పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి chintala Devender అభిప్రాయం:

    12/16/2013 8:09 am

    ఎల్లలు లేని ప్రపంచం చాల బాగుంది.మంచి పత్రిక

  2. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి తః తః అభిప్రాయం:

    12/15/2013 1:28 pm

    పెరటి తోటలో పూల తావులు మోసుకొచ్చే చిరుగాలిలా ఉంటాయి ఇంద్రాణి కవితలు. ఈ కవితలొ ఇంతకు ముందు కనపడని అస్పష్టత చోటు చేసుకున్నదనిపించింది నాకు. ఇంతకు ముందు రెండు సార్లు చెప్పిన అభిప్రాయాన్నే మళ్ళీ చెబుతున్నాను – గరిక పేని ఏనుగును కట్టేయగల కవయిత్రి ఇంద్రాణి.

    -తఃతః

  3. పాఠకులకు సూచనలు గురించి బత్తుల వామీ అప్పారావు అభిప్రాయం:

    12/13/2013 11:34 am

    సెర్చ్ (వెతుకు) ఉన్న వ్యుత్పత్తుల వెబ్ సైట్ చెప్పగలరా?

  4. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి Deepa అభిప్రాయం:

    12/12/2013 5:46 pm

    చాలా బావూండాది.

  5. ఈమాట గురించి గురించి hymavathy.Aduri అభిప్రాయం:

    12/10/2013 10:21 am

    సంపాదకులవారికి!

    ఆర్యా! నేను ఏదైనా రచన పంపాలంటే ఏ మైల్ కు పంపాలో మైల్ ఐ.డీ ఇవ్వగలరు.

    (ముందుగా రచయితలకు సూచనలు చదవండి. submissions<AT>eemaata.com కు మీ రచనలు పంపాలి. – Ed.)

  6. నెమ్మదిగా నాట్యం గురించి తమ్మినేని యదుకులభూషణ్ అభిప్రాయం:

    12/10/2013 12:42 am

    ఇది అనువాద కవిత. అప్పట్లో- విశ్వకవిత శీర్షికన నానా కవులను అనువాదం చేస్తున్న రోజుల్లో చేసినది. నేను అనువాదమన్న విషయం పేర్కొన్నాను కూడా.
    ఆ సంగతి, సంపాదకులు పాత సంచికలను కొత్త సాంకేతికరీతులకు అనుగుణంగా తీర్చిదిద్దే క్రమంలో జారిపోయినట్లుంది. మూల కవితకు దారి :
    http://www.davidlweatherford.com/slowdance.html

  7. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి బ్రహ్మేశ్వర రావు మేకా అభిప్రాయం:

    12/09/2013 1:27 am

    శ్రీశ్రీ మహా ప్రస్థానం చాలా ఇష్టంగా ఎన్నోసార్లు చదివాను. మీరన్నట్లు చాలా పదాల అర్థం అప్పుడూ తెలియదు, ఇప్పుడూ తెలియదు నాకు. నిఘంటువులను చూడాల్సిన అవసరం ఉన్నా, బద్దకంతో ఆపని చేయలేదు. ఆ ఉద్ధృతిలో కొట్టుకు పోయాను. ఈ రోజున రాస్తున్న కొన్ని కవితలు జఠిలంగానే ఉంటాయి నావరకు. వీటన్నిటికీ సమర్థులు సరళంగా వ్యాఖ్యానించి రాస్తే బాగుండు.

  8. ఒంటరి ప్రపంచం గురించి Kranthi అభిప్రాయం:

    12/04/2013 9:02 am

    Thank you Sasikala gArU, Bhaskar gArU 🙂

  9. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    12/04/2013 3:02 am

    చూడామణి గారికి,
    రామ్ గారికి,
    సుబ్రహ్మణ్యం గారికి,

    మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

  10. చిలక – గోరింక గురించి Dr CBS Venkataramana అభిప్రాయం:

    12/03/2013 9:18 am

    కథ పూర్తయిందా? లేదా, మిగతాది చదువరులను ఆలోచించుకొమ్మని వదిలేసేరా?

    కథలో ఒక చోట “మొగుడు పెళ్ళాల మధ్య డైవోర్స్ వస్తే” అన్న టాపిక్ తెచ్చి, ఆదేదో ఒక భరింపరాని విషయమన్నట్లు వదిలేశారు. కాని, జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏ విషయాన్ని కూడా తక్కువ చేసి వదలిపెట్టకూడదుకదా!

    డైవర్సే కాదు, ఏ కారణం చేతనైనా భర్త చనిపొతే, భార్య దిక్కులేనిదై, పిల్లలతొ పడే అవస్థల గురించి కూడా ఆలొచించాలి కదా!

    భార్యా-భర్తలు సమానమైనప్పుడు, ఒకరు ఇంటిపని ఒకరు వుద్యొగమూ చెయ్యాలి అని ఎందుకనుకొవాలి? ఇద్దరూ రెండు పనులూ ఎందుకు కలిసి చేసుకొకూడదు?

    పిల్లలను చూసుకొవడమనేది పెళ్ళైన పదిహేను సంవత్సరాలవరకు మాత్రమే. ఆ తర్వాత ఉద్యోగం కావాలంటే భార్యకి దొరుకుతుందా? ఇవన్నీ కూడా చర్చిస్తే బాగుండేదేమో!!

    డా. సి. బి. ఎస్. వేంకటరమణ