పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి v.sesha sayee అభిప్రాయం:

    08/06/2013 6:03 am

    సాక్షి సినిమాలో పాట “అలివేణికి మొక్కరా” కాదు. అది “అయిరేణికి మొక్కరా” (అయిరేని కొండల గురించి.)

  2. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి తః తః అభిప్రాయం:

    08/06/2013 1:04 am

    తః తః అన్నది — “ప్రగాఢమైన నమ్మకం ఉంటూనే తీవ్రంగా ప్రశ్నించటమూ ఉండవచ్చన్నదీ అనుభవమే. The concept of questioning with faith …

    డా. జయప్రభ కు అర్థమైంది — “నమ్మకాలని బాగా ప్రశ్నించమని అంటున్నారు అదిగో ఆ తహ తహ గారు

    నేను చెప్పదలచుకున్నదాన్ని ఇంకొంచం స్పష్టం చేయాలని,”The concept of questioning with faith” అని ఇంగ్లిష్ లో చెప్పి అగేహానంద భారతి (హిందూ సన్యాసిగా మారిన ఒక ఆస్ట్రియన్) పుస్తకాన్ని రిఫర్ చేశాను.

    డా. జయప్రభ భక్తి సాహిత్య కర్తృత్వాల చర్చలొ పడి నా మాటల్లోని విభక్తి ని విస్మరించారనుకోవాలి. నమ్మకా’న్ని’ ప్రశ్నించటం కాదు. విశ్వాసాన్ని సడలనీకుండా, నమ్మకం ‘తో’, ప్రశ్నించటం . It roughly means ‘questioning details keeping faith in tact’. ఇంత తప్పుగా అర్థం చేసుకోగలిగిన వాళ్ళను ఇదే చూట్టం! “అదిగొ ఆ తహ తహ గారు”ని అలా అన్న వాళ్ళ సంస్కారానికి వదిలేస్తూ…

    తః తః

  3. నిశ్శబ్దం గురించి lyla yerneni అభిప్రాయం:

    08/05/2013 10:45 pm

    కానీ ఆ కాంటెక్స్ట్ లో కమలాదాస్ గారి ప్రస్తావన అసలు బాగలేదు.-రవికిరణ్ తిమ్మిరెడ్డి

    What context did you read it in? Poet of నిశ్శబ్దం? Who now tells us, he likes poetry of Kamala Das, for certain specific qualities.

    The man, who is a stay home daddy -in the 100 words I provided- is reading the same Kamala Das. Her writing is so compelling, he is brooding over it, and he forgets to change the diaper of an infant son. This stay home dad is a responder to some styles of writing, so he weeps.

    Why should the man -in the 100 words I provided,- be denied access to a writer? In what context should/should not Kamala Das be read or contemplated? Is a diaper changing guy not privy to reading a sophisticated woman?

    Explain.

    లైలా

  4. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha అభిప్రాయం:

    08/05/2013 1:48 pm

    అవును ఇంద్రాణీ! ఎప్పుడైనా నాకు కూడా కవిత్వం కలిగించే అనుభవమే ప్రధానం అవుతుంది. శబ్దమో అర్ధమో! మహిషాసురమర్దిని స్తోత్రపు నడక మామూలుదా? అది చదువుతున్నప్పుడు హృదయస్పందనపు వేగాన్నీ పెంచుతుంది. అదే సమయంలో చిత్తశాంతినీ కలిగిస్తుంది. నీకు మల్లేనే నాకూ ఇవన్నీ ఎంతో ప్రీతిపాత్రమైనవి. మరీ చిన్నతనం లోనే చాలా శ్లోకాలూ, స్తోత్రాలూ నేర్చేసుకున్న అనుభవంతో చెబుతున్నాను ఆ ధ్వనులు అస్పస్టం ఐన ఏవో వాసనలని మనసుకి అందిస్తాయని!

    ఈమాటలో నేను చదివిన కవిత్వంలో నీ ఊహలు ఎంతో వైవిధ్యం గా ఉన్నాయి. అందరూ చూసే ఒక అతి సాధారణ దృశ్యం లోంచి ఒక అసాధారణ దృశ్యాన్ని నీ కవిత్వం చూపిస్తుంది. అందుకోసం నువ్వు ఎంచుకునే పదాలు సైతం బాగుంటున్నాయి. మంచి కవిత్వం అంటేనే అదీ! ఒక కవిత చదివాకా ఏ కారణం వల్ల అయినా అది అలా మనసులో చాలా సేపు సుడితిరగాలి. సుఖాన్నో,దుఖాన్నో కల్గిస్తూ! కవిత్వం నించి నేను ఆశించేది ఇంతే!

    వేళకి అనివార్యంగా ” మల్లేపూల్ మల్లేపూల్..” అంటూ పిలిచే ఒక కొత్త గొంతుకి తెలుగు పాఠకులు అనివార్యంగా ఎదురు చూడాల్సి వచ్చేలా, మరిన్ని మరిన్ని మంచి కవితలు నీ నించి రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచం లోని నిత్య సంక్షోభాలు సైతం నీ చూపు దాటి పోకూడదని కూడా కోరుకుంటున్నాను.

    ఆత్మీయంగా.
    జయప్రభ.

  5. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి indrani Palaparthy అభిప్రాయం:

    08/05/2013 10:41 am

    జయప్రభ గారు:

    నమస్తే.

    స్తోత్రం ఎవరు రాసారు అన్న దాని మీద నాకు పెద్ద ఆసక్తి ఏమీ లేదండీ. అలాగే నిజంగా మహిషాసురుడు ఉన్నాడా,అమ్మ వారి చేత సంహరింపబడ్డాడా అనేది కూడా.

    నాకు కావలసింది ఆ స్తోత్రం వింటున్నప్పుడు లేక చదువుతున్నప్పుడు దాని శబ్దశక్తి వల్ల నాకు కలిగే అనుభూతి. ఆధ్యాత్మిక ఆనందం.

    నా చిన్నప్పుడు మీ ఇంటర్వ్యూ ఒకటి పత్రికలో చూసాను. మీరు నవ్వుతూ కూర్చుని ఉన్న ఫొటో వేసారు. మీరు మీ చిన్నప్పటి విషయాలు, మీ నాన్న గారి గురించి, ఇంకా రేడియో వినడం గురించి అలాంటి విషయాలు చాలా చెప్పారు.

    మీతో ఇప్పుడిలా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది.

    ఇంద్రాణి.

  6. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha అభిప్రాయం:

    08/05/2013 3:37 am

    కామేశ్వర రావు గారూ! కాళిదాసుని గురించి మాట్లాడటం చాలా క్లిష్టమైన విషయం! మరీ ముఖ్యంగా నిర్ధారించడం! ఎవరు ఏ అభిప్రాయానికి వచ్చినా అది వారి వారి నమ్మకం తప్ప అన్యం కాలేదు.

    కాళిదాసుని గురించిన విశేషాలలోని అంశాలెన్నో ఇప్పటికీ ప్రశ్నార్ధకమే! ఆయన కాలమే స్పష్టంగా నిర్ధారణ కాలేదు. మౌఖికంగా ఆయనని గురించిన అనేకమైన కధలు ప్రచారం లో ఉన్నవి. అందులో ఎవరికి నచ్చినవి వారు చేర్చుకుంటూ పోయేరు. ఆయన కవిత్వాన్ని ఎందరో ప్రస్తావించేరు. ఆయన ఉపమల గొప్పదనాలని కీర్తించేరు. వల్లభదేవుని మొదలు కోలాచలం మల్లినాధుని వరకూ వ్యాఖ్యానాలు రాసేరు. కర్నాటకలోని ఐవోలు శాసనంలోని కాళిదాసు ప్రసక్తి ఉంది.

    ఇంక అనేకులు అనేక అభిప్రాయాలని వ్యక్తంచేసేరు మరి. అతడు శుంగవంశంలో ఉన్నవాడంటే కాదు ఖచ్చితంగా గుప్తవంశం వాడైన రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యునిగా బిరుదు పొందిన వాడు ఆయన ఆస్థానంలోని నవరత్నాలలో కాళిదాసు కూడా ఒకడని చెప్పారు. చివరికి కాళిదాసు రచనలని అనుసరించి ఆయన భారత దేశం అంతా బాగా తిరిగాడని భావించారు. ఆయన ఉజ్జయినీ వాడంటే కాదు మిధిల వాడని మరికొందరూ తగువుపడ్డారు. ఉజ్జయినీ ఆయనకి ఎంత బాగా తెలియక పోతే “మేఘ సందేశం” లో అంత బాగా వర్ణిస్తాడనీ అన్నారు. అసలు హిమాలయాలని అంత బాగా వర్ణించేడని అంటేనే ఆయన అక్కడే ఎక్కడో పుట్టి, ఆ తర్వాత ఉజ్జయినీకి వలస వచ్చి ఉండాలీ అని అన్నారు!చివరికి ఆయన సింహళం వెళ్ళాడనీ అక్కడ ఉన్న రాజుకి కాళిదాసంటే మహా ఇష్టమనీ చెబుతూ దానికి సంబంధించిన ఒక గాధని ఆధారంగా చూపిస్తూ, చివరికి కాళిదాసు సింహళ దేశంలో హత్య కావింబడ్డాడనీ ప్రచారంలో ఉన్న కధల్నీ ప్రస్తావించారు. ఆయనని గురించి పరిశోధనలు చేసిన పండితులే ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. ఆయన కాలం తేల లేదు. ఆయన జీవితం గురించిన ఒక స్పష్టమైన విషయమూ మనకి ఆధారాలతో దొరికిందిలేదు ఇప్పటి వరకూ! అసలు ఆయన కవిత్వం సైతం అనేక సార్లు ఎత్తి రాసుకునే క్రమంలో మార్పులూ చేర్పులూ పొంది ఉంటుందనే భావన సైతం పండితులలో ఉంది. ఇన్ని వేల ఏళ్ళలో ఏది మూల ప్రతికి దగ్గరగా ఉన్నదో ఏది ఎన్ని మార్పులు పొంది తయారైనదో సరిగ్గా తెలియలేదు కాళిదాసు రచనల విషయంలో.

    కాళిదాసుని తొలిగా ఇంగ్లీషు వారికి పరిచయం చేసిన విలియం జోన్స్, హెచ్.హెచ్. విల్సన్ లు ఆయన కవిత్వానికి పరవశించిన జెర్మన్ కవి గోథె లాంటి వాళ్ళూ ఉన్నారు. రామచంద్ర తివారీ లాంటి ఆధునిక పరిశోధకులూ కాళిదాసుని గురించి బోలెడంత పరిశోధించి తీర్మానాలు చేశారు. ఇన్ని జరిగినా కాళిదాసు ఒక మిస్టరీ గానే మిగిలిపోయాడు చివరికి.

    ఇంతా చేసి కాళిదాసు అసలు ఎవరూ అన్నదే ఇంకా తేలలేదు. మీరేమో కాళిదాసు ఒక తరహా కాదు ఇంకో తరహా కవిత్వం రాసిన వాడూ ఒకాయన ఉన్నాడని అంటున్నారు. సంస్కృతంలో ప్రసిధ్ధి చెందిన చాలా శ్లోకాలకి కర్తృత్వ నిర్ణయం సాధ్యం కాదని నేను ఇందుకనే అన్నాను సుమా! ఆశు సంప్రదాయం బలంగా ఉన్న సంస్కృతులలో ఉన్న బలమూ ఇదే, బలహీనతా ఇదే! కవి రచన నిలబడుతుంది. కర్తృత్వం నిలబడదు. నమ్మకం ఉంటుంది. నేను మీ నమ్మకాన్ని అర్ధం చేసుకుంటాను కూడా!

    మీరు అశ్వధాటీ వృత్తంలో ఉన్న ఆ దశ శ్లోకీ రచన కాళిదాసుదే అని భావించినా, కాదని ఆది శంకరులదే అని మోహన గారు భావించినా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి గనకా? నమ్మకమే కదా? నమ్మకాలని బాగా ప్రశ్నించమని అంటున్నారు అదిగో ఆ తహ తహ గారు — మరి అలా ప్రశ్నించుకుంటూ మరి కొన్ని కొత్త వెలుగులు ప్రసరించరాదూ మీ అందరూనూ. పాఠకులు మరి కొన్ని కొత్త సంగతులని చదివి సంతోషిస్తారు కద! అందువలన మీకు తెలిసిన కాళిదాసుని గురించి పరిచయం చేయండి.

    జయప్రభ.

  7. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    08/04/2013 9:01 pm

    ఇప్పుడే నా స్నేహితుడుకి చదివి వినిపిస్తున్నాను, ఆ ఆఖరి పాదాల్ని మరీ మరీ రెండు మూడు సార్లు చదువుతూ. మీరు లేని ప్రపంచం లో నేను కొంతకాలం నివసిస్తాను త్రిపురా, నాకు ఎలా చెప్పాలో ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు, అంత ప్రేమని, అంత అద్భుతాన్ని, ఈ తెలుగు మాటల్లో.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  8. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి మోహన అభిప్రాయం:

    08/04/2013 10:17 am

    ఇన్నేళ్ల తరువాత ఈ వ్యాసముపైన అభిప్రాయాలు వస్తున్నందులకు ఆనందముగా ఉంది! దశశ్లోకి శంకరాచార్యకృతమని అభిప్రాయమున్నది. నేను ఈ వ్యాసమును వ్రాసినప్పుడు అలాగే ఉండవచ్చుననుకొన్నాను. కాని అది నిస్సంశయము కాదు కాబట్టి నేను దానికి ఉదాహరణను ఇవ్వలేదు. కాని ఇప్పుడు చెప్పగలను అది వారు వ్రాయలేదని. ఎందుకంటే అశ్వధాటి వృత్తము శంకరుల కాలములో లేదు. దానిని హేమచంద్రుడు తన ఛందోనుశాసనములో పేర్కొనలేదు. అశ్వధాటి మొట్టమొదట సుమారు 16వ శతాబ్దపు మందారమరంద చంపువులో కనబడుతుంది మనకు, అశ్వధాటి పేరుతో కాదు మత్తేభము అనే పేరుతో! ఈ విషయాలనుగురించి నేను ఒక ప్రత్యేక వ్యాసము వ్రాయబోవుచున్నాను, బహుశా అది జనవరి నాటికి తయారు కావచ్చును. కామేశ్వరరావుగారు, మీరు చెప్పిన కాలిదాసు ఎప్పటివాడో? విధేయుడు – మోహన

  9. దైవం గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    08/04/2013 5:43 am

    దేవునిపై కవిత్వం చాలాకాలంగా లేదు. బహుశా అభ్యుదయం కాదంటారని భయమేసి కాబోలు. ఈ మధ్య సూఫీ కవిత్వానికి లభిస్తున్న ఆదరణ మరలా ఆ వైపుకు మనల్ని మరలిస్తుందేమో. మంచి పరిణామమే! కవిత సాదాగా ఉన్నా ఒక మంచి మలుపుకు కారణమౌతుందనిపిస్తుంది.

  10. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు… గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    08/04/2013 5:32 am

    శరీరంతో
    మీరు లేని ప్రపంచంలో
    నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా…!
    మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని
    లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ –
    కొన్ని కాంతి సమయాల్ని తింటూ –
    బూడిదరంగు ఆటలో పాల్గొంటూ…

    ఇంతకు మించి ఒక నిద్రపై మరొకరు చెప్పటానికి ఏముంటుంది…