పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు గురించి కె వి రమణ అభిప్రాయం:

    11/09/2013 12:30 am

    చాలా బాగుంది.
    ఈ కింది వాక్యాంశాలలో టైపుతప్పులు కనబడ్డాయి. ఉదాహృతపంక్తి చివరిపదం చూడండి
    ఈ ప్రశ్న ఇతరుల్ని అడయటం
    ఆ సమాధానం తన్నుకోచ్చిందా
    ఈ అద్భుతమైన క్షణానికి సాక్షం.

  2. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి మోహన అభిప్రాయం:

    11/08/2013 8:45 pm

    వివిధ కావ్యములలో కనబడే పద్యముల తరతమ భేదములను వివరించు విధానములో శ్రీ మురళీధరరావుగారు తప్పకుండా మంచి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శృంగార తిలక కావ్యాన్ని గురించి ఎంతో మంచి సమాచారాన్ని మనకందచేశారు. ఈ విషయంలో వారి కృషి తప్పకుండా అభినందనీయం.

    ఆంగ్లములోగల ఒక సామెతను అందఱు వినే ఉంటారు – One swallow does not make a summer. వివాదాస్పదమైన ఒక పద్యమును ఆధారముగా నుంచుకొని నన్నెచోడుని కాలమును గాని, అలాటి కవి ఉన్నాడా లేడా అని గాని చెప్పలేమని అనుకొంటాము. ఈ వ్యాసపఠనానంతరము, నన్నెచోడుడు పదహారవ శతాబ్దము పిదప జీవించి ఉన్నాడని అనుకొంటే కలిగే పర్యవసానములను, తదితర విషయములను గురించి మేము ఒక వ్యాసమును సిద్ధము చేస్తున్నాము. ఈ వ్యాసములో ఒక రచయిత, కావ్యకర్తృత్వపు కాలనిర్ణయము వీటికి సహకారపడే ప్రక్రియలను (methodological aspects) గురించి కూడ చర్చిస్తాము. ఈమాట సంపాదకులు అంగీకరిస్తే అది రాబోయే సంచికలో ప్రచురింపబడవచ్చును.

    జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్

  3. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి తః తః అభిప్రాయం:

    11/08/2013 3:15 pm

    అ) ఒకప్పుడు నాకన్నా ఐదారేళ్ళు పెద్దవాడైన ఒక సంస్కృత పండితుడితొ స్నేహానికై ఉవ్విళ్ళూరుతుంటే ఒక రొజు ” ‘సశేష’ అని మూడుసార్లు అను ” అన్నాడు. నేను రెందు సార్లు అనగానే తనపరిచయస్తులలొ చివరి బెంచీ లొ నన్ను కూచోనిచ్చాడా సశేష భిషక్.
    ఆ) “ఆధునిక తెలుగు భాషలో ఇంతగా ఉపయోగించే æ ధ్వనిని చూపడానికి తెలుగు లిపిలో ప్రత్యేక సంకేతం లేకపోవడం పెద్దలోటు. ” శ్రీ కొలిచాల
    bank కు తెలుగు లొ ‘బ్యాంక్’ వంటి లిపి రూపాలను చూడలేక æ శబ్దానికి కొన్ని సంవత్సరాల కిందట ఒక లిపి తయారు చేశాæను. ఇప్పుడు వెలిబుచ్చుతున్నాను. అచ్చు’ఆ’ మధ్య లొ ఉన్న అడ్డ గీతని కొద్దిగా ఎడమవైపుకు పొడిగించి కుడివైపున ఉన్న గుండ్రాన్నిఎడమ వైపున కూడా రాయటం గా. సుమారు గా ‘త’ వత్తు , ఐత్వము కొసల దగ్గర కలిపినట్టుగా. హల్లు ల లొ ఇది దీర్ఘము గుర్తు లొ ఎడమ వైపు పైన ఒక గుడి గా ఉంటుంది. ‘బి’లొ గుడి ని అలాగే ఉంచి బ’ కు దీర్ఘము కూడా పెట్టటం తొ అది ‘bAæ’ అవుతుంది. ‘కాడా’ అన్న మాటలొ రెండు దీర్ఘాల గుర్తులకూ ఎడమ వైపున పైకి గుడి చుట్టాæమనుకోండి. ఆప్పుడు ఆ మాటని కాæడాæ అని పలకాలి .
    తః తః

    .

  4. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    11/08/2013 1:53 am

    జ్యోతిర్మయి గారికి,
    ధన్యవాదాలు. సాధారణమైన అంశాల్లోనే హాస్యం కనిపిస్తుందండి నాకు…దహా.

    నాగ మురళీధర్ గారికి,
    రాధ గారికి,
    ధన్యవాదాలు.

    ఎన్నెల గారికి,
    ప్రద్యుమ్నుడికి ఇలియానా ఆరాధ్య దేవత. సీతయ్య గారి కెవరో మరి? ఆ పేరు చెక్కించండి.
    అయినా కత్తి పుచ్చుకొని మీరు అలా నుంచొని ఉంటే, ఇంకొకరిని తలుచుకోవటానికి ఆయన కెంత ధైర్యం?…దహా.

    వేణు శ్రీకాంత్ గారికి,
    ధన్యవాదాలు.

    తృష్ణ గారికి,
    ధన్యవాదాలు.
    ‘పాపం సీతయ్య గారు’ అని ఘట్టిగా అనకండి. ఆ కత్తి ఇటువైపు విసరవచ్చు ఆవిడ,,,,దహా.

  5. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    11/08/2013 1:50 am

    నాగార్జున గారికి,
    దహా. ధన్యవాదాలు.

    మల్లికార్జున శర్మ గారికి,
    >>> ఇంటింటి ప్రభావతీ ప్రద్యుమ్నం! సరే, అలాక్కానివ్వండి!
    అంతేనండి. ధన్యవాదాలు.

    రాజ్ కుమార్ గారికి,
    ధన్యవాదాలు.

    praveen guttula గారికి.
    ధన్యవాదాలు. బూరెల్లోనే చిల్లు చేసి నెయ్యి నింపి తింటాం. దహా.

  6. గద్యములో పద్యములు గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/06/2013 11:17 am

    విద్వన్మాన్యులు శ్రీ జెజ్జాల కృష్ణమోహనరావు గారికి
    నమస్కృతులతో,

    ఈ శ్రీనివాస గద్యను ప్రతిరోజూ తెల్లవారుజామున నేను వింటూనే ఉన్నా, అనేకపర్యాయాలు తిరుమలలోని శ్రీవైష్ణవ విద్వాంసులు దివ్యోత్సవాలలో వాద్యసహకారంతో శ్రుతిమనోహరంగా పఠిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూచి ఆనందించినప్పటికీ – శబ్దసంయోజన వల్ల ఆ గద్యగంభీరిమ మనస్సును ఆకట్టుకొనటమే కాని, అందులోని ఛందోనిర్మాణరీతుల సంస్ఫురణ మనసుకెన్నడూ కలుగలేదు. ఒక శతాబ్ది మునుపటివారే కాబట్టి మహావిద్వాంసులైన పురిసై శ్రీనివాసాచార్యులవారి రచనలన్నీ అచ్చులో ఉన్నాయి కాని, దీని రచనావిశేషాలను గుఱించిన విమర్శనాత్మక పర్యాలోకనం తెలుగులో అంతగా జరిగినట్లు కనిపించదు. ఆ విధంగా ఒకానొక శ్రవణీయరచనను రమణీయసాహిత్యంగా దర్శించిన మీ ప్రజ్ఞాప్రతిభానతను మనసారా అభినందిస్తున్నాను.

    భట్ట బాణుని కాదంబరిలో “పాతాలతలవాసిషు దానవేషు” వంటి చోట్ల వృత్తగంధం వినిపిస్తున్నదని వ్యాఖ్యాతలు వ్రాయటమే గాని, అంతకంటె ఎక్కువగా ఆ విశేషాలను పరిశీలింపలేదు. నన్నయ్య గారి గద్యాన్ని విద్యార్థులకు ఇచ్చి, అందులోని వృత్తాంశాలను గుర్తించి, ఆ పద్యాల పేర్లను చెప్పమని శ్రీ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు శిష్యులకు ఛందస్సును నేర్పుతుండేవారు. అవి శిక్షాప్రణీతాలు.

    లాక్షణికులు గద్యనిరూపణాధ్యాయాలలో చూర్ణకాన్ని లలితము, ఆవిద్ధము, అవృత్తిముగ్ధం, అత్యంతవృత్తిముగ్ధం అని; ఇంకా ఉత్కలికను, వృత్తగంధిని – పెక్కు అంతర్భేదాలతో వివరించారు. కవులు కావ్యగతంగా గద్యబంధలీనంగా కొన్ని కొన్ని సమ-విషమవృత్తాలను, అర్ధసమాలను, తాళవృత్తాలను ప్రయోగించినవన్నీ అందరికీ తెలిసిన సంగతులే.

    అయితే, వీటి నిర్మాణరీతులను సూక్ష్మంగా అనుశీలించి, ఇంత విస్తారమైన పరిధిలో గద్యంలో సరిక్రొత్తగా నిక్షేపింపగల ఛందోగతులను ప్రస్తారించి, వాటిలో మునుపటి లాక్షణికులు చెప్పని అభినవరూపాలను ప్రకల్పించి, వాటికి లక్ష్యాలను శిల్పించి, ఆ రూపాలను సార్థక నామవృత్తాలుగా ప్రచారంలోకి తెచ్చినవారు మీరొక్కరేనని ఈ విధంగా ‘ఈమాట’ లేఖాముఖతః ఉచ్చైఃస్వనంతో నా బోటి సహపాఠకులకు చెప్పగలగటం నాకెంతో సంతోషంగా ఉన్నది.

    శ్రీనివాస గద్యకు మీరు వృత్తపట్టికను అనుబంధించటం చమత్కృతంగానూ ఉన్నది. అది మీ అధికారపరిధిలోని విషయమే కదా! 🙂

    అచిరకాలంలో మీ వ్యాసాలు అచ్చుకు వచ్చి, విద్యాస్థానాలలో పఠనపాఠనాలకెక్కి, విద్యార్థులకు ఉపాదేయాలు కావాలని నా శుభాకాంక్ష.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి తృష్ణ అభిప్రాయం:

    11/06/2013 1:36 am

    @బులుసుగారూ, బాగుందండి ఉపవాస ప్రహసనం..:)

    @ఎన్నెల:కత్తట్టుకు రెడీగా ఉన్నారా?! పాపం సీతయ్యగారు..:-)

  8. ఒక్కో రోజు గురించి తృష్ణ అభిప్రాయం:

    11/06/2013 1:31 am

    చాలా బాగుంది మానసా!

    “కాలపు కుండకు చిల్లులు పెట్టి
    అట్టడుగున పేరుకున్న అనుభవాలేమిటని
    దోసిలితో పైకెత్తి చూస్తాను”

    ఈ వాక్యాలు చాలా నచ్చాయి.

  9. విశ్వనాథ: వివాహాశీస్సులు గురించి pattabhiramaiah అభిప్రాయం:

    11/06/2013 12:46 am

    కార్తీక మాసపు ఉదయపు వేళ శ్రీ విశ్వనాధ వారి వివాహాశీస్సులు పద్యరూపంలో చిన్ని కన్నయ్యని సాక్షాత్కరింప చేస్తుంటే హృదయ పారవశ్యం చెప్పనలవి కాకుండా ఉంది. ఇంతటి మధురానుభూతిని అందించిన శ్రీ మురళీధరరావుగారికి సవినయ నమస్కారములు.

  10. కవితాకన్యక మానసంరక్షణము గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    11/05/2013 12:54 pm

    యదుకుల భూషణ్ గారికి , మణి వడ్లమాని గారికి – మీ వ్యాఖ్యలకు బోలెడు ధన్యవాదాలు. రాసేప్పుడు, ఈమాట వారికి పంపించేప్పుడు ఇలాటివి ఎవరూ చదవరు అని నాకు అనుమానంగానే ఉన్నా మీ వ్యాఖ్యలు చూసాక నా అంచనా తప్పని తేలింది. 🙂

    భవదీయుడు
    మాగంటి వంశీ మోహన్