పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. క్రీడాభిరామము:1 వ భాగం గురించి krishna అభిప్రాయం:

    11/18/2013 10:40 am

    ధన్యవాదాలు, group-2 లో క్రీడాభిరామము కవి పేరు విన్నాము. అమూల్యమైన గ్రంథాన్ని చూపినందుకు ధన్యవాదాలు. తాత్పర్యం వ్రాస్తే బాగుండేది.

  2. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదేవ రావు అభిప్రాయం:

    11/18/2013 2:19 am

    శాంతామూర్తి గారికి:డా చంద్రశేఖరన్ శివప్రసాద్ గారి చిన్నాన్న అన్న వివరం తొనూ ఆంధ్ర విశ్వకళాపరిషత్ తొ మీకు గల అనుబంధం తోనూ మీరు వెలిబుచ్చిన మీ అభిప్రాయాలకు ధన్యవాదాలు .
    వాసుదేవ రావు

  3. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి hareesh అభిప్రాయం:

    11/17/2013 9:49 am

    Reading this essay reminded me of the popular”padyam” of Tirupati Venkata Kavulu. There, they used the words “dosamu”, “rosamu”, “baasalu” etc with what we call kunti-sa.

    దోసమటంచు ఎరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
    మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
    రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
    మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే

    Hareesh

  4. కొన్ని త్రిపుర సందర్భాల్లో గురించి ganesh అభిప్రాయం:

    11/16/2013 1:55 am

    చాలా బాగుంది స్వాతి గారు , ప్రతీ వాక్యం చదివి అర్థం చేసుకుని ,పాత జ్ఞాపకాలు నెమరు వేస్కుంటూ…………….

  5. ఒక్కో రోజు గురించి Manasa అభిప్రాయం:

    11/15/2013 9:31 am

    Thank you all.. 🙂

  6. ద్వితీయ కళత్రం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    11/14/2013 10:53 am

    జాతకాలు మీద నమ్మకం కన్నా మానవప్రయత్నాన్ని నమ్మటం ముఖ్యం అన్న ఒక సిధ్ధాంతాన్ని ప్రతిపాదించే ఒక్క సంఘటనయే ఈ‌ కధ. ఈ సందర్భంలో జ్యోతిషానికి సంబంధించిన మానవ బలహీనతలు కొన్ని ప్రస్తావించటం జరిగింది. సిధ్ధాంతాన్ని రచయిత తన స్వీయానుభవంతో సమర్థిస్తున్నారు. ఒక స్వీయానుభవంతో సత్యాసత్యాలు ప్రతిపాదించ వచ్చునా అన్న ప్రశ్న ఉంది. దానికేమి? ఒకే చేదు అనుభవంతో జ్యోతిషం పట్ల విరక్తి కలిగినవాళ్ళు ఉన్నారు. అలాగే ఒకే నిదర్శనంతో జ్యోతిషంపై గాఢమైన విశ్వాసం కల్పించుకున్నవాళ్ళూ ఉన్నారు లోకంలో. కధ ప్రతిపాదించిన దాన్ని ఆమోదించటం‌ మానటం చదువరి ఇష్టం.

    ప్రస్తుత కథలో, పాప జాతకం అంత వివరంగా విశ్లేషించవలసిన సందర్భం తెలుసుకునే వీలుంటే ఇంకా గొప్పగా వుండేది అన్న అభిప్రాయం ఒకటి వచ్చింది. కాని ఆ సందర్భం తెలుసుకోవటం వలన పాఠకుడికి కొత్తగా అందేది ఏమీ ఉండదూ, అది ప్రస్తావించటం వలన తాను చెప్పదలచిన పిండితార్థానికి చేకూరే బలమూ ఏమీ ఉండదూ అని రచయిత భావించి ఉండవచ్చునని నా అభిప్రాయం.

    చాలా మంది కథ అనగానే దానికి కొన్న అంగాలు ఊహించుకుంటారు.

    కథకు ఒక ప్రధానవిషయం ఉండాలి – అది మనం మాట వరసకు హృదయం అనుకోవచ్చును. ఆ ప్రథానవిషయం ద్వారా నిరూపితం కావలసిన లేదా ప్రతిపాదించబడ వలసిన లేదా స్పష్టపడ వలసినదైన సిధ్ధాంతమో, జీవనసత్యమో, దృక్పథమో ఉండాలి – అది ప్రాణం వంటిది. కథను నడిపించే సంఘటనలు జ్ఞానేంద్రియాల్లాంటివి. కథను నడిపించే పాత్రలు కర్మేంద్రియాల్లాంటివి. వీటన్నిటి సమాహారమైన ఒక స్వరూపమే కథ.

    ఇలా అనుకున్నప్పుడు కథ అనేది సర్వాంగసుందరంగా కుదిరిందా అన్న విషయం ఆలోచించటం జరుగుతుంది సహజంగా.

    ఈ దృక్కోణం కథలకూ నవలలకూ కూడా సమంగా వర్తింపచేసుకుని ఒక విలువైన జీవంగల సృష్టి జరిగిందా అని చూడటం ఒక పధ్ధతి.

    కాని ఇంకొక విధంగా కూడా చూడవచ్చును.

    జీవితం అనేది ఒక ప్రవాహం లాంటిది. ప్రతి జీవితమూ ఒక ప్రత్యేకమైన జీవనదీ ప్రవాహమే. మన జీవితమూ, మన దృష్టికి వచ్చిన ప్రతిజీవితమూ కూడా అంతే. మన జీవితమైనా, ఇతరుల జీవితాలైనా ఆ ప్రవాహాలని మనం సమగ్రంగా చూడలేం. మన దృష్టివైశాల్యానికి అందినంతగా మాత్ర్రమే చూడగలం. ఒక్కటి మాత్రం స్పష్టం – ఏ కొంచెంగా దృష్టికి వచ్చినా ప్రతి జీవన ప్రవాహమూ అద్భుతమే. ఏతజ్జీవి యొక్క అనంత సత్యాన్వేషణాప్రయాణంలో అది ఒక చక్కని భాగమే.

    కాబట్టి పూర్వాపరాలు చర్చించి సమగ్రమైన విగ్రహం కుదర్చటానికి ప్రయత్నించకుండా సూటిగా తన దృష్టికోణానికి అందిన ఒక్క సంఘటనను అక్షరబధ్ధం చేసే ప్రయత్నంగా కూడా ఒక కథ అనేది ఉండవచ్చును. జీవికి అణువణువునా ప్రాణం ఉన్నట్లుగా ఏదో ఒక చిన్న సంఘటనలోనూ ఎంతో కొంత చెప్పదగిన విషయాన్ని సమర్థుడైన రచయిత ఆవిష్కరించవచ్చును.

    పాత జానపద కథల్లో వినిపిస్తూ ఉంటుంది. ఒక చిత్రకారుడు ఒక గోరుముక్కనో తలవెంట్రుకనో ఆధారం చేసుకుని అందగత్తె బొమ్మను వేసాడని. అలాగే ఒక రచయిత ఒక సంఘటనను చెబితే అక్కడ ఉన్న సారాంశమే మనకు చెప్పటానికి రచయితకు సరిపోవాలి – అలా సరిపోతుంది అనుకున్న ఆ సంఘటనను అతడు సమర్థంగా నిర్వహించాలి. అంతే. కధావిగ్రహంలోని మిగతా సర్వభాగాలు చదువరులు అవసరమైతే స్వతంత్రంగా మనఃఫలకంలో చిత్రించుకోవాలి. అవన్నీ తాను చెప్పటానికి అముఖ్యమైనవి కాబట్టే రచయిత చెప్పలేదు కథలో. అంతే‌కాదు, అవన్నీ చదువరి సమగ్రంగా తెలుసుకో నవసరం లేదనీ కథకుడి అభిప్రాయం కూడా కాబట్టి వాటిజోలికి పోనవుసరం లేదు కదా ఏ చదువరికీ.

    నాకు తోచిన రెండు ముక్కలు వ్రాసాను. నేను రచయితనూ కాను, విమర్శకుడనూ కాను. అది వేరే సంగతి.

    జ్యోతిషం లాంటి వివాదాస్పదమైన విషయం పైన రకరకాల కథలు వ్రాయవచ్చును. అలాంటి వాటిలో ఇది కూడా ఒక కథ. ఈ‌ కథ నాకు బాగా నచ్చిందనో నాకు అసలు నచ్చలేదనో నేను చెప్పటం లేదు. నాకు నచ్చటంతో సంబంధం లేదు – ఇది ఒక చక్కని కథ.

  7. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి chudamani అభిప్రాయం:

    11/14/2013 7:03 am

    కధ చాలా బాగుంది. నిజంగానే అందరి ఇళ్ళల్లో ఉండే సాధారణ విషయం గొప్ప జోవియల్ గా చెప్పారు.

  8. రచయితలకు సూచనలు గురించి S A Rahman,Chittoor. అభిప్రాయం:

    11/13/2013 6:52 am

    గౌ!! సంపాదకులు గారికి:

    రఛనలను టెక్ష్ట్ ఫైళ్ళలో పంపమని సూచించినారు. టెక్ష్ట్ ఫైల్ అంటే ఏమిటి?
    దయచేసి వివరించగలరు.

    ఇదే పేజీలో రచన హామీతోపాటూ పంపవచునా?

    [Text file అంటే pdf, jpeg, gif వంటివి కాకుండా (*.txt) వంటి పేరుతో ఉన్న files. Unicodeలో గాని, RTS పద్ధతిలోగాని టైప్ చేసి (submissions@eemaata.com) అన్న చిరునామాకు పంపండి. అచ్చుతప్పులు లేకుండా తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]

  9. మా అమ్మ గదే! గురించి ennela అభిప్రాయం:

    11/13/2013 12:42 am

    ముందంతా బాధేసింది, కానీ చివరని కిసుక్కున నవ్వొచ్చింది. ముగింపు సూపరసలు!

  10. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి ఎన్నెల అభిప్రాయం:

    11/13/2013 12:28 am

    “ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్టు భారతం చెప్తున్నది. అంటే పాండ్యులు, ఆంధ్రులు కూడ కృష్ణుడి కాలం నాటి వాళ్లనేనా?”……..ఇది చదివి నేనొకసారి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇప్పటికీ ఇక్కడ కనిపించిన హిందీ వాళ్ళు మీరు మదరాసీలా అని అడుగుతుంటారు. అవునని, కానీ తెలుగు రాష్టం విభజన కారణంగా తెలుగు వాళ్ళు అంటారని సమాధానమిస్తా. అప్పటికి మరి ఆంధ్రులని ఎలా అనేవారో ! .

    మీరు సూచించిన లింకులన్నీ సమయం చూసుకుని తప్పకుండా చదువుతానండీ..మీ స్పందనకి ధన్యవాదాలు.