నిజమే మీరు చెప్పినట్టుగా ఈ బహుళ అంతస్తుల భవనాల వల్ల సరైన ఎండేకాదు గాలి, వెలుతురూ కూడా ఇళ్ళల్లోకి సరిగా రావడం లేదు. మొక్కలు పెంచాలనుకునే వారి అభిరుచి కుండీలకే పరిమితమౌతుంది. అలాంటి వాతావరణంలో పెరడులో కూరగాయల మొక్కలు పెంచాలనుకోవడం ఎదుటివారికి హాస్యాస్పదంగానే ఉంటుంది మరి. మంచి విషయం పరిచయం చేశారు. ధన్యవాదాలు.
ఆద్యంతం అత్యద్భుతం ! పదప్రయోగాలు చవులూరిస్తున్నాయి.ఇఒతకుముందెన్నడూ వినని,చదువని(నేను సుమా!) యీ కథను ఇంత రమ్య రీతిలో చదివే అదృష్టం కలిగింది. తిరుమలదేశికాచారిగారికి ధన్యవాద సహస్రములు. తెలుగు పద్యం జిగినీ బిగినీ వైదగ్ధ్యాన్నీ సజీవంగా నిలిపి జాజ్వల్యమానంగా వెలిగిస్తున్న ఆచార్యులకు నమోవాకములు.
“మనిషికీ మనిషికీ మధ్యనున్న అహంభావమనే పొరని ఆత్మవిమర్శతో బద్దలు కొట్టిన నాడే నిజమైన పండుగ”
* కథలోని ఆత్మ కి అక్షర వివరణ ఈ మీ వ్యాఖ్య మురళి గారు!
కథ గురించిన మీ ప్రశంసలకు ఇవే నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, -శుభాభినందనలతో..
నమస్తే. నేను ఈమాట’కు క్రొత్త పాఠకుణ్ణి. ఈ శీర్షిక చాలా బాగుంది. పాత పుస్తకాల గురించి, సాహిత్యం గురించీ,చాలా వ్యాసాలున్నాయి. చాలా కాలం క్రిందట ఎవరో ‘కృష్ణరాయ విజయం’ గురించి అడిగిన గుర్తు. ఆర్కైవ్స్.ఆర్గ్ లొ, ౧౦౯౩౬ (ఒకటి సున్న మూడు తొమ్మిది ఆరు) లో ఈ పుస్తకమ్ ఉన్నది. చూడగలరు.
చాలామంది లాగే సంక్రాతి నాకిష్టమైన పండుగ. కానీ చాలాకాలంగా సంక్రాంతిని నేను కథల్లోనే చదువుతున్నాను, ఆ ఇష్టంతోనే సంక్రాంతి మీద నేను కూడా రెండు కథలు రాసాను ‘సంక్రాంతి వెన్నెల’ ‘సంక్రాంతి లైవ్ ఫ్రమ్ దోసకాయలపల్లి’ అన్న పేర్లతో (ఆంధ్రభూమి వీక్లీ లో వచ్చాయి) దమయంతి గారూ, బాల్యంలో మనందరికీ ఎన్నో అనుభూతులని పంచిపెట్టిన సంక్రాంతి ఇప్పుడు కేవలం కథలకీ, ఊహలకీ, ఉత్తరాలకీ పరిమితమైపోవడానికి కారణం చెబుతున్నట్టుగా వుంది మీ కథ. మానవసంబంధాలు బలహీనమైపోవడానికి కారణం ఎవరో అన్నట్టుగా మనం వంతెనలకి బదులు గోడలు కట్టడమే! మనిషికీ మనిషికీ మధ్యనున్న అహంభావమనే పొరని ఆత్మవిమర్శతో బద్దలు కొట్టిన నాడే నిజమైన పండుగ, నిజమైన సంక్రాంతి !! మీ కథలో జానకి ఆలోచనలు ఊహలకీ, ఉత్తరాలకీ మాత్రమే పరిమితమైపోకుండా ఆచరణలో పెట్టేవరకూ స్థిరంగా వుండి, ఆనక అత్తగారింట్లో అడుగు పెట్టేక తను ఊహించినదానికన్నా భిన్నమైన స్పందన ఎదురైనా కూడా అంతే స్థిరంగా నిలబడగలగాలి అనిపించిందంటేనే, ఈ కథ మమ్మల్నెంత ‘మమేకం’ చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. మీ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు, జానకి మనస్థత్వ చిత్రణ చాలా చక్కగా, వాస్తవికంగా వుంది. మంచి కథ రాసి, చదివించారు, శుభాభినందనలు !!
కృషితో దుర్భిక్షం గురించి దుగ్గిరాల శ్రీశాంతి అభిప్రాయం:
02/18/2014 4:56 am
సుబ్రహ్మణ్యంగారికి నమస్కారమండీ.
నిజమే మీరు చెప్పినట్టుగా ఈ బహుళ అంతస్తుల భవనాల వల్ల సరైన ఎండేకాదు గాలి, వెలుతురూ కూడా ఇళ్ళల్లోకి సరిగా రావడం లేదు. మొక్కలు పెంచాలనుకునే వారి అభిరుచి కుండీలకే పరిమితమౌతుంది. అలాంటి వాతావరణంలో పెరడులో కూరగాయల మొక్కలు పెంచాలనుకోవడం ఎదుటివారికి హాస్యాస్పదంగానే ఉంటుంది మరి. మంచి విషయం పరిచయం చేశారు. ధన్యవాదాలు.
మహామంగళప్రవచనము గురించి నరసింహారావు అభిప్రాయం:
02/17/2014 8:03 am
ఆద్యంతం అత్యద్భుతం ! పదప్రయోగాలు చవులూరిస్తున్నాయి.ఇఒతకుముందెన్నడూ వినని,చదువని(నేను సుమా!) యీ కథను ఇంత రమ్య రీతిలో చదివే అదృష్టం కలిగింది. తిరుమలదేశికాచారిగారికి ధన్యవాద సహస్రములు. తెలుగు పద్యం జిగినీ బిగినీ వైదగ్ధ్యాన్నీ సజీవంగా నిలిపి జాజ్వల్యమానంగా వెలిగిస్తున్న ఆచార్యులకు నమోవాకములు.
మాధవీమధుసేనము గురించి నరసింహారావు అభిప్రాయం:
02/17/2014 7:37 am
అత్యద్భుతం ! అలనాటి పెద్దనాదులను తలపించు ఈ కవితాపఠనం మహదానందభరితం.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
02/16/2014 12:29 pm
“మనిషికీ మనిషికీ మధ్యనున్న అహంభావమనే పొరని ఆత్మవిమర్శతో బద్దలు కొట్టిన నాడే నిజమైన పండుగ”
* కథలోని ఆత్మ కి అక్షర వివరణ ఈ మీ వ్యాఖ్య మురళి గారు!
కథ గురించిన మీ ప్రశంసలకు ఇవే నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, -శుభాభినందనలతో..
పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి కుప్పా సుదర్సన కుమార్ అభిప్రాయం:
02/16/2014 5:57 am
నమస్తే. నేను ఈమాట’కు క్రొత్త పాఠకుణ్ణి. ఈ శీర్షిక చాలా బాగుంది. పాత పుస్తకాల గురించి, సాహిత్యం గురించీ,చాలా వ్యాసాలున్నాయి. చాలా కాలం క్రిందట ఎవరో ‘కృష్ణరాయ విజయం’ గురించి అడిగిన గుర్తు. ఆర్కైవ్స్.ఆర్గ్ లొ, ౧౦౯౩౬ (ఒకటి సున్న మూడు తొమ్మిది ఆరు) లో ఈ పుస్తకమ్ ఉన్నది. చూడగలరు.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
02/16/2014 12:18 am
మనసులోని ప్రేమని ఉన్నది వున్నట్టు చెప్పడం, అందులోనూ అది లేఖా రూపమైనప్పుడు, మీరన్నట్టు అమృతతుల్యమే నేమో! ఎంత తీయగా చెప్పారు మీవైన మాటల్లో!
ధన్యవాదాలు అన్నపూర్ణ గారు!
శుభాకాంక్షలతో.
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆకునూరి మురళీకృష్ణ అభిప్రాయం:
02/15/2014 11:34 pm
చాలామంది లాగే సంక్రాతి నాకిష్టమైన పండుగ. కానీ చాలాకాలంగా సంక్రాంతిని నేను కథల్లోనే చదువుతున్నాను, ఆ ఇష్టంతోనే సంక్రాంతి మీద నేను కూడా రెండు కథలు రాసాను ‘సంక్రాంతి వెన్నెల’ ‘సంక్రాంతి లైవ్ ఫ్రమ్ దోసకాయలపల్లి’ అన్న పేర్లతో (ఆంధ్రభూమి వీక్లీ లో వచ్చాయి) దమయంతి గారూ, బాల్యంలో మనందరికీ ఎన్నో అనుభూతులని పంచిపెట్టిన సంక్రాంతి ఇప్పుడు కేవలం కథలకీ, ఊహలకీ, ఉత్తరాలకీ పరిమితమైపోవడానికి కారణం చెబుతున్నట్టుగా వుంది మీ కథ. మానవసంబంధాలు బలహీనమైపోవడానికి కారణం ఎవరో అన్నట్టుగా మనం వంతెనలకి బదులు గోడలు కట్టడమే! మనిషికీ మనిషికీ మధ్యనున్న అహంభావమనే పొరని ఆత్మవిమర్శతో బద్దలు కొట్టిన నాడే నిజమైన పండుగ, నిజమైన సంక్రాంతి !! మీ కథలో జానకి ఆలోచనలు ఊహలకీ, ఉత్తరాలకీ మాత్రమే పరిమితమైపోకుండా ఆచరణలో పెట్టేవరకూ స్థిరంగా వుండి, ఆనక అత్తగారింట్లో అడుగు పెట్టేక తను ఊహించినదానికన్నా భిన్నమైన స్పందన ఎదురైనా కూడా అంతే స్థిరంగా నిలబడగలగాలి అనిపించిందంటేనే, ఈ కథ మమ్మల్నెంత ‘మమేకం’ చేసుకుందో అర్ధం చేసుకోవచ్చు. మీ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు, జానకి మనస్థత్వ చిత్రణ చాలా చక్కగా, వాస్తవికంగా వుంది. మంచి కథ రాసి, చదివించారు, శుభాభినందనలు !!
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి darbha lakshmi annapurna అభిప్రాయం:
02/14/2014 3:05 pm
దమయంతిగారూ అద్భుతంగా వుందండీ ఆమె మనసులో మాట చెప్పిన తీరు!
ఒక చిన్న అమృతతుల్యమైన భావన క్రమంగా విశ్వవ్యాప్తమైనట్టుగా అనిపించింది !
ఎవడూకానివాడు బతికేడు ఏ చింతాడో ఓ ఊరు గురించి mohan naidu అభిప్రాయం:
02/14/2014 11:43 am
మీ కవితకన్న ముందు నన్ను ఆకట్టుకున్నది మా వూరి పేరు నెను పుట్తిన చింతాడ. భాష ఏదైనా దేశమెదైన పరిస్థితి ప్రజల స్వభావము ఒక్కలానె వుంటుంది.
వలసరాజ్యములందు భారతీయ శిల్పకళ: 1. హైందవసామ్రాజ్యము గురించి మోహన అభిప్రాయం:
02/11/2014 8:43 am
చంపాదేశములో మందాక్రాంతమును గురించి ఇక్కడ చదువవచ్చును.
విధేయుడు – మోహన