పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఇంటి మొగుడు గురించి Sravya V అభిప్రాయం:

    09/02/2013 1:02 am

    హ హ బావుంది గురువు గారు !
    మీరు మంచి స్టొరీ టెల్లర్ అనేది ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ బట్ స్టిల్ ఐ సే చాలా బావుంది నేరేషన్ అండ్ కొత్తగా చేర్చిన పొడిగింపు కూడా ! మీరు నాకు మరీ ఎక్కువ క్రెడిట్స్ ఇచ్చేస్తున్నారు 🙂

  2. శ్రీ సూర్యనారాయణా… గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/01/2013 5:30 pm

    ఇంద్రాణి గారు:
    మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను వృత్తిరీత్యా శాస్త్రాలను చదివి, భౌతికశాస్త్రంలో పి. హెచ్. డి. పట్టా పొంది సహేతుకంగా ఆలోచనలని సాగిస్తున్నా, ఈ సృష్టిలో మానవులుగా మన స్థాయి ఏమిటని తరచిచూస్తూ ఉంటే, మన పూర్వులు చెప్పిన భక్తి తాత్పర్యం అర్ధం అవుతున్నట్టుగా అనిపిస్తోంది! నా మటుకు నాకు సూర్యుడే కనిపించే దైవం!

    రసాయన శాస్త్రంలో చదువుకొన్న మాండలే కనిపెట్టిన పీరియాడిక్ పట్టికలో ఉదజని అత్యంత తేలికైన వాయవు. సూర్యగోళం ఈ తేలికైన వాయువుతో నిండి ఉంది. భూమిలాంటి గ్రహాలు 10 లక్షల దాకా సూర్యగోళంలో తేలికగా ఇమిడిపోతాయి. అసలు సూర్యుని ఉనికిని గమనిస్తేనే ఒళ్ళు గగుర్పాటుతో జలదరిస్తుంది. ఇక ఈ విశాలవిశ్వం తలపే ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

    ఈ మధ్యే యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, ఫిలడెల్ఫియా లో భౌతికశాస్త్రంలో ఫి. హెచ్. డి చెయ్యటానికి వెళ్ళిన మా అమ్మాయి రమ్యకి, నాకు మధ్య జరిగిన చర్చల ఫలితమే ఈ పరిచయ వ్యాసం!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  3. బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    09/01/2013 1:50 pm

    ఇంటర్వ్యూ అసమగ్రంగా ఉందనిపించింది. అన్నీ ప్రశ్నలు, ఖండనలే గానీ జవాబులు లేవు. మనం అన్నింటినీ ఒక వైపునుంచి మాత్రమే చూస్తున్నామనే వాదాన్ని ముందుంచి, ఆ రెండవ వైపు ఏమిటో, ఆ వైపు ఎలా చూడాలో చూచాయగానైనా చెప్పకపోతే ఎలా?

  4. శ్రీ సూర్యనారాయణా… గురించి indrani Palaparthy అభిప్రాయం:

    09/01/2013 12:15 pm

    వ్యాసం ఎంతో బావుంది లక్ష్మన్న గారు.శ్రీ సూర్య నారాయణ పాట అద్భుతః. ఈ మధ్య మిధునం సినిమాలో కూడా వాడుకున్నారు.

    వ్యాసం చాలా చక్కగా చదివించేలా ఉంది.మీ మాటలాగే ఎంతో సరళంగా ఉంది. ఇలాంటి సైన్సు వ్యాసంలోనూ సంగీతాన్ని తీసుకురాకుండా ఉండలేకపోవడం మీ సంగీతాభిమానాన్ని చాటుతోంది.

    చిన్నతనంలో సూర్యుని వంక చూడొద్దన్ని చెప్పినా నేను అదే పనిగా చూస్తూ ఉండేదాన్ని. ఆ తరువాత అందుకో ఎందుకో మరి ఆరో తరగతిలోనే నాకు కళ్ళ జోడు వచ్చి సైటు ఇంకా పెరుగుతోంది గానీ తగ్గడం లేదు.

    ఇంద్రాణి.

  5. బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ గురించి Sowmya అభిప్రాయం:

    09/01/2013 11:08 am

    ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వ్యూ ఇక్కడితో ఆగిపోయిందా? ఉన్నట్లుండి ఆగిపోయినట్లు తోచింది. ఏదేమైనా, ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  6. కొన్ని త్రిపుర సందర్భాల్లో గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/01/2013 10:34 am

    నడచివెళ్లిపోయిన నిత్యపథికుడు త్రిపుర గారి జ్ఞాపకాల సౌందర్యాన్ని, త్రిపుర వెతుకులాటనీ ఆవేదనతో ఆవిష్కరించిన త్రిపుర గారి వీరాభిమాని స్వాతి గారికి కృతజ్ఞతాభినందనలు.

  7. జనరంజని: మహానటి సావిత్రి గురించి nuttu.simhachalam అభిప్రాయం:

    08/29/2013 1:04 pm

    నాకు సావిత్రి గారంటే చాల ఇష్టం. నటిగా ఆమె అద్భుతం. ఆమె మళ్ళీ తెలుగు గడ్దమీద పుట్టాలని ఆ భగవంతుని కోరూకూంటూన్నాను.

  8. పాఠకులకు సూచనలు గురించి Dr. Bharathi.j. అభిప్రాయం:

    08/28/2013 1:06 pm

    తెలుగుభాషకు తెలుగు అధ్యాపకులుగ మేము చేయలేకపోతున్న సేవ మీరు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెలుగువెలుగు పత్రికలో ఈ పత్రిక గురించి ఇప్పుడే చదివాను. మీ భాషాభిమానాన్ని చూసి తెలుగు భాషకు మంచి రోజులువచ్చాయని సంతోషిస్తూ, నా వంతు కృషి యేం చేయవచ్చో సూచించమని కోరుతున్నాను.

  9. About eemaata గురించి lyla yerneni అభిప్రాయం:

    08/27/2013 2:10 pm

    To:
    eemaata Editors/Technical experts:

    Can you facilitate, selective hiding of the various sidebars on both sides of the page,( the side bars -giving info on issues, headings, library, poetry, stories etc.,) by a click in an adjacent box. The reading of the articles will be so much nicer, if they are on a nice clean page, without the constant clutter, and claustrophobia created by the side bars.

    Thanks for your kind attention.
    Lyla

    [We cannot make them disappear, unfortunately. However, within an article by clicking on “Printer Friendly Page” link on the right side bar (near the top), one can read only the text on a plain white background. – Ed.]

  10. ప్రవాసి గురించి V N Rao అభిప్రాయం:

    08/27/2013 11:09 am

    పై వ్యాఖ్య ప్రవాసీయుల్ని ఎద్దేవా చేస్తున్నట్లుంది. జీవిత ప్రయాణం మనిషిని ఎక్కడెక్కడికో తీసుకు వెడుతుంది కదా. ఆ సుదూర తీరాల్నుంచి వెనక్కి తిరిగి రావటం సాధ్యపడచ్చు పడకపోవచ్చు అనేక కారణాల వల్ల. రాలేకపోతున్నానని రచయిత ఆవేదన. తల్లినేల గుమ్మానికి అడ్డంగా నిలుచుందని కాదనుకుంటాను.