పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి lyla yerneni అభిప్రాయం:

    09/17/2013 6:43 pm

    నేచర్ కు సంబంధించి యాక్యురసీ ఆఫ్ ఎ సైంటిస్ట్, యాక్యురసీ ఆఫ్ ఎ పొయెట్ ల గురించీ ఈ మాటలు ఒక సారి చూడండి:

    మీరు ఈ స్పానిష్ పొయెట్ ని గురించి చదువుతూ,’గిరీశం’ లాటి తెలుగు దగుల్బాజీ పోరంబోకు వెధవ ప్రస్తావన ఎలా తెచ్చారండీ? ఏమిటి సంబంధం? కాళిదాసు అంత సైంటిఫిక్, బొటానికల్ కవి ఐతే, అభిజ్ఞాన శాకుంతలంలో తుమ్మెద శకుంతల ముఖం చుట్టూ ఎందుకు తిరిగిందండి?

    లైలా

  2. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha అభిప్రాయం:

    09/17/2013 1:30 pm

    మరువం, దవనం తీసుకోవడంలో కాదు నా ఇబ్బంది, ఆ పక్కనే ఆ “తేనెటీగల్ని” తెచ్చి పెట్టడంలో! అనువాదకునికి గనక అక్కడ ఆ తేనెటీగ ప్రస్తావన గనక ముఖ్యం అయితే, అప్పుడు అక్కడ సుగంధపూరితమైన పువ్వుల పేర్లు చాలానే ఉన్నాయి కదా తెలుగులో సైతం? వాటిని పెట్టి ఉండొచ్చును. కాదూ మరువం దవనం గనక మాత్రమే అనువాదకుని ప్రిఫరెన్స్ అయితే అప్పుడు తేనెటీగ ప్రస్తావన గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే, మరువం దవనం వాటి సురభిళ పత్రాలకోసం మాత్రమే ప్రఖ్యాతి వడసినవి. పువ్వులకోసం కాదు. అందువలన తేనెటీగల ప్రస్తావన అక్కడ అసలు నప్పదు అన్నది నా ఉద్దేశ్యం! అనువాదకునకు తన సొంతభాష లోకి తర్జుమా చేసేటప్పుడు ఈ విషయంలో అయితే స్పష్టత తప్పక ఉండాలి. తేనెటీగలు మరువానికీ దవనానికీ నప్పవు. మరువం దవనం పూలకి కాదు ప్రసిధ్ధి. వాటిమీదకి తేనెటీగ వాలే వీలు లేదు. అందుకూ! అందువలన మొదటి పోలిక తరవాతి మాటకి ప్రతిబంధకం కాక తప్పదు. అందుకనే అడిగాను మరువం దవనం — వీటికీ తేనెటిగలకీ ఎలా కుదురుతుందని. ఇంతకీ దీనికి మచాదో ఏం రాసేడో అసలు భాషలో అది తెలిస్తే అప్పుడు కదా అసలు దానికి ఈ అనువాదం ఏపాటి సన్నిహితంగా ఉందో, తెలిసేది? అనువాదకునికి స్వతంత్రం ఉంటుంది. నేను దాన్ని ఒప్పుకుంటాను కూడా! శ్రీ శ్రీ “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు?” అన్న పద్యం ఇందుకు ఉదాహరణగా భావిస్తాను. అయితే “నప్పడం” అన్నది చాలా ముఖ్యం. నప్పక పోయాకా మిగిలిన మాటలేవన్నా వట్టివే!!

    జయప్రభ.

  3. కినిగె.కాం తో నా అనుభవాలు గురించి uday అభిప్రాయం:

    09/16/2013 9:18 pm

    మంచి సమాచారం అందజేశారు థేంక్సు.

  4. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి lyla yerneni అభిప్రాయం:

    09/16/2013 7:12 pm

    Exquisite.

    Like the way I revisit a person, a painting, a book, a garden, I have longing for, I am going to revisit this writing many times.

    Many Thanks.

    లైలా

  5. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తః తః అభిప్రాయం:

    09/16/2013 4:18 pm

    “కవిత్వానికి భావోద్వేగమే ప్రధానం అనిపిస్తూంది.”

    పాటకి beat ప్రధాన మనిపించినట్లు. భావొద్వేగం నెససరీ యే గానీ సఫిసియెంట్ కాదు. భాషకు సంబంధించిన ప్రతిదీ గుండెకాయ ఒక్క దాని తోనే కాదు తలకాయకు కూడా సంబంధించి ఉంటుంది. “మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు.”అన్న శ్రీ వాడ్రేవు మాటలు నా కంత సబబుగా ఉన్నట్లనిపించటం లేదు. కాల గమనంలో ‘బాల్యకాల’ వంటి పదబంధాలతో చేసిన అనువాదం -అనువాదం అనను, గిరీశాన్ని గుర్తు తెచ్చుకుంటూ తర్జుమా అంటాను. ఇది మచాడో కి అన్యాయం చేసే ప్రమాదం ఉంది. ‘ఇండియాటుడే’లో శ్రీ వాడ్రేవు రాసినవి చదివి వారి అభిమాని నైన వాణ్ణి, అయినా నాకు ఇలా రాయక తప్పటం లేదు.

    నేచర్ కు సంబంధించి యాక్యురసీ ఆఫ్ ఎ సైంటిస్ట్, యాక్యురసీ ఆఫ్ ఎ పొయెట్ ల గురించీ ఈ మాటలు ఒక సారి చూడండి:

    “Kalidasa’s knowledge of nature is not only sympathetic, it is also minutely accurate. Not only are the snows and windy music of the Himalayas, the mighty current of the sacred Ganges, his possession; his too are smaller streams and trees and every littlest flower. It is delightful to imagine a meeting between Kalidasa and Darwin. They would have understood each other perfectly; for in each the same kind of imagination worked with the same wealth of observed fact.”

    from KALIDASA – TRANSLATIONS OF SHAKUNTALA & OTHER WORKS, BY ARTHUR W. RYDER

    తః తః

  6. ఇంటి మొగుడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    09/15/2013 11:12 pm

    శ్రీనివాస్ గారికి,
    ధన్యవాదాలు. పులుసు లో ఉప్పు, కారం సరి చూసింది ఈమాట సంపాదకులు. వారికి కూడా ధన్యవాదాలు.

    బ్రహ్మేశ్వర రావు గారికి, జగదీష్ గారికి, ధన్యవాదాలు.

    నరసింహారెడ్డి గారికి, ధన్యవాదాలు. ఈ కధలు నచ్చితే, నా బ్లాగ్ ని ఓ చూపు చూడండి…దహా(దరహాసం)
    ‘నవ్వితే నవ్వండి’ bulususubrahmanyam.blogspot.in

  7. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి jayaprabha అభిప్రాయం:

    09/15/2013 12:57 pm

    తహ తహ గారూ! భర్తృహరిని కోట్ చేయడం మీరు బాగుంది. ఆశ్చర్యమే కదా! ఇంక వీరభద్రునికి నా అభిప్రాయం మీద శ్రధ్ధ లేకపోయినా, లేదా ఆయన మళ్ళీ ఆ పధ్ధతిలోనే తిరిగి అనువాదం చేయబూనుకున్నా నాకొచ్చిన ఇబ్బంది మాత్రం ఏముందీ? నచ్చిన వాటిని ఆస్వాదిస్తాం! లేకపోతే సరేనని పేజీ తిప్పేస్తాం! అందువలన ఎవరికుండే అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఇక్కద అది కాదు సమస్య. నేను కవిగా చేయలేదు, అనువాదకునిగా చేయలేదు అని వీరభద్రుడు అనడం మాత్రం నాకు వింత గానే అనిపించింది. అందులో ఏదో ఒక పాత్ర తప్పనిసరిగా అతనికి ఉంటుంది. తనకి అటువంటి పాత్ర ఏదీ లేదని వీరభద్రునికి అనే అవకాశం ఉండదనుకుంటాను. ఆయన ఆ రెండూ గనక.

    ఇంక ఒక నాగరికతకి చెందిన కవిని మరొక నాగరికతకి చెందిన భాష లోకీ ప్రతీకలలోకీ మార్చవలసి వచ్చేటప్పుడు ఎదురయ్యే సమస్యల మీద మాట్లాడుకోవడం అనువాదకులకి పనికొచ్చే సంగతే ఎప్పుడైనా! ఇక్కడ చదివే వాళ్ళు కూడా ముఖ్యమే అనుకుంటాను, వాళ్ళు ఎవరైనా! అందుకే కదా వీరభద్రుడు అంత శ్రమ పడిందీ?

    అవును. కొలిచాల గనక స్పానిష్‌లో మచాదో భావాన్ని గనక చెప్పక పోయి ఉంటే వీరభద్రుని అనువాద భావం / వాక్యం, అర్ధం లేనట్టుగానూ అసమగ్రంగానే మిగిలిపోయేది. “ద్రోహవస్త్రం” అన్న దాన్ని సమర్ధించుకోవడం కోసం వీరభద్రుడు అంత బెట్టు పోవాలా? మరీను!

    జయప్రభ.

  8. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి నరసింహ శర్మ మంత్రాల అభిప్రాయం:

    09/15/2013 9:47 am

    “నీ వాడివాడి చూపుల్లో – నా నాడి కొట్టుకుంటోంది”

    దీనిని ఆంగ్లానువాదం చేస్తే… “ఇన్ యువర్ షార్ప్ షార్ప్ లుక్స్ – మై హార్ట్ బీట్స్ ఆల్వేజ్” అని వస్తూంది.

    దీనినే ఇంకోలా చెప్పొచ్చు…

    “The beat of my heart
    May lash in your
    Eyes of lust”

    “కోరలున్న విషనాగులు – కోరాడే కోలాటం” ప్రాసక్రీడలో భావం బలి.

    కవిత్వానికి భావోద్వేగమే ప్రధానం అనిపిస్తూంది.

  9. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి తః తః అభిప్రాయం:

    09/15/2013 9:22 am

    సమాంతర దృక్పథాల మీద
    వెన్నెల వాలాలి!
    అవి కలుసుకున్నచోట
    చిన్నెలు రాలాలి!

    తః తః

  10. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి Vadrevu Chinaveerabhadrudu అభిప్రాయం:

    09/15/2013 7:19 am

    సురేశ్ కొలిచాలగారు — నా అనువాదం మీద జయప్రభ వ్యాఖ్యలు నాకేమంత ఆశ్చర్యం కలిగించలేదు గాని ఆ వ్యాఖ్యలకి జవాబు ఇవ్వడానికి మీరు తీసుకున్న శ్రద్ధకి నమోవాకాలు అర్పిస్తున్నాను. నేను ఆ కవితలని ఒక కవిగా గాని, లేదా అనువాదకుడిగా గాని అనువాదం చేయలేదు. ఆ కవిత్వం పట్ల ఆపుకోలేని తమకానికి లోనైన పాఠకుడిగా చేశాను. కాని మీరు రాసిన టీకా చదివాక ద్రోహవస్త్రం అనేమాట ఆ కవితలో మరీ బాగా అమరిందనిపిస్తోంది. మనం అనువాదం చేస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉండే ఒక మహాప్రజ్ఞ చేసే మిరకిల్ అది.

    ఇక మరువం,దమనం పూలుకావు. కాని వేరే దేశాల పుష్పాల పేర్లు మన భాషకి సన్నిహితంగా లేనప్పుడు మనం మనకి సన్నిహితంగా ఉండే పేర్లనే వాడుకోవలసిఉంటుంది. మరువం, దమనం అనే పేర్లు పాఠకుడిలో రేకెత్తించగల సున్నితమైన సంవేదన ముఖ్యం తప్ప, వాటి బొటానికల్ ఆక్యురసీ కాదు. నిమ్మ పొద, కేశ రాశి, ఊట నీరు, వేన వేల జలాలు లాంటి పదాల్లో తెలుగు లేదని ఇప్పుడే తెలుసుకున్నాను. కాని నేను నిస్సహాయుణ్ణి. ఆ కవితల్ని ఇప్పుడు అనువాదం చేసినా అలాగే అనువాదం చేస్తాను.

    మరోమాట కూడా చెప్పాలి. నా దృష్టిలో ‘మరీముఖ్యంగా ఒక మాఘమాసపుగాలి’ని నేనేమంత గొప్ప అనువాదంగా పరిగణించలేను.

    చినవీరభద్రుడు