ఎంత బాగా రాశారు దమయంతి గారు. మీరు మాటి మాటికి మమ్మల్ని మీ కథల ద్వారా మా బాల్యంలోకి పంపి జ్ఞాపకాల గవ్వల్ని తనివి తీరా ఏరుకున్నాక మళ్ళీ వర్తమానంలోకి దింపి మా మనసుల్ని తియ్యదనంతో నింపి మళ్ళీ మీరు రాసే కథ వచ్ఛే వరకూ మమ్మల్ని ఇక్కడే నిలిపేస్తున్నారు. మళ్ళీ మాకోసం మీరు తీసుకొచ్చే మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ మీ భక్తురాలు.
ధన్యవాదాలు.
పూర్ణిమ.
శ్రీనివాస్ గారు,
బహు ధన్యవాదాలు. ఎప్పుడో ౩౦ ఏళ్ళ నాడు విన్నది మళ్ళీ ఇప్పుడు విన్నాను మీ పుణ్యమా అని. ఇంకా ముందు ముందు ఇలాంటివి మరిన్ని మీ ద్వారా వినగలమని ఆశిస్తున్నాను.
రామ ప్రసాద్
శుభోదయము. మీ రచన బంతి పూల పడవ మీద పోదాం పదవా చదివేను. చదివేను అనడం కన్న అనుభూతికి లోనయ్యేను అని చెప్పాలి. గొబ్బెమ్మల పైన హుందాగా నిలిచిన బంగారు రంగు బంతి పువ్వు పరమశివుని కేశజాలమునకు తలమానికమైన శశాంకుని తలపింప చేయదూ? ఆ మాటకు వస్తే బంతిపూల పడవ అనడంలోనే కవితాత్మ దర్శనమవుతున్నది.
రవికిరణ్ తిమ్మిరెడ్డి ఆభిప్రాయంతొ నేను ఏకీభవిస్తున్నాను. కారుకు రోడ్డు లేకపోవటం, తలదాచుకోవటానికి ఇల్లు లేకపోవటాన్ని ఒకే గాటన కట్టేసి రాయడం… వారు (రచయిత) మొదట మొదలు పెట్టిన సమస్య గాఢతకు ముప్పు తెచ్చింది. కధ శైలి బాగుంది.
మంచి వ్యాసము. మదురై మణి అయ్యర్ కచేరీల చివరలో ఈ నోటు స్వరాలను పాడేవారు. సంస్కృతములో 39 నోట్టు స్వరాల సాహిత్యము ఆంగ్లములో, దేవనాగరి లిపిలో అంతర్జాలములో ఉచితముగా దొరుకుతుంది.
ఈ వ్యాసములో కొన్ని లేఖక దోషములున్నవని చింతిస్తున్నాను. అవి – దీక్షితర్ (తమిళములో కూడ దీక్షితరే) దీక్షితార్ కాదు. ఇవి తమిళములో కూడ నోట్టు స్వరాలు, నొట్టు స్వరాలు కావు. నోటు అనే పదమును (సురేశ్ గారు ఈ మధ్య చెప్పినట్లు) నోట్టు అని తమిళములో వ్రాయుట వాడుక. మదరాసు దగ్గర ఉండే ఊరు మణలి, మనాలి కాదు. ఈ మణలిలోనే ఇప్పుడు ఒక ఆయిల్ రిఫైనరీ ఉన్నది. దీక్షితర్ ఉండినది ఎట్టయా(య)పురములో, ఎత్తయిపురము కాదు. ఈ ఎట్టయాపురములో మరొక మహానుభావుడు జన్మించాడు, అతడే సుబ్రహ్మణ్య భారతి.
ఏమిటండీ ఇది కధా? ఆత్మ హత్య చేసుకోవడానికి వచ్చినవాడికి అవతల వాడి సంగతెందుకు? వాడు తలుపులేసుకుంటే ఈయనకెందుకో? కొన్ని రంగులు కొండలు వర్ణించగానే కధ అయిపోయిందా? పాములుంటాయనే సరికి మళ్ళీ భయం ఒకటా. ఇంతకన్నా మంచిది దొరకలేదా?
వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అంతకు ముందెప్పుడూ చూడని మనిషి గురించి మొత్తం ఆయన ఆలోచనలా? తలా తోకా లేకుండా ఏమిటో.
ఆత్మహత్య చేసుకునేవాడు సాధారణంగా అవతలివాడికి చూచాయగా చెప్తాడని రీసెర్చెర్స్ అంటారు. ఆందులోనూ బాగా తెల్సినవాళ్లకి. ఇలా ముక్కు మొహం తెలీనివాళ్ళ దగ్గిరకి వెళ్లి,వాళ్ళ జీవితాల గురించి తల బద్దలు కొట్టుకోరు. కొండలూ కోనలూ కాస్త బాగ వర్ణించగానే కధ ఐపోదు. వస్తువనేది ఉండక్కర్లా?
కృషితో దుర్భిక్షం గురించి Rajkumar అభిప్రాయం:
01/03/2014 2:29 am
అద్భుతః.. ఎప్పటిలానే. చింతన్ బైఠక్ అంటే ఏంటండీ? కూర్చొని చింతించడమా? 😉
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి poornima అభిప్రాయం:
01/03/2014 2:18 am
ఎంత బాగా రాశారు దమయంతి గారు. మీరు మాటి మాటికి మమ్మల్ని మీ కథల ద్వారా మా బాల్యంలోకి పంపి జ్ఞాపకాల గవ్వల్ని తనివి తీరా ఏరుకున్నాక మళ్ళీ వర్తమానంలోకి దింపి మా మనసుల్ని తియ్యదనంతో నింపి మళ్ళీ మీరు రాసే కథ వచ్ఛే వరకూ మమ్మల్ని ఇక్కడే నిలిపేస్తున్నారు. మళ్ళీ మాకోసం మీరు తీసుకొచ్చే మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ మీ భక్తురాలు.
ధన్యవాదాలు.
పూర్ణిమ.
జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి Rama Prasad అభిప్రాయం:
01/03/2014 12:20 am
శ్రీనివాస్ గారు,
బహు ధన్యవాదాలు. ఎప్పుడో ౩౦ ఏళ్ళ నాడు విన్నది మళ్ళీ ఇప్పుడు విన్నాను మీ పుణ్యమా అని. ఇంకా ముందు ముందు ఇలాంటివి మరిన్ని మీ ద్వారా వినగలమని ఆశిస్తున్నాను.
రామ ప్రసాద్
కృషితో దుర్భిక్షం గురించి సుబ్రహ్మణ్యం నిష్టల అభిప్రాయం:
01/02/2014 11:59 pm
మీ కధలు చదివితే ఆరోగ్యానికి మంచిదని నా భావన. కధనం చాలా బాగుంది. మంచి కధలు అందిస్తున్నందులకు అభినందనలు మరియు ధన్యవాదములు.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి శంభర వేంకట రామ జోగారావు అభిప్రాయం:
01/02/2014 11:52 pm
అమ్మా శ్రీమతి దమయంతి గారు, నమస్కారములు.
శుభోదయము. మీ రచన బంతి పూల పడవ మీద పోదాం పదవా చదివేను. చదివేను అనడం కన్న అనుభూతికి లోనయ్యేను అని చెప్పాలి. గొబ్బెమ్మల పైన హుందాగా నిలిచిన బంగారు రంగు బంతి పువ్వు పరమశివుని కేశజాలమునకు తలమానికమైన శశాంకుని తలపింప చేయదూ? ఆ మాటకు వస్తే బంతిపూల పడవ అనడంలోనే కవితాత్మ దర్శనమవుతున్నది.
రచనకు అభినందనలు.
భవదీయుడు,
జోగారావు
బెంగళూరు
పేరు గలవాడేను మనిషోయ్ గురించి రమాసుందరి అభిప్రాయం:
01/02/2014 11:36 pm
రవికిరణ్ తిమ్మిరెడ్డి ఆభిప్రాయంతొ నేను ఏకీభవిస్తున్నాను. కారుకు రోడ్డు లేకపోవటం, తలదాచుకోవటానికి ఇల్లు లేకపోవటాన్ని ఒకే గాటన కట్టేసి రాయడం… వారు (రచయిత) మొదట మొదలు పెట్టిన సమస్య గాఢతకు ముప్పు తెచ్చింది. కధ శైలి బాగుంది.
నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి మోహన అభిప్రాయం:
01/02/2014 11:11 pm
మంచి వ్యాసము. మదురై మణి అయ్యర్ కచేరీల చివరలో ఈ నోటు స్వరాలను పాడేవారు. సంస్కృతములో 39 నోట్టు స్వరాల సాహిత్యము ఆంగ్లములో, దేవనాగరి లిపిలో అంతర్జాలములో ఉచితముగా దొరుకుతుంది.
ఈ వ్యాసములో కొన్ని లేఖక దోషములున్నవని చింతిస్తున్నాను. అవి – దీక్షితర్ (తమిళములో కూడ దీక్షితరే) దీక్షితార్ కాదు. ఇవి తమిళములో కూడ నోట్టు స్వరాలు, నొట్టు స్వరాలు కావు. నోటు అనే పదమును (సురేశ్ గారు ఈ మధ్య చెప్పినట్లు) నోట్టు అని తమిళములో వ్రాయుట వాడుక. మదరాసు దగ్గర ఉండే ఊరు మణలి, మనాలి కాదు. ఈ మణలిలోనే ఇప్పుడు ఒక ఆయిల్ రిఫైనరీ ఉన్నది. దీక్షితర్ ఉండినది ఎట్టయా(య)పురములో, ఎత్తయిపురము కాదు. ఈ ఎట్టయాపురములో మరొక మహానుభావుడు జన్మించాడు, అతడే సుబ్రహ్మణ్య భారతి.
విధేయుడు – మోహన
మంచు గురించి Ravi Patnaik అభిప్రాయం:
01/02/2014 11:03 pm
ఏమిటండీ ఇది కధా? ఆత్మ హత్య చేసుకోవడానికి వచ్చినవాడికి అవతల వాడి సంగతెందుకు? వాడు తలుపులేసుకుంటే ఈయనకెందుకో? కొన్ని రంగులు కొండలు వర్ణించగానే కధ అయిపోయిందా? పాములుంటాయనే సరికి మళ్ళీ భయం ఒకటా. ఇంతకన్నా మంచిది దొరకలేదా?
వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు అంతకు ముందెప్పుడూ చూడని మనిషి గురించి మొత్తం ఆయన ఆలోచనలా? తలా తోకా లేకుండా ఏమిటో.
ఆత్మహత్య చేసుకునేవాడు సాధారణంగా అవతలివాడికి చూచాయగా చెప్తాడని రీసెర్చెర్స్ అంటారు. ఆందులోనూ బాగా తెల్సినవాళ్లకి. ఇలా ముక్కు మొహం తెలీనివాళ్ళ దగ్గిరకి వెళ్లి,వాళ్ళ జీవితాల గురించి తల బద్దలు కొట్టుకోరు. కొండలూ కోనలూ కాస్త బాగ వర్ణించగానే కధ ఐపోదు. వస్తువనేది ఉండక్కర్లా?
కృషితో దుర్భిక్షం గురించి Subramanyam అభిప్రాయం:
01/02/2014 10:40 pm
గురువు గారు మీరు మటుకు మాకు హాస్య వైద్యశ్రీ. మీ ప్రయోగాలు (హాస్య గులికలు) క్రొంగొత్తగా మాకు అందిస్తూనే ఉండాలని ప్రార్థిస్తున్నాము.
కృషితో దుర్భిక్షం గురించి నాగ మురళీధర్ నామాల అభిప్రాయం:
01/02/2014 9:34 pm
దూరదర్శన్ వారిని సంప్రదించక పోయారా గురూజీ? పెరటి వ్యవసాయంలో వంకాయ మొక్కలసాగు సమస్యలు వాటి పరిష్కారాలు కార్యక్రమం చేసేవారు!