వెనకెప్పుడో మీరు అన్నట్టు, చిన్ని గడ్డిపోచ వసంత స్పర్శ తననెట్లా తల మునకలు చేసినదీ వచ్చీరాని భాష లో చెప్తే ఎవరికర్ధమవుతుంది ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప.మాటలకూ అందని మధురానుభూతిని అయాచితంగా ప్రసాదిస్తున్న మీకు సదా కృతజ్ఞులం.
నిజం.’దృశ్యాన్ని మరో దృశ్యంతోనో వస్తువుతోనో పోల్చినట్టుకాక వాటి మూలాల్ని, స్వభావాల్ని,సంస్కారాల్ని ఒక్క మాటలో ఊహకి అందించటం లాగే’ ఉంటుంది త్రిపుర రచన. ఆయనకు చక్కటి నివాళి ఇచ్చారు స్వాతి.
03/25/2012 5:42 pm నాడు త:త:గారు శ్రీ వాసా వీణ కచేరి గురించి ఒక సంఘటన రాసారు. నాకు శ్రీ వాసాగారి రికార్డ్స్ ఇంకా వారి సంగీతం గురించిన సంగతులు కావాలి. దయచేసి సహాయం చేయగలరని ఆశిస్తున్నా.
నమస్కారాలతో,
చూడామణి.
శ్రీ వాసా వీణ కచేరి గురించి ఒక సంఘటన: విశాఖ భారతి గాన సభ(?) వారు ఒక సారి వారి వార్షిక పరంపరలో పర్వీన్ సుల్తానా గారి కచేరీ ‘వివేకానంద హాల్’ లో ఏర్పాటు చేసారు. విశేషంగా హాలు నిండిపోయింది [కాల్ టెక్స్ లో పెద్దాయన శ్రీ చెడ్డాతో సహా] ఆమె ‘అనివార్య కారణాలవల్ల’ రాలేక పోయారు.ఆవిషయం కాలాతీతమైపోయిన్తర్వాత తెలిసినట్టుంది. నిర్వాహకులు శ్రీ వాసాను అభ్యర్దించారు. మూడు గంటల పాటు శ్రీ వాసా చాలా గొప్పగా ఉత్తరదేశ సంగీత బాణీలో కచేరీ చేశారు. ఆద్యంతం శ్రీ ముసునూరి తన్మయులై విన్నారు. [ఆరోజుల్లో ఆయన విజయనగరం సంగీత కళాశాల ప్రాంశుపాలురుగా ఉన్నట్టు గుర్తు. నాపక్కన ఆ సాయంత్రం ఆయన కూర్చున్నారు]. దాదాపు గంటన్నరా రెండు గంటల తరవాత శ్రీ చెడ్డా కోరిక మేరకు ‘దేశ్’ వాయించి , “ఫర్మాయి ఏ” అని కూడా అన్నారు.
కచేరి అయిపోయిన తర్వాత నేను ముసునూరి వారిని “కచేరీ ఎలావుంది?” అని అడిగాను. ఇప్పటి భాషలో ఎమేజింగ్ అన్నట్టుగా చెప్పారు. నేను వారికి శ్రీ మంచాల గూడా ఉత్తరదేశ బాణీ లో వీణ వాయిస్తారు గదా అని గుర్తుచేశాను. ‘అది ఏ కొద్ది సేపో’ అని ‘ఇదొక అద్భుతం’ అని అనిపించే మాటలన్నారు.
వాడ్రేవు గారు మీ అపారమైన విద్వత్తుకి, సరి సమానమైన మీ తృష్ణకి వేన వేల నమస్కారాలు. ఎక్కడి ఆంటోనియో మచాడో, ఎక్కడి బార్న్‌స్టన్…ఎక్కడి చైనా, ఎక్కడి స్పెయిన్. మా జీవితం లో ఇవన్ని మా అంతట మేం చదవగలమా, చదివినా అర్ధం చేసుకోగలమా ఇంత బాగా! ప్రపంచ సాహిత్యాన్ని మంచి నీళ్ళ లాగా మా దోసిట్లో పోస్తున్న మీకు సదా కృతజ్ఞులం.
//నా అంతిమప్రయాణతరుణం సమీపించాక
తిరిగి రాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లా దిసమొలతో నేను తప్ప.//
మంచి ప్రశ్నే వేసారు.నేను కూడా ముందు హవిస్ అనే అనుకున్నాను కానీ, అంతకు ముందు పాదంలోనే “యత్ పురుషేణ హవిషా” అని హవిస్సును గురించి చెప్పేశారు కాబట్టి ఇది హవిస్- సంబంధించింది కాదేమోనని అనిపించింది. ధవిత్రము అంటే
“యాగమునందు అగ్నిని ప్రజ్వలింపఁజేయుటకు కృష్ణాజినముతో చేయఁబడిన విసనకఱ్ఱ” అని కొన్ని నిఘంటువులలో చూసి శరత్తు విసనకర్రలా అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది అనుకున్నాను. Sacred Texts వెబ్ సైటు లోని మూలంలో కూడా దేవనాగరి లిపిలో శరద్ ధవిః అని విడదీసి ఇచ్చారు. సాముల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహితలో చూస్తే సంస్కృత పాఠంలో శరద్ధవిః అని కలిపే ఇచ్చారు కానీ, తెలుగు అనువాదంలో మాత్రం హవిస్సనే అనువాదం చేసారు. అదీకాక, హ- కారంతో సంధి జరిపినప్పుడు వర్గాక్షరాల్లోని నాలుగవ అక్షరం ఆదేశమవుతుంది, కాబట్టి మీరు చెప్పినట్టు శరత్ + హవిః = శరద్ధవిః అని చెప్పడమే సబబుగా తోస్తోంది.
బావుంది మీ వ్యాసం. ఐతే, ఈసారి కొంచెం జాగర్ఫీ, గీగర్ఫీ – కాస్త ఎక్కువగా హడలేసినట్లనిపించింది. 🙂
మండూకసూక్త ప్రస్తావన మట్టుకు బాగా నచ్చింది. “శరద్ధవిః”ని “శరత్ + హవిః” అని విడదీయాలేమో? హవిః = హవిస్సు, oblation/burnt offering.
(Sacred Texts వెబ్ సైటు లోని అనువాదం నుంచి: When Gods prepared the sacrifice with Puruṣa as their offering, Its oil was spring, the holy gift was autumn; summer was the wood.)
వ్యాసంలోని విషయానికి సంబంధించని వ్యాఖ్య ఇది. కనుక, సంపాదకులు దీన్ని తిరస్కరిస్తే నేనేమీ అనుకోను. 🙂
“ఊర్ధ్వజ్ఞుడు” లాంటి గొట్టు మాటలను పిల్లలకి నేర్పిస్తున్నారని చదివి కొంచెం నవ్వుకొని అర్థం ఏమిట్రా అని ఆంధ్రభారతి వెబ్ సైటుకెళ్ళి చూస్తే “కొంగ కాళ్ళవాడు”, “లేచినవాడు” అని అర్థాలు చూసి గట్టిగా నవ్వుకున్నాను. సంస్కృత నిఘంటువులో “Long shaked” అని అర్థం ఇచ్చారు. అంటే ఏమిటో తెలియదు.
కొంగకాళ్ళవాడు అంటే స్వీట్‌హోం బుచ్చిబాబు గుర్తుకువచ్చాడు. పెద్ద పెద్ద అంగలేస్తాడని తనకి “అంగదుడు” అని పేరుపెట్టారు రంగనాయకమ్మగారు.
సంస్కృత నిఘంటువులో “ఊర్ధ్వజ్ఞ”, “ఊర్ధ్వజ్ఞు” శబ్దాలు రెండూ కనిపించాయి. వాటికి “డు” తగిలించి తెలుగులోకి మార్చుకోవడం కరెక్టనే అనుకుంటాను.
ఇప్పుడే ఆఫీసునుంచి ఇంటికి వస్తూ ఒక ఊర్ధ్వజ్ఞురాలిని చూసి మనస్సులోనే నవ్వుకున్నాను.
[బహుశా సంస్కృత నిఘంటువులో long shanked (shank = the part of the lower limb in humans between the knee and the ankle; leg.) అని ఉండుండాలండీ. – సం.]
రాతి పడవ గురించి రామారావు అభిప్రాయం:
09/12/2013 1:42 pm
ప్రస్తుత పరిస్థితులపై బహు చక్కని, సుతిమెత్తని విమర్శ. వ్యంగ్యశైలి అద్భుతం..
ఇంటి మొగుడు గురించి బ్రహ్నేశ్వర రావు మేకా అభిప్రాయం:
09/12/2013 11:14 am
చాలా బాగుంది.సరదాగా,చక్కటి ఆహారం అందించారు.
స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి రవిశంకర్ అభిప్రాయం:
09/12/2013 8:53 am
వెనకెప్పుడో మీరు అన్నట్టు, చిన్ని గడ్డిపోచ వసంత స్పర్శ తననెట్లా తల మునకలు చేసినదీ వచ్చీరాని భాష లో చెప్తే ఎవరికర్ధమవుతుంది ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప.మాటలకూ అందని మధురానుభూతిని అయాచితంగా ప్రసాదిస్తున్న మీకు సదా కృతజ్ఞులం.
కొన్ని త్రిపుర సందర్భాల్లో గురించి Lalitha P. అభిప్రాయం:
09/12/2013 7:19 am
నిజం.’దృశ్యాన్ని మరో దృశ్యంతోనో వస్తువుతోనో పోల్చినట్టుకాక వాటి మూలాల్ని, స్వభావాల్ని,సంస్కారాల్ని ఒక్క మాటలో ఊహకి అందించటం లాగే’ ఉంటుంది త్రిపుర రచన. ఆయనకు చక్కటి నివాళి ఇచ్చారు స్వాతి.
ఉగాది కవిసమ్మేళనాలు గురించి chudamani అభిప్రాయం:
09/12/2013 7:13 am
ఈమాట సంపాదకవర్గానికి,
03/25/2012 5:42 pm నాడు త:త:గారు శ్రీ వాసా వీణ కచేరి గురించి ఒక సంఘటన రాసారు. నాకు శ్రీ వాసాగారి రికార్డ్స్ ఇంకా వారి సంగీతం గురించిన సంగతులు కావాలి. దయచేసి సహాయం చేయగలరని ఆశిస్తున్నా.
నమస్కారాలతో,
చూడామణి.
స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి రాజశేఖర్ గుదిబండి అభిప్రాయం:
09/12/2013 1:43 am
వాడ్రేవు గారు మీ అపారమైన విద్వత్తుకి, సరి సమానమైన మీ తృష్ణకి వేన వేల నమస్కారాలు. ఎక్కడి ఆంటోనియో మచాడో, ఎక్కడి బార్న్‌స్టన్…ఎక్కడి చైనా, ఎక్కడి స్పెయిన్. మా జీవితం లో ఇవన్ని మా అంతట మేం చదవగలమా, చదివినా అర్ధం చేసుకోగలమా ఇంత బాగా! ప్రపంచ సాహిత్యాన్ని మంచి నీళ్ళ లాగా మా దోసిట్లో పోస్తున్న మీకు సదా కృతజ్ఞులం.
//నా అంతిమప్రయాణతరుణం సమీపించాక
తిరిగి రాని తీరానికి లంగరెత్తేవేళ, పడవలో
నాదంటూ ఏదీ ఉండదు, సూర్యుడి కింద
సాగరతీరశిశువుల్లా దిసమొలతో నేను తప్ప.//
పలుకుబడి: ఋతువులు, కాలాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/10/2013 10:53 pm
శ్రీనివాస్ గారు,
మంచి ప్రశ్నే వేసారు.నేను కూడా ముందు హవిస్ అనే అనుకున్నాను కానీ, అంతకు ముందు పాదంలోనే “యత్ పురుషేణ హవిషా” అని హవిస్సును గురించి చెప్పేశారు కాబట్టి ఇది హవిస్- సంబంధించింది కాదేమోనని అనిపించింది. ధవిత్రము అంటే
“యాగమునందు అగ్నిని ప్రజ్వలింపఁజేయుటకు కృష్ణాజినముతో చేయఁబడిన విసనకఱ్ఱ” అని కొన్ని నిఘంటువులలో చూసి శరత్తు విసనకర్రలా అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది అనుకున్నాను. Sacred Texts వెబ్ సైటు లోని మూలంలో కూడా దేవనాగరి లిపిలో శరద్ ధవిః అని విడదీసి ఇచ్చారు. సాముల శ్రీమదాంధ్ర ఋగ్వేద సంహితలో చూస్తే సంస్కృత పాఠంలో శరద్ధవిః అని కలిపే ఇచ్చారు కానీ, తెలుగు అనువాదంలో మాత్రం హవిస్సనే అనువాదం చేసారు. అదీకాక, హ- కారంతో సంధి జరిపినప్పుడు వర్గాక్షరాల్లోని నాలుగవ అక్షరం ఆదేశమవుతుంది, కాబట్టి మీరు చెప్పినట్టు శరత్ + హవిః = శరద్ధవిః అని చెప్పడమే సబబుగా తోస్తోంది.
సురేశ్.
పలుకుబడి: ఋతువులు, కాలాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
09/10/2013 6:41 pm
సురేశ్ గారికి:
బావుంది మీ వ్యాసం. ఐతే, ఈసారి కొంచెం జాగర్ఫీ, గీగర్ఫీ – కాస్త ఎక్కువగా హడలేసినట్లనిపించింది. 🙂
మండూకసూక్త ప్రస్తావన మట్టుకు బాగా నచ్చింది. “శరద్ధవిః”ని “శరత్ + హవిః” అని విడదీయాలేమో? హవిః = హవిస్సు, oblation/burnt offering.
(Sacred Texts వెబ్ సైటు లోని అనువాదం నుంచి: When Gods prepared the sacrifice with Puruṣa as their offering, Its oil was spring, the holy gift was autumn; summer was the wood.)
శ్రీనివాస్
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
09/10/2013 6:01 pm
వ్యాసంలోని విషయానికి సంబంధించని వ్యాఖ్య ఇది. కనుక, సంపాదకులు దీన్ని తిరస్కరిస్తే నేనేమీ అనుకోను. 🙂
“ఊర్ధ్వజ్ఞుడు” లాంటి గొట్టు మాటలను పిల్లలకి నేర్పిస్తున్నారని చదివి కొంచెం నవ్వుకొని అర్థం ఏమిట్రా అని ఆంధ్రభారతి వెబ్ సైటుకెళ్ళి చూస్తే “కొంగ కాళ్ళవాడు”, “లేచినవాడు” అని అర్థాలు చూసి గట్టిగా నవ్వుకున్నాను. సంస్కృత నిఘంటువులో “Long shaked” అని అర్థం ఇచ్చారు. అంటే ఏమిటో తెలియదు.
కొంగకాళ్ళవాడు అంటే స్వీట్‌హోం బుచ్చిబాబు గుర్తుకువచ్చాడు. పెద్ద పెద్ద అంగలేస్తాడని తనకి “అంగదుడు” అని పేరుపెట్టారు రంగనాయకమ్మగారు.
సంస్కృత నిఘంటువులో “ఊర్ధ్వజ్ఞ”, “ఊర్ధ్వజ్ఞు” శబ్దాలు రెండూ కనిపించాయి. వాటికి “డు” తగిలించి తెలుగులోకి మార్చుకోవడం కరెక్టనే అనుకుంటాను.
ఇప్పుడే ఆఫీసునుంచి ఇంటికి వస్తూ ఒక ఊర్ధ్వజ్ఞురాలిని చూసి మనస్సులోనే నవ్వుకున్నాను.
[బహుశా సంస్కృత నిఘంటువులో long shanked (shank = the part of the lower limb in humans between the knee and the ankle; leg.) అని ఉండుండాలండీ. – సం.]
ఉగాది కవిసమ్మేళనాలు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/10/2013 6:03 am
!!! @ విభ్రమాస్పదంగా ఉన్నది @ !!!