పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నందిని గురించి VNM RAO అభిప్రాయం:

    01/08/2014 9:03 am

    బావుంది

  2. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి challa prasad అభిప్రాయం:

    01/07/2014 11:41 pm

    వినచక్కని కార్యక్రమాన్ని పంచిన శ్రీనివాస్ గారికి ధన్యవాదములు. నూతన సంవత్సరములో స్వరాజ్యేస్వరుని వినిపించారు.

  3. మంచు గురించి రఘోత్తమరావు అభిప్రాయం:

    01/07/2014 6:41 am

    “వచ్చిన పని కాకుండా చస్తానేమో అనుకుంటూ బాత్రూంలోకి నడిచాను.” — అన్న మాటల్లో ప్రధానపాత్రను అర్థం చేసుకునేందుకు మొదటి సంకేతం దొరుకుతుంది. పనిలో పనిగా “ఏమిటా పని?” అన్న ఉత్సుకతను పాఠకుల్లో రేకెత్తిస్తుంది కూడా.

    “ఏమీ పట్టకుండా ఎవరుంటారు ఈ ప్రపంచంలో? ఏమీ లేని జీవితంలో ఏకాంతం ఉంటుంది. అదీ లేని మనసెలా ఉంటుంది?” — ఇది రెండవ సంకేతం. కథలోని ప్రధాన పాత్ర చావడానికి వచ్చినట్టుగా ఇంకా పాఠకులకు తెలీదు. అంతే కాదు అతను కొండ మీది పల్లెను వెదుక్కుని చేయడానికి “వచ్చిన పని” ఏమిటో కూడా బోధపడలేదు. కానీ ప్రకృతి పట్ల అతని ప్రతిస్పందనలు, సాటి వ్యక్తి జీవనశైలిని చూసి ఉలిక్కిపడడాల వల్ల అతను ఓ గొప్ప పనికై వచ్చాడని ఊహించుకొనే అవకాశం ఉంది.

    “ఇదేనా నా కాబోయే ఆఖరి అద్భుత కళాఖండం? మై స్వాన్ సాంగ్ టు దిస్ అన్‌డిౙర్వింగ్ వర్‌ల్డ్? పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.”
    — ఇక్కడ అతని పల్లెయాత్ర గురించి, అతను “వచ్చిన పని” గురించి ముఖ్యమైన విషయాల్ని అతని ద్వారానే చేరవేయిస్తాడు రచయిత.

    “మీ లోపల మీరు దాచుకున్నదేమిటి అని అడుగుతున్నాను?”

    “ఏముంటుందండీ. ఏమీ లేదు.”

    నిజానికి, చావు = ఏమీలేనితనం. తను కోరి కోరి వచ్చింది ఈ emptiness/nothingness ను సాధించడానికి…అదీ ఆత్మహత్య ద్వారా. కానీ ఆసక్తికరంగా తను వచ్చిన పనిని మర్చిపోయి, “కుర్చీలో కూచున్నప్పుడు మీరేం ఆలోచిస్తారు? పోనీ, మీరు ధ్యానం చేసుకుంటారు కదూ. కనీసం ఈ విషయమైనా ఒప్పుకోండి,” అని అడుగుతాడు. ఇదీ అతని లోని జర్జరీకృత మనస్తత్వానికి (split personality?) అసలైన సంకేతం.

    ఛస్తే తప్ప తెలిసిరాని తన అస్తిత్వాన్ని కొండమీది టీచర్ ద్వారా వ్యక్తపరిచింది మృత్యువు. ఆ మాత్రపు ప్రతీకదర్శనాన్నే తట్టుకోలేని వాడు కనుకనే పారిపోయాడు. మంచులాంటి వ్యక్తి నుండే కాదు, చావు నుండే కాదు “అత్యద్భుతమైన కళాఖండా”న్ని చిత్రించాలన్న ధృడ సంకల్పం నుండి కూడా పారిపోయాడు. అతను ఓ సంకల్ప వర్జితుడు. వ్రాత్యుడు. ఎత్తైన ఊహల్ని ఆశయాలుగా పెట్టుకుని ఒక్క అడుగైనా ముందుకు వెయ్యలేని ఆరంభశూరుడు. ఆనంద్ సాయ్ గారన్నట్టుగా ఓ సగటు జీవి.

    అందుకనే ప్రథమ పురుష చక్కగా కుదిరింది. నా మనోవైకల్యాన్ని నేనుగా ఒప్పుకుంటే, చెప్పుకుంటేనే విలువ ఎక్కువ! ఐనా, రచయిత ఏ పురుషలో చెప్పాడన్నదాని కంటే కూడా చెప్పదల్చుకున్న విషయాన్ని సారభూతంగా చెప్పాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఈ విషయంలో సుబ్బూకు 90/100 మార్కులు 🙂

  4. తరగని దూరం గురించి Vani అభిప్రాయం:

    01/07/2014 3:04 am

    సావిత్రిగారు,
    నిజమే, దూరాలు పెరిగినా ఫోన్లో మాత్లాడుతున్నాం అనుకుంటున్నాము, కాని మనసుల మద్య అగాధాలు పెరిగిపోతున్నాయి. ఏ మాటా మనసులులో నుండి రాదు. అన్నీ పొడి మాటలే. కవిత చాలా బాగుంది
    – vaaNi

  5. మంచు గురించి Meher అభిప్రాయం:

    01/06/2014 10:27 pm

    పైన కామేశ్వరరావు గారు, ఆనందసాయి గారు చెప్పిన అర్థం కథలో సుస్పష్టంగానే వ్యక్తమవుతున్నదే. నాకూ అదే కనిపించింది. ఇందులో చావు గురించి వెతుక్కుంటున్న ప్రతీకలేవీ నాకు కనపడలేదు. ప్రతీకలు అన్ని లెవెల్స్ లోనూ వర్క్ అవ్వాలి. ఇక్కడ అది లేదు.

    కథ బాగా మొదలైంది, బాగా సాగింది. కానీ చివరికొచ్చేసరికి (“ఇంకో మూడు రోజులు గడిచాయి” అన్న వాక్యం నుండి)రచయిత కథని తాననుకున్న ముగింపు వైపు చాలా బలవంతంగా తొందరపెట్టి నడిపించినట్టుంది. అంత బాగా సాగిన రచన చివర్లో రచయిత తత్త్వ ప్రతిపాదనా చాంచల్యానికి అర్ధాంతరంగా బలి కావటమే చదివేవాళ్లలో ఇంత అసహనం కలగజేసిందనుకుంటా. ఆ దామోదరం పాత్ర ముందు దిగదుడుపు చేసేందుకు కళాకారుని పాత్రలో జీవం తీసేసి తోలుబొమ్మను చేశారు. నా వరకూ ఈ కథ సగమే రాయబడింది.

    And yes, it would have been better told in third person narration. Because that would have lessened the effect of writer’s imposing hand.

  6. మనుషులెందుమూలంగా జీవిస్తారు? గురించి కుమార్ కునపరాజు అభిప్రాయం:

    01/06/2014 9:15 pm

    శర్మగారు మీ అనువాదం చాలా బాగుంది.మీ ఫోన్ నెంబర్ తెలియ చేస్తారా!

  7. మంచు గురించి anand sai అభిప్రాయం:

    01/06/2014 5:11 pm

    గ్రాండుకేన్యను పోయేటేళ్ళు యావరేజిన అక్కడుండేది ఆరు నిమిషాలంట. అక్కడికి పోయేది, విస్టా పాయింట్ల ఒక ఫోటో దిగేది, మళ్ళా కారెక్కి ఇంకేడకో బోయేది. బతికినందాకా ఇట్లా అది చూసినా, ఇది చేసినా అని టిక్కులు గొట్టుకునే మనుషులు. లవరుతో తాజ్‌మహలు చూసేదానికి పోయి, ఉన్న కాసేపు ఫేస్‌బుక్కులో పెట్టుకునేటందుకు ఫోటోలు దిగేటోళ్ళు. ఈ కథలో ఉండేటోడు అట్లాంటోడు. మనందరి లాంటోడు.

    ఈ కథలో వాడు నిజానికి చచ్చిపోదామని వచ్చినాడా? ఎట్లా నమ్మేది? నాకు నవ్వొస్తా ఉంది మీరంతా దానికి పడిపోతే. కథలో ఏమున్నాదో చూసి కదా కథ ఏం చెప్తావుందని ఆలోచించేది. కథలో ఏంది అనేది వాడు: “పంతం కోసం కాదు. నిజమైన కళాకారుడికి చావంటే భయం ఉండదని లోకానికి నా వల్ల తెలియాలి.” అంటే ఏమని? ఇదేమో వానికి సొంతంగా పుట్టిన బుద్ధి కాదని. వాని స్కాచీ, వాని కాష్మీరీ షాల్, వాని ఇంట్లో పెయింటింగులు, వాడు దిన్న రకరకాల తిళ్ళు గురించి మనకెందుకు చెప్పింది? వానికి పదిమందీ వాణ్ణి జూసి ఏమనుకునేదీ వానికి ముఖ్యమని తెలియట్లా? నా పేరు అడగద్దు అనె.అని నిమిషం గాకపాయె, నీపేరేంది, నీ ఉద్యోగమేందని మొదలెట్టినోడు కదా. వాడా చచ్చిపోయేది? వాడు కళాకారుడే. అడ్వర్టైజింగ్ అని యాడ చెప్పుకునండబ్బా? ఎలక్షన్ల బ్యానర్లు గీసేటోళ్ళు గూడ కళాకారులే. ఇంటినిండుగ ప్రకృతి చిత్రాలు పెట్టుకున్నోళ్ళందరు జిడ్డు కృష్ణమూర్తులా ఏంది? మనసుల లోతు లేకుంటే మల్లెపూలంత తెల్ల లాల్చీలు కట్టుకుంటే వస్తందా? పుస్తకాలు చదువుకున్నోళ్ళు చాలమంది, ఇంటర్నెట్ల వాళ్ళ జ్ఞానం జల్లుతుళ్ళా మనమీద? వాళ్ళల్ల ఎంతమంది నిజంగ చదువుతోటి మరింత మంచి నేర్చుకొన్నోళ్ళు? మనసు నిజంగ పెద్దది చేసుకున్నోళ్ళు? అందులోంచి నిజంగ నేర్చుకున్నోళ్ళు? చావాలనంటే బాత్రూము చాలదా ఏంది, అరకులోయే కావాల్నా? వాడు నాలాంటోడు నీలాంటోడు. పెద్ద ఫేకుగాడు. ఎప్పుడూ దేనికోదానెంబడి మనం పరిగెత్తుతుళ్ళా? మరి మనకి, డబ్బు, పేరు, గొప్ప, ఏదీ పట్టకుండ నిజంగ నిమ్మళంగ బతికేటోడు కనిపిస్తే ఏమనుకుంటం? నిజాయితీగ మీకు మీరే చెప్పుకునండి. ఒక్క నిమిషం ఖాళీగుంటె మనకి బోరు కొడతది. ఎందుకు అని ఒక్క పాలి ఆలోచించినామా? లే. I am feeling bore అని ఫేస్బుక్ల పెట్టి పదిమందికి మాత్రం చెప్పుకుంటం.

    వాడేదో ఊడబీకి నేనింత గొప్పోణ్ణి అని అందరూ గుర్తు పెట్టుకోవాల అని వచ్చినోడే గానీ నిజంగా చచ్చేటోడు కాదు. అసలేం ఊడబీకాలనో గూడ వానికి తెలీకపాయె. ముందు నాలుగు రంగులు చాలనుకొనె. ఆపైన ఇంకా కావాలనుకొనె. వాణ్ణి అందరూ పట్టించుకోవాలె, వాణ్ణి గురించి ఆలోచించాల, అదీ వాని కోరిక. పైగా వాణ్ణి వాడు పెద్ద పోటుగాడనుకుంటన్నాడు గదా. మరి అట్లాంటోనికి, ఏమీ పట్టనోడు కనిపిస్తే ఎట్లుంటది? చావును జూసినట్లుంటది. అంతే. తోక కాళ్ళసందుల పెట్టుకొని సక్కంగ వెనక్కి పరిగెత్తిపోయినాడు. అంతే. ఈ కథ ఆ ఫేకు ఆర్టిస్టుగాడి మీద. దామోదర్ మృత్యువు గాదు, ఈ కథ నిజంగా చచ్చిపోదామనుకున్న గొప్ప కళాకారుడిది కాదు. ఈ కథల తాత్వికతా లేదు. గాడిదగుడ్డూ లేదు. తెలివిగ రాశినా కొన్ని చోట్ల డొంకతిరుగుడు మాత్రం ఉండాది. అందుకనే మనకి ఏమేమో కనిపిస్తాఉన్నాయి ఈ కథలొ లేనివన్నీ.

    [దయచేసి వాక్యాలను రెండు చుక్కలతో (..) ముగించకండి. కామాల బదులు .. వాడకండి – సం.]

  8. మంచు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    01/06/2014 2:36 pm

    చివర వాడిన “ఆత్మహత్య” అనే పదం పాఠకుల్లో వ్యతిరేకభావాన్ని కలిగించినట్టుంది. దాని బదులు “నిర్యాణము” అనో, “సమాధి” అనో అని ఉంటే ఆలోచనలు మరోలాగా సాగి ఉండేవేమో! సాధారణంగా తీవ్రనిస్పృహ కాని, క్షణికావేశం కాని ఆత్మహత్యకు దారితీస్తాయన్నది బాగా తెలిసిన విషయం. ఇక్కడ కథకుని నిర్ణయానికి ఆ రెండూ కారణాలు కావన్నది స్పష్టమే. ఇంతకీ అతను ఆత్మహత్య చేసుకోలేదు. చేసుకోవాలనుకున్నాడు. ఎప్పుడు? ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించి. తనకి పూర్తి సంతృప్తినిచ్చే ఒక కళాఖండాన్ని ఏ కళాకారుడైనా సృష్టించగలడా అన్నది పెద్ద అనుమానం! అదే కాని జరిగితే, బహుశా ఆపై అతనికి బ్రతుకు కొనసాగించే అవసరం కనిపించదు. అలాంటి ఒక కళాఖండాన్ని సృష్టించి బ్రతుకు చాలించాలన్నది ఈ కళాకారుని వెఱ్ఱి ఆశ. తానొక చిత్రకారుడు కాబట్టి, ప్రకృతికి బాగా దగ్గరై, అందులోని వర్ణాలను తన కుంచెలో పట్టుకోవాలని నాగరికతకు దూరంగా కొండప్రాంతానికి వచ్చాడు. అలా వచ్చినవాడికి తనకు పూర్తిగా భిన్నమైన, వ్యతిరేకమైన వ్యక్తివం, దృక్పథం కలిగిన మనిషి తారసపడ్డాడు!

    ప్రకృతిలాగానే, చిత్రకారునికి జీవితం కూడా రంగులమయంగానే కనిపిస్తుంది. రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, కోరికలు, సందేహాలు, అన్నీ అతనికి కావాలి. అలాంటి వాడికి ఒక నిజమైన సన్యాసి తారసపడ్డాడు. అతన్ని చాలా దగ్గరగా చూసే సందర్భం వచ్చింది. అతనో నిర్వికార నిరంజనుడు. జీవితం పట్ల ఎంతో పిపాస ఉన్న తను దాన్ని త్యజించాలని అనుకుంటూ ఉంటే, అసలు దానిపై ఎలాంటి కోరికా కనబరచని మరొకడు ఏమాత్రం విసుగూ విరామం లేకుండా జీవిస్తూ పోవడం అనేది ఎలా అర్థం చేసుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యాడు. అలా అని అతని బ్రతుకులో యాంత్రికత లేదు. జీవం (తడి) ఉంది. కాని అది నీటితడి కాదు, మంచు తడి! కాంతిహీనమైన నలుపు కాదది. అన్ని రంగులూ కలగలిసిపోయిన తెల్లదనం. అతను మూగవాడు కాదు, మౌని. కవి అయినవాణ్ణి భయపెట్టే మౌనం. చిత్రకారుణ్ణి బెంబేలెత్తించే తెల్లదనం!

    నా యీ వ్యాఖ్యానమంతా కథలో ఉన్నదని నేననడం లేదు. ఇది కూడా పైన రఘుగారి వ్యాఖ్యానం లాంటిదే. ఇదా, అదా, రచయిత ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా లేదు. ప్రతి కథలోనూ అలాంటి స్పష్టత ఉండలని నేననను. కాని యీ కథకి మాత్రం అది అవసరమని నా అభిప్రాయం. అది లేకపోవడం కథలో లోపమనే నేను భావిస్తాను. కథకుని వ్యక్తిత్వాన్ని, జీవితం పట్ల అతని దృక్పథాన్ని అంచానా వేసే అవకాశం పెద్దగా పాఠకులకి ఇవ్వలేదు. బహుశా అలాంటి అవకాశం ఇవ్వకూడదనే కథని ఉత్తమపురుషలో నడిపించారేమో తెలియదు కాని, పైన పూర్ణిమగారు అన్నట్టుగా, ప్రథమపురుషలో సాగి ఉంటే అందుకు మరింత అవకాశం ఉండేదని నేను అనుకుంటున్నాను.

  9. ఈమాట నియమావళి, మరొక్కసారి గురించి Madhav అభిప్రాయం:

    01/06/2014 11:42 am

    మోహన గారు – 2004లో బర్కిలీ నుంచి సిన్సినాటికి వస్తూ, (డెన్వర్ రాబోయే 2-3 గంటల ముందు) రాకీ మౌంటెన్స్‌లో హైవే (IS-70) పక్క తీసిన ఫోటో. (మినాల్టా మాక్సమ్ 7 ఫిల్మ్ కేమేరా. మిగతా వివరాలు వెతికి చెప్పగలను.) ముఖచిత్రం కోసం వెతుకుతుంటే నా ఆల్బమ్స్‌లో కనిపించి…

    మాధవ్

  10. ఈమాట నియమావళి, మరొక్కసారి గురించి మోహన అభిప్రాయం:

    01/06/2014 10:39 am

    ఈ సంచిక ముఖచిత్రము బాగున్నది, దాని వివరములను తెలియజేయగలరా? విధేయుడు – మోహన