పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. శైశవ గీతి గురించి Raj అభిప్రాయం:

    01/21/2014 5:27 am

    ఒక్కసారిగా బాధ వేసింది. పాపం పిల్లలు! మనము ఏమి చేయలేమా?

  2. కృషితో దుర్భిక్షం గురించి kota అభిప్రాయం:

    01/17/2014 8:40 pm

    హహ్హహ్హ. బావుంది.

  3. సొరంగానికా చివర గురించి K అభిప్రాయం:

    01/17/2014 2:32 pm

    Wonderful.

  4. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి SRIPADA అభిప్రాయం:

    01/17/2014 6:42 am

    నిజంగా ఒక గొప్ప అనుభూతిని ఈ జనరంజని కార్యక్రమం విని పొందాము. కృతజ్ఞతలు.

  5. ఆదర్శాలకు పోతే… గురించి K అభిప్రాయం:

    01/16/2014 4:59 pm

    కథ బాగుంది.

  6. జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి mohan naidu అభిప్రాయం:

    01/16/2014 2:36 pm

    అపురూపమైన అనుభవం కలిగింది.మీకు ధన్యవాదాలు. రాజేశ్వరరావుగారి గొంతు వినే భాగ్యం కలిగించి మాకు పండగ ఆనందాన్ని ఎన్నొ రెట్లు పెంచారు.

  7. చెలియలికట్ట: విశ్వనాథ గురించి Halley అభిప్రాయం:

    01/16/2014 7:45 am

    “మైదానం” చదివినప్పటి నుంచీ “చెలియలి కట్ట” చదవాలి అని అనుకుంటూ ఉండేవాడిని. ఎందుకనో ఎపుడూ కుదరలేదు.మీ పుణ్యమా అని ఈ రోజు వినటం జరిగింది. థాంక్స్ !

  8. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Halley అభిప్రాయం:

    01/16/2014 3:18 am

    షెల్డొన్ పొల్లొక్ గారి ” Crisis in the Classics ” అనే వ్యాసం చదివి అంతర్జాలంలో తచ్చాడుతూ అనుకోకుండా ఇక్కడికి వచ్చాను . భావ దాస్యం గురించీ పాత తెలుగు సాహిత్యం మీరు ఎందుకు చదువుతారు అన్న విషయం గురించీ మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి . అయితే ఈ విషయల పైన కొత్తగా scholars రావాలి అంటే దీనికి ఒక incentive structure కూడా అవసరం అని నా భావన.

  9. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/15/2014 8:25 pm

    “కథని ఉత్తరం ద్వారా చెప్పడం చాలా బాగుంది ”-అనే మీ ప్రశంస నాకెంతగానో నచ్చింది సూర్య నారాయణ మూర్తి గారూ!

    -ఫోన్ చేసి కాని,ఎదురయి కానీ మాటల్లో చెప్పలేని కొన్ని అతిసున్నితమైన హృదయ భావాలను – అవలీలగా వ్యక్తపరచగల ఒకేఒక్క సాధనం –‘ఉత్తరం’ అని నా నమ్మకం.భావోద్వేగపూరితమైన వాక్య విన్యాసానికి ఉత్తరం మాత్రమే ఓ గొప్ప శరణ్యం. ఇంకా చెప్పాలంటే,ఉత్తరాలు రాయడం ఒక కళ. అందుకే ఈ కథకింతటి కళని తెచ్చిచ్చిందనిపిస్తుంది నాకు.

    నిజానికి ఇదొక ప్రేమలేఖ. మాటల్లో చెబితే మన్నిక పోతుంది. అది- అక్షరం లోనే నమ్మకాన్ని పొందుతుంది. అందుకే కామోసు -“A real love letter is made of insight, understanding, and compassion. Otherwise it’s not a love letter. A true love letter can produce a transformation in the other person, and therefore in the world. But before it produces a transformation in the other person, it has to produce a transformation within us. Some letters may take the whole of our lifetime to write.” అని అంటాడు ఒక జెన్ బోధకుడు. ఈ మాటలు ఎంతగానో ఆకట్టుకుంటాయి,మరెంతగానో ఆలోచింపచేస్తాయి- కదూ?

    కథ ‘ఏకబిగిన చదివించిందనే’ మీ మరో ప్రశంసకి..ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ,
    సంక్రాంతి పండగ శుభాకాంక్షలతో..

  10. బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి Akella Suryanarayana murthy అభిప్రాయం:

    01/15/2014 2:18 pm

    అత్తగారు నెలలు లెక్కేసుకోడం నచ్చింది, సంక్రాంతి కోసం చేసిన Landscape beautiful, ఉత్తరం ద్వారా చెప్పడం చాల బాగుంది. ఏక బిగిన చదివించేరు.