకోను పాఠకులు!

    కృష్ణారావు

    (సోమరాజుకి ఆడి బామ్మరిదికీ తేడా తెలీపోతే ఎలా?)

  5. భార్యోత్సాహం గురించి Naresh అభిప్రాయం:

    07/30/2013 8:04 am

    అన్నీ భర్తే చేస్తే ఇక భార్య ఏమి చేస్తుందో. ఇలాంటి భార్యలు ఉంటే అంతా నిరుత్సాహమే.

  6. దైవం గురించి a.madhu అభిప్రాయం:

    07/30/2013 7:09 am

    చాలా బాగుంది.

  7. గతమెంతో ఘనకీర్తి – భవితెంతో భవదీప్తి గురించి తః తః అభిప్రాయం:

    07/29/2013 5:21 pm

    “కానీ గురజాడ వేసిన బాట ఒక శతాబ్దంలో సాహిత్యాన్ని పురోగమన మార్గం పట్టించింది. భావకవిత్వ ధారను చరిత్ర గర్భంలో నిక్షిప్తం చేసింది.” – ఆర్ వి రామారావు

    తిలక్ కవిత్వంలో ‘భావకవిత్వ’ ధార ఉన్నదా లేదా? తిలక్ గురజాడకు -రామారావు గారి రచన కు సంబంధించినంతవరకూ -కాలప్రమాణంలో తగినంత దూరంలో ఉన్నాడా లేడా? ఈ రెండు ప్రశ్నలకూ సమాధానాలు, ‘ఉన్నది’ , ‘ఉన్నాడు’ అనే వస్తాయనుకుంటాను.

    తః తః

  8. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి తః తః అభిప్రాయం:

    07/29/2013 11:49 am

    లక్ష్మన్న గారికి ధన్యవాదాలు. ఈ చరణం ఆంధ్రప్రభ అచ్చులో వచ్చిన గుర్తు రావటం లేదు.

    నమస్కారాలతొ
    తః తః

  9. నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/29/2013 11:14 am

    “రమ్మంటే చాలు గానీ రాజ్యాలు విడిచి రానా…” అన్న పాట శ్రీ రోహిణీ ప్రసాద్ సింధుభైరవి రాగంలో బాణీ కట్టగా నేను పాడే వాణ్ణి. ఆ పాటలో ఒక చరణం ఇక్కడ ఉన్నట్టు లేదు!

    కన్నులందు మంచులాగా
    కలన్నీ కరగి పోగా
    కావేరీ వోలె పొంగే
    కన్నీరు తుడిచి రానా … (రమ్మంటే చాలు గానీ…)

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి narayana అభిప్రాయం:

    07/29/2013 7:34 am

    గుజలీ పుస్తకాలు అంటె ఏమిటి? దయచేసి తెలుపగలరు.