పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/06/2014 9:22 am

    ఒక సాధకుని దృష్టితో చూస్తే ఈ సంభాషణలో రఘోత్తమ రావుగారి వాదన చక్కగా చిక్కగా ఉంది. మధ్వుల భాష్యం ఆ ఒక్క శ్లొకం లోనే అంత పటిష్టంగా ఉంటె మొత్తం చదివితే ఇంకా ఎన్ని విషయాలు తెలుసుకొవచ్చొ అనే కుతూహలం కలుగక మానదు. రఘోత్తమ రావుగారి వంటి వారు మధ్వుల గీతా భాష్యాన్ని ఆంధ్రీకరిస్తె ఎంతొ మేలు.

    //మన ధార్మిక గ్రంథాల విశ్లేషణ చేసే సందర్భంలో విశ్లేషకులు రెండు విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి: 1. ప్రసంగం 2. ప్రసక్తి

    ఇది కొత్త విషయం నా వరకూ. ధన్యవాదాలు.

  2. ముగ్గురు సాధువులు గురించి Amarnath అభిప్రాయం:

    03/06/2014 8:48 am

    మనిషి సులువైన మార్గాన్ని వదిలి తనకు తానుగా జీవితాన్ని ఎలా క్లిష్టంగా గజిబిజిగా చేసుకుంటాడో టాల్స్టాయ్ చాలా బాగా చెప్తారు. అనువాదానికి ధన్యవాదాలు.

  3. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రామారావు కన్నెగంటి అభిప్రాయం:

    03/06/2014 8:21 am

    Since nobody raised objections to whatever I said, I am correct. Shall we move on?

    That means all of you agreed that:

    1. The blasphemy/libel laws as they are stated are incorrect and antithetical to Hinduism.

    2. Hinduism has enough contradictions in it that using coherence as a way of logic does not work.

    3. And, the legal recourse to the book insults the intelligence of people and stifles discourse.

    Thanks for agreeing I am right. It is most satisfying to be correct. But, then, I always knew that.

  4. దేవకన్య గురించి Naga Muralidhar అభిప్రాయం:

    03/06/2014 7:55 am

    వావ్! బావుంది మానసగారూ.

  5. వెన్నెల – తిలక్ కవిత గురించి ప్రణవ్ అభిప్రాయం:

    03/06/2014 7:47 am

    కవితామృతానికి వాస్తవికత హాలాహలాన్ని జోడించి సరికొత్త టానిక్ తయారు చేసిన సాహితీ భిషక్… బాలగంగాధర తిలక్!

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాధిక అభిప్రాయం:

    03/06/2014 3:59 am

    సురేష్ గారు, ఒక సందేహం.

    “దృక్కోణాల విభేదం, లక్ష్యాల వైవిధ్యం వల్ల ఒకే సంఘటన, ఒకే సత్యం వేర్వేరుగా కనిపిస్తాయన్న సత్యం భారతీయ దార్శనీకులకు ఏనాడో తెలుసు. అంధగజన్యాయం లాగా, హిందూ మత చరిత్ర అనబడే గజాన్ని వర్ణించే ఎన్ని ప్రత్యామ్నాయ కథనాలు ఉంటే నిజాన్ని అంత బాగా అర్థం చేసుకోగలం.” అన్నారు మీరు వ్యాసంలో.

    అది ఒకే సత్యం వేరు వేరుగా కనిపించడమా! వేరు వేరుగా చెప్పబడడమా! ఒక సత్యం పలురకాలుగా చెప్పబడడం, అంధ గజ న్యాయం ఒకటి కాదేమో కదా! మొదటి దాన్ని అందరికీ “తెలిసిన ఒకే సత్యం” పలురకాలుగా చెప్ప బడుతుంది అన్న అర్ధం లోనూ రెండోదాన్ని ఎవరికీ “అసలు సత్యం తెలియదు.” అన్న అర్ధం లోనూ కదా వాడతారు! అంధ గజ న్యాయాన్ని పాటించకూడని విషయంగానే ఇప్పటివరకు విన్నాను. మీరు అది నిజాన్ని తెల్సుకోవడానికి ఉపయోగిస్తుందంటున్నారు!

  7. ఉరి: కధ నచ్చిన కారణం గురించి రానారె అభిప్రాయం:

    03/06/2014 2:02 am

    “(మాట్లాడటం) మాయాపి హితులైన మానవులకు సహజ లక్షణం”

    మాయాపిహితులు అంటే అర్థం ఏమిటో తెలియలేదు. తెలిసినవాళ్లు చెబితే కృతజ్ఞుణ్ణి. ఈ కథను ఇక్కడుంచి చదివించే అవకాశం కలిగించినవారందరికీ కూడా థాంక్సు. ఈ కథలో అన్నింటికంటే బలంగా నన్ను తాకినది: జైల్లో తొలిసారి కూడు పెట్టగానే, పిల్లలకోసం దాన్ని దాచుకోవడం.

    విశ్వనాథ ‘వీరవల్లడు’ ఇటీవలే చదివాను. ఆయనకున్న కథనవిద్య ఎంత బలమైనదో కొద్దికొద్దిగా తెలిసివస్తోంది.

  8. గౌతమి గురించి రాధ మండువ అభిప్రాయం:

    03/06/2014 12:33 am

    రాధిక గారికి, బాలసుందరి గారికి ధన్యవాదాలు. మోహన్ గారు, మీరు చాలా బాగా చెప్పారు. మీ కామెంట్ నాకు చాలా సంతోషం కలిగించింది. Thank u. ప్రకృతి సాక్షీభూతంగా మన జీవితాల్లో నిలిచి ఉంటుంది. ప్రతి పనిలో భాగస్వామి అవుతుంది. గుర్తించి నడుచుకునే వాళ్ళ జీవితాలు ధన్యమవుతాయి. కదా?

  9. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తః తః అభిప్రాయం:

    03/06/2014 12:04 am

    వాల్మీకి రామాయణములో సీత లక్ష్మణుని సందేహించడము ఆమె పాత్రలో లోపమా? విధేయుడు – మోహన

    కాదు. అది వాల్మీకిని సరిగా అర్థం చెసుకొక పొవటం. వాల్మీకి (ఒక అద్భుతమైన) రక్త మాంసాల కవి. A flesh and blood poet like Shakespeare.

    తః తః

  10. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:

    03/05/2014 5:21 pm

    The latest analysis of Raghottama Rao garu clearly illustrates the importance of precision in language and the context. So, given these inputs and the fact that the conclusion of the essay is erroneous, would the author Suresh garu consider revising his opinion? Is he open to being corrected?

    [Rest of the post is edited as it pertains to a discussion on Facebook and not here on eemaata. — Ed.]