పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ప్రతీకారం గురించి poornima అభిప్రాయం:

    12/23/2013 7:20 am

    బావుంది

  2. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి indrakanti pinakapani అభిప్రాయం:

    12/23/2013 6:08 am

    పద్యాన్ని మొదట రాసిన వాడు అద్భుతంగా రాస్తే దాన్ని కాపీ కొట్టిన వాడు తప్పులుగా రాస్తాడని అనుకోడం పొరపాటు. ఆ రకంగా కూడా నన్నెచొడుని ప్రాచీనత స్పష్టమవ్తూంది.

  3. ఆవిడ గురించి poornima అభిప్రాయం:

    12/23/2013 5:18 am

    మనసుని తాకింది ఈ కథ. ఈ కథ ప్రారంభంలో నేను అనుకున్న అంచనాను నిజం చేసింది. బావుంది.

  4. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి Ramajoga Rao Iswara అభిప్రాయం:

    12/22/2013 6:48 am

    శ, ష, స ల కింత శషభిష లెందుకో! దోసము రోసము వైకృత పదాలుగ బహుజనపల్లి సీతారామాచార్యులు అంగీకరించిన తరువాత ఇంత చర్చా! ఆన్నమాచార్యుల వ్యాకరణ ఙ్ఞానాన్ని భాషాపటిమనీ శంకించే అవసరం ఉందా? అన్నమాచార్యులు తద్భవ , తత్సమ, దేశ్య పదాలతో కీర్తనలను రచించిన మహా పండితుడు.
    రామజోగారావు ఈశ్వర
    హైదరాబాదు

  5. కవితాకన్యక మానసంరక్షణము గురించి మాగంటి వంశీ మోహన్ అభిప్రాయం:

    12/20/2013 1:02 am

    ఆకుల మానయ్య గారు నమస్కారం – నచ్చినందుకు సంతోషం. పాఠశాలకు, విద్యార్థులకు చేర్చదలచుకున్నందుకు మరింత సంతోషం. పోతే మీ ప్రదర్శనలో ఈ ఏకాంకిక ప్రచురించిన “ఈమాట” వారి పేరు, శ్రీ మక్కపాటి వేంకటరత్నం పంతులు గారి పేరు – ప్రస్తావిస్తే బాగుంటుంది అన్న చిన్నసూచనతో ముగిస్తూ, మీకు వీలుంటే, కుదిరితే ఆ ప్రదర్శన ఆడియో వినిపించగలరని ఆశిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు.

    భవదీయుడు
    వంశీ

  6. భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి pardhasaradhi అభిప్రాయం:

    12/17/2013 12:09 pm

    చాల మంచి వివరణ ఇచ్చారు.మీ లాంటి వారు ఇలా వివరణ ఇవ్వబట్టే నాకు చాల విషయములు తెలిసినవి. ధన్యవాదాలు.

  7. కవితాకన్యక మానసంరక్షణము గురించి Akula Manaiah అభిప్రాయం:

    12/17/2013 11:54 am

    నమస్కారం. మీ భాషాపటిమకు జోహార్లు. మీ ఏకాంకికను మాపాఠశాలలో ఒక విద్యార్థిచే ప్రదర్శించుటకు సాహసం చేస్తున్నాను. ఆశీర్వదించండి.

  8. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    12/17/2013 8:20 am

    మోహన గారు

    కొంత వివరణ అవసరం. ఇస్మాయిల్ గారు స్వయానా గొప్ప పండితులు. పండితుల పట్ల ఆయనకు గల ఆదరం అందరికీ విదితమే. ఆయన కవిత్వ పక్షపాతి, ఆరుద్ర గొప్ప కవిత్వం రాయగలిగే వారు, అది ఆరుద్ర మాత్రమే చేయగలిగిన పని, ఆరుద్ర తలకెత్తుకున్న పని డొక్కశుద్ధిగల పండితుడు ఎవరైనా సరే చేయగలిగి ఉండేవాడు, అని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ ఉండేవారు. ఇదీ దీనికి గల సందర్భం.

  9. ఏం లేదు గురించి బ్రహ్మేశ్వర రావు మేకా అభిప్రాయం:

    12/17/2013 1:32 am

    కథ లా కాకుండా ఒక చక్కటి స్కెచ్ లాగున్నది. బాగున్నది. నేనూ అలాగే విలక్షణమైన వాడి నను కొంటూ ఉండే వాడిని. సవివరంగా, సహజంగా విలక్షణత ప్రదర్శించారు.

  10. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి J K Mohana Rao అభిప్రాయం:

    12/16/2013 4:01 pm

    In an otherwise excellent bird’s eye view of modern poetry, I am slightly shocked to find this sentence – Arudra showed a great promise in his earlier poems (Paila pacchisu) but later his talents were diverted into the dreary sands of historical scholarship. Is this the value attached to painstaking job of scholarship by even renowned poets?

    Regards – mOhana