పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నిశ్శబ్దం గురించి D.Venkateswara Rao అభిప్రాయం:

    08/09/2013 8:41 am

    మీ ఆరు ఖండాలు చదివినప్పుడు ఎలా విమర్శించాలా అనుకున్నాను. లైలా గారు వ్రాసిన పంక్తులకు, మీ ఆఖరు కవిత ఖండం జోడించి, మొత్తం ఒకసారి చదివి చూచినప్పుడు ఇక వ్రాయవలసిన అవసరం రాలేదు.

    “ఎదొందలయాభై ఎమ్మెల్ రక్తం లో కలసిపోతే మొహాన నరాలు ఉబ్బిపోతే.
    కానీ ఎప్పుడో వెళ్ళిపోయిన కమలాదాస్ ని ఈ పెంటలోకి
    మనసు మారుమూలల్లో మిగిలిపోయిన …”

    ఫై పంక్తులలొ ‘ఎదొందలయాభై ఎమ్మెల్ రక్తం’ అంటె ఎమిటొ కొంచెం అర్ధమయ్యెలా చెబుతారా రవికిరణ్ తిమ్మిరెడ్డి గారూ?

    దడాల వెంకటేశ్వరరావు

  2. నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి Nagaraju Vemuri అభిప్రాయం:

    08/09/2013 8:11 am

    Recently I read Neela sundari Parinayam of Kuchimanchi Timma kavi. Most of the words I was not able to know the meanings. I approached one of my guru ( for Telugu literature) and got to know that the kavyam was written in Accha Telugu. According to my guru, If you don’t understand the acchha telugu words, that means you do not know telugu.

    This website is very good. Why don’t you introduce some more easy literary subjects to enable us to learn the Telugu ( As per SRI SRI “Teluguvadi nota telugela palakadu”) for our present and future young generations.

    Nagaraju Vemuri

  3. భార్యోత్సాహం గురించి Nagaraju Vemuri అభిప్రాయం:

    08/09/2013 7:43 am

    ముణి మాణిక్యం గారిని గుర్తుకు తెచ్చారు.

  4. కథాంతం గురించి రవిశంకర్ అభిప్రాయం:

    08/07/2013 9:11 pm

    థాంక్స్ జగన్నాథశర్మ గారు. కథ బాగుందని మీరు చెప్పటం చాలా ఆనందం కలిగించింది.

  5. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి రవిశంకర్ అభిప్రాయం:

    08/07/2013 9:05 pm

    మీరన్నది నిజమే. అలంకరించిన కుండల గురించి కదా. ఉత్తరోత్తరా నా కా పదం తెలిసిందిగాని, వెనక్కు వచ్చి, వ్యాసంలో కరెక్టు చెయ్యలేదు. మీరు సరిదిద్దినందుకు ధన్యవాదాలు.

  6. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు అభిప్రాయం:

    08/06/2013 11:33 pm

    శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీ జాషువ గారి గురించి మాట్లాడుతూ శ్రీ జాషువ మహాకవి అనడానికి ఈ ఒక్క ఖండిక చాలు అన్నారు. అంతటి గొప్పఖండికను రచించిన వారు తెలుగువారవ్వడం మన అదృష్టం. ఆయన దురదృష్టం కూడాను, ఎందుకంటే ఆయన వేరే ఏ దేశంలోనైన జన్మించి ఉంటే ఆయన అంతర్జాతీయ కవి కాగలిగి ఉండేవారు. ఆయన కవిత్వం అంతటి మహోన్నతం. గుర్రము జాషువా కవిత కోరి పఠింపని వారు లేరిలన్ అనేది అక్షర సత్యం.

  7. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి jayaprabha అభిప్రాయం:

    08/06/2013 1:42 pm

    తహతహా!! “ఇంత తప్పు గా అర్ధం చేసుకోవడం”, ఇంకా “సంస్కారాలకి వదిలేస్తూ…” లాంటి మాటలే? న్యాయమేనా? నేను ఏమన్నానని మీరిన్ని మాటల్ని అంత గబగబా అనేసారో! మరీ అంత తహతహా?? నేనసలు మీతో ఏ చర్చా చెయ్యందే? చెయ్యాల్సినవి కూడా ఏవీ నాకు లేవే?

    కామేశ్వరరావు గారు: ఇందుకే నేను అన్నాను ఇవి నమ్మకాలకి వదిలేయవలసినవే తప్ప మనం అంతకన్నా అడుగు దాటలేమని. గట్టిగా ఆరొందల ఏళ్ళ వెనకటి అష్టదిగ్గజాలే మనకి సరిగ్గా తెలియరు. ఇంకా పదిహేను వందల ఏళ్ళ వెనకటి నవరత్నాలూ.. కాళిదాసూ ఏమి తెలుస్తారు చెప్పండీ? నన్నపార్యులూ ఆదిశంకరులూ కూడా అంతే! వచ్చే వెయ్యి ఏళ్ళ కి ఇవాళ ఉన్న ఈ ఈమాట వంటివి పదిలంగా ఉండే వీలు లేకపోతే గనక మనమూ ఇంతే 🙂 మన సందేహాలూ ఇంతే !!

    జయప్రభ.

  8. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    08/06/2013 1:16 pm

    జయప్రభగారూ, మోహనగారూ, — నేను చెప్పిన దానిలో కొంత అస్పష్టత తొంగి చూసినట్టుంది. నా ఉద్దేశం, మత సంప్రదాయంలో మరో చారిత్రక కాళిదాసు ఉన్నాడని కాదు. ఎలా అయితే అనేక చాటు పద్యాలు, వాటి చుట్టూ అల్లబడిన కథలూ కవికుల గురువైన కాళిదాసుకి ఆపాదింపబడ్డాయో, అదే విధంగా, ఆ కాళిదాసునే, దేవీ భక్తునిగానూ, చాలా దేవీ స్తోత్రాలు ఆయన రచనలుగానూ నమ్మే సంప్రదాయం ఒకటి ఉంది – అన్నది నా ఉద్దేశం. కాళిదాసు రచనగా బాగా ప్రసిద్ధి చెందిన శ్యామలాదండకమే అతను రచించినది కాదని కొంతమంది పరిశోధకులు తేల్చారు! ఇక మిగతావాటి గురించి చెప్పడానికేముంది. అయినా కొంతమందికి అవి కాళిదాసు రచనలే అని అనుకుంటే తృప్తి. కొంతమందికి రచయితతో పనిలేకుండా వాటిలో కవిత్వాన్ని ఆనందించడమే తృప్తి. కొంతమందికి అసలు రచయిత ఎవరన్నది కూపీలాగడంలో తృప్తి. కొంతమందికి కర్తృత్వం ఎందుకలా ఆపాదింపబడిందో పరిశోధించడం తృప్తి. ఎవరి దృష్టికోణం మేరకు వారు సాగిపోవడమే! 🙂

    అసలు సౌందర్యలహరే ఆదిశంకరులది కాదని వాదించేవారున్నారు! శంకరులు ప్రస్థాన త్రయానికి వ్రాసిన భాష్యాలు, మరి రెండు గ్రంథాలను మాత్రమే పరమ ప్రామాణికంగా తీసుకొనేవారు మిగతా స్తోత్రాలూ, కృతులూ అతని రచనలు కావని వాదిస్తారు. అవి శంకరులు ప్రతిపాదించిన అద్వైతానికి పూర్తి విరుద్ధమని వారి అభ్యంతరం. అవి శంకరులవే అని నమ్మేవారు వాటిని అద్వైత సిద్ధాంతపరంగా అన్వయించి చూపుతారు. దీనికి అంతెక్కడిది!

  9. కథాంతం గురించి jagannadhasharma అభిప్రాయం:

    08/06/2013 10:13 am

    రవిశంకర్ గారూ, కథలో తెలియని బాధ ఉన్నది. బాగుంది.

    -జగన్నాధ శర్మ

  10. దైవం గురించి తః తః అభిప్రాయం:

    08/06/2013 8:15 am

    శ్రీ వేలూరి:

    ఇంద్రాణి ‘దైవం’ చదివినప్పుడు నాకు గుర్తొచ్చినవి:

    “ఇవ్వని వారికి కలిమిని
    ఇవ్వ గలారలకు లేమినిచ్చు వివేకిన్
    పువ్వున ముల్లిడు రసికుని
    నవ్వులు కుటిలినకు నేర్పు నట శేఖరునిన్” — ఆత్రేయ.

    “Forgive, O Lord, my little jokes on Thee, and I’ll forgive Thy great big joke on me.” — Robert Frost.

    ఉన్నదున్నట్టు చెప్పలేను గానీ కల్పవృక్షంలో ఒక సీస పద్యం — విశ్వనాథ, దైవం నాలుగు రకాలు అని మొదలు పెట్టి అ నాలుగు రకాలూ చెప్పి పద్యం ముగిస్తూ ‘ఐదవది కలదు అది ఇప్పుడనవసరము ‘ అని ముగిస్తాడు.

    తః తః